translateexpand_more

Cricket News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 03:05 am
ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు

పద్దెనిమిదేళ్లు.. ఒకే ఒక్క టైటిల్ కోసం ఆ జట్టు పడ్డ తపన, అభిమానులు ఎదురుచూసిన నిరీక్షణ అంతా ఇంతా కాదు. కానీ, గెలిచిన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి వారికి పట్టిన సమయం మాత్రం కేవలం పన్నెండు నెలలే! అవును, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత లీగ్‌లో తమకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల కేరింతల మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గర్వంగా ముద్దాడింది.ఒత్తిడిలో ‘కింగ్’ కోహ్లీ విశ్వరూపం!గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (1), కెప్టెన్ రజత్ పాటిదార్ (15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) ఉపయోగకరమైన పరుగులు చేసినా.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది మాత్రం రన్ మెషీన్ విరాట్ కోహ్లీనే. ఒత్తిడిని జయించడంలో తనకు సాటిలేరని కోహ్లీ మరోసారి నిరూపించాడు. గుజరాత్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూనే, పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ..

AP7AM01 Jun, 03:03 am
పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే

అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ చారిత్రాత్మకంగా ముగిసింది. మే 31, ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ఈ సీజన్ కేవలం ఆర్సీబీ విజేతగా నిలవడమే కాకుండా, బ్యాటర్ల ఆధిపత్యం, బౌలర్ల నైపుణ్యంతో పాటు ఎన్నో సరికొత్త రికార్డులకు వేదికగా నిలిచింది.రికార్డుల రారాజు వైభ‌వ్‌ఈ సీజన్‌లో యువ సంచలనం వైభవ్ తన అసాధారణ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో 700కు పైగా పరుగులు (776) సాధించిన తొలి టీనేజర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 72 సిక్సర్లు బాది, 2012లో క్రిస్ గేల్ (59) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ప్లేఆఫ్స్‌లో సురేశ్ రైనా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతులు) రికార్డును సమం చేయడమే కాక, ఒక ప్లేఆఫ్ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు బాది శుభ్‌మన్ గిల్ (10) రికార్డును అధిగమించాడు. పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేయడం, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 600 పరుగుల మార్కును దాటడం వంటి అరుదైన ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.బ్యాటర్ల విధ్వంసం.. సరికొత్త రికార్డుల మోత ఇతర బ్యాటింగ్ రికార్డుల విషయానికొస్తే.. ఈ సీజన్‌లో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేదనను నమోదు చేసింది. ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్

Sakshi01 Jun, 01:48 pm
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్‌లో మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేశారు. 42 బంతుల్లో 75 పరుగులు (నాటౌట్) చేసి ఆర్‌సీబీ విజయానికి కీలక పాత్ర పోషించారు. అతని ఆట శైలి కేవలం భారీ షాట్లపై కాకుండా, సరైన టెక్నిక్, సహనం, క్రమశిక్షణపై ఆధారపడుతుందని అతని కోచ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆయన

AP7AM01 Jun, 06:27 am
ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా

ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. రికార్డులతో పాటు కాసుల వర్షంలోనూ మునిగిపోయాడు. కేవలం బ్యాట్‌తోనే కాకుండా సంపాదనలోనూ ఈ బిహార్ కుర్రాడు భళా అనిపించాడు. వేలం పాటలో కేవలం రూ.కోటి పైచిలుకు ధరకే దక్కిన ఈ పరుగుల వీరుడు ఈ ఒక్క సీజన్ ద్వారానే ఏకంగా రూ.రెండున్నర కోట్లకు పైగా ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.మ్యాచ్ ఫీజే ఎక్కువమెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే అతడికి లభించిన అసలు సంపాదన దీనికంటే చాలా ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందిస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. దీనివల్ల కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే ఈ కుర్రాడు ఏకంగా రూ.1.20 కోట్లు సంపాదించడం విశేషం.అవార్డులతో కాసుల వర్షంరాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో వైభవ్ అవార్డులను ఊడ్చేశాడు. ఈ సీజన్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకొని భారీగా నగదు బహుమతులను అందుకున్నాడు. ఆ వివరాలు చూస్తే:మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.15 లక్షలుఆరెంజ్ క్యాప్ (టాప్ స్కోరర్ - 776 పరుగులు): రూ.10 లక్షలుసూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు (దీనితో పాటు టాటా సియెర్రా కార్)సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు):

AP7AM01 Jun, 05:43 am
కోహ్లీని చేతులు జోడించి పలకరించిన వైభవ్.. కౌగిలించుకుని మాట్లాడిన కింగ్.. ఇదిగో వీడియో

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సంబరాలతో హోరెత్తుతోంది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, తొలిసారి టైటిల్ గెలిచిన ఆనందంలో ఆ జట్టు మునిగిపోయింది. ఆ ఉత్సాహభరిత వాతావరణంలో భారత క్రికెట్ వర్తమానం, భవిష్యత్ మధ్య ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.విజయోత్సవాల మధ్య, వైభవ్ సూర్యవంశీ ఎంతో వినమ్రంగా చేతులు జోడించి నమస్కరిస్తూ విరాట్ కోహ్లీ వద్దకు వచ్చాడు. వెంటనే కోహ్లీ ఆ యువ కెరటాన్ని ఆత్మీయంగా కౌగిలించుకుని అభినందించాడు. ఆ తర్వాత వైభవ్ భుజంపై చేయి వేసి చాలాసేపు ముచ్చటించాడు. ఈ అపురూప దృశ్యాలు కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో ఎవరికీ తెలియకపోయినా, ఈ దృశ్యం భారత క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది.ఈ సీజన్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అందరినీ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌ను చూసి, భవిష్యత్ టెస్ట్ క్రికెటర్ అవుతాడంటూ స్వయంగా సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు.ఈ సీజన్‌లోనే గువాహ‌టిలో ఆర్‌సీబీ బౌలర్లపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, కోహ్లీ అతని క్యాప్‌పై సంతకం చేసి అభినందించాడు. కానీ, ఫైనల్ తర్వాత చోటుచేసుకున్న‌ ఆసక్తికర

AP7AM31 May, 07:08 am
ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం

ఐపీఎల్ 2026 ఫైనల్ సమరానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే టైటిల్ పోరును ఒక 'మామూలు గేమ్‌'గానే పరిగణిస్తున్నామని, ఎలాంటి ఒత్తిడికి లోనవడం లేదని స్పష్టం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపాడు.ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి, క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో గెలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ నేపథ్యంలో ఆర్సీబీ విడుదల చేసిన ఓ వీడియోలో పాటిదార్ మాట్లాడాడు. "వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతుండటం, అదీ గతేడాది కప్ గెలిచిన ఇదే మైదానంలో కావడం చాలా సంతోషంగా ఉంది. గతేడాదికి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఫైనల్, పెద్ద వేదిక అని తెలుసు. కానీ నా వరకు ఇదొక సాధారణ మ్యాచ్ మాత్రమే" అని అన్నాడు.భారీ అంచనాలున్న మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్‌లాగే తీసుకోవడం తనకు అలవాటని పాటిదార్ వివరించాడు. "నేను ఎప్పుడూ వర్తమానంలో ఉండటానికే ప్రయత్నిస్తాను. ఇది ఫైనల్ కదా, ఏం జరగబోతోంది, ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. ఫలితంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను" అని తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జట్టుగా ఆడిన తీరు గర్వంగా ఉందని, ప్రతీ

AP7AM30 May, 06:26 am
చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్ పై 'బాడీలైన్' బౌలింగ్ పై విమ ర్శ లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. అయితే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుత పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104) అద్భుత సెంచరీతో గుజరాత్ విజయం సాధించడంతో వైభవ్ పోరాటం వృథా అయింది.ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలమైన దశలో క్రీజులోకి వచ్చిన వైభవ్, ఏమాత్రం బెదరకుండా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. 204.26 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి జట్టు స్కోరును 214/6 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత ఎలిమినేటర్‌లోనూ 97 పరుగులతో రాణించి తన సత్తా చాటాడు.అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్‌ను కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ బౌలర్లు అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని 'బాడీలైన్' బౌలింగ్ వేశారు. ఈ విషయంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు."15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడానికి బాడీలైన్ బౌలింగ్ వేయడం నాకు నచ్చలేదు. అతను పెద్దవాళ్లతో ఆడుతున్నాడని నాకు తెలుసు, కానీ నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదు" అని పఠాన్ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో చిన్న వయసు ఆటగాడిపై అంతటి

AP7AM31 May, 12:33 pm
కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్... భువీపై సచిన్ ప్రశంసలు

ఐపీఎల్ 2026 ఫైనల్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సీజన్‌లో భువీ విజయ రహస్యం 'వొబ్లీ సీమ్' బౌలింగేనని, ఈ కొత్త ఆయుధంతో అతను బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేస్తున్నాడని విశ్లేషించారు.ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్ చేరడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌లలో 26 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు సచిన్ తన 'ఎక్స్' ఖాతాలో విడుదల చేసిన వీడియోలో భువీ బౌలింగ్‌పై మాట్లాడారు. "ఈ సీజన్‌లో భువీ బౌలింగ్‌ను గమనిస్తే, అతను 'వొబ్లీ సీమ్' ఉపయోగిస్తున్నాడు. దానివల్ల బంతి లోపలికి వస్తుందో, బయటకు వెళుతుందో బ్యాటర్లు అంచనా వేయలేకపోతున్నారు. భువీ చేస్తున్నది అదే" అని సచిన్ వివరించారు.గతంలో భువీ ఎక్కువగా సంప్రదాయ స్వింగ్‌పై ఆధారపడేవాడని, కానీ ఇప్పుడు ఆ పద్ధతిని స్పృహతోనే మార్చుకున్నాడని సచిన్ అన్నారు. "గతంలో భువీ బంతిని ఎక్కువగా అవుట్ స్వింగ్ లేదా ఇన్ స్వింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అతను సాధ్యమైనంత నిటారుగా బౌలింగ్ చేస్తున్నాడు. 'వొబ్లీ సీమ్' కారణంగా బంతి పిచ్‌పై పడ్డాక ఎలా కదులుతుందో చెప్పడం కష్టం. ఇదే ఈ సీజన్‌లో భువీ సక్సెస్ మంత్రం," అని టెండూల్కర్ తెలిపారు.భువనేశ్వర్ కచ్చితత్వాన్ని కూడా సచిన్ మెచ్చుకున్నారు. ఆఫ్-స్టంప్ లేదా నాలుగో స్టంప్ లైన్‌పై బౌలింగ్ చేస్తూ, అక్కడి నుంచి

AP7AM01 Jun, 02:35 pm
క్రికెట్ లో ఐసీసీ కీలక నిర్ణయాలు.. వెలుతురు తగ్గితే పింక్ బాల్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ క్రికెట్‌లో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలలో ముఖ్యమైనది, వెలుతురు మందగించినప్పుడు పింక్ బాల్ వాడకం. టెస్ట్ మ్యాచ్‌లలో వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోకుండా, పూర్తి ఓవర్లు జరిగేలా చూడటమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.ఈ కొత్త నిబంధన ప్రకారం, టెస్ట్ మ్యాచ్ ఎప్పటిలాగే రెడ్ బాల్‌తో ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆట మధ్యలో వెలుతురు తగ్గితే, ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్ బాల్‌తో ఆటను కొనసాగించవచ్చు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందే ఇరు జట్లు దీనికి అంగీకరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 90 ఓవర్ల ఆటలో 75 ఓవర్లు ముగిశాక వెలుతురు తగ్గితే, మిగిలిన ఓవర్లను పింక్ బాల్‌తో పూర్తి చేస్తారు.దీంతో పాటు మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా ఐసీసీ ఆమోదించింది. ఇకపై డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్‌లు మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే, బౌలర్ల సందేహాస్పద యాక్షన్‌ను పర్యవేక్షించేందుకు మ్యాచ్ అధికారులు హాక్-ఐ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఉన్న లెగ్-సైడ్ వైడ్ల నిబంధనను శాశ్వతం చేశారు.టీ20 మ్యాచ్‌లలో 15 నిమిషాల విరామాన్ని తప్పనిసరి చేసింది. ఆట తిరిగి ప్రారంభమైనప్పుడు బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు, నిబంధనల ఉల్లంఘన కారణంగా క్రికెట్ కెనడా సభ్యత్వంపై ఐసీసీ తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, సస్పెన్షన్ కాలంలోనూ కెనడా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ 2026

AP7AM31 May, 07:49 pm
మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్‌లో సుమారు 190 పరుగులు చేసి ఉంటే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్లమని, అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ అనంతరం అతడు మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు."పిచ్ మరీ నెమ్మదిగా ఏమీ లేదు. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా సహకరించింది. అయితే, మేం తొలి ఓవర్లలోనే వికెట్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మధ్య ఓవర్లలో వేగం పెంచలేకపోయాం, దాంతో మా ఇన్నింగ్స్ గాడి తప్పింది" అని గిల్ వివరించాడు. 150-160 పరుగులు చేసినప్పటికీ, పవర్‌ప్లేలో కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్‌లోకి రావొచ్చని బలంగా నమ్మినట్లు తెలిపాడు."ఛేజింగ్‌లో పవర్‌ప్లేలో ప్రత్యర్థి 15-20 పరుగులు అదనంగా చేసింది. వారిని 50-55 పరుగులకే కట్టడి చేసి ఉంటే మాకు గెలుపు అవకాశం ఉండేది. కానీ వాళ్లు అక్కడ దూకుడుగా ఆడి మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు" అని గిల్ పేర్కొన్నాడు.అయితే, ఫైనల్‌లో ఓడినప్పటికీ ఈ సీజన్‌లో జట్టు ప్రదర్శనపై గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. "తొలి రెండు మ్యాచ్‌లు ఓడినా ఆ తర్వాత మేం పుంజుకున్న తీరు అద్భుతం. ఈ టోర్నమెంట్‌లో మాది అత్యుత్తమ బౌలింగ్ విభాగం. కప్ గెలవకపోయినా మా ప్రయాణంపై సంతోషంగా ఉన్నాం. ఒకవేళ ట్రోఫీ గెలిచినా కూడా, మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని మాకు తెలుసు" అంటూ గిల్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు.

AP7AM02 Jun, 02:55 am
నా అస లు టార్గెట్ వేరే... నా నుంచి మీరు త ర్వాత చూసేది ఆ క్రికెటే

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2లోనే వెనుదిరిగినప్పటికీ, ఆ జట్టులోని ఓ యువ సంచలనం మాత్రం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగుల రికార్డు స్కోరుతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇంతటి విజయం సాధించినా, తన అసలు లక్ష్యం భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమేనని ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. "అవును, నా తర్వాతి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంది. దానికోసం నేను గ్రౌండ్‌లో కష్టపడాలి. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. త్వరలోనే అందరూ చూస్తారు" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. "ప్రతి బంతిని బాదడమంటే నాకు ఇష్టమని అందరూ అనుకుంటారు. కానీ, ఇది టీ20 ఫార్మాట్. స్వేచ్ఛగా ఆడమని కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బంతిని నేను బాదగలనని నమ్మకం ఉన్నప్పుడే షాట్ ఆడతాను. అంతేగానీ, బలవంతంగా ప్రతి బంతినీ కొట్టాలని చూడను" అని తెలిపాడు.అంతేగాక‌ "టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్ అని మా

AP7AM31 May, 07:43 pm
ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనంతరం పటీదార్ భావోద్వేగంగా మాట్లాడాడు. ఈ అనుభూతి అద్భుతంగా ఉందని, తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని తెలిపాడు. గతేడాది జ్ఞాపకాలు మదిలో కదలాడాయని, ఈసారి విజయం సాధించడం చాలా సంతోషాన్నిస్తోందని అన్నాడు."టాస్ గెలిచినప్పుడు ఛేజింగ్ చేయడం సులువవుతుందని స్పష్టమైన ప్లానింగ్‌తో ఉన్నాం. మా బౌలర్లు భువీ, హేజిల్‌వుడ్, రసిఖ్, కేపీ సుయాశ్, షెఫర్డ్ టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి వల్లే ఈ విజయం సాధ్యమైంది" అని పాటిదార్ జట్టును ప్రశంసించాడు.తన వ్యక్తిగత ప్రస్థానం గురించి మాట్లాడుతూ, "నేను ఆర్సీబీకి కెప్టెన్ అవుతానని, ట్రోఫీని గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు. బహుశా ఇదంతా నా విధిలో రాసిపెట్టి ఉంది. అందుకు నేను కృతజ్ఞుడిని" అని అన్నాడు. గతేడాది కంటే ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగామని, అభిమానుల మద్దతుతో ప్రతిచోటా తమకు హోమ్ గ్రౌండ్ లాగే అనిపించిందని తెలిపాడు. టోర్నమెంట్‌కు ముందు తాను బాగా సిద్ధమయ్యానని, డీకే (దినేశ్ కార్తీక్) ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ జట్టుకు అండగా ఉంటారని కొనియాడాడు.చివరగా, "ఈ విజయం మరోసారి మీకే, ఆర్సీబీ ఫ్యాన్స్. ఈ సాలా ను కప్ నమ్దు," అంటూ అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చాడు.

AP7AM31 May, 06:51 pm
మ్యాచ్ గెలిచాక.. కోహ్లీ సెలబ్రేషన్ కు అర్థం ఏంటి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్ అందించిన తర్వాత, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసుకున్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే కోహ్లీ చేసిన ఒక వింత సైగ అభిమానులను తీవ్రమైన చర్చలో పడేసింది.విజయసూచకంగా బంతిని బౌండరీకి తరలించిన అనంతరం, కోహ్లీ మైదానంలోంచి స్టాండ్స్ వైపు చూస్తూ ఒక వ్యక్తిని ఉద్దేశించి చేతితో కప్పింగ్ మోషన్ (cupping motion) చేశాడు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు కనిపించిన ఈ సంజ్ఞ వెనుక అర్థమేమిటనేది ఎవరికీ అంతుపట్టలేదు. దీంతో ఆన్‌లైన్‌లో దీనిపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన క్లిప్స్‌తో నిండిపోయాయి."విరాట్ సెలబ్రేషన్‌కు అర్థం ఎవరైనా చెప్పగలరా?" అంటూ ఒక అభిమాని పోస్ట్ చేయగా, "అతను ఇలా చేయడం ఎప్పుడూ చూడలేదు. దీని వెనుక ఏదైనా రహస్య సందేశం ఉందా?" అని మరో అభిమాని ప్రశ్నించాడు. మైదానంలో తన భావోద్వేగాలను ఉత్సాహంగా ప్రదర్శించే కోహ్లీ, ఎన్నోసార్లు తన సంబరాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. కానీ ఈసారి చేసిన సంజ్ఞ మాత్రం ఆయన వీరాభిమానులను సైతం గందరగోళంలో పడేసింది.అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించగా, కోహ్లీ మిస్టరీ సెలబ్రేషన్ ఆ రాత్రికి మరో ఆసక్తికరమైన అంశాన్ని జోడించింది. ఈ సంజ్ఞపై కోహ్లీ లేదా ఆర్సీబీ యాజమాన్యం నుంచి ఏదైనా వివరణ వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AP7AM31 May, 03:23 pm
ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ టాపార్డర్ ను కుప్పకూల్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆట ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లు గుజరాత్ బ్యాటర్లపై నిప్పులు చెరిగారు. పేసర్ జోష్ హేజిల్‌వుడ్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10)ను పెవిలియన్‌కు పంపగా, మరో కీలక బ్యాటర్ సాయి సుదర్శన్ (12)ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. దీంతో పవర్‌ప్లేలోనే గుజరాత్ రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన నిశాంత్ సింధు (20)ను రసిఖ్ సలామ్ దార్ ఔట్ చేయడంతో జీటీ మరింత ఒత్తిడిలో పడింది.క్రీజులో కుదురుకుంటున్న ప్రమాదకర బ్యాటర్ జోస్ బట్లర్ (19)ను కృనాల్ పాండ్య అద్భుతమైన బంతితో అవుట్ చేశాడు. ఈ స్టంపౌట్ ఇన్నింగ్స్ కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15) రెండు భారీ సిక్సర్లతో మెరుపులు మెరిపించినా, అతడిని కూడా హేజల్‌వుడ్ ఔట్ చేయడంతో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది.ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (19), రాహుల్ తెవాటియా క్రీజులో ఉండగా.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ కనీసం పోరాడే స్కోరు చేస్తుందా

AP7AM31 May, 04:39 am
హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్ క్రికెటర్ నాకు త ర చూ మెసేజ్ లు పంపాడు.. బ్లాక్

ఓటీటీ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న నటి నేహల్ వదోలియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ ప్రముఖ క్రికెటర్ తనకు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో ఆ క్రికెటర్ ఎవరనే దానిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.ఇటీవల ‘సునో ఇండియా పాడ్‌కాస్ట్’లో పాల్గొన్న నేహల్‌ను.. "ఏదైనా క్రికెటర్ మీకు ఎప్పుడైనా డైరెక్ట్ మెసేజ్ చేశారా?" అని అడగ్గా, ఆమె నవ్వుతూ "పేరు చెప్పేయమంటారా?" అని బదులిచ్చారు. ఆ తర్వాత "అతను అంత పాప్యులర్ కాదు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందినవాడు. అతనికి విడాకులు కూడా అయ్యాయి" అని కొన్ని క్లూస్ ఇచ్చారు.ఎలాంటి మెసేజ్‌లు పంపేవాడని ప్రశ్నించగా.. తన సోషల్ మీడియా స్టోరీస్‌కు తరచూ రియాక్ట్ అయ్యేవాడని, తన అందాన్ని పొగుడుతూ 'హాట్','బ్యూటిఫుల్','ప్రెట్టీ' వంటి మెసేజ్‌లు పంపేవాడని నేహల్ వివరించారు. అయితే, తనకు ఆ సంభాషణ కొనసాగించడం ఇష్టం లేకపోవడంతో స్పందించలేదని తెలిపారు. "నేను మెసేజ్ చేస్తే అతను మళ్లీ మొదలుపెడతాడు. అందుకే నాకు మాట్లాడటం ఇష్టం లేదు" అని చెప్పిన నేహల్, చివరికి ఆ క్రికెటర్‌ను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.ఈ పాడ్‌కాస్ట్ క్లిప్‌లు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ మిస్టరీ ఆటగాడు ఎవరనేది కనిపెట్టే పనిలో పడ్డారు. కొందరు షిమ్రాన్ హెట్‌మెయర్, తుషార్ దేశ్‌పాండే పేర్లను ప్రస్తావించగా, మరికొందరు యుజ్వేంద్ర చాహల్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడంటూ కామెంట్లు చేస్తున్నారు.నేహల్ ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు. కొద్ది

Vaartha31 May, 08:58 am
ఇవాళ జట్లు తలపడనున్న నేపథ్యంలో అహ్మదాబాద్ లో కఠిన ఆంక్షలు

Final Match:IPL 2026 ఫైనల్ బెంగళూరు ఆంక్షలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అహ్మదాబాద్‌లో ఆర్సీబీ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్న నేపథ్యంలో బెంగళూరు నగరంలో పోలీసులు కఠిన నిబంధనలు తెచ్చారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించకుండా పోలీసులు నిఘా పెంచారు. Read also: RCB vs GT Final Match:నేడే ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మహా సంగ్రామం.. వర్షంతో రద్దయితే ఆర్సీబీదే ట్రోఫీ? నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటుపై పూర్తిగా నిషేధం విధించారు. అనుమతి లేకుండా ఎవరూ గుంపులుగా చేరకూడదని పోలీసులు స్పష్టం చేశారు. మ్యాచ్ చూసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా రోడ్ల మీద వేచి ఉండటం వంటి పనులు చేయవద్దు. నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత బైక్ స్టంట్లు, టపాసులు కాల్చడం వంటి పనులపై నిషేధం కొనసాగుతుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, హారన్లతో హంగామా చేయడం వంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. అభిమానులు తమ ఇంటి వద్దే మ్యాచ్ చూస్తూ ఉత్సాహాన్ని పంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. సురక్షితమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. PM Modi: ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని సూచనలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. PM modi: మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ లో భారత క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు RCB

Zee Telugu31 May, 05:57 pm
గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. IPL 2026 Champion RCB: ఐపీఎల్‌ ప్రారంభమైన 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీని కూడా ఖాతాలో వేసుకుంది. 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బెంగళూరు జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీరోచిత పోరాటంతో ఐపీఎల్‌ 2026 ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌తోపాటు ఫైనల్‌లోనూ పూర్తిస్థాయిలో వైఫల్యం ప్రదర్శించిన గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌గా నిలిచింది. Also Read: RCB vs GT Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌.. బెంగళూరుదే ఐపీఎల్‌ ట్రోఫీ సొంతగడ్డపై ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ ఘోరంగా విఫలమైంది. వరుసగా రెండో ట్రోఫీ సాధించాలనే కసితో ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో పరాజయం పొందింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయకపోగా.. బౌలర్లు కూడా ఘోరంగా విఫలమవడంతో ట్రోఫీని చేజార్చుకుని గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పూర్అద్భుతంగా బౌలింగ్‌ వేసి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేశారు. ఆరంభం నుంచి వికెట్లు తీస్తూ బౌలర్లు గుజరాత్‌ నడ్డి విరిచారు. గుజరాత్‌ టైటాన్స్‌ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించి చాంపియన్‌గా నిలిచింది. విరాట్‌ కోహ్లీ వీరోచిత పోరాటంతో బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. క్వాలిఫయర్‌

AP7AM31 May, 01:44 pm
కప్ నీదా, నాదా?... మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్... గుజరాత్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 పండుగ ముగింపు దశకు చేరుకుంది. రెండు నెలల పాటు హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరుగుతున్న ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ, "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్, మ్యాచ్ సాగేకొద్దీ పెద్దగా మార్పులు ఉండవని భావిస్తున్నాం. గతేడాది ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఈ మ్యాచ్ గెలవడానికి మా వంతు అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ప్రస్తుతంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మేము ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, "మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇది మాకు అలవాటైన వికెట్. తొలి మూడు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నాం" అని చెప్పాడు.ఇక పిచ్ విషయానికొస్తే, ఇది బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుందని క్యూరేటర్లు విశ్లేషించారు. ఎరుపు, నలుపు మట్టి మిశ్రమంతో తయారు చేసిన ఈ పిచ్‌పై

AP7AM01 Jun, 09:57 am
ఆండీ 'ఫ్లవర్' అనుకుంటిరా... ఫైర్! ఆర్సీబీకి 2 టైటిళ్లు తెచ్చిన తెరవెనుక హీరో

 "ఈ సాలా కప్ నమదే"... ప్రతి ఐపీఎల్ సీజన్‌లో వినిపించే నినాదం. కానీ దశాబ్దానికి పైగా ఆ నినాదం మాటలకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు నిరాశే మిగిలింది. అలాంటి జట్టు ఇప్పుడు వరుసగా రెండుసార్లు (2025, 2026) ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిందంటే, దాని వెనుక ఉన్నది ఒకే ఒక్క పేరు... ఆండీ ఫ్లవర్! పేరులో 'ఫ్లవర్' (పువ్వు) ఉన్నా, అతను చేసింది మాత్రం పెను విధ్వంసం. ఆర్సీబీ తలరాతను మార్చేసిన నిశ్శబ్ద విప్లవకారుడు అతడు.ఆగస్టు 2023లో ఫ్లవర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆర్సీబీ పరిస్థితి వేరు. వ్యక్తిగత ప్రతిభకు, స్టార్ డమ్‌కు ప్రాధాన్యత ఇచ్చే జట్టుగా పేరుంది. కాగితంపై బలంగా ఉన్నా మైదానంలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ సంస్కృతిని మార్చడమే ఫ్లవర్ తన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్టార్ ఆటగాళ్ల కన్నా, జట్టుగా గెలవడం ముఖ్యమని చాటిచెప్పాడు. టీమ్ స్ట్రక్చర్, సమష్టితత్వం, జట్టు సంస్కృతిపై దృష్టి సారించాడు.ఆయన మార్పులు మాటలతో కాదు, చేతలతో మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆర్సీబీని వేధిస్తున్న బలహీనమైన బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టాడు. 2025 వేలానికి ముందు రూ.10.75 కోట్లకు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకురావడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ భువీ గత రెండు సీజన్లలో 45 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో, రసిఖ్

AP7AM31 May, 05:47 am
పేసర్ల వార్ .. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే

ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించిన ఈ సీజన్‌లో తమ పటిష్ఠ‌మైన బౌలింగ్ ప్రదర్శనలతో రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. ఈ మెగా ఫైనల్‌లో ఇరు జట్ల పేస్ బౌలింగ్ దళాల మధ్య జరిగే పోరే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.ఈ ఫైనల్ కేవలం టైటిల్ పోరు మాత్రమే కాదు, పర్పుల్ క్యాప్ కోసం ఇద్దరు స్టార్ పేసర్ల మధ్య జరిగే ఆసక్తికర సమరం కూడా. ప్రస్తుతం 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ బౌలర్ కగిసో రబడా, 26 వికెట్లతో అతడి వెనుకే ఉన్న ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ మధ్య ఈ పోటీ నెలకొంది. అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో ఈ సమరం మరింత ఆసక్తికరంగా మారింది. బ్యాటర్లకు స్వర్గధామంగా మారిన ఈ సీజన్‌లో బౌలింగ్‌నే నమ్ముకుని ఫైనల్ చేరడం ఈ రెండు జట్ల ప్రత్యేకత.గుజరాత్ టైటాన్స్ జట్టులో అనుభవం, యువత కలగలిసిన పటిష్ఠ‌మైన పేస్ దళం ఉంది. కగిసో రబడా (రూ. 10.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (రూ. 12.25 కోట్లు), ప్రసిధ్ కృష్ణ (రూ. 9.5 కోట్లు) వంటి స్టార్లతో పాటు ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ (రూ. 7 కోట్లు) జట్టుకు అదనపు బలం. ఈ సీజన్‌లో సిరాజ్ 18, హోల్డర్ 17 వికెట్లు పడగొట్టి

AP7AM30 May, 01:04 am
సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఓ 15 ఏళ్ల కుర్రాడు సృష్టిస్తున్న సంచలనాలు మామూలుగా లేవు. రాజస్థాన్ రాయల్స్‌ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర లిఖిస్తున్నాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 96 పరుగులు చేసి, త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. ఐపీఎల్ రికార్డు పుస్తకాల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.రికార్డుల మోత మోగించిన 'సూర్యవంశీ'ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్: ఒకే ఐపీఎల్ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని దాటిన తొలి అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో 776 పరుగులు సాధించాడు.రస్సెల్ రికార్డు బద్ధలు: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం 440 బంతుల్లోనే ఈ ఘనత సాధించి, వెస్టిండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. అతి పిన్న వయస్కుడు: ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 700 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 సంవత్సరాల 63 రోజులు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు సాయి సుదర్శన్ పేరిట ఉండేది.

Sakshi28 May, 10:22 am
వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప

Sakshi27 May, 03:47 pm
ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఐపీఎల్ చివరకొచ్చేసింది. ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్స్‌కి ఎవరొస్తారనే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో గట్టిగా ఉంది. ఇప్పుడు సదరు క్రికెట్ ప్రేమికుల కోసమా అన్నట్లు దిగ్గజ సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ని ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది? (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) సచిన్ టెండూల్కర్ జీవితం, క్రికెట్ జర్నీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్'. 2017లో థియేటర్లలో రిలీజైన ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ క్రీడా జర్నీతో పాటు 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన క్షణాలు, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్‌తో పాటు భారతీయ క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించారు. ఇదివరకే హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళ వెర్షన్లని ఆహా ఓటీటీలోకి తీసుకురానున్నారు. గురువారం(మే 28) నుంచి తెలుగులో, శుక్రవారం(మే 29) నుంచి తమిళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్) 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు) ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు) మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు) చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు) హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని

TV9 Telugu26 May, 09:41 am
అర్ష్‌దీప్ సింగ్‌కు ఏమైంది.. ఏకంగా 200లకుపైగా పోస్ట్‌లు డిలీట్.. అసలు రీజన్ అదేనా..?

Arshdeep Singh Instagram Posts Deleted: భారత క్రికెట్ జట్టు యువ పేసర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జరిగిన ఒక ఊహించని పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరించే ఈ స్పీడ్‌స్టర్, తాజాగా తన ఖాతా నుంచి ఏకంగా 200కు పైగా పోస్టులను తొలగించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. క్రికెట్ ప్రపంచంలో అర్ష్‌దీప్ సింగ్ ఆటతీరుతో పాటు ఆయన చేసే వినోదాత్మక వీడియోలకు, రీల్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. తీరిక సమయం దొరికినప్పుడల్లా తోటి ఆటగాళ్లతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. అయితే, తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని పూర్తిగా ప్రక్షాళన చేశాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలాయి. అందులోనూ ఎక్కువ భాగం వివిధ వ్యాపార ప్రకటనలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్ గత ఏడాది డిసెంబర్ నెలలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి అర్ష్‌దీప్ చేసిన ఒక ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు 15 మిలియన్లకు పైగా వీక్షణలు (వ్యూస్) సాధించిన ఆ అరుదైన వీడియోను సైతం అర్ష్‌దీప్ ఇప్పుడు తొలగించాడు. దీంతో ఆరాధ్య ఆటగాడికి అసలు ఏమైంది? ఎందుకిలా పాత జ్ఞాపకాలన్నింటినీ చెరిపేస్తున్నాడంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో ఏ

Zee Telugu27 May, 12:43 am
క్రీడా రంగంలోకి 'జీ'.. యునైట్ 8 పేరిట నాలుగు ఛానల్స్ ప్రారంభం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Unite8 Sports Channels: వినోదం... వార్తా ప్రసారాలతోపాటు ఓటీటీలతో కుటుంబాలను మొత్తం సంతోషంతో నింపుతున్న జీ మీడియా ఇప్పుడు మరో గొప్ప ముందడుగు వేసింది. భారతీయ మీడియా రంగంలో ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ సంస్థగా అగ్రస్థానంలో ఉన్న 'జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్' ఇప్పుడు స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ప్రేక్షకుల విశేష ఆదరణ, తన ముద్రను చూపించిన జీ మీడియా ఇకపై క్రీడారంగంలో కూడా మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ఛానళ్లను ప్రారంభించింది. జీ మీడియా క్రీడలకు సంబంధించి 'యునైట్8 స్పోర్ట్స్' (Unite8 Sports) పేరుతో సరికొత్త క్రీడా ఛానళ్ల పోర్ట్‌ఫోలియోను ప్రారంభించబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్రీడారంగంలోని సరికొత్త ఫార్మాట్లు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో క్రీడాభిమానులకు అత్యుత్తమ వినోదం, అనుభూతిని అందించడమే లక్ష్యంగా జీ మీడియా క్రీడా ఛానళ్లను ప్రారంభించనుంది. దశాబ్దాలుగా జీ సంస్థ వినోద ఛానళ్లలలోనే ముఖ్యమైన క్రీడా ఈవెంట్లను ప్రసారం చేస్తూ స్పోర్ట్స్ రంగంలో విశేష గుర్తింపు సాధించింది. ప్రత్యక్ష ప్రసారాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను ఉపయోగించుకుని భారీ ప్రేక్షకాదరణ (వ్యూయర్‌షిప్)‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బలమైన పునాదితో క్రీడా రంగంలో మరింత విస్తరించడానికి భారీ ప్రణాళికతో జీ మీడియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సంస్థ ఒకేసారి నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురానుంది. సరికొత్త ఛానళ్లు ఇవే హిందీలో: యునైట్8 స్పోర్ట్స్ 1

AP7AM30 May, 06:02 am
వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ కు అమితాబ్ ఫిదా.. ఆసక్తికర పోస్టు

"ఆ వయసులో మేము గోళీలు, గిల్లీదండ కూడా సరిగ్గా ఆడలేకపోయాం" అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ మ్యాచ్ అనంతరం అమితాబ్ బచ్చన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. ఈ వయసులో మేము గోళీలు, గిల్లీదండ కూడా సరిగ్గా ఆడలేకపోయాం!!" అని హిందీలో పోస్ట్ చేశారు. గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.అమితాబ్ వ్యాఖ్యలతో నెటిజన్లు ఏకీభవించారు. "రాజస్థాన్ ఓడిపోవడం మాట అటుంచితే, వైభవ్ మరో ఇన్నింగ్స్ చూడలేకపోతున్నామనేదే బాధ" అని ఒక అభిమాని పేర్కొనగా, "వైభవ్ ఆట వెనుక అతని తండ్రి త్యాగం, కృషి ఉన్నాయి" అని మరొకరు కామెంట్ చేశారు. మ్యాచ్ ఓటమి తర్వాత డగౌట్‌లో వైభవ్ కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఈ యువ సంచలనం ఐపీఎల్ 2026లో అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు.

Eenadu28 May, 01:43 pm
వైభవ్ సూర్యవంశీ.. సరిలేరు నీకెవ్వరు

చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తగ్గేదేలే అంటున్నాడు. ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో SRHపై 29 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లా తాజ్‌పూర్‌లో 2011 మార్చి 27న వైభవ్‌ జన్మించాడు. తండ్రి తన ఆస్తులు విక్రయించి వైభవ్‌కు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించారు. 13 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టి.. 14వ ఏటా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అతి పిన్నవయస్కుడైన ఐపీఎల్‌ క్రికెటర్‌ ఇప్పటికీ వైభవే. వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభకు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఫిదా అయిపోయింది. 2025 ఐపీఎల్‌ వేలంలో రూ.1.1 కోట్లు పెట్టింది దక్కించుకుంది. 2025 సీజన్‌లో గుజరాత్‌పై 38 బంతుల్లో సెంచరీ బాది ఔరా అనిపించాడు. ఇప్పుడు 65 సిక్స్‌లు బాది క్రిస్‌ గేల్‌ (59) రికార్డూ బద్దలుకొట్టాడు. రాష్ట్రీయ బాల్‌ పురస్కారం- 2025 అందుకున్న వైభవ్‌.. ‘‘ఓర్పు, అంకితభావంతో చేసే ప్రతి ప్రయత్నం.. మీరు మెరెసేందుకు సిద్ధం చేస్తుంది’’ అని అన్నాడు. వెస్టిండీస్‌ బ్యాటర్‌ బ్రియాన్‌ లారా, భారత ఆటగాడు యువరాజ్‌ సింగ్‌కు వైభవ్‌ పెద్ద ఫ్యాన్‌. వాళ్లలా దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతానని చెప్పాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వైభవ్‌ కార్టూన్స్‌ చూస్తాడు. అలా చేస్తేనే తనలో ఒత్తిడి పోతుందని, మైదానంలో స్వేచ్ఛగా ఆడగలనని అన్నాడు. పిజ్జా, బర్గర్‌ వంటి జంక్‌ఫుడ్‌ను ఇష్టం. కానీ, క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ ముఖ్యమని.. వాటన్నింటినీ త్యాగం చేశాడు. ‘ధురంధర్‌’ ఫేవరెట్‌ చిత్రమని చెప్పాడు. టీ20ల్లో గేల్‌ అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు (175)పై వైభవ్‌ కన్నేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయడమే లక్ష్యమంటున్నాడు. వైభవ్‌ ఆటను మెచ్చిన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ.. అతడికి ఐపీఎల్‌ కప్‌ నమూనా, తను ఆటోగ్రాఫ్ పెట్టిన క్యాప్‌ను గిఫ్ట్‌గా పంపించాడు. వైభవ్‌ సూర్యవంశీ

Zee Telugu26 May, 03:26 am
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు...

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు...

Zee Telugu27 May, 12:44 am
గుజరాత్ భారీ ఓటమి.. ఐపీఎల్ 2026 ఫైనల్ లోకి బెంగళూరు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. RCB Into IPL 2026 Finals: ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభమైన 17 ఏళ్ల తర్వాత తొలి ట్రోఫీని దక్కించుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనే కసితో ఆడి గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సీజన్‌లో అత్యధిక స్కోర్‌ బాదడమే కాకుండా గుజరాత్‌ను బౌలింగ్‌తో ఘోరంగా దెబ్బతీసి ఐపీఎల్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతూ ఆడుతున్న బెంగళూరు మొదట ప్లేఆఫ్స్‌లో బెర్త్‌ను దక్కించుకోవడమే కాకుండా టాప్‌లో నిలిచింది. రజత్‌ పాటిదార్‌ బ్యాటింగ్‌ విధ్వంసంతో బెంగళూరు ట్రోఫీ సాధించేందుకు ఒక్కడుగు దూరంలో నిలిచింది. Also Read: Gold Treasure: భూమిని తవ్వితే బంగారం నాణేలు ప్రత్యక్షం.. విలువ ఎన్ని కోట్లంటే? భారీ తేడాతో విజయం ధర్మశాల వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్‌ టైటాన్స్‌ చేతులెత్తేసింది. 19.3 ఓవర్లకు 162 పరుగులు చేసి గుజరాత్‌ ఆటను ముగించింది. ప్రత్యర్థి ఏమాత్రం పోటీనివ్వకపోవడంతో బెంగళూరు జట్టు 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ తరఫున రాహుల్‌ తెవాటియా మినహా ఏ ఒక్క బ్యాటర్‌ కూడా కనీస పోరాటం చేయలేకపోయారు. తెవాటియాకు తోడు జోస్‌ బట్లర్‌ కొంత రాణించినా.. మిగతా బ్యాటర్లందరూ కూడా డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. పరువు కాపాడిన రాహుల్ తెవాటియా అద్భుత ఫామ్‌లో ఉన్న సాయి

Cricket News Keyword | Telugu Digital