translateexpand_more

Vaibhav Suryavanshi News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media31 May, 07:15 pm
ఒకే సీజన్ లో 4 అవార్డులు కొల్లగొట్టిన వండర్ కిడ్ వైభవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు వేడుకల్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులు సృష్టించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేసిన ఈ యువ ఆటగాడు ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. దీంతో ఐపీఎల్ 2026 అవార్డుల విజేత వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచారు. ఈ సీజన్ లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో వైభవ్ ఏకంగా 776 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లీగ్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆరెంజ్ క్యాప్ విజేతకు లేని విధంగా 237 పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలోనే 500 పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ లో అత్యధికంగా 72 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా వైభవ్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. క్రిస్ గేల్ నెలకొల్పిన పాత రికార్డును అధిగమించి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. దీంతో ఒక్క సీజన్ లోనే ఆరెంజ్ క్యాప్, మోస్ట్ సిక్సర్స్, ఎమర్జింగ్ ప్లేయర్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేసులో నిలిచి 4 అవార్డులను దక్కించుకున్నారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 732 పరుగులు, సాయి సుదర్శన్ 722 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫలితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసే సమయానికి వైభవ్ సూర్యవంశీ లీగ్ లోనే టాప్ రన్ స్కోరర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ లోని ఇతర ముఖ్య అవార్డుల

Sakshi01 Jun, 07:59 am
కోహ్లికి కూడా సాధ్యం కానిది 15 ఏళ్లకే చేసి చూపించాడు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోహ్లికి కూడా సాధ్యం కానిది 15 ఏళ్లకే చేసి చూపించాడు..!

AP7AM01 Jun, 06:27 am
ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా

ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. రికార్డులతో పాటు కాసుల వర్షంలోనూ మునిగిపోయాడు. కేవలం బ్యాట్‌తోనే కాకుండా సంపాదనలోనూ ఈ బిహార్ కుర్రాడు భళా అనిపించాడు. వేలం పాటలో కేవలం రూ.కోటి పైచిలుకు ధరకే దక్కిన ఈ పరుగుల వీరుడు ఈ ఒక్క సీజన్ ద్వారానే ఏకంగా రూ.రెండున్నర కోట్లకు పైగా ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.మ్యాచ్ ఫీజే ఎక్కువమెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే అతడికి లభించిన అసలు సంపాదన దీనికంటే చాలా ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందిస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. దీనివల్ల కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే ఈ కుర్రాడు ఏకంగా రూ.1.20 కోట్లు సంపాదించడం విశేషం.అవార్డులతో కాసుల వర్షంరాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో వైభవ్ అవార్డులను ఊడ్చేశాడు. ఈ సీజన్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకొని భారీగా నగదు బహుమతులను అందుకున్నాడు. ఆ వివరాలు చూస్తే:మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.15 లక్షలుఆరెంజ్ క్యాప్ (టాప్ స్కోరర్ - 776 పరుగులు): రూ.10 లక్షలుసూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు (దీనితో పాటు టాటా సియెర్రా కార్)సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు):

AP7AM01 Jun, 02:33 am
రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతం సృష్టించాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ అనంతరం 15 ఏళ్ల ఈ కుర్రాడు ఏకంగా ఐదు వ్యక్తిగత అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో 776 పరుగులతో పరుగుల వరద పారించిన వైభవ్.. తన అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు పొందాడు.ఈ సీజన్‌లో వైభవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ సిక్సెస్ అవార్డులను గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతేడాది 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన సాయి సుదర్శన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.అంతేకాదు ఈ సీజన్‌లో మొత్తం 72 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59) రికార్డును కూడా తుడిచిపెట్టాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి.. వైభవ్‌తో సరదాగా ముచ్చటించాడు. "ఇంత చిన్న వయసులో ఇంత బలంగా బంతిని బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్?" అని శాస్త్రి హిందీలో అడగ్గా.. "నేనిప్పుడు పాలు తాగడం లేదు" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

AP7AM01 Jun, 12:51 am
ఈ సీజ న్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే

భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే, వైభవ్ సూర్యవంశీ అనే యువ కెరటం ఐపీఎల్ 2026 సీజన్‌ను తన అసాధారణ బ్యాటింగ్‌తో శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ కుర్రాడు, తన అద్వితీయ ప్రదర్శనతో రికార్డుల మోత మోగించాడు. సీజన్ ముగింపు వేడుకలో ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.ఈ సీజన్‌లో వైభవ్ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో 72 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 231.7 స్ట్రైక్ రేట్‌తో ఆధునిక క్రికెట్‌లోని మేటి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో 400, 500, 600 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న పిన్న వయస్కుడిగానూ ఘనత సాధించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని, ఆట తీరును చూసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసించాడు. అతడు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడు.అవార్డుల స్వీకరణ అనంతరం రవిశాస్త్రితో వైభవ్ మాట్లాడుతూ.. "అవార్డులు గెలవడం గర్వంగా ఉంది. కానీ, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. బంతిని బలంగా బాదడమే నా నైజం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్‌లో నేర్చుకున్నాను" అని వివరించాడు.అయితే, సంజయ్ మంజ్రేకర్, మహ్మద్ కైఫ్

TV9 Telugu31 May, 12:47 pm
అహ్మదాబాద్ లో అలజడి.. ఐపీఎల్ ఫైనల్ కు ఊహించని గెస్ట్

IPL 2026 Final : ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. అయితే ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ఫైనల్‌కు చేరనప్పటికీ, ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం అహ్మదాబాద్‌లో తళుక్కున మెరిశాడు. ప్లేఆఫ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ టీనేజ్ సెన్సేషన్, నేడు జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు చూపించిన అసాధారణ ప్రదర్శనకు గాను స్టేడియంలో అతడిని సత్కరించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు సాధించాడు. ఇతడి ఊచకోత వల్లే రాజస్థాన్ జట్టు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 లో కూడా ఒంటరి పోరాటం చేస్తూ 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 96 పరుగులు చేసి జట్టుకు 214 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. వైభవ్ సూర్యవంశీ క్వాలిఫయర్-2 లో అద్భుతంగా ఆడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కలేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు కంప్లీట్ డామినేషన్‌తో రాజస్థాన్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా ఛేజ్ చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 104 పరుగులతో సెంచరీ బాదగా, ఓపెनर సాయి సుదర్శన్ 58 పరుగులతో అదరగొట్టాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ

AP7AM30 May, 06:26 am
చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్ పై 'బాడీలైన్' బౌలింగ్ పై విమ ర్శ లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. అయితే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుత పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104) అద్భుత సెంచరీతో గుజరాత్ విజయం సాధించడంతో వైభవ్ పోరాటం వృథా అయింది.ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలమైన దశలో క్రీజులోకి వచ్చిన వైభవ్, ఏమాత్రం బెదరకుండా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. 204.26 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి జట్టు స్కోరును 214/6 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత ఎలిమినేటర్‌లోనూ 97 పరుగులతో రాణించి తన సత్తా చాటాడు.అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్‌ను కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ బౌలర్లు అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని 'బాడీలైన్' బౌలింగ్ వేశారు. ఈ విషయంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు."15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడానికి బాడీలైన్ బౌలింగ్ వేయడం నాకు నచ్చలేదు. అతను పెద్దవాళ్లతో ఆడుతున్నాడని నాకు తెలుసు, కానీ నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదు" అని పఠాన్ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో చిన్న వయసు ఆటగాడిపై అంతటి

Sakshi31 May, 02:58 pm
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర

NTV Telugu29 May, 03:35 pm
రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో పరుగుల సునామీ సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క సీజన్‌లో పవర్‌ప్లే ఓవర్లలో (1-6 ఓవర్లు) 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కారు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ పవర్‌ప్లేలో ఏకంగా 233.63 భీకర స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు బాది అగ్రస్థానంలో నిలిచారు. టి20 క్రికెట్ చరిత్రలోనే పవర్‌ప్లేలో ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎవరూ చేయలేదు. గతంలో ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ 2016 సీజన్ పవర్‌ప్లేలో 150.16 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు సాధించారు. ఆ తర్వాత స్థానాల్లో ట్రావిస్ హెడ్ (402 పరుగులు – 2024), సాయి సుదర్శన్ (402 పరుగులు – 2025), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (382 పరుగులు – 2009) ఉన్నారు. వీరి తర్వాత జోస్ బట్లర్ (374 రన్స్ – 2022), విరాట్ కోహ్లీ (373 రన్స్ – 2024) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్-2 పోరులో యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ వంటి కీలక వికెట్లు త్వరగానే పడిపోయినా.. సూర్యవంశీ మాత్రం తనదైన శైలిలో భీకర బ్యాటింగ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన 90 పరుగులతో క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. గత మ్యాచ్‌లోనే కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం

NTV Telugu30 May, 11:04 am
వైభవ్ బ్యాటింగ్ కు యానిమల్’ విలన్ ఫిదా.. దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు

Bobby Deol: ఐపీఎల్ 2026 సీజన్‌ ముగింపుకు చేరువలో ఉంది. ఈ మొత్తం సీజన్‌లో గెలుపు.. ఓటములతో సంబంధం లేకుండా ఒక ప్లేయర్ మాత్రం విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.. ఈ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ టీంలతో సంబంధం లేకుండా యావత్ క్రికెట్ అభిమానుల దృష్టిలో ఈ బుడ్డోడిపై ఇప్పుడు ప్రత్యేక అభిమానం ఉందంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం ఈ బిహార్ యువ సంచలనంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి ఆటపై మనసు పారేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్, 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ సైతం వైభవ్ బ్యాటింగ్‌ స్టైల్‌కు ఫిదా అయిపోయారు. తన రాబోయే చిత్రం 'బందర్' ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్, వైభవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడాలి" ఈ సందర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్స్ వల్ల ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లను ఎక్కువగా చూడలేకపోయానని అన్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే దాదాపు సెంచరీ మార్కును టచ్ చేసిన ఇన్నింగ్స్ గురించి యాంకర్ ప్రస్తావించగా బాబీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "అతడొక అద్భుతం. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రతిభ చూపించడం అసాధారణం. దేవుడు ఆ బుడ్డోడిని చల్లగా చూడాలి, అతనికి ఎవరి దిష్టి (చెడు దృష్టి) తగలకుండా కాపాడాలి" అంటూ బాబీ డియోల్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఒకవైపు వైభవ్ ఆటపై ప్రశంసలు కురుస్తున్నప్పటికీ, శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన

TV9 Telugu01 Jun, 02:33 pm
వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంతో తెలుసా

15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్‌లో కోటి పది లక్షల కాంట్రాక్ట్‌తో పాటు, ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ వంటి ఐదు మేజర్ అవార్డులు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 776 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుగా నిలిచాడు.

AP7AM31 May, 07:35 pm
వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. అయితే, టైటిల్ గెలిచింది ఆర్సీబీనే అయినా, పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో అసలు సిసలు హీరోగా నిలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు.వైభవ్ సూర్యవంశీ ప్రభంజనంఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అతని భయంలేని, నిలకడైన స్ట్రోక్‌ప్లేతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ అసాధారణ బ్యాటింగ్‌కు గుర్తింపుగా 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డులు కూడా వైభవ్‌నే వరించాయి.ఇంతటితో ఆగకుండా, 237.31 స్ట్రైక్ రేట్‌తో 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది 'సూపర్ సిక్సెస్' అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యువ కెరటం తన ప్రదర్శనతో ఎన్నో బ్యాటింగ్ రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త

Andhra Jyothy29 May, 03:39 pm
వైభవ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. తొలి ప్లేయర్ గా

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే... స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో రాజస్థాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్‌లో ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో 500 పై చిలుకు పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు, పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2016 సీజన్‌లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు. వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

NTV Telugu29 May, 04:10 pm
మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్ గా వైభవ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ నైంటీస్ (90s) లో అవుట్ కావడం ఇది మూడోసారి. దీంతో ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 90 పరుగుల మార్కు వద్ద అవుటైన ఆటగాడిగా ఆస్ట్రేలియా గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉన్న ఒక చెత్త రికార్డును వైభవ్ సమం చేశాడు. 2014 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన మాక్స్‌వెల్ మూడు సార్లు 90ల్లో అవుట్ కాగా, ఇప్పుడు 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ కూడా మూడు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి బోల్తా పడ్డాడు. ఈ జాబితాలో లక్నో తరపున ఆడుతున్న మిచెల్ మార్ష్ (2 సార్లు – 2026) తర్వాతి స్థానంలో ఉన్నాడు. గుజరాత్ ముందు భారీ టార్గెట్ వైభవ్ సూర్యవంశీ (96) సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఫెరీరా 11 బంతుల్లో 38 మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్‌తో పాటు మిగిలిన

NTV Telugu29 May, 02:44 pm
విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు

టాటా ఐపీఎల్ (TATA IPL) చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే ఒక ఐపీఎల్ సీజన్‌లో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకుని సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ, ఈ యువ ఆటగాడు సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ అత్యంత వేగంగా పరుగుల వరద పారించడం ద్వారా అతను ఈ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. తాజా గణాంకాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ 2026 ఐపీఎల్ సీజన్‌లో కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే బౌండరీల ద్వారా మాత్రమే 632 పరుగులు రాబట్టాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్‌లలో మొత్తం 59 ఫోర్లు, ఏకంగా 66 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను సాధించిన పరుగులలో అత్యధిక భాగం కేవలం బౌండరీల రూపంలోనే రావడం అతని హిట్టింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఈ అసాధారణ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ.. జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ వంటి మేటి అంతర్జాతీయ ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ పేరిట ఉండేది. బట్లర్ 2022 ఐపీఎల్ సీజన్లో 15 ఇన్నింగ్స్‌లలో 83 ఫోర్లు, 45 సిక్సర్ల సాయంతో బౌండరీల ద్వారా 606 పరుగులు సాధించి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సైతం ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌లో ఉన్న 2016 సీజన్లో 15 ఇన్నింగ్స్‌లలో 83 ఫోర్లు, 38 సిక్సర్ల ద్వారా కేవలం బౌండరీల

Eenadu31 May, 09:49 pm
వైభవ్ సిక్సర్లవంశీ

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా వైభవ్‌ నిలిచాడు. అతడు మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు. ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల ఘనత అతడిదే. మొత్తం 72 సిక్సర్లు కొట్టాడు. 63 ఫోర్లు బాదాడు. సూర్యవంశీ ఈ టోర్నీలో ప్రతి 4.5 బంతులకు ఒక సిక్స్‌ రాబట్టాడు. అతడు మూడు శతకాలు (93, 97, 96) చేజార్చుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు (440 బంతుల్లో) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు (521) చేసిన మొదటి ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌ వార్నర్‌ (467 పరుగులు, 2016లో)ను వైభవ్‌ అధిగమించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

AP7AM30 May, 11:11 am
ఏషియన్ గేమ్స్ రేసులో వైభవ్.. సూర్య, గిల్ కు దక్కని చోటు

ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. జపాన్‌లోని ఐచీ-నగోయాలో జరగనున్న ఈ పోటీల కోసం 30 మందితో కూడిన ప్రాథమిక జాబితాను ఐఓఏకు సమర్పించింది. ఈ లిస్ట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌ల పేర్లు లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.ఒకేసారి రెండు సిరీస్‌లుసెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లు ఒకే సమయంలో వస్తుండటంతో బీసీసీఐ రెండు వేర్వేరు టీమ్‌లను బరిలోకి దించుతోంది. విండీస్ సిరీస్‌లో గిల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉండటం వల్లే అతణ్ని ఏషియన్ గేమ్స్ లిస్ట్‌లో చేర్చలేదని తెలుస్తోంది.సూర్యకుమార్‌పై వేటు?భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఈ లిస్ట్‌లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే 2028 ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇకపై భవిష్యత్తు ప్రణాళికల్లో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లేదా తిలక్ వర్మలలో ఒకరు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.బుమ్రాకు చోటుఈ ప్రాథమిక జాబితాలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ అతడు విండీస్ వన్డే సిరీస్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నాడు. గాయం

Sakshi31 May, 11:31 am
ఐపీఎల్ ఫైన ల్లో వైభ వ్ సూర్య వంశీ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచిన పేరు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, ప‌డుకున్నా.. ఇలా అత‌డు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన‌ప్ప‌టికీ క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి పాల‌యిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సీజ‌న్‌ను మూడో స్థానంతో ముగించింది. జ‌ట్టు ఓట‌మి

TV9 Telugu29 May, 02:56 am
ఎడమ కాలిలోనే ఉంది మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వెనుక ఉన్న సీక్రెట్ ఇదేనట

Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. లెఫ్ట్ హ్యాండ్ కలిగిన ఈ అద్భుతమైన ఆటగాడు ఐపీఎల్‌లో బరిలోకి దిగాడంటే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నాడు. మైదానంలో ఎంతటి దిగ్గజ బౌలర్లు బౌలింగ్ వేస్తున్నా, వారి లైన్ అండ్ లెంగ్త్‌ను పూర్తిగా దెబ్బతీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఈ చిన్నారి ప్లేయర్ ఏకంగా 65 సిక్సర్ల సాయంతో 680 పరుగులు బాదేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ ఎలా ఇంతలా రెచ్చిపోతున్నాడు, అతని పవర్‌ఫుల్ బ్యాటింగ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనే విషయాలను రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జుబీన్ భరూచా తాజాగా వెల్లడించారు. వైభవ్ సూర్యవంశీ కొట్టే భారీ సిక్సర్ల సీక్రెట్ అతని ఎడమ కాలు (బ్యాక్‌ఫుట్) మూవ్‌మెంట్‌లో దాగి ఉందని జుబీన్ భరూచా వివరించారు. సాధారణంగా చాలా మంది బ్యాటర్లు షాట్లు కొట్టడానికి ఫుట్‌వర్క్‌పై ఎక్కువగా శ్రమిస్తారు. కానీ వైభవ్ మాత్రం క్రీజులో ఎక్కువ కదలికలు లేకుండా నిలబడిన చోటు నుంచే అద్భుతమైన షాట్లను ఆడగలడు. బౌలర్ బంతిని విసిరే క్రమంలో వైభవ్ తన శరీరం బరువు మొత్తాన్ని ఎడమ కాలిపై (బ్యాక్‌ఫుట్) ఉంచుతాడు. అతని చేతులు, కళ్లు, శరీరం అన్నీ ఒకేసారి సింక్ అవుతూ బంతిని ముందే అంచనా వేయడానికి సహాయపడతాయి. క్రీజు లోతును పూర్తిగా వాడుకుంటూ, బ్యాట్‌ను పైకి ఎత్తే విధానం (హై బ్యాక్‌లిఫ్ట్) అతని షాట్లకు అదనపు వేగాన్ని, శక్తిని ఇస్తుందని భరూచా పేర్కొన్నారు. గత ఏడాది (2025) ఐపీఎల్ సమయంలో వైభవ్ కేవలం లెగ్ సైడ్ మాత్రమే

Andhra Jyothy29 May, 10:11 am
ప్రశాంతత కావాలని అనిపించినప్పుడల్లా కార్టూన్లు చూస్తాను

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతుంది. ఐపీఎల్ 2026లో అతడు తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకు ఇష్టమైన ఓ విషయం గురించి వెల్లడించాడు. స్పోర్ట్స్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతుంది. ఐపీఎల్ 2026లో అతడు తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. సీజన్ ప్రారంభం నుంచి ఇటీవల జరిగిన ఎలిమినెటర్ మ్యాచ్ వరకు వైభవ్ పలు అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. పలు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్ల పిల్లాడు ఈ స్థాయిలో ప్రదర్శన చేయడంపై క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్యాట్ కమిన్స్ , జస్ప్రీత్ బుమ్రా , జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లపై విజయం సాధించినప్పటికీ, అతడు ఒక పసివాడిలాగే తన గదిలో కార్టూన్లు చూడటానికి ఇష్టపడతాడటం. ఈ విషయాన్ని ఈ చిచ్చర పిడుగే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో వైభవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లపై విజయం.. గంట లేదా రెండు గంటల పాటు టెలివిజన్ ముందు గడిపే సమయం ఇచ్చేంత ప్రశాంతత తనకు ఇవ్వదని తెలిపాడు. 'రెండు, మూడేళ్ల క్రితం నేను ఇంట్లో ఉండి మ్యాచ్‌లు ఆడేటప్పుడు లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కార్టూన్లు చూసేవాడిని. అవి నాకు చాలా నచ్చేవి. ఇప్పుడు కూడా, నాకు విశ్రాంతి లేదా ప్రశాంతత కావాలని అనిపించినప్పుడల్లా కార్టూన్లు చూస్తాను. నా గదిలో హాయిగా కూర్చుని నచ్చిన కార్టూన్లు చూస్తాను. అలా చూడటం నాకు చాలా బాగుంటుంది. అలానే ఇంటిని గుర్తు చేస్తుంది' అని వైభవ్ వెల్లడించాడు. ఇటీవల

TV9 Telugu28 May, 01:29 pm
కొత్త సిక్స్ మెషిన్.. వైభవ్ సూర్యవంశీకి క్రిస్ గేల్ సెల్యూట్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసి, రాజస్థాన్ రాయల్స్ (RR)కు ఒంటిచేత్తో విజయాన్ని అందించిన 15 ఏళ్ల బీహార్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బుడ్డోడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్‌పై తాను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఫొటోలను షేర్ చేస్తూ.. హంగ్రీ ఫర్ మోర్ (ఇంకా పరుగుల కసి తీరలేదు) అంటూ కేవలం మూడు ముక్కల క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిన్న పోస్ట్‌తో త్వరలో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఇంకా పెద్ద స్కెచ్ వేసినట్లు ఈ చిన్నోడు హింట్ ఇచ్చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 3 రన్స్ తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 30 బంతుల్లోనే శతకం బాదిన క్రిస్ గేల్ రికార్డు ఇప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా ఉంది. అయితే, గేల్ సెంచరీ రికార్డును అందుకోలేకపోయినా.. దశాబ్ద కాలంగా ఎవరికీ సాధ్యంకాని క్రిస్ గేల్ మరో భారీ రికార్డును మాత్రం వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, ఏకంగా 12 ఆకాశమే హద్దుగా చెలరేగిన సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ దాడితో ఐపీఎల్ ఒకే ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో క్రిస్ గేల్ ఒకే సీజన్లో 59 సిక్సర్లు కొట్టగా..

Sakshi28 May, 03:50 am
ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది

మ్యాచ్‌ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ వేసిన తొలి ఓవర్లో సిక్స్‌తో దూకుడు మొదలు పెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్‌ కొట్టాడు. ఆపై కమిన్స్‌ మరుసటి ఓవర్లో ఒక ఫోర్, ఆపై వరుసగా మూడు సిక్సర్లు బాది వైభవ్‌ తానేంటో చూపించాడు. సాకిబ్‌ వేసిన తర్వాత ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి సిక్స్‌తో గేల్‌ను సమం చేసిన వైభవ్, తర్వాతి సిక్స్‌తో గేల్‌ను అధిగమించాడు. మూడో సిక్స్‌తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో అతను ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీతో సురేశ్‌ రైనా (2014) రికార్డు సమం చేశాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ పవర్‌ప్లేలో అత్యధిక సిక్స్‌లు (8) కొట్టిన ఘనత కూడా వైభవ్‌దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (30 బంతుల్లో గేల్‌ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నంచి క్యాచ్‌

AP7AM30 May, 01:04 am
సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఓ 15 ఏళ్ల కుర్రాడు సృష్టిస్తున్న సంచలనాలు మామూలుగా లేవు. రాజస్థాన్ రాయల్స్‌ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర లిఖిస్తున్నాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 96 పరుగులు చేసి, త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. ఐపీఎల్ రికార్డు పుస్తకాల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.రికార్డుల మోత మోగించిన 'సూర్యవంశీ'ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్: ఒకే ఐపీఎల్ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని దాటిన తొలి అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో 776 పరుగులు సాధించాడు.రస్సెల్ రికార్డు బద్ధలు: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం 440 బంతుల్లోనే ఈ ఘనత సాధించి, వెస్టిండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. అతి పిన్న వయస్కుడు: ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 700 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 సంవత్సరాల 63 రోజులు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు సాయి సుదర్శన్ పేరిట ఉండేది.

AP7AM29 May, 04:17 pm
సూర్యవంశీ మళ్లీ సెంచరీ మిస్.. ఫెరీరా సిక్సర్ల వర్షం.. రాజస్థాన్ భారీ స్కోరు

ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రాజస్థాన్ రాయల్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ ముందు కొండంత లక్ష్యం నిలిచింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అయితే, ఆఖర్లో డొనోవన్ ఫెరీరా సృష్టించిన విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరును నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా సూర్యవంశీ పరిణితి చెందిన ఆటతీరుతో ఆకట్టుకోగా, ఫెరీరా తన పవర్‌ హిట్టింగ్‌తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (1) ఔట్ కాగా, ఆ తర్వాత కగిసో రబాడా బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్ (7) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, ప్రమోషన్‌పై నాలుగో స్థానంలో

NTV Telugu29 May, 02:15 am
వీడియోలు చూసి ప్లాన్ రెడీ చేశాం.. మేమేంటో గ్రౌండ్ లో చూయిస్తాం .. వైభవ్ పై గుజరాత్ కోచ్

Parthiv Patel: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసుపై జరుగుతున్న చర్చలకు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ బ్రేక్ వేశారు. ప్రస్తుత సీజన్‌లో కేవలం 15 మ్యాచ్‌ల్లోనే 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్ వయసు గురించి మాట్లాడటం ఆపేసి, అతని ఆటతీరుపై మాత్రమే దృష్టి పెట్టాలని పార్థివ్ హితవు పలికారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి రాజస్థాన్‌ను క్వాలిఫైయర్-2 కు చేర్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైభవ్ వయసుపై మళ్లీ వివాదాలు చెలరేగాయి. గతంలో అతని తండ్రి సైతం ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ పవర్ కోచ్ ఆండ్రీ రస్సెల్ సైతం ఈ వివాదాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేయగా, తాజాగా పార్థివ్ పటేల్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పార్థివ్ మాట్లాడుతూ.. “వైభవ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. మనం అతని వయసు గురించి అస్సలు మాట్లాడకూడదు, ఆ చర్చకు ఇక్కడితో స్వస్తి పలకాలి. అతను అసాధారణమైన ప్రతిభావంతుడు. అయితే, ప్రత్యర్థి జట్టుగా రేపటి మ్యాచ్‌లో అతను అంతగా రాణించకూడదనే మేము కోరుకుంటున్నాం” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుతానికి గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గతంలో గుజరాత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 56 సగటుతో 168 పరుగులు చేశాడు. ఇందులో కేవలం 35 బంతుల్లోనే కొట్టిన నాటౌట్ 101 పరుగుల సెంచరీ సైతం ఉంది. ఈ నేపథ్యంలో క్వాలిఫైయర్-2 లో

Sakshi28 May, 10:22 am
వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప

Sakshi28 May, 05:40 am
వైభ వ్ ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇత డే

వైభ‌వ్ సూర్య‌వంశీ.. క్రికెట్ ప్ర‌పంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్‌-2026లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభ‌వ్‌. ఐపీఎల్ మొద‌లై 19 సీజ‌న్లు అవుతున్న‌ప్ప‌టికి ప్లే ఆఫ్స్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదు. ఈ నాకౌట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్‌-బి, ప్లాన్‌-సి అని చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను సైతం ఈ వండ‌ర్ కిడ్ వదల్లేదు. 15 ఏళ్ల వైభవ్ కేవ‌లం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌ల‌తో 97 ప‌రుగులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు సచిన్ టెండూల్కర్‌, యువరాజ్ సింగ్‌, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చ‌ర పిడుగును ఐపీఎల్‌కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్‌ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది. థాంక్యూ సమర్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీలోని టాలెంట్‌ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్న‌ర్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్‌లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను మొదటిసారి చూశాడు. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే వైభ‌వ్ ఆడుతున్న అద్భుత‌మైన షాట్లు, అత‌డిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. వెంట‌నే వైభ‌వ్ గురుంచి రాజ‌స్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభ‌వ్ కోసం ప్రత్యేకంగా

NTV Telugu28 May, 12:53 pm
వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. మొత్తంగా 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సమయంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల (59 సిక్సర్లు) రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను ఏకంగా 583 పరుగులు సాధించాడు. ఇతడి బ్యాటింగ్ విన్యాసాలకు ముగ్ధులైన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా లైవ్ కామెంట్రీలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ గనుక ఐపీఎల్ వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతాడని హర్భజన్ సింగ్ అడగ్గా.. సెహ్వాగ్ ఏమాత్రం ఆలోచించకుండా తాను రూ. 30 కోట్లు పెట్టడానికైనా సిద్ధమేనని ప్రకటించాడు. దీనికి వెంటనే స్పందించిన ఆకాష్ చోప్రా.. తాను కూడా రెండో ఆలోచన లేకుండా అంతే మొత్తాన్ని వేలంలో ఆఫర్ చేస్తానని చెప్పడం విశేషం. మరోవైపు ఈ అద్భుత ప్రదర్శనతో సూర్యవంశీని టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంపిక చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే నెలలో తిలక్ వర్మ నేతృత్వంలో శ్రీలంకతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం భారత్-ఏ జట్టులో ఈ వండర్ కిడ్‌కు చోటు దక్కింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం వైభవ్ సూర్యవంశీని అరుదైన ప్రతిభ గల ఆటగాడిగా అభివర్ణించారు. శారీరక నైపుణ్యంతో పాటు మానసిక దృఢత్వంపై బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నాయని, తద్వారా అతను భారత్ తరఫున సుదీర్ఘ కాలం