translateexpand_more

Rajnath Singh Telangana News

Latest updates from Telugu Digital news sources.

Vaartha02 Jun, 05:51 pm
తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర కీలకం

Byri Shankar Mudiraj: మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని, వారి అమూల్యమైన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కొనియాడారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నాటి పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత కీలకమైన, చారిత్రాత్మకమైన పాత్ర పోషించిందని గుర్తుచేశారు. నాడు బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా హైదరాబాద్‌కు విచ్చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. అలాగే, పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ నాటి ప్రతిపక్ష నేత, దివంగత సుష్మా స్వరాజ్.. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ బిడ్డలెవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. “తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి” అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బిల్లు పాస్ చేయించింది బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. Read Also: తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధాన సూత్రాల కోసం తెలంగాణ యువత సుదీర్ఘకాలం ఉధృతమైన పోరాటాలు చేసిందని బైరి శంకర్ అన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ తిరోగమన దిశలో పయనిస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమరవీరుల ఆశయాలు నేరవేరాలన్నా, తెలంగాణ తన అసలైన గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పాలన్నా అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘనమైన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు ఉమారెడ్డి, కాసానగొట్టు సంతోష్, గుండ్ల జనార్ధన్, సుతారి కార్తీక్, తాటికొండ శ్రీనివాస్, కెమ్మసారం సంతోష్, సునీల్, కనకరాజు, మహేందర్, యాదగిరి, వెంకట్రాంరెడ్డి, సాగర్ తదితర నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. Vizianagaram Land Acquisition: భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష! Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Pawan : పవన్ కంటే తనకే ఎక్కువ అర్హత ఉందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే !! Pawan – Komati Reddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ Janasena Vs Congress : నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో – పొన్నం కు బొలిశెట్టి కౌంటర్ Pawan Kalyan : ఇది భారతదేశమా? పాకిస్థానా? కాంగ్రెస్ తీరు పై పవన్ ఆగ్రహం Janasena Party :తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ మాజీ అధినేత, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ లక్ష్యంగా... తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్... ప్రజా గాయకుడు, దివంగత గద్దరన్నతో తనకు ఉన్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని జనసేన అధినేత పవన్... ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలని,... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్... ఆర్‌సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ...