
నందమూరి తారక రామారావు జూనియర్ (జూ. ఎన్టీఆర్) తన తాతగారు, దివంగత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)తో తనకున్న అమూల్యమైన అనుబంధాన్ని, తన పేరు మార్పు వెనుక ఉన్న చారిత్రక ఘట్టాన్ని ఓ ఇంటర్క్యూలో వివరించారు. ఓ ఉదయం తాను సీనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ వాతావరణం, అక్కడి దైవత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, గుడిలో ఉన్న అనుభూతి కలిగిందని తెలిపారు. కాషాయ వస్త్రాల్లో కూర్చుని ఉన్న తాతగారు తనను “ఏమిటి మీ పేరు?” అని అడిగారని, తాను తారక్ రామ్ అని బదులిచ్చానని చెప్పారు. తన నాయనమ్మ బసవరామ తారకం పేరుతో కలిసి ఉంటుందని తారక్ రామ్ అని పెట్టారని వివరించారు. అయితే, సీనియర్ ఎన్టీఆర్ వెంటనే తన తండ్రి హరికృష్ణను పిలిచి, “ఈ అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావుగా మార్చండి” అని ఆదేశించారని తెలిపారు. ఆ క్షణం నుంచి తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని జూ. ఎన్టీఆర్ పేర్కొన్నారు. పేరు మార్పుతో మొదలైన ఈ అనుబంధం ఒక సంవత్సరం పాటు కొనసాగిందని, తాతగారు తనను బంగారంలా చూసుకున్నారని భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ అనుబంధం అపురూపమైనదని, ఆ సమయంలో తాను, తాతగారు మాత్రమే ఉండేవారని, మూడో వ్యక్తికి తావులేదని వివరించారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్‌లో తాతగారే తనను భరతుడిగా వేషం వేయించి, అరకు తీసుకెళ్లారని తెలిపారు. అదే సినిమాకు ఆయనే దర్శకుడని, డబ్బింగ్ సమయంలో తాతగారే థియేటర్‌లో కూర్చుని తనతో డబ్బింగ్ చెప్పించారని గుర్తుచేసుకున్నారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తాతగారు నాన్-వెజిటేరియన్ తినేవారు కాదని, సాయంత్రం 5:30 కల్లా భోజనం చేసి 7:00 గంటలకు నిద్రపోయేవారని, అయితే




