translateexpand_more

Run Machine News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 03:03 am
వైభ వ్ సూర్య వంశీ ర న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత కుమించి

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క పేరు మార్మోగిపోయింది. అతనే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఈ వండర్‌కిడ్, టోర్నీకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన సూర్యవంశీకి, రెండో సీజన్ ఒక అగ్నిపరీక్ష లాంటిది. సాధారణంగా రెండో సీజన్‌లో ఆటగాళ్లపై అంచనాలు పెరిగిపోతాయి, ప్రత్యర్థులు వారి ఆటతీరుపై పూర్తి అవగాహనతో ఉంటారు. కానీ, వాటన్నింటినీ అధిగమించి సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఎంతో మంది అంతర్జాతీయ స్టార్ బ్యాటర్లున్న ఈ లీగ్‌లో 750 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతని బ్యాటింగ్ ఎంత వినోదాన్ని పంచిందో, అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థులకు విధ్వంసాన్ని సృష్టించింది. ఈ యువ కెరటం ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు.ఒక రెడ్డిట్ పోస్ట్‌ ద్వారా సచిన్ తన విశ్లేషణను పంచుకున్నాడు. "వైభవ్ సూర్యవంశీ కేవలం తాను చేసిన పరుగులతోనే కాదు, అంతకుమించి ఆటపై తనదైన ముద్ర వేశాడు. అతను క్రీజులోకి రాకముందే ప్రత్యర్థి జట్లు అతని గురించి తీవ్రంగా ఆలోచించేవి, అతని కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించేవి. అభిమానులు అతని బ్యాటింగ్ కోసమే ఎదురుచూసేవారు" అని టెండూల్కర్ పేర్కొన్నాడు."ఎలిమినేటర్, క్వాలిఫయర్ వంటి అత్యంత కీలకమైన, ఒత్తిడితో