translateexpand_more

Cricket News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 03:25 am
మా ప్లాన్ అదే.. ఈ కప్పూ వారికే అంకితం

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. నాకౌట్‌ స్టేజ్‌లోని గత మూడు మ్యాచుల్లో టాస్‌ గెలిచిన టీమ్‌ తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. అందుకు భిన్నంగా ఆర్సీబీ లక్ష్య ఛేదన వైపే మొగ్గుచూపడం గమనార్హం. దీనిపై బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ స్పష్టత ఇచ్చాడు. అలాగే ఈ విజయాన్ని వారి అభిమానులకే మళ్లీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఫైనల్‌ కోసం ఇక్కడికి వచ్చాక గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శించాం. ఈ విజయంపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. టాస్‌ గెలిస్తే ఏం చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్య ఛేదన సులువుగానే ఉంటుందని భావించాం. అందుకే, టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నాం. గుజరాత్ టాప్ - 3 బ్యాటర్లను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుందని తెలుసు. భువీ, జోష్, రసిఖ్ ఈ సీజన్‌లో చాలా ప్రభావం చూపించిన బౌలర్లు. జట్టులోని ప్రతి బౌలర్‌ను నేను మెన్షన్ చేయాలి. కెప్టెన్‌గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. వరుసగా రెండోసారి కప్పును సగర్వంగా ఎత్తుకోవడం మరిచిపోలేని సందర్భం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ, ఈసారి అంచనాలు ఉన్నాసరే ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం’’ అని పాటీదార్ తెలిపాడు. ‘‘ఈ

Eenadu01 Jun, 02:15 am
మారింది నా ఆట కాదు.. ఆలోచనా విధానమే

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌ విజేతగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలవడంలో విరాట్ కోహ్లీ పాత్ర కీలకమైందే. బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించిన అతడు.. మైదానంలోనూ దూకుడుగా వ్యవహరించాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై ఫైనల్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ తన జట్టుకు రెండో కప్పును అందించాడు. ఇప్పుడున్న కుర్రాళ్లే మనల్ని మరింత ముందుకు వెళ్లేలా చేస్తారని విరాట్ వ్యాఖ్యానించాడు. ‘‘ కప్పును అందుకోవాలని ప్రతి ఒక్క ప్లేయర్‌ కలలు కంటాడు. ఇలాంటి క్షణాలను ఎక్కువ సార్లు రావాలని అనుకుంటాడు. ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు ఆ విజయాన్ని ఖాయం చేసే పరుగులు కొడుతూ క్రీజ్‌లో నిలబడి ఉండాలనేది నా కల. అది ఈసారి సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి మేం కొత్తగా ఏమీ చేయలేదు. చాలా రిలాక్స్‌గా ఉన్నాం. కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగాం. మేం ఎలా ఆడాలని అనుకున్నామో.. అదే ఆటతీరును ప్రదర్శించాం. నా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని చేయడం వెనుక కుర్రాళ్లే కారణమని చెబుతా. సూపర్ యంగ్‌ ప్లేయర్లు మనల్ని నిరంతరం ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు మన గేమ్‌ను మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మెరుగ్గా మారాలంటే బాగా శ్రమించాలి. ఇప్పుడు మోడ్రన్ క్రికెట్‌లో ఎప్పుడైనా సరే అదనంగా 20 లేదా 30 పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు నా మైండ్‌సెట్‌ను మాత్రమే మార్చుకున్నా. నా ఆటతీరు కాదు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు భారీగా షాట్లు కొట్టేందుకూ వెనుకాడను. ప్రత్యర్థిగా బెస్ట్ బౌలర్‌ ఉన్నా సరే కొట్టాలనుకుంటే కొట్టేయడమే. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని విరాట్ అన్నాడు. ‘‘గతేడాది మేం ఛాంపియన్‌గా నిలిచాం. ఈసారి మాపై భారీ అంచనాలు వచ్చాయి. మేం ఒక్కో లక్ష్యం పెట్టుకుని మరీ

Eenadu01 Jun, 09:08 am
తగ్గని విజయ కాంక్ష.. ఇదీ విరాట్ సక్సెస్ మంత్ర

అన్నింటికీ మించి ఓ యోధుడు ఆ జట్టుకు వెన్నెముకగా మారాడు.. ఛేజింగ్‌ కింగ్‌ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు.. తమ తొలి ఐపీఎల్ టైటిల్‌కు ‘ద్వితీయ’ విఘ్నం లేకుండా చేసేశాడు పైన ఉపోద్ఘాతమంతా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించే.. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో ఒకే ఒక్క జట్టుకు ఆడుతూ నిలకడగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్. విజయమో.. వీరస్వర్గమో కాదు. గెలుపే శ్వాస.. గెలుపే లక్ష్యం. ఆర్సీబీ రెండోసారి కప్పును సొంతం చేసుకోవడంలో విరాట్ అండ్‌ కో పాటించిన సక్సెస్ మంత్ర ఇదే. ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పట్టువిడవకుండా 75 పరుగులతో అజేయంగా చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్‌లో 675 పరుగులు చేశాడు. అత్యుత్తమ యావరేజీ కూడా విరాట్‌దే కావడం గమనార్హం. ఐపీఎల్ జరిగిన దాదాపు రెండు నెలలూ ఎండాకాలమే. ఎక్కువ మ్యాచులు రాత్రి 7 గంటలకు మొదలైనా సరే.. ఆ ఉక్కపోత తట్టుకోవడం కష్టం. 20 ఓవర్లపాటూ మైదానంలో ఉత్సాహంగా ఉండాలంటే ఫిట్‌నెస్ అత్యంత కీలకం. ఈ విషయంలో విరాట్ కోహ్లీపై ఒక్క రిమార్కూ ఉండదు. ఇప్పుడున్న కుర్రాళ్ల కంటే జోష్‌గా పరుగులు పెట్టాడు. బ్యాటింగ్‌ సమయంలోనూ అంతే. సహచరులు ఏమైనా వెనుకడుగు వేస్తే పదమంటూ పరుగులు పెట్టించాడు. సింగిల్‌ వచ్చే దగ్గర కూడా డబుల్‌ తీసిన సందర్భాలెన్నో! ‘‘నా అంత ఫిట్‌నెస్ ఇప్పుడున్న కుర్రాళ్లకూ ఉండదు. మైదానంలో 40 ఓవర్లపాటు ఇటు నుంచి అటు వైపు పరుగులు పెట్టమన్నా పెడతా. సింగిల్‌, డబుల్స్‌ తీస్తూ వెళ్లాలని చెబితే అదీ చేస్తా. ఆట కోసం నేనేమీ ప్రత్యేకంగా తయారుకాను. నా దినచర్య ఇలానే ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెడీగా ఉంటా’’ ఐపీఎల్‌ కప్పును సొంతం చేసుకుని

Eenadu01 Jun, 03:49 am
పరిస్థితులకు అనుగుణంగా ఆడా

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌లో హాట్‌ టాపిక్‌ వైభవ్ సూర్యవంశీ. ఈ ఎడిషన్‌లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో ఓడి ఇంటిముఖం పట్టినా.. అతడు మాత్రం తన ఆటతో దుమ్మురేపాడు. అత్యధిక పరుగులు (776) చేసి ఆరెంజ్ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు మరి కొన్ని అవార్డులను దక్కించుకున్నాడు. ఎమర్జింగ్‌ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రయిక్‌రేట్ (237.3), సూపర్ సిక్సర్ల (72) అవార్డులు వరించాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం వాటిని స్వీకరించిన వైభవ్‌.. ఈ టోర్నీలో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘‘అవార్డులు వచ్చినందుకు ఆనందంగా ఉన్నా.. ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. నాకు ఇది గర్వపడే క్షణం. వచ్చే సీజన్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. (నిర్భయంగా ఆడేందుకు రోజుకు ఎన్ని గ్లాస్‌ల పాలు తాగుతావు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ) సార్.. నేను ఇవాళ పాలు తాగలేదు (నవ్వుతూ). ఆట కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. సహజసిద్ధంగా ఆడేందుకు ప్రయత్నించా. తొలి బంతి నా జోన్‌లో పడితే భారీ షాట్ కొట్టేందుకే చూస్తా. ఒక్కసారి కనెక్ట్ అయితే అదే దూకుడుతో ఆడతా. నేను ఈ సీజన్‌లో ఓ కీలక విషయం నేర్చుకున్నా. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలనేది తెలుసుకున్నా. అలాగే పరిస్థితికి తగ్గట్టుగా జట్టుకు ఏది అవసరమో తెలుసుకుని ఆడా. నాకౌట్‌ స్టేజ్‌లోనూ అది చేసి చూపించా. ఫిట్‌నెస్‌పైనా దృష్టి పెట్టా. సుదీర్ఘకాలం పాటు ఆడాలంటే అదెంతో కీలకం. గాయాలు కాకుండా చూసుకోవాలి. మా జట్టులోని ప్రతి ఒక్కరూ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. వారంతా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు. జట్టులో చాలా మంచి వాతావరణం ఉంది’’ అని వైభవ్‌ తెలిపాడు.

Eenadu03 Jun, 11:07 am
ఆ మ్యాచ్ కే కాకుండా టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురండి

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్‌ (Women's T20 World Cup 2026) జూన్ 12 నుంచి మొదలుకానుంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అభిమానులు, మీడియాకు ఓ విజ్ఞప్తి చేసింది. కేవలం భారత్, పాక్‌ మ్యాచ్‌కే హైప్‌ క్రియేట్ చేయొద్దని, టోర్నీ మొత్తానికి ఆదరణ వచ్చేలా ప్రచారం చేయాలని కోరింది. ‘‘2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బర్మింగ్‌హామ్‌లో భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే కాకుండా మనం టీ20 ప్రపంచ కప్‌నకు కూడా మరింత ప్రచారం కల్పించాలని ఆశిస్తున్నాను. కేవలం ఒక మ్యాచ్‌కే మనం ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. అభిమానులు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. వారి కోసం మేం మంచి ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉంది’’ అని మంధాన పేర్కొంది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌ లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో (జూన్ 14న) ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడనుంది. ఇక, భారత జట్టు విషయానికొస్తే.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా నెగ్గింది. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu03 Jun, 05:40 am
అది ఫేక్ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఏఐ యుగంలో ఏది నిజమో.. ఏది కల్పితమో తెలియని పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని చాలా నెమ్మదిగా ఆడతాడంటూ అవమానించేలా మాట్లాడినట్లున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విరాట్‌ గురించి హర్షా భోగ్లే ఒక ప్రశ్న అడిగితే.. వైభవ్‌ దానికి సమాధానం ఇచ్చినట్లుగా ఉంది ఆ వీడియో. అయితే అది ఫేక్‌ వీడియో అని ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ‘ఎక్స్‌’ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియో ఫేక్‌. అందులో వైభవ్‌ను మర్యాద తెలియనివాడిగా, అహంకారిగా చిత్రీకరించారు. నేను అతడిని ఆ ప్రశ్న అడగలేదు. అతడు కూడా అలాంటి సమాధానమేదీ ఇవ్వలేదు. క్రూరంగా, దురుద్దేశపూర్వకంగా ఇలా వీడియో క్రియేట్‌ చేశారు. తనతో మాట్లాడిన కొద్దిమందితో చాలా గౌరవంగా మాట్లాడే ఒక చిన్న పిల్లాడి విషయంలో ఇలా ప్రవర్తించడం మరింత దారుణం’ అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఫేక్‌ వీడియోలో ఏముందంటే.. ‘మీరు కూడా విరాట్‌ కోహ్లీలా క్రికెట్‌ ప్రపంచాన్ని ఓ రాజులా ఏలాలి అనుకుంటున్నారా?’ అని హర్షా భోగ్లే అడిగితే.. ‘నాకు విరాట్‌ భయ్యా అంటే ఇష్టం. కానీ నాకు అతడి రికార్డ్స్‌ అంటే ఇష్టం లేదు. అతడు చాలా నెమ్మదిగా హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు చేస్తాడు..’ అని అన్నట్లుగా ఉంది. కానీ అదంతా ఫేక్‌ అని హర్షా భోగ్లే తేల్చిచెప్పాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 04:43 am
రజత్ పాటీదార్ .. ది సైలెంట్ కిల్లర్

ఐపీఎల్‌లో ఆర్సీబీ అనగానే అందరికీ విరాట్‌ కోహ్లి గుర్తుకొస్తాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతూ ఆ ఫ్రాంఛైజీకి కోహ్లి తీసుకొచ్చిన ఆకర్షణ, విలువే వేరు. ఇప్పటికీ కింగ్‌ నిలకడను కొనసాగిస్తున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కానీ కెప్టెన్‌గా ఆర్సీబీ రాత మార్చి, బ్యాటర్‌గా ఆ జట్టును ఎంతో ప్రమాదకరంగా తీర్చిదిద్దుతున్న ఘనత మాత్రం రజత్‌ పాటీదార్‌కే చెందుతుంది. అతడికి స్టార్‌ ఇమేజ్‌ లేదు. తన గురించి సోషల్‌ మీడియాలో పెద్దగా చర్చ జరగదు. మైదానంలో, బయట అతను కూడా పెద్దగా హడావుడి చేయడు. కానీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రశాంతంగా పని చేసుకుపోతూ ఆర్సీబీని మేటి జట్టుగా నిలబెడుతున్నాడు పాటీదార్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరు అనగానే.. ఇది సమవుజ్జీల పోరు అని, ఎంతో హోరాహోరీగా సాగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆర్సీబీ దూకుడు ముందు జీటీ ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక ఇన్నింగ్స్‌ అయ్యేసరికే మ్యాచ్‌ ఫలితంపై ఒక అంచనా వచ్చేసింది. ఆర్సీబీ ఆల్‌రౌండ్‌ మెరుపుల ధాటికి బెంబేలెత్తిన టైటాన్స్‌.. ఏకంగా 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు పాటీదార్‌. అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత తన బౌలింగ్, ఫీల్డింగ్‌ వ్యూహాలతోనూ అతను తన ప్రత్యేకతను చాటాడు. గుజరాత్‌ లాంటి బలమైన బ్యాటింగ్‌ ఉన్న జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌లో కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెలరేగిపోవడం పాటీదార్‌కు ఇది కొత్తేమీ కాదు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభ దశలోనే అతను 2022

Eenadu31 May, 10:33 am
ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లు.. మరి మిగతా టీమ్ ల పరిస్థితేంటి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. మరి 19వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా నేడు ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు కప్పు సొంతమవుతుంది. దాంతోపాటు భారీ మొత్తం ప్రైజ్‌మనీ కూడా దక్కనుంది. మరి అదెంత? రన్నరప్‌ అయిన టీమ్‌కు ఎంత లభిస్తుంది? మిగతా జట్ల పరిస్థితి? వ్యక్తిగతంగా ప్లేయర్లకూ ఎంత వస్తుందో చూద్దాం.. బీసీసీఐ వర్గాల ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 46 కోట్లు. 2008లో తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పుడు విజేతకు రూ. 4.8 కోట్లు దక్కేవి. తర్వాత సీజన్‌లోనూ అంతే మొత్తం. అయితే, 2010 నుంచి 2013 వరకు రూ. 10 కోట్లు చొప్పున అందించారు. 2014, 2015లో రూ. 15 కోట్లు.. 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు విజేతకు దక్కింది. కొవిడ్‌ కారణంగా 2020లో ప్రైజ్‌మనీని రూ. 10 కోట్లకు తగ్గించింది. ఇక 2021 నుంచి ప్రస్తుత సీజన్‌ వరకూ రూ. 20 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీని విజేతకు ఇస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

SkyC Media31 May, 06:15 pm
కోహ్లీ విశ్వరూపం, గుజరాత్ పై ఘనవిజయం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 విజేత ఆర్‌సీబీ జట్టుగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును ఆర్‌సీబీ బౌలర్లు తక్కువ పరుగులకే నియంత్రించారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 50 పైగా పరుగులు చేసి రాణించారు. సాయి సుదర్శన్ 40 పైగా పరుగులతో కీలక సహకారం అందించారు. శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియా పరుగులు చేసినప్పటికీ స్కోరు వేగాన్ని పెంచలేకపోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో గుజరాత్‌ను గట్టిగా దెబ్బతీశారు. దీంతో గుజరాత్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితం కాగా భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉండగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఫలితంగా ఆర్‌సీబీ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆర్‌సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ 14 బంతుల్లో 11 పరుగులు చేసి కోహ్లీకి

Vaartha29 May, 05:46 pm
రాజస్థాన్ పై గిల్ విధ్వంసం

RR VS GT Scorecard: ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (Gujarat Titans) కెప్టెన్ (Shubman Gill) అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. (Rajasthan Royals)తో జరుగుతున్న కీలక పోరులో గిల్ దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్సులు, 15 ఫోర్లు ఉండటం విశేషం. మ్యాచ్ ప్రారంభం నుంచే గిల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. రాజస్థాన్ బౌలర్లపై ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అటాకింగ్ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. మరో ఓపెనర్ (Sai Sudharsan) కూడా అద్భుతంగా ఆడి 58 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి గుజరాత్‌కు పటిష్ట స్థితి కల్పించింది. సాయి సుదర్శన్ ఔటైన తర్వాత (Jos Buttler) క్రీజులోకి వచ్చి గిల్‌కు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోర్ 175/1గా కొనసాగుతోంది. గిల్ దూకుడు చూస్తుంటే గుజరాత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్‌కు(RR VS GT Scorecard) చేరుకోనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. Singareni Employees: సింగరేణి ఉద్యోగుల సమస్యలపై చర్చ! IPL 2026 Final : గిల్-సుదర్శన్ సునామీ.. ఫైనల్‌లోకి గుజరాత్ టైటాన్స్! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. GT VS RR Match :ఫైనల్‌కు గుజరాత్..ఆర్సీబీతో టైటిల్ ఫైట్! IPL Qualifier 2 : రాజస్థాన్‌కు టెన్షన్.. వికెట్ కోల్పోకుండా

Eenadu30 May, 10:21 pm
నీదా.. నాదా

రెండో టైటిల్‌పై బెంగళూరు, గుజరాత్‌ గురి ఐపీఎల్‌-19 తుదిపోరు నేడే రాత్రి 7.30 నుంచి అహ్మదాబాద్‌ కొన్ని జట్లు మొదట్లో అదరగొట్టి, తర్వాత తుస్సుమనిపించాయి.. కొన్ని జట్లు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముందంజ వేసి, అసలు సమరాల్లో చేతులెత్తేశాయి. చివరికి టోర్నీలో ఇప్పటిదాకా ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు మేటి జట్లే అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. లీగ్‌ దశలో సమాన విజయాలతో టాప్‌-2లో నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఐపీఎల్‌ 19వ సీజన్‌ టైటిల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఐపీఎల్‌ ట్రోఫీ కల నెరవేర్చుకున్న ఆర్సీబీ, వరుసగా రెండో టైటిల్‌ పట్టేయాలని పట్టుదల ప్రదర్శిస్తుంటే.. ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే ఛాంపియన్‌గా కావడమే కాక అయిదేళ్లలో మూడో ఫైనల్‌ ఆడబోతున్న జీటీ కూడా రెండో కప్పుపై కన్నేసింది. మరి ఆదివారం సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఫైనల్లో అ‘ద్వితీయ’ విజయాన్నందుకునే జట్టేదో? ప్రపంచ క్రికెట్‌ ప్రేమికుల ఫేవరెట్‌ లీగ్‌ ఐపీఎల్‌లో ఈ సీజన్‌కు మిగిలింది ఇంకొక్కటే మ్యాచ్‌. రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన లీగ్‌లో ఆఖరి పోరుకు వేళైంది. ఆదివారం ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును.. 2022 విజేత గుజరాత్‌ టైటాన్స్‌ ఢీకొనబోతోంది. టోర్నీలో అత్యుత్తమ జట్ల మధ్యే ఫైనల్‌ జరుగుతుండడం.. ఆల్‌రౌండ్‌ బలంతో సమవుజ్జీల్లా కనిపిస్తున్న టీమ్స్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడం ఈ పోరుపై ఆసక్తిని పెంచుతోంది. ఇరు జట్లూ రెండో కప్పు మీదే గురి పెట్టడం విశేషం. తన సొంతగడ్డ అహ్మదాబాద్‌లో ఆడబోతుండడం గుజరాత్‌కు సానుకూలాంశం కాగా.. క్వాలిఫయర్‌-1లో ఇదే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈ ఐపీఎల్‌లో మిగతా

Eenadu31 May, 03:50 pm
గుజరాత్ ను ఆదుకున్న వాషింగ్టన్ సుందర్.. ఆర్సీబీ లక్ష్యం 156

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50*; 37 బంతుల్లో) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), శుభ్‌మన్ గిల్ (10) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన నిశాంత్ సింధు (20) పరుగులు చేసి వెనుదిరిగాడు. జోస్ బట్లర్ (19) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అర్షద్ ఖాన్ (15) రన్స్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, జోష్‌ హేజిల్‌వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రెండు ఓవర్లలో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. ఈ క్రమంలో బంతిని అందుకున్న హేజిల్‌వుడ్ తన తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్‌ను వెనక్కి పంపాడు. తర్వాత భువీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ భారీ షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్‌ జితేశ్‌కు చిక్కాడు. బట్లర్, నిశాంత్ సింధు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గుజరాత్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ, ఎనిమిదో ఓవర్లో రసిఖ్ సలామ్ నిశాంత్‌ను ఔట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. 9-12 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. దూకుడుగా ఆడలేకపోయిన బట్లర్.. కృనాల్ వేసిన 13 ఓవర్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అర్షద్ ఖాన్‌ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపడంతో గుజరాత్ 14.1 ఓవర్లకు 99/5తో మరింత కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రాహుల్ తెవాతియా (7) కూడా విఫలమయ్యాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 34 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే

Eenadu30 May, 02:14 am
సాయి సుదర్శన్ చేతికి టేప్ వేయాలేమో

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్‌ దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను అలవోకగా చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో మెరిశాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ తలపడనుంది. వరుసగా రెండోసారి సాయి సుదర్శన్ హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు చేరడం గమనార్హం. దీనిపై కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమ జట్టు ప్రదర్శనపైనా మాట్లాడాడు. ‘‘టాస్ సమయంలో కాస్త అయోమయానికి గురయ్యాం. అందులో ఓడినా.. మ్యాచ్‌లో గెలవడం ఆనందంగా ఉంది. సాయి సుదర్శన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. మేమిద్దరం ఆటను అర్థం చేసుకొనే విధానం ఒకేలా ఉంటుంది. ఏ బౌలర్‌ను ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లోనూ సాయి హిట్‌వికెట్‌ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ వీడియో చూశా. అందులో అతడి చేతులకు టేప్‌ వేసి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లో నేనూ అదే చేయాలేమో (నవ్వుతూ)’’ అని గిల్ తెలిపాడు. ‘‘ఒక దశలో మేం వారిని 180 లేదా 190 పరుగులకే కట్టడి చేయాలని భావించాం. కానీ, 214 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో మాకు మంచి ఆరంభం దక్కింది. నేను చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నా. అలాగే జరిగింది. మాకు చాలా బౌలింగ్‌ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, వాటిని వినియోగించే అవసరం రాలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా లోతైంది. ఫైనల్‌ మ్యాచ్‌ హోం గ్రౌండ్‌లో ఆడనుండటం మాకు కలిసొస్తుంది. అయితే, మరో గొప్ప జట్టుతో తలపడనున్నామనే విషయాన్ని మరువకూడదు. నాణ్యమైన క్రికెట్ ఆడితే విజయం ఆటోమేటిక్‌గా దరిచేరుతుంది’’ అని గిల్ వెల్లడించాడు. రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్

Eenadu29 May, 07:35 am
హిట్ మ్యాన్ చెప్పిన ప్లేయరే ముంబయికి కొత్త సారథి

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ప్రదర్శన దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి నుంచి అభిమానులు ఇలాంటి ఆటతీరును ఆశించలేదు. స్టార్ ప్లేయర్లున్నా విజయాలు దక్కలేదు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరు వల్లేనని ఫ్యాన్స్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ సారథ్యం నుంచి హార్దిక్‌ వైదొలుగుతాడని.. అందుకు ఇటీవల పెట్టిన పోస్టులే సాక్ష్యమని నెట్టింట చర్చ సాగుతోంది. తాజాగా మరొక అంశం కూడా బయటకు వచ్చింది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్‌కే ముంబయి సారథ్యం దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్ల కిందట రోహిత్‌కు బదులు హార్దిక్‌ పాండ్యను సారథిగా నియమించింది. ఆ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే సీజన్‌కు కొత్త సారథిని నియమించే అవకాశాలు ఎక్కువే. గతంలో చేసిన పొరపాట్లను ముంబయి సరిచేసుకొనేలా నిర్ణయం తీసుకోనుంది. రోహిత్ మళ్లీ సారథిగా రాడు. కానీ, కొత్త కెప్టెన్‌కు రోహిత్ శర్మ ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ‘‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్‌లో జట్టు మారేందుకూ మొగ్గు చూపిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఏదైనా కంపెనీలో మేనేజ్‌మెంట్‌తో సరైన అనుబంధం లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు హార్దిక్‌ పరిస్థితి కూడా ఇంతే’’ అని ముంబయి క్రికెట్ వర్గాలు తెలిపాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో

Eenadu31 May, 01:08 pm
ముక్కోణపు సిరీస్ .. టీమ్ ఇండియా ఎ’ వైస్ కెప్టెన్ మార్పు

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌కు భారత్‌-ఎ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన రియాన్‌ పరాగ్‌.. గాయం కారణంతో వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌కు చోటు కల్పించిన బీసీసీఐ.. వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలూ అప్పగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రై సిరీస్‌లో భారత్ ఎ, శ్రీలంక ఎ, అఫ్గానిస్థాన్ ఎ జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి.మ్యాచ్‌లన్నింటికీ దంబుల్లా ఆతిథ్యమివ్వనుంది. ముక్కోణపు సిరీస్‌కి భారత్‌-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్జే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్‌కీపర్), విప్రాజ్‌ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్విర్ సింగ్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్‌ రాయ్. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 02:36 pm
ఆ ఇద్దరిని ట్రాన్స్ ఫర్ చేసి.. సీఎస్ కే హార్దిక్ ను తీసుకోవాలి

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఐపీఎల్ సీజన్‌ నాటికి హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌ వీడి బయటకు వస్తాడని ప్రచారం సాగుతోంది. దీంతో అతడిని సొంతం చేసుకొనేందుకు పోటీ తప్పకుండా ఉంటుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. ఇలా కెప్టెన్ అవసరమున్న టీమ్‌లు ఉన్నాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌కు తీసుకోవాలనే వారూ లేకపోలేదు. రుతురాజ్‌ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో ఇబ్బంది పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్‌కు పాండ్యను సీఎస్‌కేలోకి తీసుకోవాలని సూచించాడు. ట్రేడింగ్‌లో ఇద్దరు సీఎస్‌కే ఆటగాళ్లను ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలిపాడు. ‘‘ఒకవేళ నేనే మంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ అయి ఉంటే.. సీఎస్‌కే నుంచి శివమ్‌ దూబే, ఆయుష్ మాత్రేను తీసుకొనేవాడిని. హార్దిక్‌ పాండ్యను వారికి ఇచ్చేవాడిని. హార్దిక్ రాకతో చెన్నై సూపర్ కింగ్స్‌ బ్రాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే సంజు శాంసన్‌ను సారథిగా చేయాలని రూల్‌ ఏమీ లేదు. ఒకవేళ పాండ్య వచ్చి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. అతడికే అవకాశం ఇస్తా. ఎంఎస్ ధోనితో పాండ్యకు మంచి అనుబంధం ఉంది. సీఎస్‌కేకు అతడు వస్తే సమతుల్యం అవుతుంది’’ అని బద్రీనాథ్‌ విశ్లేషించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 05:42 am
నా జీవితంలో ఇలాంటివి రెండే సందర్భాలు

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే క్రికెట్ అభిమానులకు తెలిసింది. అతడికి మాజీ క్రికెటర్లూ ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఈ జాబితాలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నాడు. వైభవ్‌ సూర్యవంశీతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇలా వేరే అథ్లెట్‌తో సెల్ఫీ తీసుకోవడం తన జీవితంలో రెండోసారి మాత్రమేనని తెలిపాడు. ‘‘వారం రోజుల కిందట.. నా జీవితంలో రెండోసారి మాత్రమే ఓ పని చేశా. అదేంటంటే.. మరొక క్రీడాకారుడిని సెల్ఫీ అడిగి తీసుకున్నా. తొలిసారి నా చిన్ననాటి హీరో అయిన ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ లెజెండ్ స్టీఫెన్ మైకెల్‌తో కొద్ది రోజుల కిందట సెల్ఫీ దిగా. ఇప్పుడు రెండోసారి బిహార్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చిన 15 ఏళ్ల పిల్లాడితో దిగా. ఇదేదో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై బాగా ఆడినందుకు కాదు. ఇప్పటికే టీ20 టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే సెంచరీ కొట్టిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్‌ రికార్డు సృష్టించాడు. దాదాపు 35 ఏళ్లుగా క్రికెట్‌తో నాకు అనుబంధం ఉంది. ఓ పదిహేనేళ్ల కుర్రాడు ఇలా ఎలా ఆడుతున్నాడనేది నేను నమ్మలేకపోతున్నా. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. వైభవ్‌ను చూస్తుంటే ‘టాలెంట్’ గురించి ఆలోచింపచేస్తోంది. మనం తరచూ ఉపయోగించే.. అతి తక్కువగా అర్థం చేసుకొనే పదం అదే. వైభవ్‌కు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ లీగ్‌లో అద్భుతంగా ఆడిన స్కాట్ పెండల్‌బరీకి సారూప్యత ఉంది. వీరద్దరూ తమ క్రీడల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు’’ అని లాంగర్‌ వివరించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు

Eenadu28 May, 07:03 am
యార్కర్ మిస్ అయితే.. వైభవ్ కు దొరికిపోయినట్లే

ఇంటర్నెట్ డెస్క్‌: కీలకమైన పోరులో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఐపీఎల్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు ఇవ్వడం గమనార్హం. ఇటు బ్యాటింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే, ఈ పిచ్‌పై 240+ లక్ష్యం ఛేదించడం పెద్ద కష్టమేం కాదని.. త్వరగా వికెట్లను కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించాడు. ఇక, వైభవ్‌ను ఎదుర్కొనేటప్పుడు తమ వద్ద ఎక్కువ ఆప్షన్లు ఉన్నట్లు అనిపించలేదని కమిన్స్ అంగీకరించాడు. ‘‘వైభవ్‌ చాలా అద్భుతంగా ఆడాడు. అతడు అలా ఆడుతుంటే మా వద్ద మరిన్ని ఆప్షన్లు లేవని అనిపించింది. పిచ్ చాలా బాగుంది. కానీ, మార్జిన్స్‌ కాస్త చిన్నవే. ఒకవేళ యార్కర్‌ వేయడం మిస్‌ అయితే.. వైభవ్‌ ఏమాత్రం ఉపేక్షించడు. చాలా మంచి గేమ్. మా జట్టు ఇప్పుడు కుర్రాళ్లతో అద్భుతంగా ఉంది. ప్రఫుల్, సకిబ్ బాగా ఆడారు. అయితే, యువ ప్లేయర్లలో చాలా మందికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లలో మాదే యంగెస్ట్‌ టీమ్‌ అనుకుంటా. మా కోచింగ్‌ గ్రూప్‌ బాగా పనిచేసింది. వారిందరిని నడిపించడం కెప్టెన్‌గా ఆనందంగా ఉంది’’ అని కమిన్స్‌ తెలిపాడు. ‘‘ఛేజింగ్‌ తీసుకున్నందుకు చింతించడం లేదు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమే. కానీ, త్వరగా వికెట్లను కోల్పోవడంతో మాకు ఛేదన కష్టమైంది. స్కోరు బోర్డుపై 240+ లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండాలి. చివరి వరకూ మేం రన్‌రేట్‌ను బాగానే కొనసాగించినా.. వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. మా కుర్రాళ్ల ప్రతిభ వల్లే ఇదంతా. ఈసారి కూడా టాప్‌-2లోకి వచ్చేందుకు ప్రయత్నించాం. కానీ,

Eenadu30 May, 06:35 am
కామ్ అండ్ కూల్ ప్రిన్స్ ’.. కెప్టెన్ ’ రేసులోకి శుభ్ మన్ గిల్

ఐపీఎల్ 2026 సీజన్‌ మొదలైనప్పుడు అందరి చూపు వైభవ్‌ సూర్యవంశీపైనే.. ఈ కుర్రాడు ఎలా ఆడతాడు? ఎవరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడనే చర్చ. అందరి అంచనాలకు తగ్గట్టుగానే విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వంతు.. ఈ టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో ఎలా బ్యాటింగ్‌ చేస్తాడోనని అంతా ఆసక్తిగా తిలకించారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్ ఆటతీరుపైనా అభిమానులు మాట్లాడుకున్నారు. ఆఖరికి హార్దిక్‌ పాండ్య గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. పైన పేర్కొన్న ప్లేయర్ల జాబితాలో ఒకే ఒక్క స్టార్‌ ప్లేయర్ పేరు మొదట్లో మిస్‌ అయింది. కానీ, అతడు మాత్రం చాపకింద నీరులా ఏమాత్రం హడావుడి లేకుండా కామ్‌గా ఉంటూ పరుగుల వరద పారించాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడెవరో ఈపాటికే అర్థమై ఉంటుందిగా.. అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్‌’ అని పిలుచుకొనే శుభ్‌మన్ గిల్. గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్. వైభవ్‌ సూర్యవంశీలా భారీ హిట్టింగ్‌ ఉండదు. విరాట్ కోహ్లీలా దూకుడుగా కనిపించడు. సూర్యకుమార్ యాదవ్‌లా ‘మిస్టర్ 360’ కాదు. కానీ, శుభ్‌మన్‌ గిల్‌ను చూస్తుంటే వీరందరి కలబోతగా ఉంటాడనడంలో సందేహంలేదు. ముందు ఇన్నింగ్స్‌ను నిర్మించడంపై దృష్టిపెడతాడు. ఒక్కసారి కుదురుకున్నాక దూకుడు పెంచుతాడు. మళ్లీ ఏవైనా కుదుపులు వస్తే తట్టుకొని నిలబడతాడు. ఇప్పుడీ సీజన్‌లో 441 బంతులు ఎదుర్కొని 160కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 722 పరుగులు చేశాడు. ఇందులో 75 ఫోర్లు, 33 సిక్స్‌లు ఉన్నాయి. అంటే స్టాండ్స్‌లో బంతిని పెట్టడం కంటే ఫోర్లుగా మలిచి పరుగులు రాబట్టేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతాడు. ఇప్పుడు రాజస్థాన్‌పైనా ఇలాగే సెంచరీతో (104) తన జట్టును గెలిపించాడు. నాకౌట్‌కు చేరుకునే జట్లు ఏవో మాజీలు,

Eenadu27 May, 04:19 am
నా వికెట్ గురించి పట్టించుకోను.. ఆ ప్లాన్ సక్సెస్ అయింది

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం పాటీదార్ మాట్లాడాడు. తాను వికెట్‌ గురించి పట్టించుకోనని, బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ‘‘ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్‌. మా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో దూకుడుగా ఆడటం మాకు బాగా ఉపయోగపడింది. గుజరాత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే కచ్చితమైన ప్రణాళికతో రాలేదు. కానీ, మేం దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ‘మేం అటాకింగ్‌ గేమ్ ఆడబోతున్నామని మా బాడీ లాంగ్వేజ్‌తో వారికి తెలియజేయాలి. అది ప్రతి బ్యాటర్‌లోనూ కనిపించిందని నేను అనుకుంటున్నాను. మేం జట్టు సమావేశంలో దీని గురించి చర్చించుకున్నాం. ఇది చాలా కీలకమైన దశ. ఈ మ్యాచ్‌లో మేం ఆడిన తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. నా బ్యాటింగ్ శైలి జట్టులోని మిగతా వారి శైలికి దాదాపు సమానంగానే ఉంటుందని నేను భావిస్తాను. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్‌ ఎలా స్పందిస్తోందోనని గమనించడానికి 8 నుంచి 10 బంతులు నెమ్మదిగా ఆడతా. ఆ తర్వాత నేను ఎలా ముందుకుసాగాలనే విషయంపై నాకు పూర్తి స్పష్టత లభిస్తుంది. అప్పుడు నా వికెట్ గురించి నేను అస్సలు ఆందోళన చెందను. బౌలర్‌పై ఒత్తిడి పెంచడాన్ని ఇష్టపడతాను. గిల్, సుదర్శన్, బట్లర్‌ను పవర్‌ ప్లేలో ఔట్‌ చేయాలనుకున్నాం. ఆ ప్లాన్ సక్సెస్ అయింది’’ అని రజత్ పాటీదార్ వివరించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని

Eenadu25 May, 11:01 am
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ధర్మశాల వేదికగా మంగళవారం...

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ధర్మశాల వేదికగా మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌ (RCB vs GT) తలపడనున్నాయి. ఇందులో...

Eenadu28 May, 02:14 pm
వేలంలోకి వైభవ్ సూర్యవంశీ.. రూ.30 కోట్లు చెల్లిస్తానన్న సెహ్వాగ్

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లు బాది 97 పరుగులు చేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్ (59) పేరిట ఉన్న రికార్డును వైభవ్ (65) బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ కామెంటెటరీ చేశారు. వీరి మధ్య వైభవ్ టాపిక్‌ వచ్చింది. ఒకవేళ సూర్యవంశీ వేలంలోకి వస్తే ఎంత డబ్బు చెల్లిస్తారని సెహ్వాగ్‌ని హర్భజన్ అడిగాడు. సెహ్వాగ్ ఏ మాత్రం ఆలోచించకుండా తాను రూ.30 కోట్లు చెల్లిస్తానని చెప్పాడు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ కూడా వైభవ్‌పై ప్రశంసలు కురిపించారు. అతనిలో ‘స్పెషల్ టాలెంట్’ ఉందని.. ఈ కుర్రాడు మరింత రాటుదేలడానికి బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ మార్గదర్శకత్వం అందిస్తాయని పేర్కొన్నారు. ‘‘వైభవ్ టెంపర్‌మెంట్ ఇలానే కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని బీసీసీఐ, రాజస్థాన్ ఫ్రాంఛైజీ అందిస్తాయి. క్రీడల్లో కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢత్వం అవసరం. అతను రాబోయే మరెన్నో సంవత్సరాలపాటు టీమ్ఇండియా తరపున రాణించేలా చూడటంలో మా వంతు కృషిని మేం తప్పకకుండా చేస్తాం’’ అని అరుణ్‌ ధుమాల్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత

Eenadu27 May, 07:10 am
ఆర్సీబీ సక్సెస్ సీక్రెట్ ఇదే

ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరు పేసర్ భువనేశ్వర్ సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్‌తో క్వాలిఫయర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన భువీ మ్యాచ్‌ అనంతరం మాట్లాడాడు. బ్యాటర్లను ఎలా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవాలి, ఏవిధంగా క్లీన్‌బౌల్డ్ చేయాలనే తమ బౌలింగ్ ప్రణాళికల గురించి వివరించాడు. తమ విజయంలో డేటా (గణాంకాలు) ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలిపాడు. ‘‘తెర వెనుక జరిగిన ప్రణాళికకు చాలావరకు ఘనత దక్కుతుంది. మేం (నేను, జోష్ హేజిల్‌వుడ్) మా అనుభవాన్ని రంగరించాం. సపోర్టింగ్ స్టాఫ్‌ అందిస్తున్న సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మేం డేటా (గణాంకాల) ఆధారంగా పనిచేస్తాం. ఆటగాళ్లు ఏదైనా కొత్త పద్ధతులను అనుసరిస్తుంటే వాటిని నిశితంగా పరిశీలిస్తాం. అయితే, కేవలం గణాంకాల పైనే 100 శాతం ఆధారపడం. కానీ, అవి మాకు కచ్చితంగా సహాయపడతాయి’’ అని భువీ పేర్కొన్నాడు. తన, జట్టు బౌలింగ్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. షార్ట్ లేదా ఫుల్లర్ బంతులు సంధిస్తే బౌండరీకి వెళ్తాయి. కానీ, మేం బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వారిని ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాం’’ అని భువనేశ్వర్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

Eenadu26 May, 01:02 pm
RCB vs GT: గుజరాత్‌తో క్వాలిఫయర్‌.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ ఇవాళ ధర్మశాలలో జరగనుంది. ఈ కీలక పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాటర్ ఓ భారీ రికార్డును అందుకునే అవకాశముంది. కోహ్లీ మరో 43 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్‌ చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో 50.63 సగటు, 163.82 స్ట్రైక్‌రేట్‌తో 557 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో వరుసగా మూడు సీజన్లలో ముగ్గురు మాత్రమే 600 కంటే ఎక్కువ రన్స్ చేశారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) ఉన్నారు. 2018లో ‘బాల్ ట్యాంపరింగ్‌‘ ఉదంతం నేపథ్యంలో వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సిక్సర్లు బాదడంలో వైభవ్‌ సూర్యవంశీ దిట్ట. అలాంటి సూపర్‌ హిట్టింగ్‌ బ్యాటర్‌ను డిఫెన్స్‌ ఆడమంటే ఎలా ఉంటుంది?

Eenadu25 May, 02:53 pm
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే...

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వీరిది అత్యుత్తమ బ్యాటింగ్‌ జోడీ అని ప్రశంసలు కురిపించాడు. ‘‘శుభ్...

Eenadu24 May, 08:22 am
Sachin - Arjun: నైపుణ్యంతోపాటు ఓర్పు ప్రదర్శించావు: అర్జున్‌ ఎంట్రీపై సచిన్

- ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ కుమారుడు అర్జున్ తెందుల్కర్‌కు ఐపీఎల్ 2026 సీజన్‌లో అవకాశం దక్కింది. - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడికి తమ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చింది. - బ్యాటింగ్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చిన అర్జున్ 5 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేశాడు.

Eenadu24 May, 07:26 am
LSG vs PBKS: ఛీర్‌లీడర్స్‌తో ఫ్యాన్స్‌ అసభ్య ప్రవర్తన.. రంగంలోకి పోలీసులు

- ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య ఏకనా స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. - ఇందులో శ్రేయస్‌ అయ్యర్ శతకంతో పంజాబ్ విజయం సాధించింది. - అయితే, మ్యాచ్‌ సమయంలో ఛీర్‌లీడర్స్‌ పట్ల ప్రేక్షకుల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.

Eenadu28 May, 07:37 am
వైభవ్ ను ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ రిప్లయ్ ఏంటంటే

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్‌ సూర్యవంశీ దెబ్బకు హేమాహేమీ బౌలర్లే గతి తప్పారు. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్‌, భువనేశ్వర్‌ కుమార్, రబాడ, మిచెల్ స్టార్క్.. ఇలా ప్రతి ఒక్కరిపైనా ఈ కుర్రాడు ఆధిపత్యం ప్రదర్శించాడు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఎలా కట్టడి చేయాలనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇదే ప్రశ్న రాజస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎదురైంది. దీనికి ఆర్చర్‌ ఆసక్తికరంగా బదులిచ్చాడు. ‘‘వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేసుకోడానికి అన్ని ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తప్పకుండా 150+ మార్క్‌ను అందుకొంటాడు. చాలా మంది వైభవ్‌ను ఎలా కట్టడి చేయాలని అడుగుతున్నారు. అయితే, దానికి సమాధానం ఇప్పుడే చెప్పను. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత చెబుతా’’ అని ఆర్చర్ వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో వైభవ్‌తోపాటు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. నెట్స్‌లో వీరిద్దరూ ప్రాక్టీస్‌ కూడా చేస్తుంటారు. ‘‘వైభవ్‌లో ఉన్న అత్యుత్తమ లక్షణం.. ఏదీ ముందస్తుగా ప్లాన్‌ చేసుకోడు. అయితే, నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాడు. తన ఆటపై నమ్మకం పెట్టుకుంటాడు. ఏం సాధన చేస్తాడో.. దానినే మైదానంలోనూ చేసి చూపిస్తాడు. ఫలానా షాట్లు కొట్టడం కష్టమని ఎప్పుడూ అనుకోడు. క్రికెట్ అకాడమీకి వెళ్తే బౌలర్‌ ఎవరు అని చూడొద్దంటారు. మేం 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా బౌలర్‌ వైపు చూసేవాళ్లం. వైభవ్‌ మాత్రం అవేవీ పట్టించుకోడు. కేవలం బంతిపైనే అతడి దృష్టి ఉంటుంది. అదే అతడి సక్సెస్ మంత్ర’’ అని ధ్రువ్‌

Eenadu28 May, 06:35 am
యూనివర్స్ బేబీ బాస్ .. దెబ్బకు మోత మోగిపోయిన బౌండరీస్

‘యూనివర్సల్ బాస్‌’.. సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించే క్రిస్‌ గేల్‌కు అభిమానులు పెట్టిన ముద్దుపేరు. 14 ఏళ్ల కిందట అతడు ఐపీఎల్‌లో పెను సంచలనం సృష్టించాడు. ఒకే ఎడిషన్‌లో 59 సిక్స్‌లు బాదాడు. అప్పుడు అతడి వయసు 33 ఏళ్లు. అబ్బో ఈ రికార్డును ఇంకెవరూ బద్దలు కొట్టలేరని చాలామంది భావించారు. క్రిస్‌ గేల్ రికార్డును బద్దలు కొట్టే ప్లేయర్‌ భూమి మీదకు వచ్చి అప్పటికే ఏడాది అయింది. కానీ, ఆ విషయం అభిమానులకు 15 ఏళ్లకు తెలిసింది. దూకుడైన ఆటతో ఒకే ఎడిషన్‌లో (65*) అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించి.. ‘యూనివర్స్‌ బేబీ బాస్‌’గా మారాడు యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. ఈ కుర్రాడు కొడితే బంతి స్టాండ్స్‌లోనికే అని నిరూపించాడు. సాధారణంగా 14 లేదా 15 ఏళ్ల వయసులోని పిల్లలు ఏం చేస్తారు? వీడియో గేమ్‌ లేదా స్నేహితులతో ఆడుకుంటూ కనిపిస్తారు. కానీ, ఈ పాలబుగ్గల చిచ్చరపిడుగు మాత్రం ‘స్టార్‌’ బౌలర్లను బాదేయడమే ఇష్టమని తన ‘బ్యాటింగ్‌’తో సమాధానం ఇస్తున్నాడు. అందుకు తాజా నిదర్శనం ప్యాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో చితక్కొట్టడమే. మూడు ప్లాన్స్‌తో బరిలోకి దిగామని చెప్పిన కమిన్స్‌నే టార్గెట్‌ చేయడం గమనార్హం. 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్‌.. క్యాచ్‌ ఔట్ కాకుండా.. ఆ ఒక్క బౌండరీ కొట్టి ఉంటే ‘క్రిస్‌ గేల్‌’ మరో రికార్డు (ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ) తుడిచిపెట్టుకుపోయేదే. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్‌ 12 సిక్స్‌లు, 5 ఫోర్లు అంటే.. 92 రన్స్‌ కేవలం బౌండరీల ద్వారానే రాబట్టాడు. అందుకేగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పెద్ద స్క్రీన్‌పైన యూనివర్స్‌ బేబీ బాస్‌ అంటూ పేరు రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ప్రస్తుతం అతడి

Eenadu28 May, 02:21 am
ప్రత్యర్థి ప్లాన్ తో నాకు పనిలేదు.. ఆ రికార్డు అప్పుడే తెలిసింది

ఇంటర్నెట్ డెస్క్‌: సంచలన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న వైభవ్‌ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2026 సీజన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 29 బంతుల్లో 97 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్‌ సెంచరీని చేసే అవకాశం కొద్దిలో చేజారింది. అయితే, సెంచరీ కంటే జట్టుకు తన ఇన్నింగ్స్‌ ఉపయోగపడితే చాలని వైభవ్‌ తెలిపాడు. ప్రత్యర్థులు ఎన్ని ప్రణాళికలతో వచ్చినా తన ప్లాన్స్‌ తనకుంటాయని వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన అతడి వద్దే ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ కూడా ఉంది. ఇప్పుడు వైభవ్‌ ఖాతాలో 680 పరుగులు ఉన్నాయి. ‘‘మ్యాచ్‌ గెలిచినప్పుడు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. తర్వాత మ్యాచ్‌లో ఎలా ఆడాలనే దానిపైనే దృష్టిపెడతాం. క్వాలిఫయర్స్‌ 2లోనూ ఇదే దూకుడుగా ఆడి ఫైనల్‌కు చేరుకొనేందుకు ప్రయత్నిస్తాం. అయితే, రాబోయే పోరు గురించి మరీ ఎక్కువగా ఆలోచించను. మైదానంలోకి దిగిన తర్వాతనే నా ఆట ఏంటో ఆడతా. కానీ, సన్నద్ధత కోసం ఏం చేయాలనే దానిపై మాత్రం ఫోకస్ పెడతా. ప్రత్యర్థి బౌలర్లు ఎవరు? ఈ పిచ్‌పై ఎలా ఆడాలి? బౌండరీలు ఎంత పెద్దవి? ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తా. పాజిటివ్‌ కోణంలో ఆటడం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తా. కొద్దిలో సెంచరీ మిస్‌ కావడం బాధించినా.. అది వేగవంతమైన శతకం అవుతుందనే విషయం మాత్రం నాకు ఔటైన తర్వాతనే తెలిసింది. నా కోచ్‌లు ఎప్పుడైనా సరే నన్ను చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయమని చెబుతారు. ఎలాంటి ఒత్తిడిని తీసుకోవద్దని సూచించారు. నేను ఔటైన బంతి కూడా మిస్‌టైమ్‌ అయింది. లేకపోతే కచ్చితంగా బౌండరీ రావాల్సిన బంతి అది. ఫీల్డర్‌ను