translateexpand_more

Technology News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 11:20 am
స్మార్ట్ గార్డెన్ .. మట్టిలేకుండానే మినీ తోట

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మొక్కలకు నీళ్లు పోయడం నుంచి, పక్షులకు ఆహారం పెట్టడం వరకు... ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ కూడా హైటెక్‌ అయిపోయింది! ఇంట్లోనే ఉంటూ తక్కువ కష్టంతో ఎక్కువ గ్రీనరీని ఎంజాయ్‌ చేయాలనుకునేవారి కోసం వచ్చేసిన సూపర్‌ నేచర్‌ గ్యాడ్జెట్సే ఇవీ! రోబోటిక్‌ తోటమాలిఈ వేసవి ఎండల్లో మీరు మాత్రం హాయిగా రూమ్‌లోనో కూర్చుంటే, ఎవరైనా పైపు పట్టుకుని తోటలో నిలబడితే బాగుండు! అని

AP7AM01 Jun, 02:23 am
ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే

టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ గ్లాసెస్ విడుదల మరింత ఆలస్యం కానుంది. సాంకేతిక, అభివృద్ధిపరమైన సవాళ్ల కారణంగా వీటి లాంచ్‌ను 2027 చివరికి వాయిదా వేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. కేవలం స్మార్ట్ గ్లాసెస్ విభాగంలోనే కాకుండా, ఆపిల్ వాచ్ తరహాలోనే సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వీటిని తీసుకురావాలని కంపెనీ వ్యూహం రచిస్తోంది.బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి మార్క్ గర్‌మన్ తన ‘పవర్ ఆన్’ న్యూస్‌లెట్టర్‌లో ఈ వివరాలను వెల్లడించారు. అంతర్గతంగా 'N50' కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ గ్లాసెస్‌ను వాస్తవానికి 2026 చివర్లో ఆవిష్కరించి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ తాజా జాప్యంతో వీటి విడుదల 2027 చివరి నాటికి జరగనుంది. కంపెనీ సీఈవో టిమ్ కుక్ పదవీ విరమణకు ముందు ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఫీచర్లు.. ధర వివరాలుతొలి వెర్షన్ స్మార్ట్ గ్లాసెస్‌లో లెన్స్‌లోనే కనిపించే అగుమెంటెడ్ రియాలిటీ (AR) డిస్‌ప్లేలు ఉండవని తెలుస్తోంది. బదులుగా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై దృష్టి సారించారు. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఓవల్ ఆకారంలో కెమెరాలు, కాల్స్ మాట్లాడటానికి, సంగీతం వినటానికి, సిరితో మాట్లాడటానికి మైక్రోఫోన్లు, స్పీకర్లు ఉంటాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడక దారులను చూపించడం వంటి సదుపాయాలు కూడా ఉండనున్నాయి.రే-బాన్ వేఫేరర్, ఇతర స్లిమ్ డిజైన్ల వంటి పలు ఫ్రేమ్ స్టైల్స్‌ను ఆపిల్ పరీక్షిస్తోంది. వీటి ధర 200 నుంచి 500 డాలర్ల (సుమారు రూ. 16,000 నుంచి రూ. 42,000) మధ్య

10TV Telugu31 May, 12:59 pm
ఇక మొబైల్ మార్కెట్ షేక్! జూన్ ఫస్ట్ వీక్ లో రాబోయే సూపర్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే

Upcoming Smartphones : మే నెల ముగిసింది.. అనేక స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, జూన్ నెల వచ్చేస్తోంది. ఈ నెల మొదటి వారంలో మరెన్నో కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. అనేక టెక్ కంపెనీలు తమ అప్ కమింగ్ ఫోన్ల లాంచ్ తేదీలను ఇప్పటికే ప్రకటించాయి. హువావే, లావా, షావోమీ, మోటోరోలా వంటి బ్రాండ్‌లు అన్నీ ఈ నెల మొదటి వారంలో (Upcoming Smartphones) తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ డివైజ్‌ల నుంచి సరసమైన ధరల ఆప్షన్‌ల వరకు అన్నీ ఫోన్లు ఉంటాయి. ప్రస్తుతం కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ జూన్ మొదటి వారంలో లాంచ్ అయ్యే ఫోన్లను జాబితాను ఓసారి పరిశీలిద్దాం.. హువావే నోవా 16 సిరీస్ : హువావే సరికొత్త నోవా 16 సిరీస్‌ను జూన్ 1న చైనాలో లాంచ్ చేస్తోంది. ఈ లైనప్‌లో హువావే నోవా 16, నోవా 16 ప్రో, నోవా 16z, నోవా 16 అల్ట్రా ఉంటాయని అంచనా. నివేదికల ప్రకారం.. నోవా 16 అల్ట్రాలో 6.84-అంగుళాల 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 7000mAh బ్యాటరీ, కిరిన్ 9000 సిరీస్ ప్రాసెసర్ ఉండవచ్చు. ఈ హువావే ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. లావా బోల్డ్ N2 5జీ : భారతీయ బ్రాండ్ లావా కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తోంది. లావా బోల్డ్ N2 5జీ ఫోన్ జూన్ 3న లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ ‘నో నాన్‌సెన్స్ ఫోన్’గా క్యాంపెయిన్ చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.75-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

10TV Telugu31 May, 12:21 pm
పండగ చేస్కోండి.. రూ. 85వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ.49వేలకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ నథింగ్ ఫోన్‌లో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. కంపెనీ ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం (Nothing Phone 3) చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్ 41శాతం తగ్గింపుతో లభిస్తోంది. 5500mAh బ్యాటరీ ఉంది. నథింగ్ ఫోన్ 3పై బెస్ట్ ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.. నథింగ్ ఫోన్ 3 ధర తగ్గింపు : ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు నథింగ్ ఫోన్ 3 లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 84,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం రూ. 49,999కే లభిస్తోంది. లాంచ్ తర్వాత ఫస్ట్ టైమ్ భారీగా తగ్గింది. ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.35వేలు డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఆఫర్లను కూడా ఆఫర్ చేస్తోంది. Read Also : Vi Chepest Plan : Vi చీపెస్ట్ ప్లాన్..! ఒక్క రీచార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్! 30GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్! నథింగ్ ఫోన్ 3 బ్యాంక్ డిస్కౌంట్ : నథింగ్ ఫోన్ 3 కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2,500 తగ్గింపు లభిస్తుంది. ఈ నథింగ్ ఫోన్‌ రూ. 37,500 వరకు తక్కువకు కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఈ నథింగ్ ఫోన్ ధర రూ. 47,499కి తగ్గుతుంది. నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు : నథింగ్ ఫోన్ 3లో 1260×2800

10TV Telugu31 May, 11:46 am
చీపెస్ట్ ప్లాన్..! ఒక్క రీచార్జ్ తో 365 రోజులు ఎంజాయ్! 30 హైస్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్

Vi Chepest Plan : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలకు పోటీగా వోడాఫోన్ ఐడియా అద్భుతమైన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను సరసమైన ధరకే అందిస్తోంది. కొన్ని కంపెనీలు కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లను నిలిపివేయగా, మరికొన్నింటి ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. వినియోగదారులు నెలనెలా రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో వార్షిక ప్లాన్లు తీసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా తమ కస్టమర్లకు ఏడాది వ్యాలిడిటీతో చవకైన ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో బండిల్డ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. ఈ ప్లాన్ ఇతర కంపెనీల వార్షిక ప్లాన్‌ల కన్నా చాలా చవకైనది. పూర్తి ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రూ. 2249 రీఛార్జ్ ప్లాన్ : వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీతో అత్యంత చౌకైన ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి రూ.2,249కు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 3,600 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. Read Also : Xiaomi Smart Mijia Ultra AC : ఉక్కపోతకు బైబై.. షావోమీ కొత్త ఏసీ వచ్చేసింది.. జస్ట్ 15 సెకన్లలో ఇల్లంతా కూల్.. ధర తెలిస్తే షాక్! రోజువారీ డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి 30GB బండిల్డ్ డేటాను అందిస్తుంది. డేటా కోటా అయ్యాక కూడా ప్రతి MBకి 50 పైసల చొప్పున ఛార్జ్ అవుతుంది. అలాగే, కాలింగ్ కోటా, లోకల్ కాల్స్‌కు నిమిషానికి ఒక రూపాయి, STD కాల్స్‌కు నిమిషానికి రూ. 1.5గా ఉంటుంది. ఈ కంపెనీ 365 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్‌ కూడా అందిస్తుంది. రూ.

Asianet News Telugu31 May, 07:59 am
క్లౌడ్ టెక్నాల జీతో ప నిచేసే కూల ర్ .. అస లేంటీ టెక్నాల జీ, దీంతో జ

SINGER CloudX Fanలో అడ్వాన్స్‌డ్ క్లౌడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది ట్యాంక్‌లోని నీటిని నానో స్థాయి సూక్ష్మ కణాలుగా మార్చి గాలిలో కలుపుతుంది. దీంతో సహజమైన చల్లని గాలి అనుభూతి లభిస్తుంది. సాధారణ ఫ్యాన్‌తో పోలిస్తే మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఇది సహాయపడుతుంది. ధ‌ర విష‌యానికొస్తే ఈ కూల‌ర్ అస‌లు ధ‌ర రూ. 15,490 కాగా అమెజాన్‌లో ఏకంగా 52 శాతం డిస్కౌంట్‌తో రూ. 7499కి ల‌భిస్తోంది. దీంతో పాటు ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా క్యాష్‌బ్యాక్ ల‌భిస్తోంది. ఇక ఈఎమ్ఐ ఆప్ష‌న్ ద్వారా ఈ ఫోన్‌ను నెల‌కు రూ. 2500 చెల్లించి, 3 నెల‌ల్లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫ్యాన్‌లో 5 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంక్ ఉంటుంది. ఒకసారి నీరు నింపితే సుమారు 8 గంటల వరకు నాన్ స్టాప్‌ క్లౌడ్ ఇన్ఫ్యూజ్డ్ గాలిని అందిస్తుంది. అవసరమైతే నీటిలో ప‌ర్ఫ్యూమ్స్‌ లేదా దోమలను దూరం చేసే లిక్విడ్ల‌ను కూడా కలపవచ్చు. CloudX Fan తక్కువ శబ్దంతో పనిచేసేలా రూపొందించారు. దీంతో నిద్రపోతున్నప్పుడు, కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు లేదా ప్రశాంతమైన వాతావరణం అవసరమైన సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రత్యేకంగా "క్వైట్ మోడ్" ఆప్షన్ ఉండటం వల్ల సౌండ్ ఎక్కువ‌గా వినిపించ‌దు. ఈ ఫ్యాన్‌తో "పాయింట్ ఎనీవేర్" రిమోట్ కంట్రోల్ అందిస్తారు. గదిలో ఎక్కడి నుంచైనా ఫ్యాన్‌ను నియంత్రించవచ్చు. అలాగే లో, మీడియం, హై అనే మూడు స్పీడ్ మోడ్‌లు ఉంటాయి. అవసరాన్ని బట్టి గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. ఫ్యాన్‌లో సిల్వర్ కోటెడ్ మెష్ ఫిల్టర్ ఉంటుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గాలిలో ఉండే దుమ్ము, పుప్పొడి, పెంపుడు

10TV Telugu01 Jun, 02:20 pm
వావ్.. కొత్త ఐటెల్ ఆక్వా వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. నీళ్లలో తడిసినా చెక్కుచెదరదు.. ధర జస్ట్ రూ.

itel Aqua Mobile : ఐటెల్ కొత్త ఇన్నో సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్‌ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో IP67 రేటింగ్‌తో వస్తున్న ఏకైక ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ ఐటెల్ ఫోన్ వాటర్, డస్ట్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే, ఈ ఫోన్‌లో ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ కూడా ఉంది. సౌండ్, నాయిజ్ ఎక్కువగా ఉండే వాతావరణంలో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ప్రకారం.. రోజువారీ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కొత్త ఇన్నో సిరీస్‌ను రూపొందించారు. ధర, లభ్యత విషయానికి వస్తే.. ఐటెల్ ఆక్వా ఫోన్ ధర రూ. 1,799గా ఉంది. ఈ ఫీచర్ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో నుంచి కొనుగోలు చేయవచ్చు. 30 నిమిషాలు నీటిలో మునిగినా.. : దాదాపు 42 శాతం ఫీచర్ ఫోన్లు నీళ్లలో తడిసి పాడైన కారణంగానే యూజర్లు మార్చేస్తున్నారని తమ ఇంటర్నల్ సర్వేలో తేలిందని ఐటెల్ ప్రకటనలో పేర్కొంది. అందుకే ఐటెల్ ఆక్వాకు IP67 రేటింగ్ అందిస్తోంది. ఈ ఐటెల్ ఫోన్ 30 నిమిషాల వరకు నీటిలో మునిగినా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. దుమ్ము, బురద, తేమతో కూడిన వాతావరణంలో కూడా ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. Read Also : Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం 200MP కెమెరాతో వివో X ఫోల్డ్ 6 వచ్చేస్తోంది.. శాంసంగ్, హానర్ ఫోన్లకు దబిడి దిబిడే.. కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఫోన్‌లో ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్

AP7AM01 Jun, 03:40 pm
నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం

నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరూ ఇళ్లను నిర్మించుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే లక్ష ఇళ్లను ప్రారంభిస్తామని అన్నారు.

10TV Telugu01 Jun, 12:41 pm
కెమెరా, 7000 బ్యాటరీతో కొత్త హువావే నోవా 16 ప్రో వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా

Huawei Nova 16 Ultra : హువావే నుంచి సరికొత్త అల్ట్రా ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో కొత్త హువావే నోవా 16 ప్రో లాంచ్ అయింది. ఈ నోవా 16 ప్రోలో 6.84-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 7,000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. హువావే నోవా 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. హువావే నోవా 16 ప్రో ధర : హువావే నోవా 16 ప్రో ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,899 (రూ. 51,752) , 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,399 (రూ. 58,400), 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,999 ( రూ. 66,471)గా ఉంది. హువావే నోవా 16 ప్రో స్టార్రీ బ్లాక్, స్కై బ్లూ, వైట్, ఫ్రాస్ట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ హువావే అధికారిక సైట్, వి మాల్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. హువావే నోవా 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : హువావే నోవా 16 ప్రో ఫోన్ (2856×1320) పిక్సెల్స్ రిజల్యూషన్, 1-120Hz ఎల్టీపీఓ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2160Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, కున్లూన్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.84-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. Read Also : Vivo Y200 Pro 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో Y200 ప్రో 5G అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్.. హువావే ఫోన్ టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్

10TV Telugu01 Jun, 12:11 pm
కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో 200 ప్రో 5 అతి చౌకైన ధరకే.. ఫ్లిప్ కార్ట్ లో

Vivo Y200 Pro 5G : వివోనా మజాకా.. వివో ఫోన్లకు భారత మార్కెట్లో ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. మీరు వివో లవర్స్ అయితే ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. మీ బడ్జెట్ రూ. 20వేల లోపు అయితే ఈ వివో 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లతో వివో Y200 ప్రో 5జీ ఫోన్ భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో ఫోన్ (Vivo Y200 Pro 5G) ఎంత తగ్గింది? ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. వివో Y200 ప్రో 5G ధర, ఆఫర్లు : వివో Y200 ప్రో 5జీ ఫోన్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999 లాంచ్ ధరతో పోలిస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18వేలకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 900 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 17,100కు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. వివో ఫోన్ లాంచ్ ధర కన్నా దాదాపు రూ. 7,899 తగ్గింపుతో లభిస్తోంది. Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. 338 శాతం పెరగనున్న ఉద్యోగుల జీతాలు? 5 ఫ్యాక్టర్ ఫార్ములా లెక్కలివే..! వివో Y200 ప్రో 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వివో Y200 ప్రో 5జీలో ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 1300 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్,

Namasthe Telangana30 May, 11:02 am
ఉద్యాన పంట ల రైతుల కు స బ్సిడీపై డ్రిప్ ఆటోమేషన్ సాంకేతికత అంద జేత

– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.బంగ కోటేశ్వర్ చుంచుప‌ల్లి, మే 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యాన పంటల రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ శుభవార్త అందించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు “డ్రిప్ ఆటోమేషన్” సాంకేతికతను సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. బంగ కోటేశ్వర్ తెలిపారు. డ్రిప్ ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా రైతులు మొబైల్ ఫోన్ లేదా కంట్రోల్ యూనిట్ సహాయంతో నీటి పారుదల వ్యవస్థను సులభంగా నియంత్రించవచ్చు. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్, శ్రమ, సమయం ఆదా అవుతాయని చెప్పారు. నేలలోని తేమ స్థాయిని బట్టి ఆటోమేటిక్‌గా నీటి సరఫరా జరిగే విధంగా ఈ వ్యవస్థ పని చేస్తుంద‌న్నారు. ఈ పథకం కింద ఒక హెక్టారు విస్తీర్ణానికి డ్రిప్ ఆటోమేషన్ యూనిట్ ధర రూ.40,000గా నిర్ణయించారు. ఇందులో రైతులకు 55 శాతం సబ్సిడీగా రూ.22,000 అందించగా, మిగిలిన 45 శాతం అంటే రూ.18,000 రైతులు భరించాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఈ సబ్సిడీని RKVY/PDMC పథకాల ద్వారా అందించనున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల రైతులు తమ సమీప ఉద్యాన శాఖ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Andhra Jyothy24 May, 12:29 pm
ఏపీ సాంప్రదాయ హస్తకళలకు ఏఐ సాయంతో డిజిటల్ హంగులు

- Home » Andhra Pradesh » andhra pradesh lepakshi ai technology handicrafts revolution Savitha avn ABN , Publish Date - May 24 , 2026 | 05:59 PM ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల... - అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI - కృత్రిమ మేధ) సాంకేతికతను రంగంలోకి దించింది. - హస్తకళారూపాల అమ్మకాలను భారీగా పెంచడమే లక్ష్యంగా లేపాక్షి షోరూమ్‌లలో సరికొత్త ఏఐ వ్యవస్థలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, హస్తకళల శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు.

Eenadu29 May, 02:34 am
ఏఐ.. పురాతన పత్రాలూ చదివెయ్

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా వందల ఏళ్లనాటి పురాతన ప్రతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చరిత్రకారులు చదవలేకపోయారు. ఇప్పుడా ఇబ్బందిని తీరుస్తోంది కృత్రిమ మేధ. వాటికన్‌లోని గ్రంథాలయంలో చేతిరాతతో ఉన్న 408 పేజీల పుస్తకం బోర్గ్‌ సైఫర్‌ అత్యంత మిస్టరీగా ఉంది. 400 ఏళ్లుగా దానిని ఎవరూ డీకోడ్‌ చేయలేకపోయారు. అందులో కొన్ని వింత గుర్తులున్నాయి. అప్పట్లో వైద్య విధానాలకు సంబంధించిన రహస్యాలను ఇలా దాచి ఉంచారని చెబుతారు. అందులో 34 అరుదైన చిహ్నాలు, కొన్ని రోమన్‌ అక్షరాలున్నాయి. ఇప్పుడా పుస్తకాన్ని ఏఐలోని మెషీన్‌ లెర్నింగ్‌తో చదువుతున్నారు. ఆ పుస్తకంలో వేలాది చికిత్సలకు సంబంధించిన అంశాలున్నాయని తేల్చారు. విరేచనాలను తగ్గించడానికి గ్లాసులకొద్దీ అత్యుత్తమ నాణ్యత కలిగిన రెడ్‌వైన్‌ను తాగాలని, పిండిలో జాజికాయను పులియబెట్టి తీసుకోవాలని ఉంది. ఇలాంటి ఎన్నో అంశాలను డీకోడ్‌ చేస్తున్నామని స్వీడన్‌లోని స్టాక్‌హోం యూనివర్సిటీ లింగ్విస్టిక్స్‌ ప్రొఫెసర్‌ బీటా మెగ్వెసీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Andhra Jyothy26 May, 05:51 am
మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ..

ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెంగ్ జోయ్ తాజాగా ఓ సంచలన ఆవిష్కరణ చేసింది. ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెంగ్ జోయ్ తాజాగా ఓ సంచలన ఆవిష్కరణ చేసింది. పెంపుడు జంతువుల శబ్దాలు, ప్రవర్తన, భావోద్వేగాలను మాటలుగా మార్చి మనుషులకు వినిపించగల ఓ సరికొత్త పరికరాన్ని ఆ సంస్థ తయారు చేసింది (AI pet translator). ఏఐ సాంకేతికతతో పని చేసే ఆ పెట్ ట్రాన్స్‌లేటర్ 95 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరం సహాయంతో పెంపుడు జంతువు ఏమి అనుభూతి చెందుతోందో, ఏమి చెబుతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనిని కుక్క లేదా పిల్లి మెడకు అమర్చితే అది వాటి శబ్దాలను, శరీర కదలికలను, ప్రవర్తనను విశ్లేషించి 'ఇప్పుడు ఆకలిగా ఉంది', 'భయపడుతోంది', 'ఆడుకోవాలనుకుంటోంది' వంటి సందేశాలను యజమానికి తెలియజేస్తుంది (Pet translation device). ఈ పరికరం ధరను 799 యువాన్లు (దాదాపు రూ.10 వేలు)గా నిర్ణయించారు (AI pet collar). మే 1వ తేదీ నుంచి ఈ పరికరానికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభించింది. ఇప్పటివరకు పది వేలకు పైగా బుకింగ్స్ వచ్చినట్టు సంస్థ వెల్లడించింది. అయితే కంపెనీ ప్రకటనలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ తన వాదనలను నిరూపించడానికి ఎలాంటి ఖచ్చితమైన డేటాను అందించలేదని అంటున్నారు. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Zee Telugu29 May, 05:20 am
తెలుగు కుర్రాళ్ల గ్లోబల్ రికార్డ్.. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఆసియా జాబితాలో ఇద్దరు తెలుగు యువకులు.. ఎవరో తెలుసా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Forbes 30 Under 30 Asia 2026: అంతర్జాతీయ వేదికలపై తెలుగు యువత తమ సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామిక వేత్తలు చోటు దక్కించుకున్నారు. సమాజంలో సరికొత్త మార్పులు తీసుకురావాలన్న వారి వినూత్న ఆలోచనలతో నేడు గ్లోబల్ జాబితాలో వారిని నిలబెట్టాయి. ఆర్థిక రంగానికి సరికొత్త స్టార్టప్ ను తీసుకువచ్చిన శివగణేష్ ఒకరు అయితే.. సామాజిక సేవా రంగంలో గ్రామీణ విద్యార్థుల కోసం అద్భుతాలు స్రుష్టిస్తున్న మధులాష్ బాబు క్రొవ్విడి మరొకరు. ఈ ఇద్దరు కూడా తమ సరికొత్త ఐడియాలతో నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి. శివగణేష్ గడ్డం: చిన్నతనం నుంచే పిల్లలకు పొదుపు, డబ్బు విలువ నేర్పించాలన్న ఒక గొప్ప ఆశయంతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నేటి డిజిటల్ యుగంలో డబ్బును ఎలా పొదుపుగా వాడుకోవాలన్నది ముఖ్యం. అందుకే చిన్నారులకు, యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా కామిక్స్ రూపంలో బడ్జెట్, పెట్టుబడులు, పొదుపు, ఇన్సూరెన్స్, వ్యాపారవేత్తలుగా ఎలా మారాలి అనే కఠినమైన ఆర్థిక ఆంశాలను నేర్పించేందుకు జెని5 అనే అంకుర సంస్థను స్థాపించారు. తెలంగాణకు చెందిన ఈ యువ పారిశ్రామిక వేత్త శివగణేశ్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఫోర్బ్స్ జాబితాలోని ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ALSO READ: రైల్వే సిబ్బంది..ప్రమోషన్లు, పాస్‌పోర్ట్