translateexpand_more

Lic News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 02:52 am
ఫిన్ టెక్ సేవల్లోకి ఎల్ ఐసీ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ డిజిటల్‌ సేవలను పెద్ద ఎత్తున విస్తరించడంపై దృష్టి సారించింది. ఒక ఫిన్‌టెక్‌ సంస్థను ఏర్పాటు చేయడాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. పెరుగుతున్న డిజిటల్‌ సేవల అవసరాలను తీర్చేందుకు అవసరమైతే ప్రత్యేకమైన సేవలు అందించే సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడిని సైతం పరిశీలిస్తున్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఆర్‌.దొరైస్వామి తెలిపారు. ‘సహజంగా ఆధునికీకరణ అవసరాలు, కొత్త ఆవిష్కరణల కోసం మేము

Eenadu31 May, 10:53 am
ఫిన్ టెక్ రంగంలోకి ఎల్ ఐసీ

LIC Fintech | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఫిన్‌టెక్‌ రంగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. డిజిటల్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక పెట్టుబడులు లేదా ఆర్గానిక్‌ మార్గంలో ఫిన్‌టెక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. ఆధునిక అవసరాలను తీర్చడానికి, నూతన ఆవిష్కరణల కోసం అటు ఫిన్‌టెక్‌, ఇటు ఇన్సురెన్స్‌టెక్‌ కంపెనీలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పీఐటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశలపై మాట్లాడారు. కేవలం బీమా వ్యాపారమే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎల్‌ఐసీ ఉందని, అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిందన్నారు. పాలసీదారులకు మెరుగైన ప్రతిఫలం అందించేందుకు ప్రత్యేకమైన సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులకూ ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీని ఎల్‌ఐసీ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పారు. తమ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా సొంతంగానే తమ బిజినెస్‌ అప్లికేషన్లను తయారు చేసుకుంటున్నామని వెల్లడించారు. అదే సమయంలో కొత్త కొత్త ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఇతర ఐటీ సర్వీస్‌ ప్రొవైడర్లతోనూ కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఫిన్‌టెక్‌ రంగంలో పోటీలో నిలదొక్కుకోవాలంటే ఐటీ అప్లికేషన్‌లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌ఐసీలో తదుపరి వాటాల విక్రయంపై ప్రశ్నించగా.. పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ పరిమితిని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత

Zee Telugu29 May, 05:24 pm
వ తరగతి పాసైన మహిళలకు ఎల్ ఐసీ బంపర్ ఆఫర్.. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ .7,000 సంపాదించండిలా

Govt Best Scheme: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని వయసుల వారికి బీమా పాలసీలను అందిస్తుంది. మహిళలకు ప్రత్యేకంగా సాధికారత కల్పించేందుకు LIC ఒక పథకాన్ని నడుపుతోంది. దీని ద్వారా మహిళలు నెలకు కనీసం రూ. 7,000 సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రభుత్వ పథకం పేరు ఎల్ఐసీ బీమా సఖీ. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ పథకం భారీ ప్రజాదరణ పొందింది. ఇందులో చేరే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భీమా సఖి పథకం గ్రామీణ మహిళలకు భీమా ఏజెంట్లుగా మారడానికి, జీవనోపాధి సంపాదించడానికి గ్రామాలలో భీమాపై అవగాహన పెంచడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం గ్రామీణ మహిళలకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో భీమా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. ఎల్ఐసి బీమా సఖి పథకం కింద, కనీసం 10వ తరగతి పూర్తి చేసిన 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే.. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎల్ఐసి ఒక గొప్ప సంపాదన అవకాశాన్ని అందిస్తోంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, పాలసీ అమ్మకాలపై వచ్చే కమీషన్‌కు అదనంగా, ఇందులో పాల్గొనే మహిళలకు మొదటి మూడు సంవత్సరాల పాటు స్థిరమైన స్టైఫండ్ కూడా అందిస్తుంది. ఎల్ఐసి బీమా సఖి పథకం కింద, మహిళలకు వరుసగా మూడు నెలల పాటు ఒక స్థిరమైన స్టైపెండ్ చెల్లిస్తారు. నిబంధనల ప్రకారం, మొదటి సంవత్సరంలో మహిళలకు నెలకు రూ. 7,000 చెల్లిస్తారు, అయితే రెండవ సంవత్సరంలో ఈ మొత్తం రూ. 1,000 తగ్గి నెలకు రూ.

Eenadu25 May, 01:22 pm
LIC Joint plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రెండు కొత్త...

LIC Joint plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ బీమా అందించేలా రెండు జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్...

Eenadu24 May, 11:25 am
LIC profit: లాభాల్లో LICనే కింగ్‌.. త్రైమాసిక ఫలితాల్లో సత్తా

- LIC profit | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) కీలక మైలురాయిని అందుకుంది. - మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫైనాన్షియల్‌ రంగంలో అత్యధిక లాభం నమోదుచేసిన కంపెనీగా అవతరించింది. - రూ.23,400 కోట్ల నికర లాభంతో మొదటి స్థానం సొంతం చేసుకుంది.

Eenadu29 May, 01:08 pm
ఎల్ ఐసీ షేర్లు 50 శాతం పడ్డాయా? కారణం ఇదే

LIC shares | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో 50 శాతం మేర క్షీణించినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఎల్‌ఐసీ బోనస్‌ ఇష్యూ సంగతి తెలీని వారు ఈ మార్పు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుక్రవారం నుంచి బోనస్‌ షేర్ల జారీ షేరు విలువలో ప్రతిఫలించడమే ఇందుకు కారణం. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు విలువ రూ.830గా ఉంది. బోనస్‌ షేరు వల్ల విలువ సగమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మార్కెట్‌ ప్రారంభంలో రూ.417.60 వద్ద ప్రారంభమైంది. తర్వాత ఒక శాతం నష్టంతో రూ.411 వద్ద మగిసింది. అంటే నష్టపోయింది ఒక శాతం లోపే. కానీ, 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేయడం వల్ల స్టాక్‌ ధరలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు కనిపించింది. మే 29 నాటికి ఎల్‌ఐసీ షేర్లు ఉన్నవారికి 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయాలని ఎల్‌ఐసీ నిర్ణయం తీసుకుంది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు కలిగిన వాటాదార్లకు అదనంగా రూ.10 ముఖ విలువ కలిగిన మరో ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 2025 డిసెంబరు 31 నాటికి ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.6,325 కోట్ల నిల్వలు, మిగులు నిధులతో ఈ బోనస్‌ ఇష్యూను పూర్తి చేయనున్నట్లు ఎక్స్ఛేంజీలకు గతంలో ఎల్‌ఐసీ సమాచారం ఇచ్చింది. దీనివల్ల కంపెనీ షేర్లు సంఖ్య పెరగడమే కాకుండా.. రిటైల్‌ మదుపర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. షేర్ల సంఖ్య పెరిగినంత మాత్రాన కంపెనీ మార్కెట్‌ విలువలో ఎలాంటి మార్పూ ఉండదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల

Zee Telugu26 May, 01:44 am
LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు...

LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు ఉమ్మడి జీవిత బీమా పథకాలను ఆవిష్కరించింది. ఎల్ఐసీ న్యూజీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన...