translateexpand_more

Peddi Telugu Movie News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 12:43 pm
గ్రాండ్ గా పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా చేరుకున్న అభిమానులు

పెద్ది ఈవెంట్ గ్రాండ్ జరగనుండటంతో భారీగా అభిమానులు చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.. విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మూవీ టీమ్.. రామ్ చరణ్ కటౌట్స్ తోపాటు బుచ్చిబాబు, జాన్వీకపూర్ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పహిల్వాన్ గెటప్ లో ఉన్న కటౌట్స్ వైరల్ అవుతున్నాయి మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే స్టేడియం కు భారీగా అభిమానులు చేరుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ( నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. అభిమానులు ఇప్పటికే స్టేడియం బయట భారీగా చేరుకున్నారు.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

TV9 Telugu01 Jun, 05:01 pm
మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు .. సక్సెస్ మీట్ లా ఉంది. విజయవాడలో చెయ్యాలని అనుకున్నాం.. ఇది మాకు లక్కీయాస్ట్ సిటీ.. ఆ లక్కు కోసమే ఇక్కడకి వచ్చాము.. పెద్ది అన్ని విజువల్స్ చూశారు.. ఎన్నో కథలు వింటుంటాం.. కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయ్.. కానీ పెద్ది కథ నా గుండెలను తాకిన కథ.. నిజంగా ఇలాంటి సినిమాలు పదేళ్లకు ఒకసారి వస్తాయ్. పెద్ది సినిమా చాలా చేసింది.. వ్యక్తిగతంగా నన్ను ఒక మంచి దారిలోకి మార్చింది.. ఒక యాక్టర్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు.. కిందకి పడి.. పడిన మనిషి లేని ఎలా నిల్చుంటాడో తెలిసేలా చేసిన కథ ఇది.. ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం..? బహుశా మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత నాకు పెద్దిలో ఆ అద్భుతం కనిపిస్తుంది.. రాసిపెట్టుకోండి.. ఇండియాలో నెంబర్ 3,4లో టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా.. నాకు తెలిసింది సినిమా మాత్రమే.. చనిపోయేవరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాం.. అలాగే రెహమాన్ గారు 280 రోజులు మేం పని చేస్తే.. దానికి ప్రాణం పోస్తున్నారు.. ఆయనకు థ్యాంక్యూ.. జాన్వీ గారిని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతుంటారు.. ఎప్పుడైనా ఆట ఓడిపోతే.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు.. అలాగే ఈ పెద్ది గాడు ఆటాడలేదు.. పోరాడాడు.. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని మనస్పూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను.. మీ కుటుంబ సభ్యులను అడిగానని చెప్పండి..

TV9 Telugu01 Jun, 04:09 pm
నా జీవితానికి అర్ధం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే

మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా పీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు జాన్వీ మాట్లాడుతూ..మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. మీరు మా పై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పెద్ది సినిమా పై కూడా ఇదే ప్రేమ చూపిస్తారని అనుకుంటున్నా.. ఈ సినిమా చాలా స్పెషల్.. ఈ సినిమాలో చాలా విషయం ఉంది.. మీ జీవితానికి అర్ధం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు. నా జీవితానికి అర్ధం మిమ్మల్ని అలరించడం, సినిమాలు చేయడం.. నా ఐడెంటిటీ ఈ భూమితో, మీతో కనెక్ట్ అయ్యి ఉంది. మేము చేసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.. ఈ సినిమా నాకు చాలా ఇచ్చింది. చరణ్ తో నటించే ఛాన్స్ ఇచ్చింది.. బుచ్చి బాబు నాకు తెలిసిన మోస్ట్ ప్యాషినేట్ డైరెక్టర్.. సినిమా టీమ్ అందరూ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారు.. మీరందరూ ఇలా వస్తే మా కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నా.. అంటూ అద్భుతంగా తెలుగులో మాట్లాడింది జాన్వీ. ప్రేక్షకులు దేవుళ్ళు అని మా అమ్మ చెప్తుంటుంది. జగదేకవీరుడు సినిమాలోని శ్రీదేవి చెప్పిన డైలాగ్ చెప్పిన జాన్వీ..

TV9 Telugu01 Jun, 04:45 pm
నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే తెలుస్తుంది

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది టెన్షన్ గా ఉంది. న చేతులు కాళ్లు వణుకుతున్నాయి. ఉప్పెన తర్వాత ఐదేళ్ల తర్వాత సినిమా చేశా.. ఉప్పెనకు అవార్డు వచ్చింది.. ఇన్నేళ్లు ఎందుకు టైం తీసుకున్నా అంటే పెద్ది కోసమే తీసుకున్నా.. ఉప్పెన స్టోరీ ఇక్కడ విజయవాడలోనే రాశా.. ఉప్పెన తర్వాత ఎవరితో చేయాలా అనుకుంటున్నపుడు సుకుమార్ చరణ్ గారికి పరిచయం చేశారు.. దేవుడికి దండం పెట్టుకొని చరణ్ కు స్టోరీ చెప్పా.. పెద్ది కమర్షియల్ సినిమా కాదు.. ఇది ఎమోషనల్ మూవీ, ఒక ఆటగాడి సినిమా.. ఒక ఆట ఎలాంటి గుర్తింపు తెస్తుంది అనేది చూపిస్తుంది.. ఈ జర్నీలో చరణ్ గారితో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి.. రెండో సినిమాకే మీలాంటి స్టార్ ఇవ్వడం మాములు విషయం కాదు.. నా కథను నమ్మారు.. ఓ నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే అర్ధమవుతుంది. క్లైమాక్స్ చూసినప్పుడల్లా నాకళ్ళ వెంట నీళ్ళలొచ్చాయ్.. చాలా మంది అదే చెప్పారు. లాస్ట్ 40నిముషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుంది.. సినిమా జూన్ 4న విడుదలవుతుంది ఫ్యామిలీతో వెళ్లి చూడండి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ సినిమాలో చూస్తారు. నన్ను నమ్మినందుకు మిమ్మల్ని ఎప్పడూ మర్చిపోలేను.. జీవితంలో రుణపడి ఉంటా.. జానీ నటనలో హీరోయిజం ఉంటుంది.. క్లైమాక్స్ లో జాన్వీ నటన అద్భుతంగా ఉంటుంది. రెహమాన్ గారు అందించిన సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి.. ఈ సినిమాకు రెహమాన్ గారు మ్యూజిక్ చేయడం అనేది నా చిరకాల కోరిక అది పెద్దితో నెరవేరింది. రామ్ చరణ్ సార్.. మీరు లేకపోతే నేను లేను..అంటూ ఎమోషనల్ అయ్యారు బుచ్చిబాబు. ఫ్యామిలీతో సినిమాచూడండి.. పెద్దితో ఆడతారు, పాడతారు.. పెద్ది మీవెంట వస్తాడు.. చరణ్ గారి నటన చూస్తే మీకు కన్నీళ్లు కచ్చితంగా వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు.

NTV Telugu27 May, 04:14 am
ఆదుకున్న కరుప్పు, దృశ్యం 3.. ఐదు నెలలుగా హిట్ లేని తెలుగు ఇండస్ట్రీకి పెద్ది’ సక్సెస్ తీసుకొస్తుందా

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం బాక్సాఫీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ హడావుడి ముగియడంతో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఊపిరి పీల్చుకున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు మళ్లీ క్యూ కడుతున్నారు. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ‘దృశ్యం 3’, తమిళ చిత్రం ‘కరుప్పు’ చిత్రాలకు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ‘దృశ్యం 3’ ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి తన బ్రాండ్ పవర్‌ను నిరూపించుకుంది. ఇక కథ పరంగా అంత గొప్పగా ఏమీ లేదనే విమర్శలు ఎదుర్కొన్న సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం ఏకంగా రూ. 300 కోట్ల మార్కును దాటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కంటెంట్‌తో సంబంధం లేకుండా కేవలం క్రేజ్ సరైన టైమ్ లో రిలీజ్ కావడం ఈ సినిమాలకు కలిసొచ్చాయి. ఇప్పుడు అందరి కళ్ళు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’పైనే ఉన్నాయి. గడచిన ఐదు నెలలుగా టాలీవుడ్‌లో సరైన భారీ కమర్షియల్ హిట్ లేక టాలీవుడ్ ఈగర్ గా ఎదురుచూస్తుంది. చిన్న సినిమాలు అడపా దడపా మెరిసినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే అసలైన సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం థియేటర్లు, బయ్యర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 4న భారీ అంచనాలతో ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. పొరుగు ఇండస్ట్రీల ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ చిత్రానికి థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఐదు నెలల టాలీవుడ్ సక్సెస్ కరవును తీర్చి, రామ్ చరణ్ ‘పెద్ది’తో ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ సక్సెస్ అందిస్తాడో లేదో