translateexpand_more

Business News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 01:07 pm
విమానయాన సంస్థలకు ఊరట.. జెట్ ఫ్యూయల్ ధర 27 తగ్గింపు

Jet fuel price cut | దిల్లీ: విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన (ATF) ధరలను 27 శాతం తగ్గించాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. దేశీయ విమాన ఇంధన ధరల్లో మాత్రం వరుసగా రెండో నెలా ఎలాంటి మార్పూ చేయలేదు. జూన్ నెలకు గాను అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన ధరను కిలోలీటరుకు సుమారు 400 డాలర్ల మేర చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో కిలోలీటర్‌ 1100 డాలర్లకు చేరింది. ఈ తగ్గింపుతో అంతర్జాతీయ విమానాల ఇంధన ధరలు, దేశీయ విమాన ఇంధన ధరలు దాదాపు సమాన స్థాయికి చేరాయి. అంతర్జాతీయ విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,05,000గా ఉండగా.. ప్రస్తుతం దిల్లీలో దేశీయ విమాన ఇంధన ధర కిలోలీటరుకు రూ.1,04,927గా ఉంది. అంతకుముందు దేశీయ విమానాలకు ఏప్రిల్‌ 1న కిలోలీటరుకు 25 శాతం అంటే రూ.15వేలు చొప్పున పెంచగా.. అంతర్జాతీయ విమాన సర్వీసుల ఏటీఎఫ్‌ ధరలు మాత్రం రూ.73 వేలు పెంచారు. మే నెలలో అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్‌ ధరను కిలో లీటరుకు 76 డాలర్లు పెంచి 1511 డాలర్లుకు చేర్చారు. దేశీయ విమానాల ధరల్లో అప్పుడు ఏ మార్పూ చేయలేదు. జూన్‌లో మాత్రం కిలో లీటరుకు 400 డాలర్లు తగ్గించడం గమనార్హం. సాధారణంగా ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో జెట్‌ ఫ్యూయల్‌కే 40 శాతం ఖర్చవుతుంది. ఇటీవలి పరిస్థితుల కారణంగా ఇది 55-60 శాతానికి పెరిగింది. పెరిగిన చమురు ధరలకు తోడు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల

Eenadu01 Jun, 07:08 am
మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్ల (GST Collections) వివరాలను సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది. ఇక రిఫండ్ల సర్దుబాటు అనంతరం మే నెలకు నికరంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,66,904 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా రీఫండ్లు 2.6 శాతం పెరిగి, రూ.27,281కోట్లుగా ఉన్నాయి. దేశీయ రీఫండ్లు 4.3 శాతం తగ్గగా.. ఎగుమతి ఆధారిత రీఫండ్లు 16.6 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. స్థూల దేశీయ జీఎస్టీ రాబడి 2.6 శాతం తగ్గింది. ఆ మొత్తం రూ.1.34 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతులపై వసూళ్లు 19.1 శాతం పెరిగి, రూ.59,654 కోట్లుగా ఉన్నాయి. కాగా.. ఏప్రిల్‌, మే నెలల్లో జీఎస్టీ (GST) వసూళ్లు 6.2 శాతం పెరిగి, 4.37 లక్షలకోట్లకు చేరాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 10:53 am
ఫిన్ టెక్ రంగంలోకి ఎల్ ఐసీ

LIC Fintech | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఫిన్‌టెక్‌ రంగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. డిజిటల్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక పెట్టుబడులు లేదా ఆర్గానిక్‌ మార్గంలో ఫిన్‌టెక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. ఆధునిక అవసరాలను తీర్చడానికి, నూతన ఆవిష్కరణల కోసం అటు ఫిన్‌టెక్‌, ఇటు ఇన్సురెన్స్‌టెక్‌ కంపెనీలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పీఐటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశలపై మాట్లాడారు. కేవలం బీమా వ్యాపారమే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎల్‌ఐసీ ఉందని, అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిందన్నారు. పాలసీదారులకు మెరుగైన ప్రతిఫలం అందించేందుకు ప్రత్యేకమైన సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులకూ ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీని ఎల్‌ఐసీ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పారు. తమ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా సొంతంగానే తమ బిజినెస్‌ అప్లికేషన్లను తయారు చేసుకుంటున్నామని వెల్లడించారు. అదే సమయంలో కొత్త కొత్త ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఇతర ఐటీ సర్వీస్‌ ప్రొవైడర్లతోనూ కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఫిన్‌టెక్‌ రంగంలో పోటీలో నిలదొక్కుకోవాలంటే ఐటీ అప్లికేషన్‌లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌ఐసీలో తదుపరి వాటాల విక్రయంపై ప్రశ్నించగా.. పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ పరిమితిని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత

Eenadu30 May, 02:59 pm
మెటా ప్రీమియం ప్లాన్స్ .. ధర, ఫీచర్లివీ

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌లు వాడాలంటే డబ్బులు కట్టాలా?.. అంటే అవుననే తెలుస్తోంది. కానీ, ఇది అందరికీ కాదు. ఎవరైతే ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటారో వాళ్లకు మాత్రమే. ఇందుకోసమే వాటి మాతృసంస్థ మెటా ప్రీమియం ప్లాన్‌ను ప్రకటించింది. ప్లస్‌ పేరుతో వచ్చిన ఈ ప్లాన్‌ల ధర ఎంత? ప్రీమియం తీసుకుంటే వచ్చే ఫీచర్లు ఏంటి? తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. (గమనిక: ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు) ఈ వార్త చదివారా: దేశంలో నంబర్‌ వన్‌ ‘క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి’గా రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌

Eenadu01 Jun, 06:24 am
పర్సనల్ కంప్యూటర్లలోకి ఎన్విడియా చిప్ లు.. విండోస్ ల్యాప్ టాప్ మార్కెట్లోకి ప్రవేశం

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం ఎన్విడియా (Nvidia) తాజాగా పీసీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తైవాన్‌లో జరుగుతోన్న కంప్యూటెక్‌ ట్రేడ్‌ షో వేదికగా ఆ కంపెనీ సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఈ రంగంలో పట్టు కోల్పోతోన్న ఇంటెల్‌ కార్పొరేషన్‌ నుంచి మార్కెట్‌ షేర్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ఎన్విడియా ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఎన్విడియా త్వరలోనే తన సరికొత్త ‘ఆర్టీఎక్స్‌ స్పార్క్‌ సూపర్‌ చిప్‌’ను ప్రముఖ పీసీ బ్రాండ్స్‌కు చెందిన ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల్లో అందుబాటులోకి తీసుకురానుంది. మైక్రోప్రాసెసర్‌, గ్రాఫిక్స్‌ చిప్‌ను కలిపి దీనిని రూపొందించినట్లు జెన్సన్‌ హువాంగ్‌ వెల్లడించారు. తైవాన్‌ మీడియాటెక్‌ ఐఎన్‌సీ సహకారంతో దీనిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఆర్మ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ను రన్‌ చేస్తుంది. ఎన్విడియా ఇప్పటికే డేటా సెంటర్ల మార్కెట్లో అత్యంత కీలకమైంది. తాజాగా పర్సనల్‌ కంప్యూటర్ల రంగంలోకి అడుగు పెట్టడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలకు తీవ్రమైన పోటీ ఇవ్వనుంది. దాదాపు దశాబ్దం క్రితం ఈ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఎన్విడియా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ సారి మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రత్యర్థుల కంటే అధిక మొత్తంలో ఆర్థిక వనరులను కేటాయించగలిగే స్థితిలో ఉంది. ఇక, ఈ ప్రయత్నంతో కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో కూడా తాను కేంద్రంగా కొనసాగేందుకు ఎన్విడియాకు అవకాశం లభిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఆర్టీఎక్స్‌ స్పార్క్‌ చిప్‌ల ల్యాప్‌టాప్‌లను తొలుత సిద్ధం చేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ వినియోగంతో అత్యంత నాజుకుగా ఉండే శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేసే అవకాశం పీసీ తయారీదారులకు లభించనుంది. మైక్రోసాఫ్ట్‌ తన అత్యాధునిక సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ అల్ట్రాను ఆవిష్కరించింది. ఎన్విడియా నుంచి

Eenadu29 May, 03:32 pm
అన్ని రకాల అన్ క్లెయిమ్డ్ ఆస్తులకూ ఒకటే పోర్టల్

Unclaimed assets | దిల్లీ: బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో ఎవరూ క్లెయిమ్‌ చేయని ఆస్తులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఏకీకృత పోర్టల్‌ తీసుకొచ్చింది. ఇందులో బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్లెయిమ్‌ చేయని మొత్తాలకు సంబంధించి సెర్చ్‌ చేసే వీలుంటుంది. ఇందుకోసం www.unclaimedassetsportal.in అనే పోర్టల్‌ను శుక్రవారం ఆర్థిక శాఖ అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ‘మీ సొమ్ము మీ హక్కు’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఏకీకృత ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చినట్లు ఆర్థికశాఖ కార్యదర్శి(సేవలు) ఎం. నాగరాజు తెలిపారు. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి UDGAM, బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ బీమా భరోసా, మ్యూచువల్‌ ఫండ్స్‌ కోసం సెబీ మిత్ర, షేర్లు డివిడెండ్లకు సంబంధించి ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీకి వేర్వేరు పోర్టళ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకేచోట చేర్చడమే ఈ ప్లాట్‌ఫామ్‌ ముఖ్య ఉద్దేశం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 09:25 am
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్ తో 543

Toyota Urban Cruiser Ebella | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) దేశంలో తొలి విద్యుత్‌ కారు అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)ను లాంచ్‌ చేసింది. హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, ఎంజీ జడ్‌ఎస్‌, మారుతీ సుజుకీ ఇ-విటారాకు పోటీగా.. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దీన్ని లాంచ్‌ చేసింది. మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పై ఈ కారు రూపొందినప్పటికీ.. టయోటా డిజైన్‌ ఎలిమెంట్లను జోడించారు. దీని ధరను రూ.23.60 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu30 May, 12:05 pm
దేశంలో నంబర్ వన్ క్రిటికల్ కేర్ ఆస్పత్రి’గా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్ప్రతి (Sir H. N. Reliance Foundation Hospital) అరుదైన ఘనతను సాధించింది. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహించిన ఆల్‌ ఇండియా క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ ర్యాంకింగ్‌ సర్వే-2026లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇది తమకు అత్యంత గర్వించదగిన క్షణమని పేర్కొంటూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ ఇన్‌స్టాలో ఓ వీడియోని పోస్టు చేసింది. ఇది ప్రతి భారతీయుడికీ ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందుబాటులో ఉంచాలనే తమ సంస్థ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ గొప్ప సంకల్పం, నిబద్ధతకు దక్కిన గౌరవంగా పేర్కొంది. కేవలం క్రిటికల్‌ కేర్‌ మాత్రమే కాకుండా వైద్య రంగంలోని ప్రధాన స్పెషాలిటీల్లో కూడా తమ ఆసుపత్రి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కార్డియాక్‌ సైన్సెస్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, అంకాలజీ, న్యూరోసైన్సెస్‌, ఎమర్జెన్సీ అండ్‌ట్రామా, అబ్‌స్టెట్రిక్‌ అండ్‌ గైనకాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్‌, యూరాలజీ తదితర ప్రముఖ స్పెషాలటీల్లో సాధించిన అగ్రశ్రేణి ర్యాంకింగ్స్‌.. తమ ఆస్పత్రిలో వైద్య నిపుణత, అధునాతన సాంకేతికతకు నిదర్శనమని పేర్కొంది. ఈ అపూర్వ విజయానికి కారణమైన తమ ఆస్పత్రిలో పనిచేసే గొప్ప వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు తమపై విశ్వాసం ఉంచిన రోగులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపింది. అందరం కలిసి దేశమంతా వైద్య ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు

Eenadu28 May, 08:22 am
ఈక్విటీలపై ని రద్దు చేయాలి.. కేంద్రానికి విజయ్ కేడియా వినతి

Vijay Kedia on LTCG | ఇంటర్నెట్‌ డెస్క్‌: లిస్టెడ్‌ ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ మదుపరి విజయ కేడియా ఈ అంశాన్ని తాజాగా లేవనెత్తారు. క్యాపిటల్‌ మార్కెట్‌ బలోపేతానికి ఈ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు రూపుదిద్దుకోవాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం అని విజయ్‌ కేడియా అభిప్రాయపడ్డారు. ఎల్‌టీసీజీ పన్నును రద్దు చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రస్తుత పన్ను విధానం స్వల్పకాలిక స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌, దీర్ఘకాలిక పెట్టుబడులకు మధ్య వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేకపోతోందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక మదుపరి కేవలం మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనే వ్యక్తి మాత్రమే కాదని, దేశ సంపద సృష్టిలో భాగస్వామి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కంపెనీ వృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను, కస్టమ్స్ డ్యూటీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని విజయ్‌ కేడియా అన్నారు. కాబట్టి ఆ కంపెనీల్లో పెట్టుబడులపై మళ్లీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలు తమ పొదుపు మొత్తాలను బంగారం వంటి వాటిల్లో కాకుండా ఉపాధిని సృష్టించే, దేశ సంపదను పెంచే ఉత్పాదక వ్యాపారాలవైపు మళ్లించేలా పన్ను విధానాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రపంచస్థాయి కంపెనీలు అవతరిస్తాయన్నారు. ఎల్‌టీసీజీ 2004 వరకు ఉండేది. అప్పట్లో దాన్ని రద్దు చేశారు. 2018లో తిరిగి తీసుకొచ్చారు. 2024

Eenadu25 May, 08:52 am
Nirmala Sitharaman | ముంబయి: పశ్చిమాసియా రూపంలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో చమురు, ఎరువులు, విదేశీ మారకంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి...

Nirmala Sitharaman | ముంబయి: పశ్చిమాసియా రూపంలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో చమురు, ఎరువులు, విదేశీ మారకంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందులోభాగంగానే ప్రధాని మోదీ పొదుపు చర్యల...

Eenadu28 May, 03:24 pm
మాకు అందరూ ప్రయారిటీనే’.. యాడ్

Voda Idea on Airtel | దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసిన ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌’ ప్లాన్‌పై మరో టెల్కో వొడాఫోన్‌ ఐడియా (VI) పరోక్షంగా విమర్శలు గుప్పించింది. తమ నెట్‌వర్క్‌లో అందరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, తమ నెట్‌వర్క్‌కు మారాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. తమ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ద్వారా రద్దీ సమయంలోనూ నెట్‌వర్క్‌ అంతరాయాలు ఉండవంటూ ఎయిర్‌టెల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నెట్‌న్యూట్రాలిటీకి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్‌ ఐడియా ఎయిర్‌టెల్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచారానికి తెరతీసింది. ‘మాకు ఎవరూ ఎక్కువా కాదు.. ఎవరూ తక్కువా కాదు’.. ‘మా నెట్‌వర్క్‌లో అందరికీ సమ ప్రాధాన్యం’.. ‘స్ట్రాంగ్‌ నెట్‌వర్క్‌ అందరి హక్కు.. ఇప్పుడే వీఐకి మారండి’ అంటూ వీఐ ప్రచారం చేసుకుంటోంది. రోజు రోజుకూ తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, 110కి పైగా నగరాల్లో 5జీ సేవలు అందుతున్నాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఏఐ ఆధారిత సెల్ఫ్‌ ఆప్టిమైజింగ్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ సాయంతో మెరుగైన కనెక్టివిటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే వొడాఫోన్‌ ఐడియా దేశంలో 5జీ సేవలను విస్తరిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ ఇప్పటికే తన 5జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. మరోవైపు నెట్‌న్యూట్రాలిటీ విమర్శలపైనా ఎయిర్‌టెల్‌ స్పందించింది. నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ టెక్నాలజీ సాయంతో పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, ఇది న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని తెలిపింది. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌ వల్ల మిగిలిన యూజర్లకు సేవల్లో నాణ్యత తగ్గదని స్పష్టంచేసింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్‌కు సమాధానం ఇచ్చింది. మరో టెలికాం కంపెనీ జియో కూడా ఎయిర్‌టెల్‌ వాదనను సమర్థించింది. నెట్‌న్యూట్రాలిటీకి సూత్రాలకు 5జీ నెట్‌వర్క్‌

Eenadu25 May, 02:35 pm
Ebola outbreak | దిల్లీ: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ (Ebola outbreak) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో...

Ebola outbreak | దిల్లీ: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ (Ebola outbreak) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించి...

Eenadu25 May, 01:22 pm
LIC Joint plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రెండు కొత్త...

LIC Joint plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ బీమా అందించేలా రెండు జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్...

Eenadu24 May, 02:22 pm
RBI dividend: ఆర్‌బీఐ డివిడెండ్‌లో రాష్ట్రాలకూ వాటా పంచండి

- RBI dividend | చండీగడ్‌: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (RBI) ప్రకటించిన డివిడెండ్‌లో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా డిమాండ్‌ చేశారు. - గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.87 లక్షల కోట్లను డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. - ఈ నేపథ్యంలో చీమా స్పందించారు.

Eenadu24 May, 11:25 am
LIC profit: లాభాల్లో LICనే కింగ్‌.. త్రైమాసిక ఫలితాల్లో సత్తా

- LIC profit | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) కీలక మైలురాయిని అందుకుంది. - మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫైనాన్షియల్‌ రంగంలో అత్యధిక లాభం నమోదుచేసిన కంపెనీగా అవతరించింది. - రూ.23,400 కోట్ల నికర లాభంతో మొదటి స్థానం సొంతం చేసుకుంది.

Eenadu26 May, 03:18 pm
Sam Altman: మనుషులకు ప్రత్యామ్నాయంగా ఏఐ మారలేదు: శామ్‌ అల్టామన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: కృతిమ మేధ కారణంగా పలు కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తుండగా ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయంగా ఎప్పటికీ మారలేదన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎంట్రీ లెవల్‌లో భారీగా ఉద్యోగ కోతలు ఉంటాయని అనుకున్నా. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం కొన్ని కంపెనీల అభివృద్ధికి, ఉద్యోగుల పనితీరు మెరుగుదలకు ఏఐ కీలకంగా మారింది. సాంకేతికతను అందిపుచ్చుకున్న వారు స్థిరంగా కొనసాగుతున్నారు. మనుషులు చేసిన పనులను ఏఐ చేస్తుందేమో కానీ వారి ఆలోచనలను, సృజనాత్మకతను ఎప్పటికీ భర్తీ చేయలేదు. మనుషులకు ప్రత్యామ్నాయంగా మారలేదు’’ అని శామ్‌ అల్టామన్‌ అన్నారు. తాను కొన్ని రోజులు ఈ మెయిల్స్‌ సమాధానాలకు ఏఐని వినియోగించినట్టు తెలిపారు. కానీ మనుషుల భావాలు ముఖ్యమని గ్రహించి స్వయంగా తానే ఈ మెయిల్స్‌కు రిప్లై ఇచ్చినట్లు తన స్వీయ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చాలా మంది తక్కువ బడ్జెట్‌లో మంచి గేమింగ్ ఫోన్స్ కొనుగోలు చేయాలని కోరుకుంటారు.

Eenadu26 May, 09:28 am
Artificial Intelligence: ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు: ఈ ఏఐ గురువులకు కాసుల పంట..

ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధను అన్ని రంగాలు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. బేసిక్ టాస్క్‌లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ఏఐ (AI)ని వినియోగించేందుకు కంపెనీలు భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని వాడే విషయంలో తొలుత సంకోచించిన బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. లేకపోతే తాము పోటీలో నిలవలేమోనని ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఏఐ సాధనాలు వాడేలా తమ సిబ్బందిని సిద్ధం చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్‌ ఇస్తోన్న ఓ సంస్థ ఇప్పుడు అమెరికా (USA)లో ప్రాచుర్యం పొందింది. దాని పేరే వాల్‌స్ట్రీట్‌ ప్రాంప్ట్‌. 2025లో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్‌ వాంగ్‌.. వాల్‌స్ట్రీట్‌ ప్రాంప్ట్‌ స్థాపించారు. వారిద్దరూ గతంలో సాఫ్ట్‌బ్యాంక్‌లో పనిచేశారు. ఏఐ ప్లానింగ్‌లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ.. భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే.. 25వేల డాలర్లు (రూ.23,85,322) వసూలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రముఖ ఆర్థిక సంస్థలైన సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్ అమెరికా ఆ జాబితాలో ఉన్నాయి. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్‌, గూగుల్ జెమినై టూల్స్‌తో తమ రోజూవారీ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తిచేయడంలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉద్యోగులపై పిడుగులా చూస్తున్నా.. భవిష్యత్‌లో ఇదే అవసరంగా మారడాన్ని మనం గుర్తిస్తామని ఈ ఏఐ గురువులు చెప్తున్నారు. కాగా.. చాలామంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంలో తగిన శిక్షణ లేదు. దాంతో పాత మోడళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించడానికి భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్‌ రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. ఈ ఏఐతో లేఆఫ్‌లు ఐటీ రంగానికే పరిమితం

Eenadu24 May, 01:23 pm
Loan APP: యాప్‌ ద్వారా రుణమా..? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

- ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు, దాని కోసం బ్యాంకును లేదా NBFCని సంప్రదించడం సాధారణమే. - కానీ, ఇప్పుడు వ్యక్తిగత రుణాలు అందించే ఫిన్‌టెక్ యాప్‌లు చాలా ఉన్నాయి. - ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ పురోగతి కారణంగా, యాప్ ద్వారా వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, దాన్ని పొందడం కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతోంది.

Eenadu27 May, 10:56 am
నుంచి పెరగనున్న హ్యూందాయ్ కార్ల ధరలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ ( Hyundai Motor India price hike) కార్ల ధరలను పెంచనుంది. వేరియంట్‌ను బట్టి రూ.12,800 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. కమొడిటీ, ముడిసరకుల ధరలు పెరగడంతో కార్యకలాపాల వ్యయం భారంగా మారిందని కంపెనీ తెలిపింది. కార్లలో వేరియంట్లు, మోడళ్ల ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. వినియోగదారులపై భారం మోపాలనే ఉద్దేశం సంస్థకు లేదని, మార్కెట్‌ ధరల ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu23 May, 10:31 pm
Smartphone: ఎంత ఎదురుచూసినా.. మీక్కావాల్సిన ఫోన్‌ ధర తగ్గదు

- ఏఐ చిప్‌ల గిరాకీ భారీగా పెరగడమే కారణం డేటా సెంటర్లు, ఏఐ సర్వర్లకు మళ్లింపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ సెమీకండక్టర్ల ధర పైకి పాత మోడళ్ల తయారీకీ ఖర్చు ఎక్కువే ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ విడుదలవడమే ఆలస్యం, వెంటనే దాన్ని కొనే వార... - అయితే కాస్త ఆగి కొంటే అదే ఫోన్‌ తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ మంది భావిస్తారు. - అలా వేచిచూసిన వారికి నిజంగానే చౌకగా అది లభ్యమయ్యేది.

Eenadu29 May, 10:48 am
శాంతి’పై అనిశ్చితి.. సెన్సెక్స్ 1092 పాయింట్లు డౌన్

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి, ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగుతుండటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠాల నుంచి 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,550 దిగువన ముగిసింది. మదుపర్ల సంపద రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.466 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 75,988.51 (క్రితం ముగింపు 75,867.80) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడే 76,220.02 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 74,589.11 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరికి 1092.06 పాయింట్ల నష్టంతో 74,775.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌ షేర్లు మిగిలిన షేర్లు నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండిగో, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 91.40 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4530 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ

Eenadu25 May, 02:38 pm
ఇంటర్నెట్‌ డెస్క్: మెటా తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ పేరుతో యాప్‌ను తీసుకురాగా.....

ఇంటర్నెట్‌ డెస్క్: మెటా తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ పేరుతో యాప్‌ను తీసుకురాగా.. తాజాగా రెడ్డిట్‌ తరహాలో ఫోరమ్‌ (Facebook forum) అనే స్టాండ...

Eenadu29 May, 01:08 pm
ఎల్ ఐసీ షేర్లు 50 శాతం పడ్డాయా? కారణం ఇదే

LIC shares | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో 50 శాతం మేర క్షీణించినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఎల్‌ఐసీ బోనస్‌ ఇష్యూ సంగతి తెలీని వారు ఈ మార్పు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుక్రవారం నుంచి బోనస్‌ షేర్ల జారీ షేరు విలువలో ప్రతిఫలించడమే ఇందుకు కారణం. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు విలువ రూ.830గా ఉంది. బోనస్‌ షేరు వల్ల విలువ సగమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మార్కెట్‌ ప్రారంభంలో రూ.417.60 వద్ద ప్రారంభమైంది. తర్వాత ఒక శాతం నష్టంతో రూ.411 వద్ద మగిసింది. అంటే నష్టపోయింది ఒక శాతం లోపే. కానీ, 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేయడం వల్ల స్టాక్‌ ధరలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు కనిపించింది. మే 29 నాటికి ఎల్‌ఐసీ షేర్లు ఉన్నవారికి 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయాలని ఎల్‌ఐసీ నిర్ణయం తీసుకుంది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు కలిగిన వాటాదార్లకు అదనంగా రూ.10 ముఖ విలువ కలిగిన మరో ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 2025 డిసెంబరు 31 నాటికి ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.6,325 కోట్ల నిల్వలు, మిగులు నిధులతో ఈ బోనస్‌ ఇష్యూను పూర్తి చేయనున్నట్లు ఎక్స్ఛేంజీలకు గతంలో ఎల్‌ఐసీ సమాచారం ఇచ్చింది. దీనివల్ల కంపెనీ షేర్లు సంఖ్య పెరగడమే కాకుండా.. రిటైల్‌ మదుపర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. షేర్ల సంఖ్య పెరిగినంత మాత్రాన కంపెనీ మార్కెట్‌ విలువలో ఎలాంటి మార్పూ ఉండదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల

Eenadu28 May, 10:07 am
వ్యక్తిగత రుణాలపై కొన్ని సాధారణ అపోహలివే

వ్యక్తిగత రుణం..దరఖాస్తుదారులకు వివిధ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సహాయపడే సౌకర్యం. వ్యక్తిగత రుణాలు తాత్కాలిక నగదు అవసరాలను తీర్చుకోవడానికి ఒక మెరుగైన ప్రత్యామ్నాయం లాంటివి కూడా. అయితే, అటువంటి రుణాలతో ముడిపడి ఉన్న కొన్ని సాధారణ అపోహలు, కొంతమంది వీటిని పొందకుండా నిరోధిస్తుంటాయి. వాస్తవంగా, వ్యక్తిగత రుణాలను వివేకంతో ఉపయోగిస్తే అవి మీ ఆర్థిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు చేయాల్సిందల్లా, వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం. సరైన వాస్తవాలను తెలుసుకోవడానికి, తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ కింది విషయాలను తెలుసుకోవడం అవసరం. రుణాన్ని పొందడానికి సుదీర్ఘ దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని రుణాల గురించి తెలియని కొందరి అభిప్రాయం. అయితే, వ్యక్తిగత రుణాలను ఇప్పుడు చాలా రుణ సంస్థలు డిజిటల్‌, ఆన్‌లైన్‌ పద్ధతిలోనే చాలా వేగంగా మంజూరుజేస్తున్నాయి. రుణాలను పొందడానికి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ కూడా కాగిత రహితంగా డిజిటల్‌ పద్ధతిలోనే చాలా సులభంగానే ఉంటుంది. కేవలం కొన్ని గంటల్లోనే రుణ మంజూరుకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యంగా క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి ప్రీ-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్స్‌ లభిస్తాయి. ఇవి మంజూరవ్వడానికి పట్టే సమయం చాలా తక్కువ అని చెప్పవచ్చు. వ్యక్తిగత రుణం, మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి మాత్రమేనని ఒక సాధారణ అపోహ ఉంది. అది కొంతమేరకు నిజమే. బ్యాంకులు క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుని మీ క్రెడిట్ యోగ్యతను నిర్ణయిస్తాయి. అధిక స్కోరు..బ్యాంకు నుంచి రుణం పొందడంలో మీకు సహాయపడుతుంది. అయితే, తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల రుణ దరఖాస్తు ఆటోమేటిక్‌గా తిరస్కరణకు గురికాదు. ఆదాయం, ఉపాధి స్థిరత్వం, తక్కువ రుణ మొత్తం మొదలైన ఇతర పరిస్థితులను బట్టి, తక్కువ క్రెడిట్ స్కోరుతో కూడా మీరు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. అయితే, కొంత

Eenadu26 May, 10:24 am
Personal Loan: టాప్-అప్ లోన్ Vs పర్సనల్‌ లోన్..ఏది ఎంచుకోవాలి?

బ్యాంకుల నుంచి వివిధ రకాల నగదు అవసరాల కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. రుణ సంస్థలు వ్యక్తిగత రుణాలు అందించడం ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో రుణ దరఖాస్తుదారుల నగదు అవసరాలను తీరుస్తాయి. క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నప్పుడు వీటిని పొందడం సులభమే. ఈ రుణాలకు ఎలాంటి హామి అవసరం లేదు. ఈ రుణాన్ని పిల్లల విద్యకు, వివాహ ఖర్చులకు, ఇంటి మరమ్మతులు, ఇంకా అనేక అవసరాలకు ఉపయోగించొచ్చు. అయితే, వ్యక్తిగత రుణ చెల్లింపులు పూర్తికాక ముందే కొన్ని నెలల తర్వాత మళ్లీ నగదు అవసరాలు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితులలో మీకు రెండు ఎంపికలు ఉంటాయి. మరొక కొత్త పర్సనల్ లోన్ తీసుకోవడం లేదా టాప్-అప్ లోన్ తీసుకోవడం. టాప్-అప్ లోన్ అంటే మీ ప్రస్తుత వ్యక్తిగత రుణంపై మీరు పొందగలిగే అదనపు రుణం. స్థిరమైన రుణ చెల్లింపు రికార్డు ఉన్న రుణగ్రహీతలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి. రుణగ్రహీతలు ఇప్పటికే వ్యక్తిగత రుణం ఉన్న అదే బ్యాంకులో టాప్-అప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా బ్యాలెన్స్‌ను మరొక బ్యాంకుకు బదిలీ చేసి అక్కడ టాప్-అప్ లోన్ పొందవచ్చు. వ్యక్తిగత రుణం, టాప్‌-అప్‌-లోన్‌ మధ్య వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. మీకు అవసరమైన లోన్ మొత్తం తక్కువగా, అత్యవసరంగా ఉంటే, మీరు టాప్-అప్ లోన్ తీసుకోవచ్చు. దీని చెల్లింపుల షెడ్యూల్, కాలపరిమితి పర్సనల్ లోన్ మాదిరిగానే ఉంటాయి. అనేక పర్సనల్ లోన్లను నిర్వహించడంతో పోలిస్తే, టాప్-అప్ లోన్‌ను నిర్వహించడం సులభం. మీకు అవసరమైన రుణ మొత్తం ఎక్కువగా ఉండి, మీరు ఎక్కువ కాలపరిమితిని కోరుకుంటే, మీరు మరో వ్యక్తిగత రుణం తీసుకోవడాన్ని పరిగణించవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే కాలపరిమితి, చెల్లింపుల

Eenadu25 May, 11:01 am
ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి (Stock Market Today). పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో...

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి (Stock Market Today). పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్‌ 1100 పాయింట్లు వరకు పెరిగింది....

Eenadu23 May, 07:45 pm
Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (23/05/2026)

- Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. - అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. - పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం.

Eenadu25 May, 11:02 am
వ్యక్తులకు ఎన్ని ఆర్థిక ప్రణాళికలు ఉన్నప్పటికీ, పదవీ విరమణ ప్రణాళిక చాలా కీలకమైందని చెప్పొచ్చు. కానీ, భారత్‌లో చాలా మంది పదవీ విరమణ కోసం...

వ్యక్తులకు ఎన్ని ఆర్థిక ప్రణాళికలు ఉన్నప్పటికీ, పదవీ విరమణ ప్రణాళిక చాలా కీలకమైందని చెప్పొచ్చు. కానీ, భారత్‌లో చాలా మంది పదవీ విరమణ కోసం పొదుపు చేయకుండా, ఇంకా ఎక్కువ కాలం పనిజేసి వచ్చిన ఆదాయాన్ని పదవీ విరమణ నిధి కింద ఉపయ...

Zee Telugu26 May, 01:44 am
LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు...

LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు ఉమ్మడి జీవిత బీమా పథకాలను ఆవిష్కరించింది. ఎల్ఐసీ న్యూజీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన...

Eenadu26 May, 09:26 am
అదానీ గ్రీన్‌ ఎనర్జీ రికార్డ్‌.. 3.37 గిగావాట్‌ అవర్‌ ఎనర్జీ స్టోరేజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: అదానీ గ్రీన్‌ ఎనర్జీ రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్‌ అవర్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్‌ను (Adani green energy) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దీంతో చైనా వెలుపల ఒకే చోట నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌గా ఇది నిలిచింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయొచ్చు. ఈ భారీ ప్రాజెక్టును కేవలం 10 నెలల్లోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ పూర్తి చేయడం విశేషం. ఇందులో భాగంగా 1.37 గిగావాట్‌ అవర్‌ కెపాసిటీని మార్చిలోనే కంపెనీ ప్రారంభించింది. మిగిలిన సామర్థ్యాన్ని జోడించి మొత్తం 3.37 గిగావాట్‌ అవర్‌ కెపాసిటీకి చేర్చింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు రోజంతా సరిపడా విద్యుత్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ తెలిపారు. సౌర, పవన వ్యవస్థల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ ఉంచి, అవసరమైనప్పుడు వాడుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ ఇంధన రంగానికి స్వావలంబన, సుస్థిరత లభిస్తుందని దీనివల్ల నాణ్యమైన, అందుబాటు ధరలో విద్యుత్‌ లభిస్తుందని వెల్లడించారు. విద్యుత్‌ను నిల్వ చేసేందుకు అధునాతన లిథియం అయాన్‌ బ్యాటరీలను అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.