translateexpand_more

Pawan Kalyan Hyderabad Press Meet News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 11:26 am
మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్ లో పవన్ కు ఏం పని? అని కొందరు వ్యక్తులు పదే పదే బెదిరిస్తున్నారు.. మీరెవరు నన్ను బెదిరించటానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణలో బెదిరింపుల కంటే ఏపీలో బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. ఏపీలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం అంటే తెలంగాణ జనసైనికులు నాకు అండగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో కోరుకుంటానా? ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. మీరు సమస్యల మీద పోరాడండి అని మా పార్టీ నాయకులను కోరా. మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు. హైదరాబాద్ లో ఏం పని? అంటున్నారు. హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. మీరెవరు నన్ను బెదిరించటానికి? మీ అయ్య జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో కంటే ఆంధ్రలో బెదిరింపులు ఎక్కువ. ఆంధ్రలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకిక్కడ కొత్తగా బాగుకునేది ఏమీ లేదు. బెదిరించే వాళ్లకు అందరికీ చెబుతున్నా.. నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇంటి అడ్రస్. మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి భయాలు లేవు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతా? భయపడే వాళ్లమే అయితే పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో నేను తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అనలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Hyderabad Press Meet News Keyword | Telugu Digital