translateexpand_more

Maharashtra News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 12:43 pm
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు.ముంబైలోని వర్షా బంగ్లాలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. లోకేష్ ఆయనకు తిరుమల శ్రీవారి ప్రతిమ, మంగళగిరి శాలువా బహూకరించగా, ఫడ్నవీస్ గణేశుడి విగ్రహాన్ని అందజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక అంశాలు, ఏపీలో పెట్టుబడులు, వ్యాపార అనుకూల విధానాలు, విద్యా సంస్కరణలపై వారు చర్చించుకున్నారు.లోకేష్ తన ముంబై పర్యటనలో, ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో లోకేష్ సమావేశమై విశాఖపట్నం ప్రాధాన్యతను వివరించారు. వైజాగ్‌ను ఐటీ, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. విశాఖలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ఎయిర్‌ట్రంక్‌ను లోకేష్ ప్రత్యేకంగా కోరారు.లోకేష్ ప్రజెంటేషన్, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎయిర్‌ట్రంక్ సీఈఓ సానుకూలంగా స్పందించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఐటీ రంగంలోకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటనలు చేపడుతున్నారు.

Eenadu01 Jun, 09:52 am
మహారాష్ట్ర సీఎంతో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ.. పెట్టుబడులు, విద్యావిధానాలపై చర్చ

ముంబయి: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబయిలో భేటీ అయ్యారు. సాదర స్వాగతం పలికిన సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను లోకేశ్‌ అందజేశారు. గణేశ్‌ ప్రతిమను లోకేశ్‌కు సీఎం దేవేంద్ర బహూకరించారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మహారాష్ట్ర సీఎంకి వివరించారు. ఏపీ విద్యా శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ విధానాలు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వివిధ దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న హైపర్‌ స్కేల్‌ డేటా సంస్థ ఎయిర్‌ ట్రంక్‌ సీఈవో రాబిన్‌ ఖుదాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. విశాఖలో ఎయిర్‌ ట్రంక్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ, డేటా హైపర్‌స్కేల్‌ హబ్‌గా వైజాగ్‌ ఆవిర్భవిస్తోందని, గూగుల్‌ ఏఐ హబ్‌, రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్లు పురోగతిలో ఉన్నాయని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్నివిధాల అనుకూలమైనదని మంత్రి చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని రాబిన్‌ ఖుదా హామీ ఇచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పెనుకొండ,

Zee Telugu29 May, 09:42 am
వామ్మో.. ఎండకు హీటెక్కిన రోడ్డు... నోట్లో ఎలుకతో నాగుపాము పరుగో పరుగు.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cobra unable to cross road due to surface was too hot in Palghar Maharashtra video: కొన్ని రోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. భానుడు తన ప్రభావంతో జనాల్ని ఇంట్లో నుంచి బైటకు వెళ్లాలంటేనే భయపడేలా చేశాడు. ఎక్కడ చూసిన విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసం అయితే తప్ప బైటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా టోపీలు, గొడుగులు ధరించాలి, ఎండ ప్రభావం నుంచి బైటపడేలా జ్యూస్ లు, నీళ్లను ఎక్కువగా తాగాలని నిపుణులు చెప్తున్నారు. శరీరం డీ హైడ్రేషన్కు గురికాకుండా చూసుకొవాలని చెప్తున్నారు. ఇటీవల కొన్నిచోట్ల వర్షాలు పడిన కూడా మరల భానుడు తన తాండవం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎండల ప్రభావంకు మనుషులే కాదు.. నోరు లేనీ జీవాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి. ఇటీవల పాములు ఎక్కువగా ఎండల ప్రభావంకు గురౌతున్న అనేక వీడియోలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా.. మహారాష్ట్రలోని పాల్ ఘర్ లో ఒక పాము ఎండకు కనీసం రోడ్డు దాట లేక పోయింది.ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహా రాష్ట్రలోని పాల్ ఘర్ లోని కలెక్టర్ కార్యాలయం సమీపంలోని రోడ్డుమీద ఈ ఘటన చోటు చేసుకుంది. మిట్ట మధ్యాహ్నం ఒక పాము నోట్లో ఎలుకను పట్టుకుంది. ఆ తర్వాత రోడ్డు దాటేందుకు

Eenadu27 May, 02:51 pm
వివాహ వేడుకలో రిటర్న్ గిఫ్ట్ గా గ్రామస్తులందరికీ బీమా

Wedding gift | ఇంటర్నెట్ డెస్క్‌: వివాహం అనేది జీవితంలో అద్భుత ఘట్టం. అందుకే ఈ వేడుకను కొందరు ఉన్నంతలో సింపుల్‌గా జరుపుకొంటే.. మరికొందరు ఆడంబరాలకు పోతుంటారు. పెళ్లికి వచ్చేవారికి రిటర్న్‌ గిఫ్ట్‌గా ఖరీదైన బహుమతులూ ఇస్తుంటారు. కానీ, మహారాష్ర్టలోని ఓ కుటుంబం మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని ప్రజలందరికీ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ను అందించి సమాజంపై ఉన్న తమ ఉదారతను చాటుకుంది. వీరి ఆలోచనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్రలోకి నాందేడ్‌ జిల్లా బహదూర్‌పూర గ్రామానికి చెందిన సిద్దేశ్వర్‌, మంజూషకు ఇటీవల వివాహం జరిగింది. తన కుమారుడి వివాహం సందర్భంగా కుటుంబం పెళ్లికి వచ్చిన గ్రామస్థులందరికీ రిటర్న్‌ గిఫ్ట్‌గా రూ.1 లక్ష విలువైన యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌లను అందించింది. పెళ్లి మండపంలోనే 3500 మందికి బీమా పత్రాలను అందించారు. దీంతో పెళ్లికి వచ్చిన వారు సమాజంపై కుటుంబానికి ఉన్న నిబద్ధతను కొనియాడారు. అనుకోని ప్రమాదాల సమయంలో ఈ ఇన్సూరెన్స్‌ గ్రామస్తులకు ఎంతో ఉపయోగపడుతుందని పేఠ్‌కర్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్భాటాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Andhra Jyothy23 May, 03:08 pm
రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

- Home » National » No power can stop India from being biggest exporter of weapons in 25 to 30 years says Rajnath Singh AVR ABN , Publish Date - May 23 , 2026 | 08:38 PM ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే దశలో ఉన్న ఇండియా ర... - షిర్డి: ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే దశలో ఉన్న ఇండియా రాబోయే 25-30 ఏళ్లలో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నిలవనుందని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. - షిర్డీలో మందుగుడు సామాగ్రి తయారీ కేంద్రాన్ని (Ammunition Manufacturing Unit) శనివారంనాడు ఆయన ప్రారంభించారు.