translateexpand_more

Ravi Shastri News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 02:33 am
రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతం సృష్టించాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ అనంతరం 15 ఏళ్ల ఈ కుర్రాడు ఏకంగా ఐదు వ్యక్తిగత అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో 776 పరుగులతో పరుగుల వరద పారించిన వైభవ్.. తన అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు పొందాడు.ఈ సీజన్‌లో వైభవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ సిక్సెస్ అవార్డులను గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతేడాది 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన సాయి సుదర్శన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.అంతేకాదు ఈ సీజన్‌లో మొత్తం 72 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59) రికార్డును కూడా తుడిచిపెట్టాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి.. వైభవ్‌తో సరదాగా ముచ్చటించాడు. "ఇంత చిన్న వయసులో ఇంత బలంగా బంతిని బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్?" అని శాస్త్రి హిందీలో అడగ్గా.. "నేనిప్పుడు పాలు తాగడం లేదు" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

AP7AM01 Jun, 12:51 am
ఈ సీజ న్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే

భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే, వైభవ్ సూర్యవంశీ అనే యువ కెరటం ఐపీఎల్ 2026 సీజన్‌ను తన అసాధారణ బ్యాటింగ్‌తో శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ కుర్రాడు, తన అద్వితీయ ప్రదర్శనతో రికార్డుల మోత మోగించాడు. సీజన్ ముగింపు వేడుకలో ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.ఈ సీజన్‌లో వైభవ్ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో 72 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 231.7 స్ట్రైక్ రేట్‌తో ఆధునిక క్రికెట్‌లోని మేటి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో 400, 500, 600 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న పిన్న వయస్కుడిగానూ ఘనత సాధించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని, ఆట తీరును చూసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసించాడు. అతడు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడు.అవార్డుల స్వీకరణ అనంతరం రవిశాస్త్రితో వైభవ్ మాట్లాడుతూ.. "అవార్డులు గెలవడం గర్వంగా ఉంది. కానీ, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. బంతిని బలంగా బాదడమే నా నైజం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్‌లో నేర్చుకున్నాను" అని వివరించాడు.అయితే, సంజయ్ మంజ్రేకర్, మహ్మద్ కైఫ్

NTV Telugu01 Jun, 05:49 am
చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi Admits Pressure After IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్‌లను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. సీజన్ ముగిసిన తర్వాత తన ఫిట్‌నెస్, ఒత్తిడి, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం భారత మాజీ కోచ్ రవి శాస్త్రితో మాట్లాడిన వైభవ్ .. ఈ సీజన్ తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగాయని అంగీకరించాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కూడా చాలా ఒత్తిడి అనిపిస్తోందని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. 'ఇంతటి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు నాపై ఒత్తిడి కూడా పెరిగింది. ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అయినప్పటికీ ఇది గర్వకారణం. వచ్చే సీజన్‌లో కూడా ఇదే స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాను. నేను నా ఆటను నమ్ముతాను. కొట్టే బంతి వస్తే పూర్తిగా దాడి చేస్తాను. కానీ ఈ సీజన్‌లో నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్‌లో ఒకే విధంగా ఆడలేం. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటను మార్చుకోవాలి. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇటీవల కొందరు మాజీ క్రికెటర్లు వైభవ్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. దీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగాలంటే ఫిట్‌నెస్ కీలకమని సూచించారు. దీనిపై స్పందించిన యువ బ్యాటర్.. ఇప్పటికే తన శారీరక దారుఢ్యంపై ప్రత్యేకంగా పని చేస్తున్నానని వెల్లడించాడు. 'అవును,

Samayam Telugu01 Jun, 04:27 pm
రోజుకు ఎన్ని పాలు తాగుతావు?' రవిశాస్త్రి ప్రశ్నకు అమాయకంగా సమాధానమిచ్చిన వైభవ్

ఐపీఎల్ 2026 ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్‌కు.. ఆదివారం జరిగిన ఫైనల్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ను సాధించింది. అయితే ఈ టోర్నీలో అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ . రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ ప్లేయర్.. తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించాడు.ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు దక్కించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా ఈ బుడ్డొడిపైనే ఉంది. అయితే ఇక్కడ కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి .. సూర్యవంశీతో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు.ఈ సీజన్‌లో వైభవ్‌ సిక్సర్ల మోత మోగించాడు. దీంతో సూర్యవంశీ కొట్టే సిక్సర్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే రవిశాస్త్రి భావించాడు. ఇందులో భాగంగా “నువ్వు రోజుకు ఎన్ని పాలు తాగుతావు?” అని వైభవ్‌ను అడిగాడు. ఈ ఊహించని సరదా ప్రశ్నకు స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రశ్నకు వైభవ్.. అమాయకంగా సమాధానమిచ్చాడు. “ప్రస్తుతం నేను పాలు తాగడం లేదు సార్‌” అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కాగా ఈ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 16

Sakshi29 May, 03:03 pm
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్ మన్ గిల్

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్‌-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్‌లో శుభ్‌మ‌న్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు. రియాన్ ప‌రాగ్ 'హెడ్స్' అని కాల్‌ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్‌ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్‌ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు. ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్‌ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్‌కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు) టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ