translateexpand_more

Yennam Srinivas Reddy News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 10:48 am
కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాశారని, అందుకే వారికి మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం జడ్జీలు, జర్నలిస్టులు, నటీనటులు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేసి, వారిని బెదిరించి నియంత్రించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దీన్ని ఒక రాక్షస క్రీడగా, క్రూరమైన, వ్యవస్థీకృత నేరంగా అభివర్ణించారు. ఈ చర్యల వల్ల ఎంతోమంది బాధితులుగా మారారని ఆయన పేర్కొన్నారు."కేసీఆర్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదు" అని తేల్చిచెప్పిన యెన్నం, ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే, తమకు ఓటు వేయని వారిని గుర్తించి వేధించేందుకు మళ్లీ భారీస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే లక్షలమంది ఫోన్లపై నిఘా పెడతారని ఆరోపించారు.

Vaartha01 Jun, 09:58 am
ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు

Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశం కాదని, రాజకీయ అంశం అసలే కాదని, ఇది తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం అని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఉన్న కమీషనర్ ఆఫ్ పోలీస్, ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) అధికారుల ఎదుట ఆయన హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన మొబైల్ ఫోన్ అనుమానాస్పదంగా ట్యాపింగ్‌కు గురైందని, దీనిపై తొలిసారిగా తాను డిఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. Read also: Aadhaar Update: కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం అనంతరం చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాముఖ్యతతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం సంభాషణలను వినడమే కాకుండా, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత స్వేచ్ఛలో అక్రమ జోక్యం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గోప్యత హక్కు కల్పించబడిందని, సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ద్వారా గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఉందని, ఫోన్లు ట్యాప్

AP7AM01 Jun, 12:42 pm
పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బీఆర్ఎస్ పార్టీ కావాలనే వైషమ్యాలు రెచ్చగొడుతోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే సభల పేరుతో తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత జగన్ తో కలిసి కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నాడు ఏపీ ఎన్నికల్లో జగన్ వ్యతిరేకులను ఓడించడానికి కేసీఆర్ అన్ని విధాలుగా తెరవెనుక సహాయం చేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటూ నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎండగట్టారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల కంటే తమ ప్రభుత్వమే ప్రజా సంక్షేమంలో ముందుంటుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. గతంలో ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించిన యెన్నెం.. స్వయంగా కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే కేటీఆర్ అని పేరు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Yennam Srinivas Reddy News Keyword | Telugu Digital