translateexpand_more

Pawan Kalyan News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 02:48 am
చెప్పులతో కొట్టినా సిగ్గు రాదా.. కూటమిలో నీ స్థాయేంటో నీకు తెలుసా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చెప్పులతో కొట్టినా సిగ్గు రాదా.. కూటమిలో నీ స్థాయేంటో నీకు తెలుసా?

10TV Telugu01 Jun, 02:42 pm
ఏపీ లానే తెలంగాణలోనూ పవన్ గెలుస్తాడని భయమా?- మంత్రి పొన్నం, కవితకు తెలంగాణ జనసేన కౌంటర్

Telangana Janasena: జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ చీఫ్ కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ను అడ్డుకునే స్థాయి మీకు లేదన్నారు. ఒక మంత్రిగా ఉండి పొన్నం ప్రభాకర్ పవన్ గురించి అలా మాట్లాడడం సరికాదన్నారు సాగర్. పిఠాపురం ప్రజలు పవన్ ను దేవుడిగా చూస్తున్నారని చెప్పారు. మాట్లాడితే.. పవన్ సినిమా నటుడు అంటున్నారని.. సినిమా నటుడు అయితే రాజకీయాల్లోకి రాకూడదా? అని నిలదీశారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా ఎందుకు పవన్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కొండగట్టుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. కవిత పార్టీలో ఏముందో తెలియదు కానీ ఆమె గెటప్ లో మాత్రం 2.0 కనిపిస్తుందని విమర్శించారు సాగర్. మేము ఎప్పటినుంచో పవన్ కల్యాణ్ వచ్చి మాట్లాడమని అడుగుతున్నాం, ఈ సమావేశానికి కచ్చితంగా అనుమతి వస్తుందని సాగర్ ధీమా వ్యక్తం చేశారు. రేపు పొద్దున అనుమతి రాకుంటే ఎలా ఉంటుందో చూద్దామన్నారు. శంకర్ గౌడ్, జనసేన తెలంగాణ అధ్యక్షుడు ”పవన్ కల్యాణ్ వస్తాడు అనగానే కవిత ఎందుకు భయపడుతున్నారు. రాజకీయాల్లో మీరు మాత్రమే ఉండాలా? కొత్త తరం ఉండకూడదా? ఏపీ 21 సీట్లు పోటీ చేస్తే అన్ని చోట్లా గెలిచాము. ఇక్కడ కూడా అలాగే గెలుస్తామని భయపడుతున్నారు. కచ్చితంగా జనసేనగా ఇక్కడ పోటీ చేస్తాము. గద్దర్ లాంటి వ్యక్తిని మీరు ఇంటి బయట నిలబెట్టారు. పవన్ కల్యాణ్ దేశానికి నేత అవుతాడని గద్దర్ చెప్పారు. మీ తండ్రి వేరే రాష్ట్రాల్లో పార్టీ పెట్టేందుకు పోయినప్పుడు ఎందుకు అడగలేదు” అని కవితను ప్రశ్నించారు తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్.

AP7AM01 Jun, 02:05 pm
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ

తెలంగాణలో పవన్ కల్యాణ్ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్థరహితమని, రాజకీయ దురుద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.వివరాల్లోకి వెళితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' పేరిట ఓ ఇండోర్ కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సుమారు 2000 మంది పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం తలపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం వంటి అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.అయితే, పార్కింగ్ సమస్యను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ సభకు అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా తప్పుబట్టింది. నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ సమావేశాలు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో, కేవలం తమ కార్యక్రమానికే పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సహేతుకం కాదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోవని స్వయంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ, ఆ వ్యవహారాన్ని సాకుగా చూపి సభను అడ్డుకోవడం సరికాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Andhra Jyothy01 Jun, 12:46 am
విద్వేషాలు రెచ్చగొడితే బుద్ధి చెప్తాం

కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వైసీపీని హెచ్చరించారు. విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వైసీపీని హెచ్చరించారు. కాపు సంఘం పేరుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గుంటూరుకు చెందిన దాసరి రాము జనసేన కోసం పనిచేశారన్న అభిమానం తమకు ఉందని, ఆ విలువను పోగొట్టుకోవద్దని హితవు పలికారు. నోటికి వచ్చినట్లు వాగొద్దని అంబటి రాంబాబును హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారు, కూటమి రెండేళ్ల పాలనలో ఏం చేశామో? తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. పవన్‌ కల్యాణ్‌.. కులం కోసం పార్టీ పెట్టలేదని, అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టారని వివరించారు.

Samayam Telugu31 May, 01:26 pm
మరో వివాదాస్పద ఆస్తిని పవన్ కళ్యాణ్ భూమికి ఆపాదిస్తూ దుష్ప్రచారం.. కోడిచెరువు వివాదంపై జనసేన ఎమ్మెల్యే

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న కోడి చెరువుకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వస్తున్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్పందించారు. పవన్ కళ్యాణ్ మీద విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విపక్షాలు నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని అన్నారు. శంకర్‌పల్లి ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఆస్తులపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఆ ఆస్తి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి కాగా, అన్ని రకాల రిజిస్ట్రేషన్, అనుమతులు ఉన్నాయని తెలిపారు. 2015 నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని, ఎలాంటి ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధ అంశాలు లేవని స్పష్టం చేశారు.జన్వాడ గ్రామంలోని మరో వివాదాస్పద ఆస్తికి సంబంధించిన అంశాలను పవన్ కళ్యాణ్ వ్యవసాయ భూమికి ఆపాదిస్తూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోకం నాగ మాధవి విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవ కోసం తన సినీ జీవితాన్ని త్యాగం చేసి రెండు దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడని, ఆయన నిజాయితీపై బురదజల్లే ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలమయ్యాయని లోకం నాగ మాధవి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అక్రమాలపై పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడుతుండటంతో రాజకీయ ప్రత్యర్థులు ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని లోకం నాగ మాధవి తెలిపారు.తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ, పెరుగుతున్న ప్రజాదరణ కూడా ఈ

Samayam Telugu01 Jun, 04:45 am
పవన్ కళ్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు.. నిర్మాత రామ్ తాళ్లూరి ట్వీట్ వైరల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో రూ.500 కోట్ల విలువచేసే 10 ఎకరాల భూమిని పవన్ కబ్జా చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే జనసేన తీవ్రంగా స్పందించింది. తాజాగా టాలీవుడ్ నిర్మాత, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి ఈ ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ జీవితం ఎల్లప్పుడూ త్యాగం, నిజాయితీ, అచంచలమైన ప్రజా సేవకు ఒక ఓపెన్ బుక్ లాంటిదని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు సరిపోలలేక, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఎన్ని చేసినా, ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించలేవన్నారు. ఈ మేరకు నిర్మాత రామ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.“మన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవితం ఎల్లప్పుడూ త్యాగం, నిజాయితీ, అచంచలమైన ప్రజా సేవకు ఒక ఓపెన్ బుక్ లాంటిది. అసత్యాలు హెడ్ లైన్స్ సృష్టించవచ్చు, కానీ సత్యం విశ్వాసాన్ని సంపాదిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రచారం చేస్తున్న కల్పిత భూకబ్జా ఆరోపణలు వాస్తవాల నుండి కాకుండా, రాజకీయ నిరాశ నుండి పుట్టినవి. ఒక నాయకుడి విశ్వసనీయత, నిస్వార్థత, ప్రజల నమ్మకాన్ని సవాలు చేయడం అసాధ్యమైనప్పుడు.. అప్పటికే రాజకీయ పోరాటంలో ఓడిపోయిన వారికి వ్యక్తిత్వ హననం చేయడమే చివరి మార్గంగా మారుతుంది”“ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు సరిపోలలేక, ప్రజలలో ఆయనకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోలేక, వారు తప్పుడు సమాచారం

AP7AM31 May, 03:35 pm
జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

జనసేన పార్టీలో సరికొత్త అధ్యాయానికి ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు.  సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ... ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా ‘సేనా గళం’ అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుల, మత రాజకీయాలతో సమాజాన్ని విభజించే ధోరణులకు వ్యతిరేకంగా ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనే పాతకాలపు, బూర్జువా రాజకీయ ధోరణులకు జనసేన చరమగీతం పాడుతుందని తేల్చిచెప్పారు. ఒక కులం వారు విమర్శిస్తే, అదే కులం వారితో బదులిప్పించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి, అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలన్నదే జనసేన ఉద్దేశమని వివరించారు.సమకాలీన రాజకీయాల్లో కొందరు వ్యక్తులు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల ముసుగు వేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత తప్పిదాలకు సామాజిక వర్గాలను బాధ్యుల్ని చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఈ తరహా రాజకీయాలను నేటి యువత (జెన్-జీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.‘సేనా గళం’ కమిటీ.. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ సమగ్రతకు భంగం కలగకుండా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపిస్తుందని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, ఆ

SkyC Media01 Jun, 10:38 am
పన్నులు కట్టని పెద్ద సంస్థలపై తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విద్యా సంస్థల ఒత్తిళ్లు, రాజకీయ ప్రభావాలు, ట్యాక్స్ ఎవేషన్ అంశాలపై తాజాగా పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహించారు. జూన్ 1 రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించని పెద్ద సంస్థలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు ఉచితంగా చదువు చెప్పడం లేదని, ఫీజుల రూపంలో కోట్లు సంపాదిస్తున్నాయని మండిపడ్డారు. కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి సంస్థలు ప్రభుత్వానికి పన్నులు ఎందుకు కట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం రూ.10,000 వేతనం తీసుకునే ఉద్యోగిపై పన్ను భారం పడుతోందని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో కోట్లు సంపాదించే పెద్ద సంస్థల నుంచి బకాయిలు ఎందుకు వసూలు కావడం లేదని అధికారులను నిలదీశారు. చారిత్రకంగా చూస్తే, ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో కూడా నారాయణ, శ్రీ చైతన్య లాంటి పెద్ద విద్యా సంస్థలపై ట్యాక్స్ ఎవేషన్ ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2024 సంవత్సరంలో కూడా నారాయణ గ్రూప్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలు రాజకీయ లాబీయింగ్‌తో అధికారులను ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఏపీలో రాజకీయాలు మారినా పెద్ద సంస్థల ఒత్తిళ్ల వల్ల ఈ సమస్య అలాగే కొనసాగుతోంది. తాజాగా జరిగిన పవన్ కళ్యాణ్ రివ్యూ ద్వారా ఈ వ్యవస్థలో మార్పు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్డీయే కూటమి నేతలకు సంబంధించిన సంస్థలైనా సరే పన్నుల విషయంలో వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో పన్నుల వసూలు ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా జరగాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిరంతర పర్యవేక్షణ ద్వారానే వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులు సాధ్యమవుతాయని నిపుణులు

AP7AM01 Jun, 11:01 am
పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్

గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం, క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీలకు చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్న భారీ పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రంగాల నుంచి పేరుకుపోయిన పన్ను బకాయిలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య పౌరులు తమ పన్నులను క్రమబద్ధంగా చెల్లిస్తున్నప్పుడు.. పెద్ద పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తమ బాధ్యతలను ఎందుకు విస్మరిస్తున్నాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. "సాధారణ ప్రజలు ఎంతో నిజాయతీగా పన్నులు కడుతున్నారు. మరి పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలు పంచాయతీలకు చెల్లింపులు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాయి? ఎందుకు ఎగవేస్తున్నాయి?" అని పవన్ నిలదీశారు.పన్నుల రికవరీ ప్రక్రియలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఉపముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సదరు సంస్థల నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని పన్నులను పూర్తిగా రికవరీ చేయడానికి కఠినమైన విధానాన్ని అవలంబించాలని అధికారులను ఆదేశించారు. వసూళ్ల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించని డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలపై తక్షణమే అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Samayam Telugu30 May, 03:58 pm
సింగపూర్ టాంజాంగ్ టెర్నినల్ తరహాలోనే విశాఖ పోర్టులో.. పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా మారుస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా , కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు.. దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు.? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్తు తయారీ ఎలా జరుగుతుందో, చివరికి బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చో అధికారులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాంటు మొత్తం తిరిగిన పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని అన్నారు. కొండవీడు జిందాల్ ప్లాంటు రోజూ1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసి, సగటున 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని వివరించారు. దీనిని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం చేసి, రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చగలదని వివరించారు. విశాఖలోనూ జిందాల్ ప్లాంటు ఉత్తరాంధ్ర రీజియన్ చెత్తను సేకరించి 15 మెగావాట్లు విద్యుత్తు ఉత్పాదన చేస్తోందన్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహాలో మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాకినాడలో ఇప్పటికే పనులు మొదలు అయ్యాయని., నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.ఇక గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నదిలో కలుస్తున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా చిత్తశుద్ధితో ప్రణాళికను అమలు చేస్తా్మన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి 268 పంచాయతీలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం

AP7AM01 Jun, 07:27 am
పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు.. ఆయ న జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్

ఏపీ డిప్యూటీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారాలని, పవన్ కల్యాణ్ ప్రభావాన్ని చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకు దిగుతున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణలోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఉన్న భూమి విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.ఈ వివాదంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ జీవితం త్యాగం, నిజాయతీ, ప్రజాసేవకు నిలువుటద్దమని, ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలతో ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయలేరని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి నిందలు వేస్తారని విమర్శించారు.జన్వాడలోని వివాదాస్పద భూమిపై పార్టీ నేతలు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ భూమిని పవన్ కల్యాణ్ 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని తెలిపారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మ్యుటేషన్ కూడా చేయించుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, కేవలం వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, కబ్జా అనే ఆరోపణ పూర్తిగా నిరాధారమని స్ప‌ష్టం

NTV Telugu01 Jun, 03:45 pm
పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్

Pawan Kalyan: పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు ఎగవేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీలకు రావాల్సిన పన్నులు సక్రమంగా వసూలు చేస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యలు, ఉద్యోగుల జీతాల సమస్యలు, పారిశుధ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నుల ఎగవేతపై నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పుడు, భారీ ఆదాయాలు ఆర్జిస్తున్న పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు చెల్లించకుండా ఉండటం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పన్ను ఎగవేతల కారణంగా పంచాయతీల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని, ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని పవన్ హెచ్చరించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై పునఃఅంచనా (రీ అసెస్‌మెంట్) నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారులతో (డీపీవోలు) ప్రత్యేక ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీల పరిధిలోని సంస్థలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. గత 30 ఏళ్లలో పంచాయతీలకు చెందిన ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. తాళ్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్నులు వసూలు చేయడంలో జరిగిన అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నులు వసూలు చేయని సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల కోసం వేర్వేరు గ్రేడ్లు, పన్ను స్లాబ్‌లు నిర్ణయించాలని పవన్ సూచించారు. విద్యాసంస్థలు భారీ ఫీజులు వసూలు చేస్తూ పన్నులు చెల్లించకుండా ఉండటం సరైన విధానం కాదన్నారు. ఉచిత విద్య

AP7AM01 Jun, 03:14 pm
పవన్ ను ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాడు

జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన తమ్ముడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆసక్తికరమైన, భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాగబాబు తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, "అదృష్టం అందరినీ వరించదు. కొందరు నిరంతరం శ్రమించి, వైఫల్యాలను చవిచూసి, వాటి నుంచే మళ్లీ పైకి లేచి విజయాన్ని సాధిస్తారు. అలాంటి విజయం సాధారణమైనది కాదు... అది ఒక చరిత్ర అవుతుంది. పవన్ కల్యాణ్ కథ అదే" అని పేర్కొన్నారు."అధికార పక్షం లేదా ప్రత్యర్థులు ఆయన్ను అణచివేయాలని ప్రయత్నించినప్పుడు, అది ఆయనకు అతిపెద్ద విజయంగా మారుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఇదే" అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా, రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, సవాళ్లను పవన్ కల్యాణ్ తన విజయానికి సోపానాలుగా మార్చుకుంటారనే విశ్వాసాన్ని నాగబాబు వ్యక్తం చేశారు. తమ్ముడి రాజకీయ ప్రస్థానంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.రేపు (జూన్ 2) పవన్ సభకు హైదరాబాదులో అనుమతి నిరాకరణ ఎదురైన నేపథ్యంలో నాగబాబు తాజా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. 

10TV Telugu31 May, 01:16 pm
పవన్ కళ్యాణ్ హీరోయిన్ గ్లామర్ ఎటాక్.. అమ్మడు ఎవరో గుర్తుపట్టారా

నటి నికిషా పటేల్(Nikesha Patel) తన లేటెస్ట్ గ్లామర్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు. అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఆమె పంచుకున్న హాట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన పర్‌ఫెక్ట్ ఫిగర్, స్టైలిష్ అవతారంతో కుర్రకారుకు మతిపోగొడుతున్న నికిషా.. ఈ క్రేజీ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను పూర్తిగా షేక్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచారు.

Chitrajyothy31 May, 02:54 pm
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్

<p>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), నిర్మాత బండ్ల గణేష్‌ (Producer Bandla Ganesh)ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌ను తన ‘దేవుడు’గా కొలిచే బండ్ల గణేష్.. తరచూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన గురించి నా మనసులో ఉన్న విషయాలను ప్రపంచానికి చెప్తానంటూ బండ్ల గణేష్ వేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వారం, పది రోజులుగా పవన్ కళ్యాణ్‌‌‌ని కొందరు ఎలా టార్గెట్ చేశారో తెలియంది కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అంతా పవన్ జపమే. యూట్యూబ్‌ పెయిడ్ బ్యాచ్ అంతా దిగిపోయి, ఆయనని ఇబ్బంది పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు. జనవరి 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ పేరుతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ సభను నిర్వహించబోతున్నారు. దీనిని అడ్డుకునేందుకే అనేలా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపించని బ్యాచ్ కూడా డ్యూటీ ఎక్కారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మరోవైపు పవన్ కళ్యాణ్ అనేటోడి గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ఉందని, ఆ క్షణం కోసం వేచి చూస్తున్నానని బండ్ల గణేష్ చేసిన పోస్ట్.. ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ తన పోస్ట్‌లో.. ‘‘పవన్ కళ్యాణ్ సార్ ముందు మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ రోజు వస్తే ఆయన గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన గొప్ప మనసును,

Andhra Jyothy30 May, 12:49 pm
జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్ ను సందర్శించిన పవన్ కల్యాణ్.. అధికారులకు కీలక ఆదేశాలు

పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.. అమరావతి, మే 30: పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో చెత్తను సేకరించడం దగ్గర నుంచి బాయిలర్‌లో అది బూడిదగా మారే వరకూ.. ప్రక్రియను ఆసక్తిగా పరిశీలించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ విధానంపై ప్లాంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు, ప్లాంట్ నిర్వాహకులకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిందాల్ పరిశ్రమ తరహాలోనే గోదావరి నదీ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ సాంకేతికతను ఎలా అనుసంధానం చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో చెత్తను వేరు చేసి, దాన్ని విద్యుత్ తయారీకి ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రోజూ ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేలా మరిన్ని 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన 'ఇండోర్ మోడల్' తరహాలో చెత్తను పద్ధతిగా, పారదర్శకంగా వేరు చేసేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు.. ప్లాంట్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి అంతర్జాతీయ, జాతీయ స్థాయి గణాంకాలను వివరించారు. సింగపూర్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 2.8 శాతం కేవలం ఇలాంటి చెత్త ప్లాంట్ల నుంచే లభిస్తోందని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ గ్రిడ్‌తో ఈ వ్యర్థ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల అనుసంధానం చాలా

Sakshi01 Jun, 10:46 am
తెలంగాణ ప్రజలకు పవన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ సభ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్‌.. ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్ సభ విషయం లొ మాకు అభ్యంతరం లేదు. సభ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నరదృష్టి తగిలిందని గతంలో పవన్‌ మాట్లాడారు. తెలంగాణ

AP7AM01 Jun, 01:30 pm
పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు

హైదరాబాద్‌లో జనసేన పార్టీ రేపు నిర్వహించ తలపెట్టిన నవనిర్మాణ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2వ తేదీన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 'జనసేన సాధక్' (యాక్టివ్ సభ్యులు) సమావేశం నిర్వహించాలనుకున్నారు. సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేసిన ఈ సమావేశానికి అనుమతిని తిరస్కరిస్తున్నట్లు సెరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.శాంతిభద్రతల సమస్యలు, స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ఏపీకి చెందిన జనసేన సహా కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల వల్ల తెలంగాణలోని విద్యార్థి సంఘాలు, ఇతర బృందాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని వివరించారు.అంతేకాకుండా, జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సమయంలో సమావేశం నిర్వహించడం సమంజసం కాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహిస్తే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని, నిరసనలు, ఆందోళనలు జరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.వీటితో పాటు, సమావేశం జరగాల్సిన సంధ్యా కన్వెన్షన్‌కు తగినంత పార్కింగ్ సౌకర్యం లేదని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. నిర్వాహకులు పార్కింగ్ కోసం ప్రతిపాదించిన ఎఫ్‌సీఐ సొసైటీ లేఅవుట్‌కు సంబంధించిన స్థలంపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని,

SkyC Media01 Jun, 01:45 pm
హైదరాబాద్ లో జనసేన నవ నిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ నో

హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ రేపు నిర్వహించాలనుకున్న జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ సమ్మేళనానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఈ సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. ఈనెల జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్లు మరియు లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి కొన్ని ఉద్రిక్తతలు కూడా నెలకొని ఉన్నాయి. దీంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ఈ సభ నిర్వహణకు అనుమతులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశం ద్వారా తెలంగాణలో పార్టీని మరింత విస్తరించాలని జనసేన నాయకత్వం గట్టిగా భావించింది. సంస్థాగత బలోపేతం మరియు భవిష్యత్ వ్యూహాలపై పవన్ కళ్యాణ్ ఈ వేదిక ద్వారా దిశా నిర్దేశం చేయాలని ప్లాన్ చేశారు. సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫలితంగా ఈ సభ నిర్వహణపై తుది నిర్ణయం కోసం ఇప్పుడు కోర్టు ఆర్డర్ వైపు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే జనసేన పార్టీ తన తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఈ జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ చాలా కీలకమైనదిగా నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో

Zee Telugu31 May, 11:34 am
గోదావరి కాలుష్యంపై పవన్ పర్యటన ఎఫెక్ట్

Godavari Pollution Pawan Effect: పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా త్వరలోనే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. గోదావరి కాలుష్యం అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చేసిన రెండు రోజుల పర్యటన వల్ల అక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించేలా చేశారు. ముఖ్యంగా రాజమండ్రి ఆవా ఛానల్ వద్ద పర్యటించిన పవన్ కళ్యాణ్, అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారుల వైఫల్యంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దుర్భరంగా ఉన్న ఆవా ఛానల్ వద్ద, కేవలం 48 గంటల వ్యవధిలోనే ఆ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ప్లాస్టిక్ పేరుతో ఆ ప్రాంతమంతా పారేసిన వ్యర్థాల వల్ల

Andhra Jyothy30 May, 12:40 am
వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుకండి

వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. ‘మారేడుమిల్లి’లో అక్రమ వేట సామగ్రి స్వాధీనం అటవీ సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్‌ అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులను, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాలు, పాపికొండ జాతీయ ఉద్యానవనంలో అటవీశాఖ విస్తృత స్థాయిలో వేట నిరోధక చర్యలు(ఆపరేషన్‌) నిర్వహించింది. గాలింపు, నిఘా, కూంబింగ్‌ వంటి చర్యల ద్వారా అటవీశాఖకు చెందిన ప్రొటెక్షన్‌ వాచర్లు, యానిమల్‌ ట్రాకర్లు, ఫీల్డ్‌ సిబ్బంది అక్రమ వేట సామగ్రిని గుర్తించి, తొలగించారు. 242 వైర్‌ ఉచ్చులు, 10ఇనుప ఫుట్‌ ట్రాప్స్‌, 10కిలో మీటర్ల విద్యుత్‌ తీగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి శుక్రవారం అటవీశాఖ అధికారులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అటవీశాఖ సిబ్బందిని అభినందించారు. అక్రమ వేట వల్ల వన్యప్రాణ సంపదను నాశనం చేయడమే కాకుండా జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. అడవుల్లో వేట కోసం ఉచ్చులు, ఫుట్‌ ట్రాప్స్‌, విద్యుత్‌ తీగలు పెట్టొద్దని కోరారు.

Samayam Telugu01 Jun, 02:44 pm
హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ.. నాగబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్‌లో మంగళవారం (జూన్‌ 2) పవన్ కల్యాణ్ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో పోలీసులు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ అంశాన్ని ప్రస్తావించకుండా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "అదృష్టమనేది అందరినీ వరించదు. కొందరు అవిశ్రాంతంగా శ్రమించి, వైఫల్యాలను చవిచూసి, తిరిగి పుంజుకుని విజయాన్ని సాధిస్తారు. అలాంటి విజయం సాధారణమైనది కాదు.. అదో చరిత్రగా నిలిచిపోతుంది.. అదే పవన్ కళ్యాణ్ కథ. అధికారులు గానీ, ప్రతిపక్షం గానీ దానిని అణచివేసేందుకు ప్రయత్నించినప్పుడు, అది ఆయనకు అతిపెద్ద విజయంగా మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే." అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణకు కారణాలు..మరోవైపు జూన్ రెండో తేదీ మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ రెండో తేదీ సంధ్య కన్వెన్షన్‌లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ 2 వేల మందితో సమావేశం నిర్వహణకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి అనుమతి కోరినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై కేసులు, దీంతో తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్తత, కొంతమంది ఏపీ నేతల వ్యాఖ్యలతో

SkyC Media30 May, 05:39 am
జనసేన తొలి రాజ్యసభ సీటు రేస్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత స్థితి ప్రకారం రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చేసింది. జూన్ 18వ తేదీన ఈ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి బలం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మొత్తం 4 స్థానాలు కూటమికే దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన రాజ్యసభ సీటు ఒకటి ఆ పార్టీకి కేటాయించినట్టు గట్టి సమాచారం అందుతోంది. జనసేన పార్టీ రాజకీయ చరిత్రలోనే ఇది మొదటి రాజ్యసభ సీటు కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక స్థానానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా వేగంగా ముగియాల్సి ఉంది. జూన్ 8 లోపు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు పూర్తి కావాల్సి ఉంది. ఈ తక్కువ సమయంలోనే పవన్ కల్యాణ్ తన అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రేసులో ప్రధానంగా లింగమనేని రమేష్ పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఆయన పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా మరియు ఇతర రూపాల్లో పెద్ద ఎత్తున సహాయం అందించారు. లింగమనేనికి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నాదెండ్ల మనోహర్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉన్నాయి. దీంతో ఈ స్థానానికి ఆయన పేరు దాదాపు ఖరారైనట్టేనని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ నిర్ణయంపై కాపు సంఘాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని కాంట్రవర్సీలు కూడా లింగమనేని రమేష్ పేరు చుట్టూ తిరుగుతున్నాయి. అయినప్పటికీ పవన్ కల్యాణ్ తన పార్టీ కోసం కష్టపడిన వారి లాయల్టీని రివార్డ్ చేయాలని చూస్తున్నారు. చాలా కాలంగా పార్టీకి అండగా నిలిచిన వ్యక్తిని గౌరవించడం పవన్

Andhra Jyothy25 May, 02:29 pm
Home » Andhra Pradesh » Guntur » Pawan Kalyan Makes Key Remarks at Jana Sena Meeting Says Tamil...

Home » Andhra Pradesh » Guntur » Pawan Kalyan Makes Key Remarks at Jana Sena Meeting Says Tamil Nadu Politics Ran Smoothly Sj ABN , Publish Date - May 25 , 2026 | 07:59 PM ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధిన...

Chitrajyothy25 May, 03:27 pm
Home » Tollywood » pawan kalyan sensational comments on cm vijay rp ABN , Publish Date - May...

Home » Tollywood » pawan kalyan sensational comments on cm vijay rp ABN , Publish Date - May 25 , 2026 | 08:57 PM ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వాక్చాతుర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యే...

Chitrajyothy24 May, 11:54 am
Panja: పవన్ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రీ రిలీజ్‌కు రెడీ.. | Pawan Kalyan Panjaa Movie re Release on 2 september avm

- Home » Tollywood » Pawan Kalyan Panjaa Movie re Release on 2 september avm ABN , Publish Date - May 24 , 2026 | 05:24 PM పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా చిత్రం రీ రిలీజ్ కానుంది. - పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన మోస్ట్‌ స్టైలిష్‌ చిత్రాల్లో ‘పంజా’ (Panja) ఒకటి. - విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్‌, సంఘమిత్ర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 9, 2011లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

NTV Telugu26 May, 05:15 am
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్‌.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు

Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలకు ముందు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రాజమండ్రిలో గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగిస్తూ, గోదావరిలో పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి బోటు ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలించారు. వెంకటనగరం సమీపంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అధికారులతో కలిసి నీటి శాంపిల్స్ సేకరింపజేశారు. ఆకస్మిక తనిఖీల్లో కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “పవిత్ర గోదావరిలో కాలుష్య వ్యర్థాలు కలవడం చాలా దారుణం. పుష్కరాల సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం కాదు, రోగాలు వస్తాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏలూరులో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు. “రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరిదే. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అసెంబ్లీ, కేబినెట్‌ సమావేశాల్లో చర్చిస్తాం” అన్నారు పవన్‌ కల్యాణ్‌.. తనిఖీల సందర్భంగా పర్యావరణ శాఖ బాధ్యతలపై మంత్రి కందుల దుర్గేష్‌ను ఉద్దేశించి కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “పుష్కరాల రేవులను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు, గోదావరిలో కాలుష్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది” అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మంత్రి కందుల దుర్గేష్,

NTV Telugu26 May, 12:06 pm
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?

Pawan Kalyan: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం అత్యవసరంగా కలుసుకున్నారు. స్థానిక షెల్టన్ హోటల్‌లో ఈ కీలక సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, ప్రముఖ నిర్మాత కిలారి సతీష్‌తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. భేటీ వెనుక అసలు కారణం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లు – నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూ కారణంగా ఇండస్ట్రీలో తలెత్తిన తాజా పరిస్థితులను, ఎదురవుతున్న ఇబ్బందులను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూలంకషంగా వివరించారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, అటు నిర్మాతలకు నష్టం రాకుండా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలంటూ నిర్మాతలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఈ వివాదంలో జోక్యం చేసుకుని సమస్య సద్దుమణిగేలా చూడాలని వారు డిప్యూటీ సీఎంను కోరారని టాక్. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ సింగిల్ థియేటర్ల వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

10TV Telugu25 May, 03:29 pm
Pawan Kalyan Interesting Comments on his movies Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన...

Pawan Kalyan Interesting Comments on his movies Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్, సినీ ప్రయాణంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ స్థాయ...

Sakshi29 May, 01:35 am
దుర్గేష్ ను కావాలని టార్గెట్ చేసిన పవన్.. అసలు కథ ఇదే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దుర్గేష్ ను కావాలని టార్గెట్ చేసిన పవన్.. అసలు కథ ఇదే..!

Pawan Kalyan News | Telugu Digital