translateexpand_more

Jana Sena Telangana News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu31 May, 05:30 am
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీనపడింది. అయినా సరే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారంతా బీఆర్ఎస్‌లో చేరడంతో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. 2018లో కాంగ్రెస్‌, వామపక్షాలతో జతకట్టి పోటీ చేసినా బీఆర్ఎస్‌ ముందు నిలబడలేకపోయింది. 2023 ఎన్నికలను పెద్దగా పట్టించుకోనేలేదు. అలాంటి పార్టీని ఇప్పుడు మళ్లీ పైకి లేపేందుకు… తెలంగాణపై పసుపు జెండా ఎగరేసేందుకు అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మొన్నటి మహానాడు సాక్షిగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తామన్నారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌. మళ్లీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని ఏపీలో పవర్ షేరింగ్‌ అందుకున్న జనసేన కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2నే హైదరాబాద్‌లో తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్‌ మీటింగ్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా జనసేన ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయ్‌. దీంతో తెలంగాణలో పార్టీకి కొత్త జీవం పోయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన జనసేన నాయకత్వంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా… టీడీపీ, జనసేన రెండు పార్టీలు తెలంగాణలో బలోపేతంపై ఫోకస్ పెట్టాయి.

NTV Telugu01 Jun, 01:29 pm
పవన్ కల్యాణ్ కు తెలంగాణ పోలీసుల షాక్ .. నో పర్మిషన్

Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఓ రకంగా షాకిచ్చారు తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్‌లో నిర్వహించనున్న జనసేన పార్టీ 'నవనిర్మాణ సంకల్ప సభ'కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీంతో, ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ పాల్గొననున్న ఈ సభను గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేన నాయకత్వం 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అంతేకాకుండా జనసేన సాధక్ సమ్మేళనాన్ని కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ సభకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ చేసిన దరఖాస్తును తెలంగాణ పోలీసులు తిరస్కరించినట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, అలాగే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రస్తుతం సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసుల నిర్ణయంపై జనసేన నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కు తమకు ఉందని, అవసరమైన అన్ని నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. సభకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జనసేన నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణపై తుది నిర్ణయం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండనుంది. జనసేన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు అనుమతి లభిస్తే సభ యథావిధిగా నిర్వహించే అవకాశాలు