translateexpand_more

Pawan Kalyan Press Meet News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media02 Jun, 12:55 pm
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎవరి సొత్తు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డపై అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము కేవలం రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించామని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనుమతులు నిరాకరిస్తే ఇళ్ల నుంచే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పక్క రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయన అభివర్ణించారు. పవన్‌కు అహంకారం ఎక్కువైందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు ఇంటర్‌స్టేట్ రాజకీయ వివాదంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2026 నుంచి 2028 మధ్య కాలంలో తెలంగాణలో బలం పుంజుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని యువత, అర్బన్ ఓటర్లే లక్ష్యంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం జనసేనకు పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే రోజుల్లో జనసేన తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Samayam Telugu02 Jun, 12:10 pm
ఆంధ్రాలోనే దిక్కులేదు.. తెలంగాణలో సీఎం అవుతానా? పవన్ కళ్యాణ్

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై తనకు ఎంతో ప్రేమ ఉందన్న పవన్ కళ్యాణ్.. అది రాజకీయాలకు అతీతమన్నారు. వారాహి యాత్ర మొదలుకుని అనేక సమయాల్లో తెలంగాణ ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. హైదరాబాద్‍‌లో ఎలా అడుగుపెడతావంటూ కొంతమంది ఇటీవల తనను ప్రశ్నిస్తున్నారని.. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమని వారికి గుర్తుచేశారు. తనకు అధికారంపై ప్రేమ లేదన్న పవన్ కళ్యాణ్.. మార్పుపైనే ప్రేమ ఉందని చెప్పారు. తనకు అధికారం కావాలని లేదని.. ముఖ్యమంత్రి కావాలనే ఆశే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదు.. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయమని తమ నేతలు చాలా సార్లు అడిగారన్న పవన్ కళ్యాణ్.. ఏపీలోనే అధికారం కోరుకోని వాణ్ని.. తెలంగాణలో అధికారం కోరుకుంటామా అని ప్రశ్నించారు. ఇక కోడిచెరువు కబ్జా చేశారనే ఆరోపణలపైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను కబ్జా చేశానని నిరూపిస్తే.. తన ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని.. పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదనే విమర్శలపైనా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాను బాధపడింది విభజన జరిగినందుకు కాదని.. విభజించిన తీరే బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో జనసేన పార్టీని విమర్శిస్తున్న వారు.. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలను ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. కేవలం జనసేన పార్టీనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పార్టీ కలిసి వస్తుందో, రాదో తనకు తెలియదని.. జనసేన పార్టీ మాత్రం కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చావుకు సిద్ధపడే తాను పార్టీ పెట్టినట్లు తెలిపారు.

10TV Telugu02 Jun, 11:26 am
మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్ లో పవన్ కు ఏం పని? అని కొందరు వ్యక్తులు పదే పదే బెదిరిస్తున్నారు.. మీరెవరు నన్ను బెదిరించటానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణలో బెదిరింపుల కంటే ఏపీలో బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. ఏపీలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం అంటే తెలంగాణ జనసైనికులు నాకు అండగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో కోరుకుంటానా? ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. మీరు సమస్యల మీద పోరాడండి అని మా పార్టీ నాయకులను కోరా. మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు. హైదరాబాద్ లో ఏం పని? అంటున్నారు. హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. మీరెవరు నన్ను బెదిరించటానికి? మీ అయ్య జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో కంటే ఆంధ్రలో బెదిరింపులు ఎక్కువ. ఆంధ్రలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకిక్కడ కొత్తగా బాగుకునేది ఏమీ లేదు. బెదిరించే వాళ్లకు అందరికీ చెబుతున్నా.. నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇంటి అడ్రస్. మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి భయాలు లేవు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతా? భయపడే వాళ్లమే అయితే పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో నేను తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అనలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Press Meet News Keyword | Telugu Digital