translateexpand_more

Professor Nageshwar News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 02:05 pm
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ

తెలంగాణలో పవన్ కల్యాణ్ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్థరహితమని, రాజకీయ దురుద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.వివరాల్లోకి వెళితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' పేరిట ఓ ఇండోర్ కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సుమారు 2000 మంది పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం తలపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం వంటి అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.అయితే, పార్కింగ్ సమస్యను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ సభకు అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా తప్పుబట్టింది. నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ సమావేశాలు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో, కేవలం తమ కార్యక్రమానికే పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సహేతుకం కాదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోవని స్వయంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ, ఆ వ్యవహారాన్ని సాకుగా చూపి సభను అడ్డుకోవడం సరికాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

AP7AM24 May, 11:46 am
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు తక్షణమే ఎత్తివేయండి: ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి

- జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వంపై ప్రముఖ రాజనీతి విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. - నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. - వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు...

Oneindia Telugu26 May, 09:21 am
AP Govt: ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు యత్నాలు? తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ టీవీ డిబేట్ లో రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై కేసులు పెడతామని జనసేన చేసిన హెచ్చరికల తర్వాత ఆయన క్షమాపణ చెప్పేశారు. అయినా నాగేశ్వర్ పై ఏపీలో కేసులు పెట్టడంపై ఇప్పటికే రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇవాళ ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారన్న వార్తలు కలకలం రేపాయి. ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. నాగేశ్వర్ ఇంటి వద్ద భద్రత కల్పించారు. దీంతో ఏపీ పోలీసుల్ని నిజంగానే ప్రభుత్వం (Ap govt) అరెస్టుకు పంపిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వీటిపై ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని ఇందులో తేల్చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం. అలాంటిదేం జరగలేదు. కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.#FactCheck#AndhraPradesh pic.twitter.com/u99lXNVGgT అలాంటిదేం జరగలేదని, కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫ్యాక్ట్ చెక్ లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వివరణ తర్వాత అయినా ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందా లేక నిజంగానే నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తే తెలంగాణ పోలీసులు ఏం చేయబోతున్నారు ? ఇరు రాష్ట్రాల మధ్య

Eenadu26 May, 01:01 pm
Professor Nageshwar: ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ స్పష్టం చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు చేరుకున్నారంటూ ప్రచారం జరిగింది. దాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.