translateexpand_more

Peddi Movie Release Date News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 01:39 pm
ఏపీలో పెద్ది’ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ .. టికెట్ ధర ఇలా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పాన్‌ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే కీలక నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు విడుదల ముందు రోజు కాదు కదా కొన్ని గంటల ముందు వరకూ బుకింగ్స్‌ ఓపెన్‌ కాక, అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇందుకు అనేక అంశాలు కారణమైనా, అంతిమంగా టికెట్లు బుక్‌ కావడమే ప్రేక్షకుడు చూస్తాడు. ఈ విషయంలో ‘పెద్ది’ మూడు అడుగులు ముందే ఉంది. జూన్‌ 4న మూవీ విడుదల కానుండగా, జూన్‌ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్‌ వేసేందుకు సిద్ధమైంది. ప్రీమియర్‌ టికెట్‌ ధరల పెంపు, స్పెషల్‌ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అంతేకాదు, జూన్‌ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్‌ అందుబాటులోకి తెచ్చాయి. జూన్‌ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్‌ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి), అలాగే జూన్‌ 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌

Eenadu01 Jun, 09:58 am
థియేటర్ లో ఒకే ఒక్కడు.. ఓటీటీలో యాక్షన్ హంగామా మిస్సవ్వొద్దు

సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్‌ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ఇది. జాన్వీకపూర్‌ కథానాయిక. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం (peddi songs) అందించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ఈ మూవీ జూన్‌ 4న (Peddi release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగానే జూన్‌ 3న (peddi premiere show) రాత్రి 8గంటలకు ప్రీమియర్‌ షోలతోనూ సందడి చేయనుంది. ఏపీలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతులు రాగా, తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలి. పెద్ది రన్‌ టైమ్‌ (Peddi run time) సుమారు మూడు గంటలపైనే ఉంటుందని టాక్‌. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ (Dhurandhar: The Revenge) భారత్‌లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘జియో హాట్‌స్టార్‌’ వేదికగా జూన్‌ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్‌ ప్రీమియర్‌ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిగిలిన దేశాల్లో సినీ అభిమానులు ఈ మూవీని ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Dhurandhar 2 OTT) వేదికగా చూడొచ్చు. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్‌ (Mohanlal) కలిసి నటించిన సినిమా ‘పేట్రియాట్‌’ (Patriot Movie). ఈ మూవీ ‘జీ 5’ (Zee 5) వేదికగా జూన్‌ 5 (Patriot Movie Streaming date) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది. దేశభక్తితో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నయనతార,

Eenadu01 Jun, 04:30 pm
తెలుగులో మాట్లాడిన జాన్వీ.. జగదేక వీరుడు..’ డైలాగ్ తో నవ్వులు పంచిన బ్యూటీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏంటనేది కనుక్కోవడమే ‘పెద్ది’ మూవీ ఇచ్చే సందేశమని కథానాయిక జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) అన్నారు. రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకలో జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించారు. ‘‘మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’పైనా ఇలాంటి ప్రేమే చూపిస్తారని ఆశిస్తున్నా. అదే మాకు రోజూ కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికే. నా జీవితానికి అర్థం అంటే.. మిమ్మల్ని (ప్రేక్షకులు) అలరించడమే. మేము చేసిన ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని జాన్వీ అన్నారు. ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోక సుందరిలోని శ్రీదేవి చెప్పిన ‘మానవ.. ఒక్కసారి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా’ అన్న డైలాగ్‌లోను వేదికపై చెప్పి నవ్వులు పూయించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్‌ కథానాయిక. జూన్‌ 4న పాన్‌ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్‌ కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్‌ కథానాయిక.

NTV Telugu01 Jun, 05:17 pm
నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా .. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సమర్పణలో రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా "పెద్ది". జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను విజయవాడలో కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడిన మాటలు, సినిమాపై ఆయన నమ్మకం మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ.. విజయవాడతో తనకున్న సెంటిమెంట్ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. "ఉప్పెన సినిమా టైంలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుకుంటూ ఈ ‘పెద్ది’ కథ రాసుకున్నాను. నేను తండ్రిని కాబోతున్నానని డాక్టర్ నాకు చెప్పింది కూడా ఈ విజయవాడలోనే! ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయి. ‘ఉప్పెన’కు నేషనల్ అవార్డు వచ్చింది, ప్రొడ్యూసర్లకు, నాకు చాలా డబ్బులు వచ్చాయి. ఐదేళ్లు ఎందుకు గ్యాప్ తీసుకున్నావంటే.. అది కేవలం ఈ ‘పెద్ది’ సినిమా కోసమే" అని స్పష్టం చేశారు. మెగాస్టార్ ఉప్పెన ఇస్తే.. చరణ్ సార్ ‘పెద్ది’ ఇచ్చారు! తన గురువు సుకుమార్‌ను గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు బుచ్చిబాబు. "ఉప్పెన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్‌లో ఉంటే, మా గురువుగారు సుకుమార్ సార్ నన్ను చరణ్ సార్ దగ్గరకు తీసుకెళ్లారు. నాకు ‘ఉప్పెన’ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే.. ఈ ‘పెద్ది’ని రామ్ చరణ్ గారు ఇచ్చారు. దేవుడికి మొక్కుకుని వెళ్లి చరణ్ సార్‌కి కథ చెప్తే.. ఆయన ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేశారు. రెండో సినిమా డైరెక్టర్‌ను నమ్మి ఇంత పెద్ద స్టార్ హీరో 350 కోట్ల బడ్జెట్ సినిమా ఇవ్వడం మామూలు విషయం కాదు సార్. నన్ను, నా కథలోని నిజాయితీని నమ్మిన చరణ్ సార్‌కి జీవితాంతం రుణపడి ఉంటా" అని ఎమోషనల్ అయ్యారు. ఆట అంటే ఆకతాయితనం కాదు.. ‘పెద్ది’ పడి లేచిన మనిషి కథ.. సినిమా లైన్ గురించి లీక్ ఇస్తూ.. "పెద్ది అంటే కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదు.. కమర్షియాలిటీతో కూడిన ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా. విజయనగరం నేపథ్యంలో సాగే ఒక కుర్రోడి రూటెడ్ కథ ఇది. ఆట అంటే ఇప్పటివరకు చాలామంది ఆకతాయితనం అనుకున్నారు. కానీ ఆ ఆట ఒక మనిషికి ఎలాంటి గుర్తింపు, గౌరవం తెస్తుంది.. తన చుట్టూ ఉన్న మనుషుల్ని ఎలా మారుస్తుంది అని చెప్పే కథే పెద్ది. ఇది అలలా ఎగసిపడిన మనిషి కథ కాదు.. పడినా కూడా సింహంలా లేచిన మనిషి కథ. పెద్దిగాడికి విజయం అంత ఈజీగా దక్కలేదు, ఎన్నో ఆటంకాలను దాటుకుని సాధించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని ఈ సినిమా నిరూపిస్తుంది" అని బుచ్చిబాబు పేర్కొన్నారు. లాస్ట్ 50 నిమిషాలు కళ్లు చెమర్చాల్సిందే.. సినిమా అవుట్‌పుట్‌పై బుచ్చిబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. "ఈ సినిమాను నేను ఇప్పటివరకు 50 నుంచి 100 సార్లు చూశాను. సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 40 నుంచి 50 నిమిషాలు నేను ప్రతిసారి ఎమోషనల్ అయిపోతాను, నా కళ్ల వెంట నీళ్లు వస్తాయి. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. థియేటర్లో మీకూ కన్నీళ్లు రాకుండా ఉండవు. అలాగే ఇందులో జగపతి బాబు గారు ‘అప్పలసూరి’ అనే మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ చేశారు. అప్పలసూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్లల్లో నీళ్లు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయే కాదు" అని సవాల్ విసిరారు. చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ.. "హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ రస్టిక్ మట్టి కథలోకి వచ్చి కలర్ యాడ్ చేశారు. ఈ సినిమాలో ఆమె హెచ్‌సీఎం క్యారెక్టర్ చేశారు. కొన్ని సీన్స్‌లో ఆమె పర్ఫార్మెన్స్ ఒక మగరాయిలా, ఫుల్ హీరోయిజంతో ఉంటుంది. క్లైమాక్స్‌లో ఆమె యాక్టింగ్ ఎవరూ మర్చిపోలేరు. ఇక లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్‌గా, ఊరమాస్‌గా వచ్చింది. ఆయనతో వర్క్ చేయడం నా చిరకాల కోరిక. డీఓపీ రాండీ గారు నా అక్షరానికి ప్రాణం పోశారు, అవినాష్ కోలా 20 అద్భుతమైన నాచురల్ సెట్స్ వేశారు" అని టీమ్ అందరికీ థాంక్స్ చెప్పారు. చివరగా యాంకర్ సుమా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అది కేవలం రామ్ చరణ్ సార్ వల్లే సాధ్యం. ఒక స్టార్ హీరో ఇలాంటి రూటెడ్ కథను నమ్మి చేయడం టాలీవుడ్‌లో ఒక హిస్టరీ" అని చెప్తూ జూన్ 4న ఫ్యామిలీస్, కిడ్స్‌తో కలిసి థియేటర్లలో ‘పెద్ది’ ఎమోషన్‌ను విట్నెస్ చేయాలని బుచ్చిబాబు పిలుపునిచ్చారు.

Eenadu01 Jun, 04:09 pm
మైండ్ బ్లోయింగ్ .. చరణ్ ఇంత కష్టపడ్డారా? మస్స మస్స’ ఫుల్ సాంగ్

విజయవాడ: రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’ (Peddi). జాన్వీకపూర్‌ కథానాయిక. జూన్‌ 4న పాన్‌ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం చిత్ర బృందం విజయవాడలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఇందులో క్రేజీ పాట ‘మస్స మస్స’ పాటను విడుదల చేశారు. ఇందులో మూవీ మేకింగ్‌ విజువల్స్‌, రామ్‌చరణ్‌ పడిన కష్టం చూస్తుంటే మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది.

NTV Telugu01 Jun, 11:43 am
అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా కనిపిస్తున్న ఒక భారీ కటౌట్ గురించి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆయనెవరో కాదు.. చరణ్ కొత్త పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట. నల్లటి సూట్ ధరించి, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో రామ్ చరణ్ ఎంబీపీ, భోపాల్, బెంగళూరు ప్రమోషన్స్ ఈవెంట్లలో కనిపించిన ఈ 27 ఏళ్ల బాడీగార్డ్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో కెవిన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి వెతికిన నెటిజన్లకు కొన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలిశాయి. కెవిన్ కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. 2021లో ఇటలీ జాతీయ MMA టీమ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించారు. కెవిన్ అసలు పేరు ‘అబ్దూ కదిర్ సోవ్’. 1998లో జన్మించిన ఈయన్ను గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ వారు ‘మామా లామిన్ ఆఫ్ బర్రా’ అని పిలుస్తారు. యూరప్ మిడిల్‌వెయిట్ డివిజన్‌లో ఫైట్ చేసే కెవిన్ ఖాతాలో 4 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి (ఆయన చివరి ఫైట్ నవంబర్ 2025లో జరిగింది). తాజాగా జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హోస్ట్ అమిత్ భాటియా.. కెవిన్‌కు వస్తున్న విపరీతమైన పాపులారిటీ గురించి రామ్ చరణ్‌ను అడగ్గా, చరణ్ తనదైన శైలిలో నవ్వుతూ చాలా ఫన్నీగా స్పందించారు. "మీరందరూ అతన్ని ఇంత ఫేమస్ చేసేశారు.. అందుకే ఇప్పుడు నేను అతన్ని అస్సలు బయట తిరగనివ్వట్లేదు. ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ ఇచ్చి నా పర్సనల్ విషయాలు

Eenadu30 May, 02:00 pm
స్టార్ డమ్ ను వదిలి విజయ్ రాజకీయాల్లో రావడం హర్షణీయం

చెన్నై: సినీ కెరీర్‌ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, ఆ స్టార్‌డమ్‌ను వదిలి ప్రజాసేవ కోసం నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని కథానాయకుడు రామ్‌చరణ్‌ (Ram Charan) అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. జూన్‌ 4న (peddi movie release date) పాన్‌ ఇండియా మూవీగా విడుదల కానుంది. జాన్వీకపూర్‌ కథానాయిక. చిత్ర ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు, నటుడు శివరాజ్‌కుమార్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడారు. ‘‘సీఎం జోసెఫ్‌ విజయ్‌ను చూసి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నా. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు. చెన్నై వచ్చినప్పుడల్లా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మా కుటుంబానికి ఈ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. మా దర్శకుడు బుచ్చిబాబు (peddi movie director) అయితే.. ఐదారేళ్లు కష్టపడ్డాడు. ఏఆర్‌ రెహమాన్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు. గత పది, పదిహేను రోజులుగా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. శివన్న తెరపై కనిపిస్తే ఒక ఫైర్‌ వచ్చినట్లు అనిపిస్తుంది. ‘జైలర్‌’లో ఆయన ప్రజెన్స్‌ గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉంటుంది. కళ్లతోనే హావభావాలు, నటన పలికిస్తారు’’ ‘‘రోబో’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలకు రత్నవేలు పనిచేశారు. ఆయన ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన అనుభవం ఎంతో పనికొచ్చింది. దివ్యేందు (divyenndu in peddi), నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా యాటిట్యూడ్‌ ఆరున్నర అడుగుల పైనే ఉంటుంది. ఈ సినిమాను కష్టంతో కాదు, ఇష్టంతో చేశాం.

Eenadu29 May, 05:06 am
ఆ రెండేళ్ల కష్టాలకు.. ప్రతిఫలం దక్కింది

ఇంటర్నెట్‌ డెస్క్: అప్పలసూరిగా ‘పెద్ది’లో తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు నటుడు జగపతి బాబు (Jagapathi Babu). రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా (Peddi) జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన కెరీర్‌ గురించి మాట్లాడారు. మన కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుందన్నారు. ‘‘సినిమా రంగంలో ఉన్నంత ఆనందం నాకు ఇంక ఎందులోనూ కనిపించదు. ఇందులో ఏదైనా సాధ్యమవుతుంది. సహజంగా నా జీవితంలో ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది. కెరీర్‌లో కూడా మొదట ఫ్లాప్‌ల నుంచి హిట్‌లకు వచ్చాను. అందుకే పరాజయాలను పెద్దగా పట్టించుకోను. ఏదో ఒకరోజు విజయం తప్పక వస్తుంది నమ్ముతా. జీవితం మన అంచనాలకు అందదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ, ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి. నేనూ ఎన్నో కష్టాలు పడ్డాను. ఇలా జరిగిందేంటని ఎప్పుడూ బాధపడలేదు. వాటి నుంచి ఏదో కొత్త పాఠం నేర్చుకున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఎప్పుడూ నమ్ముతాను. బాధ వెనక సంతోషం కచ్చితంగా ఉంటుంది. నేను 2011 నుంచి 2013 వరకు ఎంతో బాధ అనుభవించా. దానికి తగిన సంతోషం ఇప్పుడు వచ్చింది. నా టైమ్‌ ఇప్పుడు స్టార్ట్‌ అయింది అనుకుంటున్నా’’ అని జగపతి బాబు అన్నారు. సినిమాల విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని జగపతి బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఫ్యామిలీ ఇష్యూ కాకుండా ఇంకా దేనిని పెద్ద సమస్యగా తీసుకోనని అన్నారు. ‘పెద్ది’లో తనకు, రామ్ చరణ్‌కు (Ram Charan) మధ్య ఉండే బంధం అందరికీ నచ్చుతుందన్నారు. చరణ్ అన్ని సినిమాలకు కష్టపడతారని.. ఈ చిత్రంలో శరీరాకృతిని మార్చుకోవడం కోసం

Eenadu28 May, 11:22 am
పెద్ది’ గురించి అడిగి.. మోదీ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ ‘పెద్ది’ జూన్‌ 4న (Peddi Release Date) పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే భోపాల్‌, బెంగళూరులో ప్రమోషన్స్‌ చేసిన చిత్ర బృందం.. గురువారం దిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్‌చరణ్‌ (Ram Charan), జాన్వీకపూర్‌ (Janhvi Kapoor), దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ‘‘దిల్లీలో ప్రధాని మోదీని ఇంతకుముందు కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా దేని గురించి అని అడిగారు. ఓ విధంగా వికసిత్‌ భారత్‌ గురించి చెప్పే కథ అని వివరించా. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే స్టోరీని పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మహ్మద్‌ అనే ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ఉండేవాడు. కొన్నేళ్ల క్రితమే భారత్‌ తరఫున ఆడాడు. తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్‌ ఉన్నారు’ అని చెప్పారు. ఒక వ్యక్తి ఎంతో మార్పు తీసుకురాగలడు అన్న దానికి ఇదొక నిదర్శనం. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’’ అని చరణ్‌ వివరించారు. సినిమాలో ఇంత బాగా డ్యాన్స్‌ ఎలా చేశారు? అని అడగ్గా.. నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారంటూ చరణ్‌ నవ్వులు పూయించారు. జాన్వీ మాట్లాడుతూ.. ‘‘తెరపై కనిపించే రామ్‌చరణ్‌కు, తెరవెనుక చరణ్‌కు అస్సలు పోలిక ఉండదు. బయట చాలా కూల్‌గా ఉంటారు. బొమన్‌ ఇరానీతో కలిసి నటించాలన్న డ్రీమ్‌ ఈ సినిమాతో నెరవేరింది. నా పాత్ర విషయంలో దర్శకుడు బుచ్చిబాబు చెప్పిందే నేను ఫాలో అయ్యా. మేమంతా ఆయన ఫ్యాన్స్‌’’ అని పేర్కొన్నారు. ‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ మాత్రమే

Eenadu28 May, 09:09 am
పెద్ది’ పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాకు యాంటీ-పైరసీ ఇంజంక్షన్‌ జారీ చేసింది. సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాను (Peddi) ఇంటర్నెట్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్‌లో లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘యాంటీ పైరసీ ఇంజంక్షన్‌’ (Anti-Piracy Injunction) అనేది కాపీరైట్ హక్కుదారులు తమ కంటెంట్ (సినిమాలు, వెబ్‌సిరీస్‌లు) అక్రమంగా కాపీ కాకుండా, పైరసీ వెబ్‌సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఒక న్యాయపరమైన రక్షణ ఉత్తర్వు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే, కొత్త యూఆర్‌ఎల్‌తో అదే కంటెంట్‌ రాకుండా కొత్త సైట్‌లను కూడా ఆటోమెటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ ‘డైనమిక్ ఇంజంక్షన్’ (Dynamic Injunction) ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి. గతకొంత కాలంగా ఇండస్ట్రీని పైరసీ బూతం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా విజయ్‌ ‘జననాయగన్‌’ విడుదలకు ముందే నెట్టింట ప్రత్యక్షమైంది. ఇలాంటివి జరగకుండా ‘పెద్ది’ టీమ్‌ ముందడుగు వేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు దీనిపై అంచనాలు పెంచేశాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన

Eenadu26 May, 05:12 am
Divyenndu: ఆయన కోసమైనా ‘పెద్ది’లో నటించాలని అనుకున్నా: దివ్యేందు శర్మ

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’ డైరెక్టర్‌ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ. ఆయన కోసమైనా ‘పెద్ది’ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. ఇందులో దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటించారు. జూన్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా దివ్యేందు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సినిమా అంగీకరించడానికి కారణం వెల్లడించారు. ‘‘నేను ఉత్తరాఖండ్‌లో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ చిత్ర బృందం నుంచి ఫోన్‌ వచ్చింది. వీలున్నప్పుడు వస్తాను అని చెప్పా. తర్వాత ‘మిమ్మల్ని కలవాలి’ అని బుచ్చిబాబు (Buchi Babu) చాలా మెసేజ్‌లు పెట్టారు. దీంతో నేను ఆ షూట్‌ మధ్యలోనే ఆపేసి ఎంతోసేపు ప్రయాణించి చాలా కష్టపడి అక్కడినుంచి ఇక్కడికి వచ్చాను. బుచ్చిబాబును చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో ప్రేమతో వ్యవహరించారు. కళకు ఎంత గౌరవం ఇస్తారో చూశాను. నా పాత్రను వివరించేటప్పుడే నిర్ణయించుకున్నా. ఈ సినిమా (Peddi) ఎలా ఉన్నా బుచ్చిబాబు కోసం చేయాలి అని. వెంటనే ఓకే చేశా. ఆయన నన్ను అంత ప్రభావితం చేశారు’’ అని దివ్యేందు (Divyenndu) తెలిపారు. ఇక పెద్ది కథ గురించి మాట్లాడుతూ..‘‘స్టోరీ చూసి షాక్‌ అయ్యాను. ఎంత గొప్పగా రాశారో అనుకున్నా. ఎన్నో ట్విస్ట్‌లు, గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. గుర్తింపు కోసం ఎంత యుద్ధమైనా చేయొచ్చని ఈ సినిమా చూశాక అర్థం అవుతుంది. ‘పెద్ది’ తన గుర్తింపు కోసం ఎంతో పోరాడతాడు. ఆ అంశం నాకు చాలా నచ్చింది’’ అని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ

Eenadu29 May, 01:22 am
పెద్ది’ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600

ఈనాడు, అమరావతి: రాంచరణ్‌ నటించిన పెద్ది సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు, జూన్‌ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్‌ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి), అలాగే సినిమా విడుదలయ్యే 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌విశ్వజిత్‌ ఉత్తర్వులిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Samayam Telugu28 May, 11:56 am
పెద్ది’ని లీక్ చేస్తే ఊరుకునేది లేదు.. యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసిన మద్రాస్ హైకోర్ట్

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్‌టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Eenadu25 May, 12:15 pm
ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పెద్ది’లో (Peddi Movie) రామ్‌చరణ్‌ (Ram Charan) నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ఆయనకు జాతీయ అవార్డు రావడం ఖాయమని కన్నడ స్టార్‌...

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పెద్ది’లో (Peddi Movie) రామ్‌చరణ్‌ (Ram Charan) నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ఆయనకు జాతీయ అవార్డు రావడం ఖాయమని కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) అన్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడి...

Eenadu25 May, 12:14 pm
ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులో ‘పెద్ది’ టీమ్‌ సందడి చేసింది. జూన్‌ 4న (Peddi Release Date) సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన...

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులో ‘పెద్ది’ టీమ్‌ సందడి చేసింది. జూన్‌ 4న (Peddi Release Date) సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్‌చరణ్‌ (Ram Charan), జాన్వీకపూర్‌ (Janhvi Kapoor), శివ రాజ...

Eenadu29 May, 08:13 am
పెద్ది’పై అసత్య ప్రచారం.. ఇద్దరిపై కేసు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’పై అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా దీనిపై ఆన్‌లైన్ వేదికగా అసత్య ప్రచారం చేస్తోన్న ఇద్దరి వ్యక్తులను గుర్తించి వారిపై ఫిర్యాదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘పెద్ది’పై (Peddi) ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో నెగెటివిటీ క్రియేట్‌ చేస్తున్నట్లు టీమ్‌ దృష్టికి వచ్చింది. దీంతో ఆధారాలను సేకరించిన చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన మద్రాసు హైకోర్టు వెకేషన్ బెంచ్‌ తాజాగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు (Peddi) ఇంటర్నెట్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్‌లు కాకుండా చర్యలు చేపట్టినట్లు అయింది. ఇప్పుడు ఇలా సోషల్‌ మీడియాలోనూ చిత్రబృందం యాక్టివ్‌గా ఉంటూ నిశితంగా పరిశీలించి నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది (Peddi Release date). గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు

Eenadu29 May, 02:36 pm
పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ .. వేడుక ఎక్కడంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) అభిమానులకు ‘పెద్ది’ టీమ్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. జూన్‌ 1న సాయంత్రం (Peddi Pre Release Event Date) ముందస్తు విడుదల వేడుక నిర్వహించనున్నట్టు తెలిపింది. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం ఈ ఈవెంట్‌కు వేదిక కానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Samayam Telugu31 May, 04:24 pm
పిచ్చి కుక్కలు ఏదోకటి వాగుతుంటాయి.. మొరుగుతూ ఉంటాయి’.. జగపతిబాబు ఘాటు వ్యాఖ్యలు

రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. స్టార్ కాస్టింగ్ తో, టాప్ టెక్నిషియన్స్ తో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ఓ రూమర్ పై జగపతిబాబు ఘాటుగా స్పందించారు.పెద్ది సినిమాలో ఒక్క డైలాగ్ చెప్పడానికి 78 టేక్స్ తీసుకున్నట్లు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే జగపతిబాబు కూడా ఓ సీన్ చేయడానికి ఏకంగా 72 టేక్స్ తీసుకున్నారని ఓ పుకారు వైరల్ అయింది. దీనిపై జగపతిబాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. నాన్ సెన్స్ అని కొట్టిపారేశాడు. సినిమా కోసం కష్టపడిన మాట వాస్తవమే కానీ, ఒక షాట్ కోసం అన్ని టేకులు తీసుకున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను రెండు మూడు టేకుల కంటే ఎక్కువ తీసుకోనని, క్లైమాక్స్ లో నాలుగు నిమిషాల సన్నివేశం సింగిల్ టేక్ లో చేశానని ఆయన తెలిపారు.జగపతిబాబు మాట్లాడుతూ.. “షూటింగ్ లో డైలాగులు చెప్తున్నప్పుడు లిప్ సింక్ కాస్త అటు ఇటు అవుతుంది. జగపతిబాబు ఒక షాట్ కోసం 72 టేకులు తీసుకున్నాడని ఎవడో ప్రచారం చేశాడు. అదంతా నాన్ సెన్స్. పిచ్చి కుక్కలు ఏదోకటి వాగుతుంటాయి.. మొరుగుతూ ఉంటాయి. అవన్నీ నిజాలు ఎలా అవుతాయి. 72 టేక్స్ తీసుకున్నాడని అనడంలో అసలు అర్థం ఉందా!. మ్యాగ్జిమమ్ 3 టేక్స్ తీసుకుంటారు. నా సైడ్ నుంచి 2 టేక్స్ మాత్రమే

Samayam Telugu23 May, 09:13 pm
ప్లీజ్.. ‘పెద్ది’ కోసం పెద్ద మనసు చేసుకోండి.. రాజకీయాలు, విభేదాలు, వివాదాలు పక్కన పెట్టండి: బండ్ల గణేష్ విజ్ఞప్తి

- జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. - ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. - 2025లో సమయంలో చేరిన రాజశేఖర్..

Eenadu01 Jun, 02:22 pm
రామ్ చరణ్ పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్

విజయవాడ: రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్‌ కథానాయిక. జూన్‌ 4న పాన్‌ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయవాడలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Eenadu01 Jun, 01:54 pm
పెద్ది’ చిత్రబృందం విజయవాడ

‘పెద్ది’ చిత్ర బృందం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. కథానాయకుడు రామ్ చరణ్ రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ విజువల్స్‌ ఇవీ... ఈ వార్త చదివారా: థియేటర్స్‌లో ‘పెద్ది’ హవా.. ఓటీటీలో యాక్షన్‌ హంగామా మిస్సవ్వొద్దు

SkyC Media01 Jun, 10:15 am
రామ్ చరణ్ పెద్ది ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులు చాలా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పెద్ది బాక్సాఫీస్ ప్రీరిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 218.50 కోట్ల రూపాయల వరకు జరిగింది. రాజమౌళి సినిమాలు కాకుండా రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ బిజినెస్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్ జోన్‌కు రావాలంటే సినిమాకు ఖచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సి ఉంది. ప్రస్తుత ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా 400 నుండి 425 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాలి. ఒకవేళ ఈ చిత్రం 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధిస్తేనే అది సూపర్ హిట్ వర్డిక్ట్‌ను అందుకుంటుంది. దీనివల్ల కొనుగోలుదారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల కంటే తక్కువ గ్రాస్ సాధిస్తే మాత్రం ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. దీంతో బయ్యర్లు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ వసూళ్లు మరింత దారుణంగా పడిపోయి 250 కోట్ల రూపాయల లోపు మాత్రమే వస్తే సినిమా డిజాస్టర్‌గా మారుతుంది. రామ్ చరణ్ గత చిత్రాల ప్రీరిలీజ్ బిజినెస్‌ను పరిశీలిస్తే గేమ్ చేంజర్ సినిమాకు 221 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఆచార్య చిత్రం 131 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేయగా, రంగస్థలం సినిమాకు 81 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో చరణ్ నటించిన