translateexpand_more

Asianet News Telugu News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 03:23 am
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ చిత్రం మరో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ తో షోలు ప్రారంభం అవుతాయి. పెద్ది చిత్రానికి సంబందించిన బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ప్లాన్ చేశారు. జూన్ 1న నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు ఎవరు వస్తారు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల విషయంలో చిత్ర యూనిట్ సీక్రెట్ మైంటైన్ చేస్తోంది. ఎందుకు ఇంతలా దాచేస్తున్నారు అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే కొన్ని రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈవెంట్ కి హాజరైతే అభిమానుల్లో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం లేదు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. పెద్ది చిత్రంలో రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించగా శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ

Asianet News Telugu01 Jun, 02:35 pm
అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నటనలోనే కాదు, ఫిట్‌నెస్ విషయంలోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. రీసెంట్ గా తాప్సీ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతున్నా పొట్ట దగ్గర కొవ్వు తగ్గట్లేదని బాధపడే అమ్మాయిలు తాప్సీ చెప్పే ఈ నిజాలు వినాల్సిందే. రీసెంట్ గా తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. సినిమా ఇండస్ట్రీ ఒత్తిడి వల్ల, తెరపై సన్నగా కనిపించాలని ఒకప్పుడు తన శరీరాన్ని చాలా హింసించుకుందట స్టార్ బ్యూటీ. "చిన్నప్పటి నుంచి నేను ఫిట్‌గానే ఉన్నా. కానీ పొట్ట కింది భాగంలో (లోయర్ బెల్లీ) ఆ కొంచెం కొవ్వు ఎందుకు పోలేదో అర్థమయ్యేది కాదు. దాన్ని కరిగించడానికి జిమ్‌లో నన్ను నేను శిక్షించుకున్నా. ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యం" అని తాప్సీ బాధగా చెప్పుకొచ్చింది. ఎక్కువ వ్యాయామం చేస్తే శరీరం సన్నబడుతుందని అనుకుంటాం. కానీ తాప్సీ ఈ విషయంలో ఏమన్నదంటే..? "మీరు ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు, శరీరం నీటిని బయటకు పంపే బదులు నిల్వ ఉంచుకోవడం (వాటర్ రిటెన్షన్) మొదలుపెడుతుంది. దీనివల్ల పొట్ట కింది భాగం ఉబ్బినట్లు కనిపిస్తుంది తప్ప తగ్గదు." జిమ్‌లో గంటలు గడిపే మహిళలు ఈ విషయం గమనించాలి. ఇది కొవ్వు మాత్రమే కాదు, నీరు కూడా కావచ్చు! న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్నాక తాప్సీకి అసలు విషయం తెలిసిందట. మహిళల పునరుత్పత్తి అవయవాలు (Reproductive Organs) పొట్ట కింది భాగంలో ఉంటాయి. ఈ సున్నితమైన అవయవాలను రక్షించడానికి అక్కడ కొంత కొవ్వు, నీరు ఉండటం చాలా అవసరం. ఇది ప్రకృతి మహిళలకు ఇచ్చిన రక్షణ కవచం. దాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించడం ఆరోగ్యానికి

Asianet News Telugu01 Jun, 11:36 am
నయనతారకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, ఒక్క సినిమాకు రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతుంది రష్మిక. ఇటు సౌత్ అటు బాలీవుడ్ పాన్ ఇండియా వైడ్ గా రష్మిక మందన్న దూసుకుపోతోంది. ఏహీరోయిన్ అయినా.. పెళ్లి తరువాత కాస్త జోరు తగ్గుంది. హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గుతాయి. కానీ రష్మికకు మాత్రం పెళ్లి తరువాత మరింత కలిసివస్తోంది. రీసెంట్ గా ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు సమాచారం. రష్మిక, పెళ్లి తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని అదే జోరుతో కొనసాగిస్తోంది. పెళ్ళి తరువాత చాలా మంది హీరోయిన్లు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రష్మిక మాత్రం అలాంటి బ్రేక్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో ‘రణబాలి’, ‘మైసా’ సినిమాల్లో నటిస్తున్న రష్మిక, హిందీలో ‘కాక్‌టెయిల్ 2’ వంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఈ సినిమాల ద్వారా ఆమెకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ప్రస్తుతం రష్మికకు డిమాండ్ భారీ స్థాయిలో ఉంది. పెళ్లి తరువాత రష్మిక రెమ్యునరేషన్‌ భారీగా పెరిగినట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగులో ఒక్కో సినిమాకు 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రష్మిక మందన్నా..బాలీవుడ్‌లో మాత్రం మూవీకి 15 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Asianet News Telugu01 Jun, 06:35 am
హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలని ధైర్యంగా బయటకు చెప్పారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు ఇబ్బందులు సావిత్రి గారి కాలం నుంచే ఉన్నాయి అని ఆమని అన్నారు. ప్రతిచోట మంచి చెడు ఉన్నట్లే ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. దేనిని ఎంచుకోవాలి, దేనివైపు వెళ్ళాలి అనేది మన మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. కష్టపడి హీరోయిన్ గా ఎదిగేవాళ్ళు, అదే విధంగా చెడు పద్దతుల ద్వారా హీరోయిన్ గా ఎదిగేవాళ్ళు కూడా ఉన్నారు అని ఆమని అన్నారు. నేను హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కొందరు కొత్త బ్యానర్ స్థాపించి ఆడిషన్స్ కి పిలిచేవాళ్ళు. అవి పేరున్న కంపెనీలు కాదు. అయినా సరే అదృష్టం బావుంటే హీరోయిన్ గా ఛాన్స్ వస్తుంది కదా అని ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని. మీకు లోపల ఏమైనా మచ్చలు ఉన్నాయోమో చూడాలి. ఎందుకంటే మీరు మూవీలో స్విమ్ సూట్ వేసుకోవాలి. కాబట్టి బట్టలు తీసి మచ్చలు చూపించండి అని అడిగారు. స్విమ్ షూట్ వేసుకోవాలి అంటే సినిమాలో వేసుకుంటాను. ఇక్కడ మీకెందుకు చూపిస్తాను. ఆ అవసరం ఏంటి అని అడిగేదాన్ని. వాళ్ళ ఉద్దేశం అర్థం అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయేదాన్ని అని ఆమని తెలిపారు. బహుశా అలాంటి మైండ్ సెట్ ఉండి, తప్పనిసరిగా హీరోయిన్ కావాలి అని అనుకునే అమ్మాయిలు చూపిస్తారేమో. నేను మాత్రం అలా చేయను అని ఆమని అన్నారు. మరో సంఘటన కూడా ఎదురైంది. హీరో డైరెక్టర్ కాదు ఏకంగా ఫైనాన్షియర్ తో కమిట్మెంట్ అడిగారు.

Asianet News Telugu01 Jun, 02:11 am
ఆఫీస్ లో వరల్డ్ ఫేమస్ బ్యూటీ రొమాన్స్, ఓటీటీలోకి అడల్ట్ మూవీ..ఈ వారం మరిన్ని సినిమాలు రెడీ

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ భారీగా ఉండబోతోంది. క్రైమ్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు, యాక్షన్ మూవీస్ ఇలా అన్ని జానర్లలో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ 5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇవే. త్రిప్తి డిమ్రి, మాధురి దీక్షిత్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. విచిత్రమైన కథనం, ఆసక్తికరమైన పాత్రలు సినిమాపై అంచనాలు పెంచాయి. 2025లో వచ్చిన స్పై థ్రిల్లర్‌కు ఇది సీక్వెల్. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ ‘Raw & Undekha’ వెర్షన్ ఇప్పటికే విదేశాల్లో స్ట్రీమింగ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఇండియాలో డిజిటల్ ప్రీమియర్‌కు వస్తోంది. జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టీన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ. ఆఫీస్‌లో సీక్రెట్ రిలేషన్‌షిప్ వల్ల ఇద్దరు వర్కహాలిక్స్ జీవితాల్లో వచ్చే గందరగోళం కథాంశంగా ఉంటుంది. 1986 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను మెక్సికో ఎలా నిర్వహించిందన్న అంశం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. డియాగో లూనా, డేనియల్ గిమెనెజ్ కాచో, కార్లా సౌజా కీలక పాత్రల్లో నటించారు. పాఠశాలల్లో క్రమశిక్షణ పూర్తిగా కూలిపోయిన పరిస్థితుల్లో, విచిత్రమైన ఇన్‌స్పెక్టర్లు ఎంట్రీ ఇచ్చి వ్యవస్థను ఎలా మార్చారన్న కథతో ఈ K-డ్రామా రూపొందింది. ఒక మహిళ షిప్పింగ్ కంటైనర్‌లో గుర్తు తెలియని స్థితిలో కనిపించడంతో కథ మొదలవుతుంది. ఆమె ఎవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారు? అనే మిస్టరీ చుట్టూ సిరీస్ తిరుగుతుంది. విధు, ప్రీతి అస్రాని నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా. థియేటర్లలో

Asianet News Telugu31 May, 12:11 pm
జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు

ఈ సినిమా జనవరి 9న సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సెన్సార్ సమస్యలే కారణమని నిర్మాత వెంకట్ నారాయణ రెండుసార్లు చెప్పారు. జూన్ 19న వస్తుందనుకుంటే, నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ 'బాలన్' అనే మరో సినిమాను ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. ఇక దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ఈ సినిమా రావొచ్చని టాక్. ఒక కార్యక్రమంలో 'జననాయగన్' రిలీజ్ గురించి డైరెక్టర్ హెచ్. వినోత్‌ను అడిగారు. దానికి ఆయన, 'సినిమా వచ్చినప్పుడు వస్తుంది. ఆ నిజం చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను చెప్పినా, దాన్ని ప్రచురించే ధైర్యం మీకు (మీడియాకు) లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. వినోత్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న డైరెక్టర్ పా. రంజిత్ నవ్వడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'జననాయగన్' సినిమా మంచి ప్రింట్‌తో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. 'ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి 5 నెలలు పడుతుందా? సినిమాను ఎవరు ఆపుతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది' అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Asianet News Telugu30 May, 11:50 am
నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్

Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్ ఈ వార్తకు సంబంధించిన

Asianet News Telugu30 May, 06:04 am
హాయ్, హలో చెప్పొద్దు.. 'టాక్సిక్' సెట్ లో కియారాకు డైరెక్టర్ వింత కండిషన్

యశ్ సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను హీరోయిన్ కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Asianet News Telugu31 May, 04:01 am
ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్ స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా

టాలీవుడ్ లో సడెన్ గా ట్రెండ్ మారింది. హీరోలంతా గ్యాంగ్ స్టర్ కథలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది హీరోలు గ్యాంగ్ స్టర్ కథలతో చిత్రాలు ప్రారంభించారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ల నుంచి తారక్, నాని లాంటి నేటి తరం హీరోల వరకు అందరూ గ్యాంగ్ స్టర్ సినిమాలే చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీరసింహా రెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది. బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో రెండవ చిత్రం పార్రంభం అయింది. ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉండబోతోందట. చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అయినప్పటికీ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. సిన్సియర్ పోలీస్ అధికారి మాఫియా డాన్ గా మారితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు నమోదవుతాయి. ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ సెటప్ తో ఉంటాయి. కథా నేపథ్యంలో కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ హీరో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. డ్రాగన్ మూవీలో తారక్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ఇటీవల మాస్ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించనున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథాంశం. ఇలా హీరోలంతా వరుసపెట్టి మాఫియా, గ్యాంగ్ స్టర్

Asianet News Telugu30 May, 04:03 pm
నెట్ ఫ్లిక్స్ లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

2015లో విడుదలైన ఈ హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. 2008లో నోయిడాలో జరిగిన డబుల్ మర్డర్ కేసు ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సేన్ శర్మ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.1 ఉంది. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ నటించిన ఈ తమిళ సినిమాలో సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.3 ఉంది. మీ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. 2018లో విడుదలైన ఈ హాలీవుడ్‌ సినిమా ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో నిండి ఉంటుంది. ప్రతి సీన్‌లోనూ సస్పెన్స్ మిమ్మల్ని సీట్ అంచున కూర్చోబెడుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వీకెండ్‌లో చూడటానికి ఇది సరైన ఆప్షన్. రాజ్‌కుమార్ రావు, రాధికా ఆప్టే నటించిన ఈ హిందీ సినిమాను మీరు వీకెండ్‌లో చూడొచ్చు. వీరితో పాటు హుమా ఖురేషి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సినిమా మొత్తం సస్పెన్స్‌తో నిండి ఉంటుంది. షనాయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన ఈ హింఈ చిత్రంలో థ్రిల్లింగ్, సస్పెన్స్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. వరుస హత్యల కేసులో ఒక డాక్టర్ జైలుకు వెళ్తాడు. తన భర్త నిర్దోషి అని నిరూపించడానికి, అతని భార్య కూడా అచ్చం అలాంటి హత్యలే చేస్తుంది. ఇదే ఈ బాలీవుడ్‌ సినిమా కథ.

Asianet News Telugu31 May, 03:52 am
ఒక్క టికెట్ తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్ సీటీసీ బంపర్ ఆఫర్

శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం "సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర" పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. కేవలం ఒకే ఒక్క టూర్‌లో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' (Bharat Gaurav Tourist Train) సర్వీసును ఉపయోగించనున్నారు. జూన్ 16న తెలంగాణలోనిన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ తన జర్నీని స్టార్ట్ చేయనుంది. ఈ డివైన్ టూర్ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ రైలును డిజైన్ చేశారు. కేవలం సికింద్రాబాద్‌లోనే కాకుండా, ప్రయాణికుల డిమాండ్ మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో కూడా ఈ రైలు ఎక్కే సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఉత్తర తెలంగాణ భక్తులకు ఈ యాత్ర చాలా ఈజీగా మారనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు కీలక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు, పురాతన ఆలయాలను ఈ టూర్‌లో కవర్ చేయనున్నారు. భక్తులు ఎంతో కాలంగా కలలుగనే ప్రముఖ శివాలయాలన్నీ ఈ సింగిల్ టూర్‌లో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శించే ప్రధాన క్షేత్రాల లిస్ట్ గమనిస్తే.. యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు

Asianet News Telugu31 May, 01:39 am
చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో కులాల ప్రస్తావన ఎప్పుడూ ఉండేదే. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఎక్కువగా కులాల ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో కులాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి గురించి ఆయన ప్రస్తావించారు. రాఘవేంద్ర రావు కమర్షియల్ చిత్రాలు ఎంత అద్భుతంగా తీశారో భక్తిరస చిత్రాలు కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించారు. నాగార్జునతో ఆయన రూపొందించిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి. నాగార్జున రాఘవేంద్రరావు తెరకెక్కించిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్ర రావు ఈ మూవీ తెరకెక్కించారు.ఈ మూవీ రిలీజ్ టైంలో హథీరాం బాబా కులం గురించి చర్చ జరిగింది. అయితే రాఘవేంద్ర రావు ఆయన్ని ఒక భక్తుడిగా మాత్రమే చూపించారు. ఆయన కులం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ వివాదం రావడంతో ఈ విధంగా స్పందించారు. మానవజాతి మొత్తం ఒకే కులం. వాల్మీకి, వ్యాసులది ఏ కులం అని ఎవరైనా అడుగుతారా అని రాఘవేంద్ర రావు ప్రశ్నించారు. వాళ్ళ వాళ్ళ కులాల్లో గొప్పవారు ఉన్నప్పుడు వారి గురించి పాజిటివ్ గా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకే కులానికి ఆపాదించడం మాత్రం తప్పు. సినిమాకు అసలు కులం ఉండకూడదు. ఎందుకంటే సినిమాని అందరూ చూడాలి. చిరంజీవి గారు ఒక కులానికి చెందిన వ్యక్తి, నేను మరొక కులానికి చెందిన వాడిని. కానీ మద్రాసులో ఉన్నప్పుడు చిరంజీవి కులం ఏంటో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ చిరంజీవితో నేను అత్యధిక

Asianet News Telugu31 May, 04:45 am
అందమైన ఆకుల డిజైన్స్ తో గోల్డ్ రింగ్స్

సింగిల్ లీఫ్ డిజైన్‌తో ఉండే ఈ గోల్డ్ రింగ్ ఎంతో అందంగా ఉంటుంది. ఇది రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. రెండు ఆకుల డిజైన్‌ ఆల్ టైమ్ ఫేవరేట్. దీని మోడ్రన్ ప్యాటర్న్ వేళ్లకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఆకు డిజైన్లలో చిన్న చిన్న డైమండ్స్ పొదిగితే ఆ రింగ్ అందంగా ఉంటుంది. ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాల్లో పెట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. తీగలు, ఆకులతో ప్రేరణ పొందిన డిజైన్ ఇది. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీ జ్యువెలరీ కలెక్షన్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే లీఫ్ రింగ్ ఇది. దీని సాఫ్ట్, ట్రెండీ లుక్ క్యాజువల్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతీ స్టైల్‌తో ఈజీగా మ్యాచ్ అవుతుంది. చిన్న చిన్న ఆకులను కలిపి తయారు చేసిన రింగ్ ఇది. చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. దీంతో చేతుల అందం మరింత పెరుగుతుంది. యాంటిక్ ఫినిషింగ్‌తో వచ్చే లీఫ్ రింగ్. వింటేజ్ స్టైల్ చీరలు, సూట్స్, ఇతర ఎత్నిక్ వేర్‌తో చాలా అందంగా కనిపిస్తుంది. Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్ Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?

Asianet News Telugu31 May, 12:48 pm
చైనీస్ కాలర్ బ్లౌజ్ డిజైన్లు.. ఏ చీరమీదైనా నప్పుతాయి

కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఫ్లాట్ కాలర్ బ్లౌజ్ డిజైన్ ఇవి. రోజూ వేసుకోవడానికి బాగుంటుంది. కాటన్ నుంచి ఆర్గాంజా చీరల వరకు దేనిపైనైనా స్టైల్ చేయొచ్చు. నగలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ అంగరఖా క్లోజ్ కాలర్ బ్లౌజ్‌ను వేసుకోవచ్చు. ఇందులో కాలర్ వెడల్పుగా, ఫోల్డ్ చేసి ఉంటుంది. ః ఈ హై-నెక్ కాలర్ బ్లౌజ్ ఏ చీరపైకైనా రిచ్ లుక్ ఇస్తుంది. మెడ దగ్గర ఉన్న డిజైన్ చోకర్ నెక్లెస్ వేసుకున్న ఫీలింగ్ కలిగిస్తుంది. మోడ్రన్ లుక్ తో వచ్చే హాల్టర్ నెక్ బ్లౌజ్ ఇది. ఇందులో మెటాలిక్ గోల్డ్‌తో పాటు కాలర్ స్టైల్ లుక్ ఇచ్చారు. ఈ అజ్రఖ్ ప్రింట్ బ్లౌజ్ లో కాలర్ హైగా కుడతారు. ఇది గుజరాతీ వర్క్ తో వస్తుంది. దీన్ని రోజూ వేసుకునే ప్లెయిన్ చీరల నుంచి ఫంక్షన్లకు కట్టే హెవీ చీరల వరకు దేనిపైనైనా వేసుకోవచ్చు. ఇది స్లీవ్‌లెస్ చైనీస్ కాలర్ బ్లౌజ్. దీని ఫ్రంట్ డీప్ వి-షేప్‌లో, స్లీవ్‌లెస్ డిజైన్‌తో ఉంది. స్మార్ట్-క్యాజువల్ లుక్ కోసం ఈ బ్లౌజ్ బెస్ట్ ఛాయిస్. డీప్ నెక్ తో వచ్చే బ్లాక్ బ్లౌజ్ డిజైన్ ఇది. కాంట్రాస్ట్ చీరను వేసకుంటే ఎంతో అందంగా ఉంటుంది. Fashion: పార్టీలకు తమన్నాలా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అదరహో Leaf Ring Design: అందమైన ఆకుల డిజైన్స్‌తో గోల్డ్ రింగ్స్ Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్

Asianet News Telugu31 May, 10:56 am
సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ దళపతి, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష మధ్య రిలేషన్ షిప్ పై చాలా కాలంగా రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎప్పటి నుంచో వీరి మధ్య బంధంపై సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఈ విషయం ఎక్షన్ టైమ్ లో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విజయ్‌కు మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకుల కేసు దాఖలు చేయడం.. త్రిష వల్లే విజయ్ కి సంగీత విడాకులిచ్చిందంటూ నెట్టింట కథనాలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలు వైరల్ అవుతున్న టైమ్ లో .. ఇద్దరు స్టార్స్ పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్న టైమ్ లో విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లికి హాజరుకావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. త్రిష విషయాన్ని ఆయుధంగా చేసుకుని.. విజయ్ ను ఎలక్షన్ లో గెలవకుండా చేయాలని ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. రీసెంట్ గా ఎన్నికల్లలో విజయ్ ఘన విజయం సాధించడం.. త్రిష బర్త్ డే రోజునే రిజల్ట్ రావడం, త్రిష కూడా సీఎం గా విజయ్ ప్రమాణస్వీకారానికి వచ్చి సందడి చేయడం. ఆ తర్వాత కూడా త్రిష ఆయన ఇంటికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. త్రిష విజయ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా కనిపించడం వంటి పరిణామాలు వీరి గురించి వస్తున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం అయిన తరువాత విజయ్

Asianet News Telugu31 May, 06:01 am
పార్టీలకు తమన్నాలా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అదరహో

సన్నగా ఉండే వారికి ఇలాంటి డ్రెస్ అందంగా ఉంటుంది. ఎరుపు రంగు గౌన్‌పై ఉన్న తెలుపు రంగు ప్రింట్ చాలా డీసెంట్‌గా ఉంది. పార్టీలకు ఈ డ్రెస్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఏదైనా థీమ్ పార్టీకి ఈ ఆఫ్ షోల్డర్ బ్లాక్ గౌన్ ట్రై చేయొచ్చు. రెడ్ కలర్ షోల్డర్ ఫ్లేర్స్‌తో ఈ బ్లాక్ గౌన్ చాలా అందంగా కనిపిస్తుంది. Leaf Ring Design: అందమైన ఆకుల డిజైన్స్‌తో గోల్డ్ రింగ్స్ Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్ Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో

Asianet News Telugu30 May, 11:32 am
తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా

June 2026 Holidays : తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే వేసవి సెలవులు ముగిసి బడిగంటలు మోగనున్నాయి. వార్షిక పరీక్షలు ముగియగానే ఏప్రిల్ 24 మూతపడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు జూన్ 12న తెరుచుకోనున్నాయి. దాదాపు 48 రోజులు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు తిరిగి స్కూల్ కి వెళ్లడం కాస్త బాధగానే ఉంటుంది. భారంగానే బ్యాగు భుజానేసుకుని స్కూల్ బాట పడుతుంటారు. ఇలాంటి విద్యార్థులకు ఊరటనిచ్చేలా జూన్ లో భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ లో ప్రారంభమైన హాలిడేస్ మే మొత్తం కొనసాగాయి. జూన్ లోనూ కొనసాగనున్నాయి. జూన్ మధ్యలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇలా స్కూళ్ళు ఓపెన్ అవుతాయోలేదో అలా మళ్లీ సెలవులు వచ్చేస్తున్నాయి. జూన్ నెలలో మొత్తంగా 16 రోజులు స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 12న విద్యాసంస్థలు రీఓపెన్ అవుతాయి... అంటే మొదటి 11 రోజులు వేసవి సెలవులే. ఇలా స్కూళ్లు ప్రారంభమై ఓరోజు నడుస్తాయో లేదో మళ్లీ రెండ్రోజుల సెలవులు వస్తన్నాయి. జూన్ 13న రెండో శనివారం, జూన్ 14 ఆదివారం... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు సెలవులే. ఇక జూన్ 21న ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంది. ఈ నెల చివరివారంలో అంటే జూన్ 26న (శుక్రవారం) మొహర్రం పండగ ఉంది. దీన్ని తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు అధికారికంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 27న(శనివారం) ఒక్కరోజు స్కూల్ నడుస్తుంది... తిరిగి జూన్ 28న ఆదివారం కాబట్టి సాధారణ సెలవు. ఇలా వేసవి సెలవులు ముగిశాక కూడా జూన్ లో ఐద్రోజుల

Asianet News Telugu02 Jun, 01:45 am
శ్రీదేవి కూతురి కామెంట్స్ వైరల్

"మలయాళం భాషను మళ్లీ ట్రై చేయాలని నాకు లేదు. ఎందుకంటే ఆ భాషను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది అందమైన భాష అనడంలో సందేహం లేదు. కానీ, నాకు తెలుగు, తమిళ భాషలు సులభంగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సినిమాల్లో నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. తమిళంలో ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలనే ఆశ ఉంది," అని జాన్వీ తన కొత్త సినిమా 'పెద్ది' ప్రమోషన్స్ టైంలో చెప్పింది.

Asianet News Telugu01 Jun, 04:59 pm
ఒకవైపు నిప్పుల కొలిమి.. ఇంకోవైపు పిడుగుల వాన ! వాతావరణంలో వింత మార్పులు.. అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రూట్ మార్చింది. ఒకే టైమ్‌లో ఎండలు దంచికొడుతూ, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు (మంగళవారం, బుధవారం) వాతావరణం చాలా విచిత్రంగా మారబోతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఒక పక్కన భానుడు నిప్పుల కురిపిస్తుంటే.. మరోపక్కన పిడుగులతో వర్షం విరుచుకుపడే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు. వాతావరణంలో ఏర్పడిన ఒక భారీ ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం వానలు పడుతున్నాయి. దీనికి రుతుపవనాల ప్రభావం కూడా తోడవుతోందని సమాచారం. తూర్పు విదర్భ నుంచి ప్రారంభమై తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దక్షిణ కేరళ వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. దీని ఎఫెక్ట్ వల్ల ఏపీలో మంగళవారం, బుధవారం పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల అలర్ట్ ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో 40-42 డిగ్రీల ఎండలు ఉంటాయి. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీలు, మార్కాపురం నందనమారెళ్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వింత వాతావరణ పరిస్థితుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాన పడేటప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఉండొద్దని అధికారులు తెలిపారు.

Asianet News Telugu31 May, 01:30 am
ఈ వారం 12 రాశుల్లో ఈ 3 రాశులవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి శుభసూచనలు ఉన్నాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు. కుటుంబ జీవితంలో పెద్దల సలహాలు కలిసివస్తాయి. దాంపత్య జీవితంలో గతంలో ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశివారికి ఈ వారం స్థిరత్వం, పురోగతి ఉంటాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. పదోన్నతి లేదా జీతం పెంపు విషయాల్లో సానుకూల సంకేతాలు ఉన్నాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. విదేశీ విద్య అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మిథున రాశివారు ఈ వారం చాలా చురుకుగా ఉంటారు. ఆలోచనా శక్తి, సంభాషణా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకం. వ్యాపారాలలో స్పష్టత అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది.

Asianet News Telugu01 Jun, 01:08 pm
రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్

పురాణాల ప్రకారం, ఈ దేవత తన తలని తానే ఖండించుకుని చేతిలో పట్టుకుని ఉంటుంది. తన రక్తాన్ని దేవదూతలకు అర్పిస్తూ భీకర రూపంలో కనిపిస్తుంది. హిందూ మతంలో అత్యంత ఉగ్రరూపిణి అయిన తాంత్రిక దేవత. ఈమెను 'దశ మహావిద్యలలో' ఆరవ దేవతగా, శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. చిన్నమస్త అంటే "ఖండింపబడిన శిరస్సు" అని అర్థం.

Asianet News Telugu31 May, 04:13 pm
ఔటా? నాటౌటా? వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వివాదం.. అంపైర్ డెసిషన్ తో హైడ్రామా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఒకే ఒక్క అంపైరింగ్ నిర్ణయం మ్యాచ్‌లోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా మారింది. గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ అవుట్ చుట్టూ తిరిగిన ఈ సీన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ లవర్స్ మధ్య పెద్ద రచ్చకు దారితీసింది. ఫైనల్ మ్యాచ్ అంటేనే ప్రెజర్ మామూలుగా ఉండదు. అందుకే గుజరాత్ బ్యాటర్లను దెబ్బకొట్టేందుకు బెంగళూరు ఒక పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగింది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టాలనేది ఆర్సీబీ స్కెచ్. జేకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఆఖరి బంతికి సరిగ్గా ఇదే జరిగింది. డఫీ వేసిన ఫాస్ట్ షార్ట్ పిచ్ బాల్‌ను గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాలని ట్రై చేశాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ కాక్స్ గాల్లోకి దూకుతూ ఒక అద్భుతమైన లో-క్యాచ్ అందుకున్నాడు. జోర్డాన్ కాక్స్ క్యాచ్ పట్టగానే ఆర్సీబీ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. వికెట్ పడిపోయిందని సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌కు ఈ క్యాచ్‌పై కాస్త డౌట్ వచ్చింది. దాంతో ఆయన వాషింగ్టన్ సుందర్‌ను గ్రౌండ్ వీడకుండా అక్కడే వెయిట్ చేయమని చెప్పి, డెసిషన్‌ను థర్డ్ అంపైర్ జయరామన్ మదనగోపాల్‌కు రిఫర్ చేశారు. బిగ్ స్క్రీన్‌పై రీప్లేలను రకరకాల యాంగిల్స్ నుండి చూసినప్పుడు అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రీప్లేలో కాక్స్ చేతుల్లో బంతి ఉన్నట్లు కనిపించినా.. అతను నేలపైకి డైవ్ చేసినప్పుడు బంతి గడ్డిని తాకుతున్నట్లు క్లియర్ గా అనిపించింది. క్రికెట్ రూల్స్ ప్రకారం.. ఫీల్డర్ బంతిపై,

Asianet News Telugu01 Jun, 10:45 am
అంటే ఏంటి? ఈ కొత్త ఫ్యూయల్ తో లాభాలు, నష్టాలు ఇవే

భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రతి నెల లక్షలాది కొత్త వాహనాలు వీటికి తోడవుతున్నాయి. దీనివల్ల దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పెరిగిపోతున్న కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ రంగాలు ఇప్పుడు సరికొత్త ఇంధన సాంకేతికతను రంగంలోకి దించుతున్నాయి. అదే 'ఫ్లెక్స్ ఫ్యూయల్' (Flex Fuel). ఈ కొత్త ఇంధనం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? దీనివల్ల ఏవైనా నష్టాలు ఉన్నాయా? అనే పూర్తి వివరాలు గమనిస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే మరేదో కాదు, దీనిని ‘ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్’ అని పిలుస్తారు. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమంతో తయారవుతుంది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలలో ప్రత్యేకమైన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లు ఉంటాయి. ఇవి ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలతో నడవడానికి సపోర్ట్ చేస్తాయి. సాధారణంగా ఇందులో 85% ఇథనాల్, 15% పెట్రోల్ (E85) లేదా ఇతర నిష్పత్తుల మిశ్రమాన్ని వాడుతుంటారు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో అధునాతన సెన్సార్లు, ఇంజన్ కంట్రోల్ మోడ్యూల్ ఉంటాయి. ట్యాంకులో ఇంధనం ఏ నిష్పత్తిలో ఉందో ఈ సెన్సార్లు గుర్తించి, దానికి తగ్గట్టుగా ఇంజన్ పనితీరును, ఎయిర్-ఫ్యూయల్ మిశ్రమాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. బై-ఫ్యూయల్ వాహనాల్లా వీటికి వేర్వేరు ట్యాంకులు ఉండవు. ఒకే ట్యాంకులో ఏ మిశ్రమాన్నైనా పోసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) లభిస్తోంది. దీనిని భవిష్యత్తులో 85 నుంచి 100 శాతానికి (E100) పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే వాహన తయారీ సంస్థలను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయాలని కోరారు. దీనికి అనుగుణంగానే ప్రముఖ

Asianet News Telugu01 Jun, 09:32 am
ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్

Coal India Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే ఈ ఏడాది నుంచి గేట్ (GATE) స్కోర్‌కు బదులుగా, సంస్థ సొంతంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నియామకాలు జరగనున్నాయి. అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు జూన్ 11, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. • ఉద్యోగ గ్రేడ్ : E-1 గ్రేడ్ (ఎగ్జిక్యూటివ్ లెవెల్) • మొత్తం ఖాళీలు: 660 (CBT విధానంలో ఎంపిక) (ఇవి కాకుండా మైనింగ్ విభాగంలో 276 పోస్టులను GATE ద్వారా భర్తీ చేస్తారు) • దరఖాస్తు విధానం : కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే • జీతం వివరాలు : నెలకు రూ.60,000/- నుంచి రూ.1,80,000/- వరకు • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం : 12 మే 2026 (ఉదయం 10:00 గంటల నుంచి) • ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ : 11 జూన్ 2026 (సాయంత్రం 06:00 గంటల వరకు) • వయోపరిమితిని లెక్కించే తేదీ : 30 ఏప్రిల్ 2026 వరకు • రాత పరీక్ష (CBT) జరిగే అవకాశం : జూలై 2026 (అంచనా మాత్రమే. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు.) వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical) - పోస్ట్ కోడ్: 12 (మొత్తం: 221) • సివిల్ ఇంజనీరింగ్ (Civil) - పోస్ట్ కోడ్: 11 (మొత్తం: 178) • మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical) -

Asianet News Telugu31 May, 02:25 pm
మ హిళ ల కు అల ర్ట్ .. జూన్ 2 త ర్వాత ఉచిత బ స్సులో

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇప్పటి వరకు మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నారు. అయితే ఈ విధానానికి బదులుగా త్వరలో ప్రత్యేక మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణ ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా మార్చడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ కొత్త విధానాన్ని దశలవారీగా అమలు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కాకుండా ముందుగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. అయితే మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్మార్ట్ కార్డులు అందరికీ చేరే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆధార్ ఆధారిత ఉచిత ప్రయాణ విధానం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డులు ఆధునిక చిప్ ఆధారిత సాంకేతికతతో రూపొందిస్తున్నారు. కార్డులో లబ్ధిదారురాలి పేరు, ఫోటో, చిరునామా, ప్రత్యేక గుర్తింపు సంఖ్య, క్యూఆర్ కోడ్ వంటి వివరాలు నమోదు చేస్తారు. బస్సు ఎక్కిన తర్వాత మహిళలు తమ స్మార్ట్ కార్డును కండక్టర్ వద్ద ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (TIM)కు చూపిస్తే లేదా స్కాన్ చేస్తే వెంటనే జీరో టికెట్ జారీ అవుతుంది. దీంతో ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే కండక్టర్లు కూడా వివరాలను మాన్యువల్‌గా తనిఖీ చేయాల్సిన పని తగ్గుతుంది. ప్రస్తుతం ప్రతి ప్రయాణికురాలి ఆధార్ వివరాలను పరిశీలించి టికెట్ జారీ చేయాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో ఇది

Asianet News Telugu01 Jun, 05:05 am
పూల డిజైన్ పట్టీలతో పాదాలకే అందం

సింపుల్ వెండీ పట్టీలకు బదులుగా ఇలాంటి పర్పుల్ స్టోన్ కట్ వర్క్ పట్టీలు ట్రై చేయాలి. ఇవి రకరకాల రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. పాదాలకు చాలా అందంగా ఉంటాయి. Gold Rings: 1 గ్రాము బంగారంలో ఉంగరాలు.. అదిరిపోయే డిజైన్లు Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్ Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో

Asianet News Telugu01 Jun, 05:05 am
ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు

మండే ఎండల్లో ఏసీ లేకుండా ఉండలేము. ఏసీలను అధికంగా వాడితే కరెంట్ బిల్లు అధికంగా వస్తాయి. దీనికి మంచి చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. కొత్తగా కూలింగ్ పెయింట్ ను సృష్టించారు. ఈ స్మార్ట్ పెయింట్ ఇంటి పైన, ఇంటి గోడలకు వేసుకుంటే చాలు ఇల్లు చల్లగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక పెయింట్ 97 శాతం వరకు సూర్య కిరణాలను తిరిగి పరావర్తనం చెందేలా చేస్తుంది. అంటే ఇంటి గోడలు, పైకప్పు ఆ వేడిని గ్రహించలేవు. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గే ఉంటుంది. అంటే ఏసీల అవసరం తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కూలింగ్ పెయింట్ చాలా ప్రత్యేకమైనది. ఈ కూలింగ్ పెయింట్ లో సూక్ష్మరంధ్రాలు కలిగిన ప్రత్యేక పాలిమర్ నిర్మాణాలను ఉపయోగించారు. ఇది సూర్య రశ్మిని గ్రహించకుండా తిరిగి పరావర్తనం చెంది ఆకాశంలోకి వెళ్లేలా చేస్తుంది. ఇంటిపై ఉన్న వేడిని కూడా బయటకు పోయేలా చేస్తుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ పెయింట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం ట్రయల్స్ చేశారు. ఆ ట్రయల్స్ లో ఈ పెయింట్ పూసిన ఇంటి పైకప్పులు సాధారణ పైకప్పులతో పోలిస్తే 25 డిగ్రీల సెల్సియల్స్ వరకు చల్లగా ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ కూలింగ్ పెయింట్ గాలిలోని తేమను కూడా నీటి బిందువులుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విద్యుత్ అవసరం లేకుండానే గాలి నుంచి నీరు తయారుచేసే ప్రక్రియ చేసేస్తుంది. దీని వల్ల కూడా ఇల్లు చల్లగా మారుతుంది. ఆస్ట్రేలియాలోని సిడ్ని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అక్కడ జరిగిన ప్రయోగాల్లో చదరపు మీటరుకు... రోజుకు 390 మిల్లీలీటర్ల వరకు నీటిని సేకరించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంటే గాలిలోని తేమను నీటి బిందువులుగా

Asianet News Telugu31 May, 12:53 am
ఫైమాతో లవ్ బ్రేకప్ పై ఓపెన్ అయిన పటాస్ ప్రవీణ్ .. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కమెడియన్లు పటాస్‌ ప్రవీణ్‌, ఫైమా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. `పటాస్‌` ప్రోగ్రామ్‌ నుంచి వీరిద్దరు కలిసి జర్నీ చేశారు. జబర్దస్త్ లోకి వచ్చాక తమ మధ్య బాండింగ్‌ బాగా పెరిగింది. ప్రేమలో పడ్డారు. ఫైమా.. బిగ్‌ బాస్‌ షోలోకి వచ్చినప్పుడు కూడా ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. ఆయనతో పలు తీపిగుర్తులను గుర్తు చేసుకుంది. బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు వెళ్లాక వీరిద్దరి మధ్య ఆ బాండింగ్‌ సరిగా లేదని తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. బ్రేకప్‌ కారణాలు తెలియకపోయినా, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌ సమస్య ఉన్నట్టు తెలిసింది. ప్రవీణ్‌కి, తనకు వ్యక్తిగత సమస్యలున్నాయని, అవి బయటకు చెప్పుకోలేం అని, అందుకే దూరం కావాల్సి వచ్చిందని ఫైమా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన వద్దకు వచ్చి పర్సనల్‌గా మాట్లాడితే బాగుండేదని ఫైమా చెప్పింది. దీనిపై తాజాగా పటాస్‌ ప్రవీణ్‌ రియాక్ట్ అయ్యాడు. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్‌ టాక్‌ షోలో పాల్గొన్న ప్రవీణ్‌.. తన బ్రేకప్‌ గురించి నీకు కూడా తెలుసు అని చెప్పాడు. `నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, నువ్వు ఒక క్లారిటీతో ఉన్నావు, నేను కూడా ఒక క్లారిటీతో ఉంటే అయిపోతుంది కదా. బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండొచ్చు. మంచి సపోర్ట్ దొరుకుతుంది. నేను దానిమీదనే ఉన్నాను, ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం` అని తెలిపారు పటాస్‌ ప్రవీణ్‌. ఫైమాతో తాను బాగానే ఉన్నానని, కానీ తమ మధ్య ప్రేమ లేదని ఆయన చెప్పకనే చెప్పాడు. ప్రేమ స్నేహం నుంచే స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్‌ లవర్‌ అయినప్పుడు లవర్‌ ఫ్రెండ్‌ ఎందుకు కాకూడదు అని తెలిపారు ప్రవీణ్‌. అమ్మాయితో

Asianet News Telugu30 May, 05:05 am
ఈ పూసల పట్టీలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే

మీకు హెవీగా, మువ్వల సప్పుడు చేసే పట్టీలు కావాలంటే, ఇలాంటి లేయర్డ్ పట్టీలు ఎంచుకోవచ్చు. ఏడు వరుసలున్న ఈ పట్టీ డిజైన్‌లో కుందన్, ముత్యాల వర్క్ అదనపు అందాన్ని ఇస్తుంది. రాజ్వాడీ స్టైల్‌లో ఇది చాలా అందమైన పట్టీ డిజైన్. ఇందులో ముత్యాలతో వరుసతో పాటు కుందన్, చిన్న చిన్న ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇవి మీ పాదాలకు అదిరిపోయే లుక్ ఇస్తాయి. ముత్యాలు, కుందన్, పూసల వర్క్‌తో వచ్చిన ఈ ఝుమ్మర్ పట్టీలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. రెట్టింపు అందాన్నిస్తాయి. ముత్యాలతో చేసిన ఈ లేయర్డ్ స్టైల్ పట్టీలను మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా ఇవి ఈజీగా దొరుకుతాయి. చీరలు, సూట్స్‌పైకి అద్భుతంగా ఉంటాయి. పింక్, మింట్ గ్రీన్ కలర్ పూసలతో చేసిన ఈ పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సింగిల్ లేయర్‌లో మినిమల్ స్టైల్‌తో ఉండే ఈ పట్టీలు మీ పాదాలకు సింపుల్, ట్రెడిషనలు లుక్ ఇస్తాయి. Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి Silver Earrings: క్యూట్ డిజైన్ లో వెండి చెవిపోగులు.. ధర కూడా తక్కువే! Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ Maangtika Designs: 1 గ్రాము బంగారంలో పాపిటబిళ్లలు..నుదిటికే అందం