
Rcb Vs Gt Head To Head News
Latest updates from Telugu Digital news sources.


ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 ఫైనల్ మ్యాచ్.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bengaluru), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించడం తమ బౌలర్ల చేతుల్లోనే ఉందని కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) అన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్ పాటిదార్ మాట్లాడాడు. ‘పోటీలో నెగ్గాలంటే.. చక్కటి బౌలింగ్ ఎటాక్ ఉండాలి. ఈ పిచ్‌పై 200, 220 పరుగులు చేయడం తేలిక. కానీ ఆ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం కష్టం. అందుకే బౌలింగ్ దళం సత్తా చాటాలి’ అని పాటిదార్ అన్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌ను అతడు కొనియాడాడు. ‘భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు అనుభవమున్న బౌలర్. తుదిపోరులో బౌలింగ్ చేయడం బౌలర్లకు అంత తేలికైన విషయం కాదు. అతడికి తన ప్రణాళికలు, శక్తిసామర్థ్యాల మీద పూర్తి అవగాహన ఉంది. అదే కీలక పాత్ర పోషించనుంది’ అని రజత్ పాటిదార్ అన్నాడు. ‘టాప్ బౌలర్లైన భువీ, హేజిల్‌వుడ్‌కు ఇతర బౌలర్ల నుంచీ మద్దతు అవసరం. రసిఖ్ సలామ్ దార్ ఈ విషయంలో జట్టుకు సాయపడ్డాడు. ఇలా బౌలర్ల నుంచి సహాయ సహకారాలు అందడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీరు కేవలం ఒకరిద్దరు బౌలర్లతోనే పోటీలో గెలవలేరు. రసిఖ్ ఈ టోర్నమెంట్‌లో చక్కటి పాత్ర పోషించాడు. ప్రధాన బౌలర్ల మీద అదనపు భారం లేదు. జట్టంతా అద్భుతంగా ముందుకు సాగుతోంది’ అని పాటిదార్ వివరించాడు. అలాగే చేతివేలి గాయానికి గురైన ఫిల్‌సాల్ట్ పునరాగమనం గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘ప్రస్తుతం అతడు నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అయితే తుది జట్టులో అతడికి చోటు

‘‘ఈ సల కప్ నమ్‌దే’’ అన్న నినాదం కాల క్రమంలో కామెడీగా మారిపోయి ఎంతో వేదనను అనుభవించిన ఆర్సీబీ ఫ్యాన్స్.. వరుసగా రెండేళ్లు ‘‘ఈ సలనూ కప్ నమ్‌దు’’ అంటూ మురిసిపోతున్నారిప్పుడు. గత ఏడాది సాధించిన విజయం గాలివాటం కాదని చాటిచెబుతూ వరుసగా రెండో కప్పుతో తన ఆధిపత్యాన్ని చాటింది బెంగళూరు. రజత్ పాటీదార్ నేతృత్వంలోని ఈ ఆర్సీబీ.. ఆషామాషీ జట్టు కాదనడానికి ఈ ఏడాది ప్రదర్శన తిరుగులేని రుజువు. వరుసగా తొమ్మిదేళ్ల పాటు కోహ్లి పోరాడాడు.. ఇంకో అరడజను మంది కెప్టెన్లు కలిసి వేర్వేరు సీజన్లలో ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ బెంగళూరుకు కప్పు మాత్రం అందించలేకపోయారు. ఐపీఎల్ ఆరంభమైన రెండో ఏడాదే (2009) ఆర్సీబీ ఫైనల్ చేరింది. 2011, 2016లోనూ తుది పోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారీ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. కోహ్లి నుంచి పగ్గాలందుకున్న డుప్లెసిస్ కూడా జట్టు రాత మార్చలేకపోవడంతో గత ఏడాది రజత్ పాటీదార్ లాంటి పెద్దగా పేరు లేని ఆటగాడిని కెప్టెన్‌ను చేసింది ఆర్సీబీ. మహా మహా ఆటగాళ్లే ఆర్సీబీ కల నెరవేర్చని నేపథ్యంలో పాటీదార్ మాత్రం ఏం చేస్తాడులే అనుకున్నారు చాలామంది. కానీ అతడి సారథ్యంలో బెంగళూరు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్ దశలో ఆధిపత్యం చలాయించడమే కాక, ఫైనల్లోనూ నెగ్గి కప్పు కల నెరవేర్చుకుంది. అప్పుడు ఆర్సీబీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే లేక లేక ఓ కప్పు నెగ్గిన ఆర్సీబీ.. ఇంకోసారి ఈ అద్భుతాన్ని పునరావృతం చేస్తుందన్న అంచనాలు ఎక్కువగా లేవు. కానీ గత సీజన్‌ను మించిన ఆటతీరుతో, మరింత ఆధిపత్యంతో ఈసారి కప్పు గెలిచింది బెంగళూరు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడమే కాక.. రెండో స్థానంలో నిలిచిన గుజరాత్‌ను

ఇంటర్నెట్ డెస్క్: ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై వేటు పడింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో లెవల్ 1 ఉల్లంఘన చేసినందుకు గాను బీసీసీఐ అతడికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. 2 డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్‌ను ప్రమాదకరంగా విసిరినట్లు తేలింది. డేవిడ్ తన తప్పును ఒప్పుకొని, మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను అంగీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తంగా 5 పాయింట్లకు చేరడంతో 2027లో ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. వచ్చే సంవత్సరం ఆర్సీబీ మొదటి మ్యాచ్‌ను టిమ్ డేవిడ్ ఆడలేడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తన బౌలింగ్‌లో స్విచ్ హిట్‌తో సిక్సర్ కొడితే చాలా కోపమొచ్చేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: పదిహేనేళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 776 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే 72 సిక్సర్లతో అభిమానులను అలరించి పలు అవార్డులను అందుకున్నాడు. మరి ఈ చిన్నోడు తాజా ఐపీఎల్ సీజన్‌లో ఎంత డబ్బును తన జేబులో వేసుకున్నాడో తెలుసా..! వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ రూ.1.10 కోట్లకు వేలంపాటలో దక్కించుకుంది. ఈ మొత్తంతో పాటు మ్యాచ్ ఫీజులు, పలు రివార్డులూ అతడు సొంతం చేసుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా రూ.15 లక్షలు, టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నందుకు గాను రూ.10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలతో పాటు టాటా సియెరా వాహనం, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలు, అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ సొంతం చేసుకున్నందుకు రూ.10 లక్షలు అందుకున్నాడు. అలాగే అతడి ఒక మ్యాచ్ ఫీజు రూ.7.5 లక్షలు. వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇలా అతడు రూ.1.20 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డుల ద్వారా మరికొంత నజరానా పొందాడు. ఇలా మొత్తంగా వైభవ్ సూర్యవంశీ రూ.2.85 కోట్ల కంటే ఎక్కువ మొత్తమే తన ఖాతాలో వేసుకున్నాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు

ఐపీఎల్-19 ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఆర్సీబీ ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గతంలో నాలుగుసార్లు ఫైనల్‌కి వెళ్లినా ఒక్కసారే ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో టైటిల్‌పై గురిపెట్టింది ఆ జట్టు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆర్సీబీ రికార్డు ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: రజత్ పాటీదార్.. ది సైలెంట్ కిల్లర్: కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదుర్స్

ఏళ్లకు ఏళ్లు చకోర పక్షిలా నిరీక్షణ తప్పలేదు నిరుడు గెలిచినా.. తొక్కిసలాట ఘటన మిగిల్చిన చేదు అనుభవం తప్పలేదు.. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి టైటిల్ దక్కినా.. తనివితీరా సంబరాలు చేసుకోలేని పరిస్థితి! ఆ లోటును పూడ్చుకోవడం కోసమేనా అన్నట్లు ఆ జట్టు మరోసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది తమ విజయం గాలి వాటం కాదని.. అది తమ ఆటగాళ్ల ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని.. నలు చెరుగులా చాటి చెప్పింది.. ఆ జట్టే.. ఆర్సీబీ.. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అలాగే, క్వాలిఫయర్ -1లో గుజరాత్ టైటాన్స్‌పై పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో అదే జట్టును మరోసారి మట్టికరిపించి.. అ‘ద్వితీయం’గా కప్పును సొంతం చేసుకుంది. ఆర్సీబీ జట్టు కూర్పు అదిరిపోయింది. బ్యాటర్లు, బౌలర్ల సమతూకంగా ఉంది. విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య ఇలా.. ఏడో స్థానం వరకు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్, రసిఖ్ సలామ్ దార్.. ఇలా బౌలింగ్ దళమూ భేష్‌గా ఉంది. కృనాల్ పాండ్య రూపంలో చక్కటి ఆల్‌రౌండర్ కూడా ఉన్నాడు. దీంతో ఆ జట్టు కూర్పు అద్భుతంగా కుదిరింది. అందుకే ఫిల్ సాల్ట్ లాంటి స్టార్ బ్యాటర్ గాయంతో దూరమైనా.. ఆ ప్రభావం జట్టుపై పడలేదు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తమ హోం గ్రౌండైన చిన్నస్వామి స్టేడియంలో లీగ్ స్టేజిలో కేవలం అయిదు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. మిగతా రెండు మ్యాచ్‌లను రాయ్‌పుర్‌లో ఆడింది. అయినప్పటికీ మెరుగ్గా రాణించి ఫ్లేఆఫ్స్‌నకు చేరుకున్న తొలి

ఇంటర్నెట్‌డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది (IPL 2026 final). అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు నగరవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ (RCB) ఛాంపియన్‌గా నిలవగా.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి కప్పు కొట్టేందుకు ఆర్సీబీ ఉత్సాహంతో ఉంది. ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలిచినా.. ఒకవేళ ఓడిపోయినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అభిమానులకు పలు కఠిన ఆంక్షలు విధించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

అహ్మదాబాద్: ఐపీఎల్-19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ (75*; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. వెంకటేశ్ అయ్యర్ (32; 16 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (24; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రజత్ పాటీదార్ (15), జితేశ్ శర్మ (11) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఆర్సీబీకి శుభారంభం దక్కింది. వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన కోహ్లీ (Virat Kohli) .. తర్వాత చెలరేగాడు. రబాడ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాదేయడంతో 4 ఓవర్లకే స్కోరు 50 దాటింది. తర్వాత వెంకటేశ్ అయ్యర్‌ను సిరాజ్, పడిక్కల్ (1)ని రబాడ పెవిలియన్‌కు పంపారు. కాసేపటికే రషీద్ ఖాన్ ఒకే ఓవర్‌లో పాటీదార్, కృనాల్ పాండ్య (1)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు ఆర్సీబీ 100/4తో నిలిచింది. దూకుడుగా ఆడిన కోహ్లీ అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాది 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో విరాట్‌కు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. నిలకడగా

RCB vs GT Qualifier 1 Live Streaming: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరానికి తెరలేచింది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా రాత్రి 7.30...

Royal Challengers Bengaluru vs Gujarat Titans Records: ఐపీఎల్ 2026 తుది సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. రెండు జట్లూ తమ రెండో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేయడంతో ఈ మ్యాచ్ అభిమానుల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అదే మైదానం.. అదే లక్ష్యం.. చరిత్ర పునరావృతమయ్యేనా? గుజరాత్ టైటాన్స్ జట్టుకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ అహ్మదాబాద్ మైదానంతో ఒక విడదీయరాని సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఇదే పిచ్‌పై 2022లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ తన తొలి ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. మరోవైపు, సుదీర్ఘ కాలంగా అభిమానులను ఊరించిన ఆర్సీబీ, గత ఏడాది అంటే ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఇదే మైదానంలో మట్టికరిపించి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఇరు జట్లూ తమ రెండో ట్రోఫీని గెలుచుకుని లీగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖాముఖి పోరులో నువ్వా-నేనా.. పైచేయి ఎవరిది? ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఇరు జట్ల మధ్య పోటీ ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రికార్డుల పరంగా బెంగళూరు జట్టుకు స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ, గుజరాత్ జట్టు ఏనాడూ వారికి సులువుగా