translateexpand_more

Education News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 12:29 am
ఆప్టా అధ్యక్షుడిగా ప్రకాశ్ రావు

ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్షుడిగా కాకి ప్రకాశ్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్షుడిగా కాకి ప్రకాశ్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆప్టా రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు శనివారం విజయవాడలో జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా ఎంజీ మెహది, ఆర్థిక కార్యదర్శిగా సుంకరి నారాయణరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సాదరతుల్ల బేగ్‌, సహాధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాసరావు, అస్టాం, మురళీమోహన్‌, ఉపాధ్యక్షులుగా బొక్కెన రాము, ఇస్మాయిల్‌, మహ్మద్‌ అలీ అక్బర్‌, మహమ్మద్‌ నజీర్‌, నారాయణ, కార్యదర్శులుగా గోపాలకృష్ణ, మహమ్మద్‌ ఖదీరుల్లా, నవీన్‌, లత, విజయలక్ష్మి ఎన్నికయ్యారు.

Andhra Jyothy29 May, 11:19 am
యూపీఎస్ సీని చూసి నేర్చుకోండి.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీం’ వ్యాఖ్య

నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేట్టిన సుప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. ఇంటర్నెట్ డెస్క్: నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్‌సీ‌లో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ వెలుగుచూడలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. యూపీఎస్‌సీని చూసి నేర్చుకోవాలని ఎన్‌టీఏకు సూచించింది. కోర్టు విచారణకు ఎన్‌టీఏ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. నీట్ వ్యవస్థ ప్రక్షాళనకు ఏర్పాటైన హైలెవెల్ కమిటీ చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్ డా. రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌టీఏ, డా. రాధాకృష్ణన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. కేంద్రం తన ఎఫిడవిట్ దాఖలు చేసేందుకు న్యాయస్థానం అదనపు గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నరసింహ మాట్లాడుతూ పేపర్ లీక్‌కు ఆస్కారం కల్పించిన పరిస్థితులు ఏమిటని డా. రాధాకృష్ణన్‌ను ప్రశ్నించారు. గతంలో అనేక రక్షణలను ఏర్పాటు చేసినా పేపర్ ఎలా లీక్ అయ్యిందని అన్నారు. ఇందుకు డా. రాధాకృష్ణన్ బదులిస్తూ పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో సమస్య తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం ఆ లోపాలనూ సరిదిద్ది వ్యవస్థను మరింత బలోపేతం చేశామని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా గతంలో మొత్తం 101 సూచనలు చేశామని చెప్పారు. వాటిల్లో 60 తాత్కాలిక సూచనలను 2025-26 పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు చెప్పారు. ఇతర మార్గదర్శకాలు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అమలవుతాయని చెప్పారు.

Vaartha01 Jun, 06:29 pm
తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం

Sai Sudha Play School :తిరుపతి నగరంలోని చిన్నారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ముందస్తు విద్యాభ్యాసాన్ని అందించాలనే సంకల్పంతో సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్’ ఘనంగా ప్రారంభమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల చెంత వెలిసిన ఈ నూతన ఏసీ ప్రాంగణాన్ని సోమవారం అమెరికా (USA) కు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు కలిసి వైభవంగా ప్రారంభించారు. Read Also: Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! యూఎస్‌ఏకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రేఖ రాళ్లపల్లి (MD, USA), రామ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ (USA) అధ్యక్షులు గుడివాడ వెంకట రామనాయుడు, డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి (MD, USA)లతో పాటు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, మాస్టర్ అభిషేక్ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాసంస్థ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వారు రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన గావించి క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ వేడుకకు రాజకీయ, సామాజిక, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో విద్యార్థులు చిన్నతనం నుంచే అత్యుత్తమ విద్యా పునాదులను కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. నగరాలకే పరిమితమైన ఇటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సదుపాయాలు భక్తుల కేంద్రమైన తిరుపతిలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. చిన్నారులలో కేవలం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విద్యాసంస్థల అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను కేవలం పరీక్షల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థలు పనిచేయాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత విద్య, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించనున్నట్లు వెల్లడించారు. ప్లే స్కూల్ ఇన్‌ఛార్జ్‌లు భార్గవి, రేవతి మాట్లాడుతూ.. చిన్నారుల మేధో వికాసంతో పాటు వారి భావోద్వేగ, సామాజిక వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు అధునాతన ఏసీ తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు, సురక్షితమైన క్రీడా వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రారంభోత్సవం అనంతరం అతిథులు పాఠశాల భవనం, డిజిటల్ తరగతి గదులు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థలాలను పరిశీలించారు. పాఠశాల కల్పించిన మౌలిక వసతులు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను వారు మనసారా అభినందించారు. కార్యక్రమం ముగింపులో అతిథులను యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, పుష్ప భార్గవి, రేవతి, రాజశేఖర్, లక్ష్మి, కళ్యాణి, భువనేశ్వరి, రాధ, భార్గవి, ఆశీఫా, శకుంతల, శారద, సుజిత, మహేశ్వరి, ధనలక్ష్మి, ద్రాక్షాయణి, కిరణ్, మున్వార్ బాషా, వెంకట ముని, బాబు రెడ్డి, రామచంద్ర రెడ్డి, రాజేంద్రప్రసాద్, వివేక్, సురేష్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ TTD Donation:టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించిన దుబాయ్ దాతలు! Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది. ఎప్పుడూ... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా... దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం... ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ జూలియానా (జూలీ) తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భవిష్యత్తులో చేపట్టే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలను... తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన తీపికబురు అందించింది. రాష్ట్రంలో... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ... యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ను

Eenadu29 May, 10:48 am
ఏపీ పీజీసెట్ ఫలితాలు వచ్చేశాయ్

AP PGCET 2026 Results | ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌-2026) ఫలితాలు విడుదలయ్యాయి. మే 8 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తంగా 19,118మంది దరఖాస్తు చేసుకోగా.. 16,406 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,020 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో 30 సబ్జెక్టులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ ఏడాది పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అందరికీ మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. అద్భుతమైన ఉత్తీర్ణత శాతం విజేతల కృషి, పట్టుదలకు నిదర్శనమన్నారు. విజయం సాధించిన ప్రతి అభ్యర్థికీ ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా ఆకాక్షించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu26 May, 06:37 am
APEDCET results: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీ ఎడ్‌సెట్‌ -2026 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 19,880 మంది పరీక్షకు హాజరుకాగా.. 19,741 మంది (99.3 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 06:59 am
సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష (జేసీసెట్‌) ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సచివాలయంలో విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు మొదటి విడతలో 18,401 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు 45,357 దరఖాస్తులు రాగా.. ఈ నెల 15న జరిగిన జేసీ సెట్‌కు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అపారమైన నమ్మకం ఉందని మంత్రి పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా గురుకులాలను నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని.. గతంలో జరిగిన వాటికి బాధ్యులపై చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu24 May, 01:21 am
నొటిఫికేషన్స్

- రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజ్‌ అయిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, సదరన్‌ రీజియన్‌లోని రీళీజూతివి ప్రాజెక్ట్‌... - అర్హులైన అభ్యర్థులు 2026, మే 30లోగా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. - యూపీఎస్సీ- నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ ఎగ్జామినేషన్‌ (11)-2026 దేశ రక్షణ శాఖలో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షలు నిర్వహ...

Eenadu23 May, 03:10 pm
AP EAPCET 2026 Key: ఏపీ ఎప్‌సెట్‌ ప్రిలిమినరీ కీ ఎప్పుడంటే?

- AP EAPCET 2026 Key | ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీ ఈఏపీసెట్‌ రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. - ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ (EAPCET 2026 Key)ని షెడ్యూల్‌ ప్రకారం నేడే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. - ఈ నెల 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.

Andhra Jyothy31 May, 02:22 pm
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం

హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): విద్యే అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా తానే చేపట్టానని తెలిపారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యకు ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు పెట్టారు.

రెండేళ్ల కృషికి నిదర్శనం..

పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)’లో పేర్కొనడం తమ ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, విద్యా వికాస పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. అయితే తాజా ఫలితాలతో సంతృప్తి చెందకుండా మరింత మెరుగైన ఫలితాల కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర నివేదికలో వచ్చిన తాజా ఫలితాలు మరింత ప్రేరణనిచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

<a

Eenadu26 May, 05:05 pm
యూపీఎస్సీ మెయిన్స్ వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్నల్లో మొత్తం రెండు భాగాలుంటాయి. ఒక్కొక్క భాగంలో నాలుగు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఒక్కో భాగంలో ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని మొత్తం రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వుంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం 1000 నుంచి 1200 పదాల మధ్యన రాయాలి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 03:32 pm
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు రేపే.. ఎన్ని గంటలకంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాల(TG EdCET 2026 Results) విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 12న జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు శనివారం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12.30 విడుదల చేస్తారని, ఒంటిగంటకు అందుబాటులోకి వస్తాయని సెట్ కన్వీనర్‌ తెలిపారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,342 మంది హాజరయ్యారు. ఫలితాలను www.eenadu.net, https://edcet.tgche.ac.in/ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 03:58 pm
ఏపీ ఎప్ సెట్ ఫలితాలు ఎప్పటివరకు రావొచ్చు

AP EAPCET 2026 Results| ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన ఎప్‌సెట్ (EAPCET 2026) ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమైతే నేడే (జూన్‌ 1) ఈ ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అవకాశం ఇచ్చినందున ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ఫలితాలు వెల్లడయ్యాకే ఎప్‌సెట్‌ ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్‌ మూడో వారంలో ఈ రోజైనా ఎప్‌సెట్‌ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎప్‌సెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లో మార్పు, విద్యార్థుల్లో గందరగోళం తలెత్తకుండా చూసే ఉద్దేశంతో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ఎప్‌సెట్‌ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలికి పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తున్నవారిలో ఒక్క గణితం సబ్జెక్టు వారే దాదాపు లక్ష మంది దాకా ఉన్నారు. జూన్‌ 5తో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగియనుండటంతో మూల్యాంకన ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఫలితాలు విడుదల చేసే దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16-18 మధ్య ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన ఎప్‌సెట్‌ పరీక్షకు దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

Education News News Keyword | Telugu Digital