translateexpand_more

Business Article News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 01:07 pm
విమానయాన సంస్థలకు ఊరట.. జెట్ ఫ్యూయల్ ధర 27 తగ్గింపు

Jet fuel price cut | దిల్లీ: విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన (ATF) ధరలను 27 శాతం తగ్గించాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. దేశీయ విమాన ఇంధన ధరల్లో మాత్రం వరుసగా రెండో నెలా ఎలాంటి మార్పూ చేయలేదు. జూన్ నెలకు గాను అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన ధరను కిలోలీటరుకు సుమారు 400 డాలర్ల మేర చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో కిలోలీటర్‌ 1100 డాలర్లకు చేరింది. ఈ తగ్గింపుతో అంతర్జాతీయ విమానాల ఇంధన ధరలు, దేశీయ విమాన ఇంధన ధరలు దాదాపు సమాన స్థాయికి చేరాయి. అంతర్జాతీయ విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,05,000గా ఉండగా.. ప్రస్తుతం దిల్లీలో దేశీయ విమాన ఇంధన ధర కిలోలీటరుకు రూ.1,04,927గా ఉంది. అంతకుముందు దేశీయ విమానాలకు ఏప్రిల్‌ 1న కిలోలీటరుకు 25 శాతం అంటే రూ.15వేలు చొప్పున పెంచగా.. అంతర్జాతీయ విమాన సర్వీసుల ఏటీఎఫ్‌ ధరలు మాత్రం రూ.73 వేలు పెంచారు. మే నెలలో అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్‌ ధరను కిలో లీటరుకు 76 డాలర్లు పెంచి 1511 డాలర్లుకు చేర్చారు. దేశీయ విమానాల ధరల్లో అప్పుడు ఏ మార్పూ చేయలేదు. జూన్‌లో మాత్రం కిలో లీటరుకు 400 డాలర్లు తగ్గించడం గమనార్హం. సాధారణంగా ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో జెట్‌ ఫ్యూయల్‌కే 40 శాతం ఖర్చవుతుంది. ఇటీవలి పరిస్థితుల కారణంగా ఇది 55-60 శాతానికి పెరిగింది. పెరిగిన చమురు ధరలకు తోడు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల

Eenadu01 Jun, 07:08 am
మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్ల (GST Collections) వివరాలను సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది. ఇక రిఫండ్ల సర్దుబాటు అనంతరం మే నెలకు నికరంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,66,904 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా రీఫండ్లు 2.6 శాతం పెరిగి, రూ.27,281కోట్లుగా ఉన్నాయి. దేశీయ రీఫండ్లు 4.3 శాతం తగ్గగా.. ఎగుమతి ఆధారిత రీఫండ్లు 16.6 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. స్థూల దేశీయ జీఎస్టీ రాబడి 2.6 శాతం తగ్గింది. ఆ మొత్తం రూ.1.34 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతులపై వసూళ్లు 19.1 శాతం పెరిగి, రూ.59,654 కోట్లుగా ఉన్నాయి. కాగా.. ఏప్రిల్‌, మే నెలల్లో జీఎస్టీ (GST) వసూళ్లు 6.2 శాతం పెరిగి, 4.37 లక్షలకోట్లకు చేరాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 12:20 pm
చిన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? బెస్ట్ ఆప్షన్లు ఇవే

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. పెద్ద పెద్ద ఫోన్ల కంటే చేతిలో సులువుగా ఇమిడిపోయే కాంపాక్ట్‌ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు (Compact smartphones). చిన్న డిస్‌ప్లే, పాకెట్‌లో ఇట్టే ఇమిడిపోయేలా, చేత్తో పట్టుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచిని పసిగట్టిన కొన్ని కంపెనీలు ఈ మధ్య కాలంలో చిన్న సైజు ఫోన్లను విడుదల చేస్తున్నాయి. వీటి డిస్‌ప్లే కేవలం 6.3 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటోంది. అలా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బుల్లిఫోన్‌ల సంగతులు ఇప్పుడు చూద్దాం.. యాపిల్‌ నుంచి వస్తున్న అతి చిన్న ఫోన్‌ iPhone 17e. ఇది కేవలం 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఏ19 చిప్‌తో పనిచేస్తుంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా+ 12 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌.. 256GB వేరియంట్ ధర రూ.64,900, 512GB వేరియంట్‌ ధర రూ.84,900. వివో నుంచి ఇటీవల కాలంలో లాంచ్‌ అయిన కాంపాక్ట్‌ ఫోన్‌ Vivo X300 FE. ఇందులో 6.31 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా+ 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా+ 8ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా+ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్‌ నుంచి ఉన్న మరో ఆప్షన్‌ iPhone 17. ఇది 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో వస్తోంది. యాపిల్‌ ఏ19 చిప్‌సెట్‌ ఉంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా+ 40 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా+ 18ఎంపీ సెల్ఫీ కెమెరా

Eenadu31 May, 10:53 am
ఫిన్ టెక్ రంగంలోకి ఎల్ ఐసీ

LIC Fintech | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఫిన్‌టెక్‌ రంగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. డిజిటల్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక పెట్టుబడులు లేదా ఆర్గానిక్‌ మార్గంలో ఫిన్‌టెక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. ఆధునిక అవసరాలను తీర్చడానికి, నూతన ఆవిష్కరణల కోసం అటు ఫిన్‌టెక్‌, ఇటు ఇన్సురెన్స్‌టెక్‌ కంపెనీలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పీఐటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశలపై మాట్లాడారు. కేవలం బీమా వ్యాపారమే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎల్‌ఐసీ ఉందని, అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిందన్నారు. పాలసీదారులకు మెరుగైన ప్రతిఫలం అందించేందుకు ప్రత్యేకమైన సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులకూ ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీని ఎల్‌ఐసీ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పారు. తమ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా సొంతంగానే తమ బిజినెస్‌ అప్లికేషన్లను తయారు చేసుకుంటున్నామని వెల్లడించారు. అదే సమయంలో కొత్త కొత్త ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఇతర ఐటీ సర్వీస్‌ ప్రొవైడర్లతోనూ కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఫిన్‌టెక్‌ రంగంలో పోటీలో నిలదొక్కుకోవాలంటే ఐటీ అప్లికేషన్‌లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌ఐసీలో తదుపరి వాటాల విక్రయంపై ప్రశ్నించగా.. పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ పరిమితిని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత

Eenadu30 May, 02:59 pm
మెటా ప్రీమియం ప్లాన్స్ .. ధర, ఫీచర్లివీ

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌లు వాడాలంటే డబ్బులు కట్టాలా?.. అంటే అవుననే తెలుస్తోంది. కానీ, ఇది అందరికీ కాదు. ఎవరైతే ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటారో వాళ్లకు మాత్రమే. ఇందుకోసమే వాటి మాతృసంస్థ మెటా ప్రీమియం ప్లాన్‌ను ప్రకటించింది. ప్లస్‌ పేరుతో వచ్చిన ఈ ప్లాన్‌ల ధర ఎంత? ప్రీమియం తీసుకుంటే వచ్చే ఫీచర్లు ఏంటి? తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. (గమనిక: ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు) ఈ వార్త చదివారా: దేశంలో నంబర్‌ వన్‌ ‘క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి’గా రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌

Eenadu01 Jun, 06:24 am
పర్సనల్ కంప్యూటర్లలోకి ఎన్విడియా చిప్ లు.. విండోస్ ల్యాప్ టాప్ మార్కెట్లోకి ప్రవేశం

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం ఎన్విడియా (Nvidia) తాజాగా పీసీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తైవాన్‌లో జరుగుతోన్న కంప్యూటెక్‌ ట్రేడ్‌ షో వేదికగా ఆ కంపెనీ సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఈ రంగంలో పట్టు కోల్పోతోన్న ఇంటెల్‌ కార్పొరేషన్‌ నుంచి మార్కెట్‌ షేర్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ఎన్విడియా ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఎన్విడియా త్వరలోనే తన సరికొత్త ‘ఆర్టీఎక్స్‌ స్పార్క్‌ సూపర్‌ చిప్‌’ను ప్రముఖ పీసీ బ్రాండ్స్‌కు చెందిన ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల్లో అందుబాటులోకి తీసుకురానుంది. మైక్రోప్రాసెసర్‌, గ్రాఫిక్స్‌ చిప్‌ను కలిపి దీనిని రూపొందించినట్లు జెన్సన్‌ హువాంగ్‌ వెల్లడించారు. తైవాన్‌ మీడియాటెక్‌ ఐఎన్‌సీ సహకారంతో దీనిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఆర్మ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ను రన్‌ చేస్తుంది. ఎన్విడియా ఇప్పటికే డేటా సెంటర్ల మార్కెట్లో అత్యంత కీలకమైంది. తాజాగా పర్సనల్‌ కంప్యూటర్ల రంగంలోకి అడుగు పెట్టడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలకు తీవ్రమైన పోటీ ఇవ్వనుంది. దాదాపు దశాబ్దం క్రితం ఈ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఎన్విడియా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ సారి మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రత్యర్థుల కంటే అధిక మొత్తంలో ఆర్థిక వనరులను కేటాయించగలిగే స్థితిలో ఉంది. ఇక, ఈ ప్రయత్నంతో కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో కూడా తాను కేంద్రంగా కొనసాగేందుకు ఎన్విడియాకు అవకాశం లభిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఆర్టీఎక్స్‌ స్పార్క్‌ చిప్‌ల ల్యాప్‌టాప్‌లను తొలుత సిద్ధం చేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ వినియోగంతో అత్యంత నాజుకుగా ఉండే శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేసే అవకాశం పీసీ తయారీదారులకు లభించనుంది. మైక్రోసాఫ్ట్‌ తన అత్యాధునిక సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ అల్ట్రాను ఆవిష్కరించింది. ఎన్విడియా నుంచి

Eenadu29 May, 03:32 pm
అన్ని రకాల అన్ క్లెయిమ్డ్ ఆస్తులకూ ఒకటే పోర్టల్

Unclaimed assets | దిల్లీ: బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో ఎవరూ క్లెయిమ్‌ చేయని ఆస్తులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఏకీకృత పోర్టల్‌ తీసుకొచ్చింది. ఇందులో బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్లెయిమ్‌ చేయని మొత్తాలకు సంబంధించి సెర్చ్‌ చేసే వీలుంటుంది. ఇందుకోసం www.unclaimedassetsportal.in అనే పోర్టల్‌ను శుక్రవారం ఆర్థిక శాఖ అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ‘మీ సొమ్ము మీ హక్కు’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఏకీకృత ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చినట్లు ఆర్థికశాఖ కార్యదర్శి(సేవలు) ఎం. నాగరాజు తెలిపారు. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి UDGAM, బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ బీమా భరోసా, మ్యూచువల్‌ ఫండ్స్‌ కోసం సెబీ మిత్ర, షేర్లు డివిడెండ్లకు సంబంధించి ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీకి వేర్వేరు పోర్టళ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకేచోట చేర్చడమే ఈ ప్లాట్‌ఫామ్‌ ముఖ్య ఉద్దేశం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 09:25 am
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్ తో 543

Toyota Urban Cruiser Ebella | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) దేశంలో తొలి విద్యుత్‌ కారు అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)ను లాంచ్‌ చేసింది. హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, ఎంజీ జడ్‌ఎస్‌, మారుతీ సుజుకీ ఇ-విటారాకు పోటీగా.. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దీన్ని లాంచ్‌ చేసింది. మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పై ఈ కారు రూపొందినప్పటికీ.. టయోటా డిజైన్‌ ఎలిమెంట్లను జోడించారు. దీని ధరను రూ.23.60 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu30 May, 12:05 pm
దేశంలో నంబర్ వన్ క్రిటికల్ కేర్ ఆస్పత్రి’గా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్ప్రతి (Sir H. N. Reliance Foundation Hospital) అరుదైన ఘనతను సాధించింది. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహించిన ఆల్‌ ఇండియా క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ ర్యాంకింగ్‌ సర్వే-2026లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇది తమకు అత్యంత గర్వించదగిన క్షణమని పేర్కొంటూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ ఇన్‌స్టాలో ఓ వీడియోని పోస్టు చేసింది. ఇది ప్రతి భారతీయుడికీ ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందుబాటులో ఉంచాలనే తమ సంస్థ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ గొప్ప సంకల్పం, నిబద్ధతకు దక్కిన గౌరవంగా పేర్కొంది. కేవలం క్రిటికల్‌ కేర్‌ మాత్రమే కాకుండా వైద్య రంగంలోని ప్రధాన స్పెషాలిటీల్లో కూడా తమ ఆసుపత్రి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కార్డియాక్‌ సైన్సెస్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, అంకాలజీ, న్యూరోసైన్సెస్‌, ఎమర్జెన్సీ అండ్‌ట్రామా, అబ్‌స్టెట్రిక్‌ అండ్‌ గైనకాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్‌, యూరాలజీ తదితర ప్రముఖ స్పెషాలటీల్లో సాధించిన అగ్రశ్రేణి ర్యాంకింగ్స్‌.. తమ ఆస్పత్రిలో వైద్య నిపుణత, అధునాతన సాంకేతికతకు నిదర్శనమని పేర్కొంది. ఈ అపూర్వ విజయానికి కారణమైన తమ ఆస్పత్రిలో పనిచేసే గొప్ప వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు తమపై విశ్వాసం ఉంచిన రోగులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపింది. అందరం కలిసి దేశమంతా వైద్య ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు

Eenadu27 May, 08:16 am
ఏఐ నిపుణులు దేశం దాటొద్దు.. ఈ ఆంక్షలు ఎక్కడంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సరికొత్త టెక్ యుగంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) నిపుణులకు భారీ డిమాండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ దేశ నైపుణ్యం ఇతరుల చేతికి చిక్కుకుండా చైనా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ఏఐ నిపుణులు దేశం దాటొద్దంటూ నిషేధం విధించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌, డీప్‌సీక్ వంటి సంస్థలకు చెందిన అగ్రశ్రేణి ఏఐ నిపుణుల (AI talent) విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. తన సాంకేతికతను పరిరక్షించుకునేందుకు, ఈ రంగంలో అమెరికాను అధిగమించే క్రమంలో వారిని వ్యూహాత్మక ఆస్తులుగా పరిగణిస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆ నిపుణులు విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే.. సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా ఈతరహా ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి కాదు. కళాశాల పరిశోధకులు, అణుశాస్త్రవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కీలక అధికారులు దేశం దాటే విషయంలో కొన్నేళ్లుగా ఆంక్షలు అమలుచేస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఏఐ రంగాన్ని చేర్చింది. అయితే చైనా (China) ప్రభుత్వం అతి జోక్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏఐ స్టార్టప్ మానుస్‌ను రెండు బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మెటా సంస్థ ముందుకురాగా.. ఆ ప్రక్రియను ఆ దేశ నియంత్రణ సంస్థలు నిరోధించాయి. తమ సాంకేతికత, టాలెంట్ దేశం దాటకుండా చూసేందుకే ఈ డీల్‌ను అడ్డుకున్నాయి. అలాగే మానుస్ సహ వ్యవస్థాపకుల్లో ఇద్దరిని దేశం విడిచివెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయాలనే లక్ష్యంతో ఉండే యువ ఇంజినీర్లపై ఈ చర్యలు ప్రభావం చూపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభుత్వం నుంచి కానీ.. కంపెనీల

Eenadu28 May, 08:22 am
ఈక్విటీలపై ని రద్దు చేయాలి.. కేంద్రానికి విజయ్ కేడియా వినతి

Vijay Kedia on LTCG | ఇంటర్నెట్‌ డెస్క్‌: లిస్టెడ్‌ ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ మదుపరి విజయ కేడియా ఈ అంశాన్ని తాజాగా లేవనెత్తారు. క్యాపిటల్‌ మార్కెట్‌ బలోపేతానికి ఈ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు రూపుదిద్దుకోవాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం అని విజయ్‌ కేడియా అభిప్రాయపడ్డారు. ఎల్‌టీసీజీ పన్నును రద్దు చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రస్తుత పన్ను విధానం స్వల్పకాలిక స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌, దీర్ఘకాలిక పెట్టుబడులకు మధ్య వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేకపోతోందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక మదుపరి కేవలం మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనే వ్యక్తి మాత్రమే కాదని, దేశ సంపద సృష్టిలో భాగస్వామి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కంపెనీ వృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను, కస్టమ్స్ డ్యూటీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని విజయ్‌ కేడియా అన్నారు. కాబట్టి ఆ కంపెనీల్లో పెట్టుబడులపై మళ్లీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలు తమ పొదుపు మొత్తాలను బంగారం వంటి వాటిల్లో కాకుండా ఉపాధిని సృష్టించే, దేశ సంపదను పెంచే ఉత్పాదక వ్యాపారాలవైపు మళ్లించేలా పన్ను విధానాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రపంచస్థాయి కంపెనీలు అవతరిస్తాయన్నారు. ఎల్‌టీసీజీ 2004 వరకు ఉండేది. అప్పట్లో దాన్ని రద్దు చేశారు. 2018లో తిరిగి తీసుకొచ్చారు. 2024

Eenadu27 May, 08:19 am
జియో నుంచి సరికొత్త ప్లాన్ .. రూ.200కే ఓటీటీ పాస్

JIO OTT pass | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో (JIO) సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే యూజర్లే లక్ష్యంగా జియో ఓటీటీ పాస్‌ను (JIO OTT pass) తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు, జియో టీవీలో వెయ్యికి పైగా ఛానళ్లు, 30 జీబీ హైస్పీడ్‌ డేటాతో ఈ ప్లాన్‌ లభిస్తుంది. ఈ పాస్‌ ధరను రూ.200గా కంపెనీ నిర్ణయించింది. మే 27 నుంచి ఈ ప్లాన్‌ అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్లాన్‌ ద్వారా రూ.1500 విలువైన ప్రయోజనాలను కేవలం రూ.200కే అందిస్తున్నట్లు జియో వెల్లడించింది. ఈ ప్యాక్‌ ద్వారా వినియోగదారులు టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేకుండా, బ్యాక్‌ గ్రౌండ్‌ప్లే చేస్తూ యూట్యూబ్‌ ప్రీమియంను యాక్సెస్‌ చేయొచ్చు. దీంతో పాటు లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ ఒరిజినల్స్‌, బ్లాక్‌బస్టర్‌ హాలీవుడ్‌ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌+ హాలీవుడ్‌ యాక్సెస్‌ను అందిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ కూడా ఈ ప్యాక్‌లో భాగంగా లభిస్తుంది. జియో టీవీ ద్వారా సోనీలివ్‌, జీ5, లయన్స్‌గేట్‌ ప్లే, డిస్కవరీ ప్లస్‌, సన్‌నెక్స్ట్‌, ఫ్యాన్‌కోడ్‌, హోయ్‌చోయ్‌, చౌపల్‌, ప్లానెట్‌ మరాఠీ, తరంగ్‌ ప్లస్‌, టైమ్స్‌ ప్లే వంటి మరో 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్‌ చేయొచ్చు. సబ్‌స్క్రైబర్లు జియో టీవీ ద్వారా వెయ్యికి పైగా లైవ్‌టీవీ ఛానళ్లు కూడా చూడొచ్చు. ఇందులో ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లకు చెందిన 150కు పైగా పెయిడ్‌ ఛానల్స్‌ కూడా ఉన్నాయి. జియోస్టార్‌, సన్‌టీవీ నెట్‌వర్క్‌, వార్నర్‌ బ్రదర్స్‌, డిస్కవరీ, ఈటీవీకి చెందిన ప్రాంతీయ వినోద, సినిమా ఛానళ్లు వీక్షించొచ్చు. యాక్టివ్ బేస్ ప్లాన్‌ ఉన్నవారు ఈ ప్లాన్‌ తీసుకుంటే

Eenadu25 May, 08:52 am
Nirmala Sitharaman | ముంబయి: పశ్చిమాసియా రూపంలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో చమురు, ఎరువులు, విదేశీ మారకంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి...

Nirmala Sitharaman | ముంబయి: పశ్చిమాసియా రూపంలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో చమురు, ఎరువులు, విదేశీ మారకంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందులోభాగంగానే ప్రధాని మోదీ పొదుపు చర్యల...

Eenadu28 May, 03:24 pm
మాకు అందరూ ప్రయారిటీనే’.. యాడ్

Voda Idea on Airtel | దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసిన ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌’ ప్లాన్‌పై మరో టెల్కో వొడాఫోన్‌ ఐడియా (VI) పరోక్షంగా విమర్శలు గుప్పించింది. తమ నెట్‌వర్క్‌లో అందరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, తమ నెట్‌వర్క్‌కు మారాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. తమ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ద్వారా రద్దీ సమయంలోనూ నెట్‌వర్క్‌ అంతరాయాలు ఉండవంటూ ఎయిర్‌టెల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నెట్‌న్యూట్రాలిటీకి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్‌ ఐడియా ఎయిర్‌టెల్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచారానికి తెరతీసింది. ‘మాకు ఎవరూ ఎక్కువా కాదు.. ఎవరూ తక్కువా కాదు’.. ‘మా నెట్‌వర్క్‌లో అందరికీ సమ ప్రాధాన్యం’.. ‘స్ట్రాంగ్‌ నెట్‌వర్క్‌ అందరి హక్కు.. ఇప్పుడే వీఐకి మారండి’ అంటూ వీఐ ప్రచారం చేసుకుంటోంది. రోజు రోజుకూ తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, 110కి పైగా నగరాల్లో 5జీ సేవలు అందుతున్నాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఏఐ ఆధారిత సెల్ఫ్‌ ఆప్టిమైజింగ్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ సాయంతో మెరుగైన కనెక్టివిటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే వొడాఫోన్‌ ఐడియా దేశంలో 5జీ సేవలను విస్తరిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ ఇప్పటికే తన 5జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. మరోవైపు నెట్‌న్యూట్రాలిటీ విమర్శలపైనా ఎయిర్‌టెల్‌ స్పందించింది. నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ టెక్నాలజీ సాయంతో పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, ఇది న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని తెలిపింది. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌ వల్ల మిగిలిన యూజర్లకు సేవల్లో నాణ్యత తగ్గదని స్పష్టంచేసింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్‌కు సమాధానం ఇచ్చింది. మరో టెలికాం కంపెనీ జియో కూడా ఎయిర్‌టెల్‌ వాదనను సమర్థించింది. నెట్‌న్యూట్రాలిటీకి సూత్రాలకు 5జీ నెట్‌వర్క్‌

Eenadu25 May, 02:35 pm
Ebola outbreak | దిల్లీ: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ (Ebola outbreak) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో...

Ebola outbreak | దిల్లీ: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ (Ebola outbreak) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించి...

Eenadu29 May, 08:43 am
సంక్షేమ పథకాలకు డిజిటల్ కరెన్సీ

RBI on CBDC | ముంబయి: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పైలట్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగానికీ విస్తరించాలని భావిస్తోంది. ఫైనాన్షియల్‌ అసెట్‌ టోకనైజేషన్‌కు ఉన్న అవకాశాలనూ పరిశీలించాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. తద్వారా సీబీడీసీ పైలట్‌ ప్రాజెక్ట్‌లో మరింత మందిని భాగస్వాములను చేయాలనుకుంటోంది. ఈ మేరకు ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో ఈ అంశాన్ని పొందుపరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్‌లలో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్‌ కరెన్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ లబ్ధిదారులకూ ఆహార సబ్సిడీని సీబీడీసీ ద్వారా అందించారు. లబ్ధిదారులు ఆ నిధులను రేషన్ షాపులు, ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా చూశారు. దీన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. పశ్చిమాసియా రూపంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ఇంధన ధరలు, సప్లయ్‌ చైన్‌ అవరోధాలు ఉన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధికి ఢోకా లేదని ఆర్‌బీఐ పేర్కొంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉండడమే దీనికి కారణమని తన వార్షిక నివేదికలో తెలిపింది. కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల బలోపేతమైన బ్యాలెన్స్ షీట్లు, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సానుకూలంగా ఉండనుందని తెలిపింది. వివిధ వాణిజ్య భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా వృద్ధికి దన్నుగా నిలవనున్నాయని అభిప్రాయపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆర్‌బీఐ గుర్తు చేసింది. 2026-27లో వ్యవసాయ రంగం

Eenadu25 May, 01:22 pm
LIC Joint plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రెండు కొత్త...

LIC Joint plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ బీమా అందించేలా రెండు జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్...

Eenadu24 May, 02:22 pm
RBI dividend: ఆర్‌బీఐ డివిడెండ్‌లో రాష్ట్రాలకూ వాటా పంచండి

- RBI dividend | చండీగడ్‌: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (RBI) ప్రకటించిన డివిడెండ్‌లో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా డిమాండ్‌ చేశారు. - గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.87 లక్షల కోట్లను డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. - ఈ నేపథ్యంలో చీమా స్పందించారు.

Eenadu24 May, 11:25 am
LIC profit: లాభాల్లో LICనే కింగ్‌.. త్రైమాసిక ఫలితాల్లో సత్తా

- LIC profit | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) కీలక మైలురాయిని అందుకుంది. - మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫైనాన్షియల్‌ రంగంలో అత్యధిక లాభం నమోదుచేసిన కంపెనీగా అవతరించింది. - రూ.23,400 కోట్ల నికర లాభంతో మొదటి స్థానం సొంతం చేసుకుంది.

Eenadu26 May, 03:18 pm
Sam Altman: మనుషులకు ప్రత్యామ్నాయంగా ఏఐ మారలేదు: శామ్‌ అల్టామన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: కృతిమ మేధ కారణంగా పలు కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తుండగా ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయంగా ఎప్పటికీ మారలేదన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎంట్రీ లెవల్‌లో భారీగా ఉద్యోగ కోతలు ఉంటాయని అనుకున్నా. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం కొన్ని కంపెనీల అభివృద్ధికి, ఉద్యోగుల పనితీరు మెరుగుదలకు ఏఐ కీలకంగా మారింది. సాంకేతికతను అందిపుచ్చుకున్న వారు స్థిరంగా కొనసాగుతున్నారు. మనుషులు చేసిన పనులను ఏఐ చేస్తుందేమో కానీ వారి ఆలోచనలను, సృజనాత్మకతను ఎప్పటికీ భర్తీ చేయలేదు. మనుషులకు ప్రత్యామ్నాయంగా మారలేదు’’ అని శామ్‌ అల్టామన్‌ అన్నారు. తాను కొన్ని రోజులు ఈ మెయిల్స్‌ సమాధానాలకు ఏఐని వినియోగించినట్టు తెలిపారు. కానీ మనుషుల భావాలు ముఖ్యమని గ్రహించి స్వయంగా తానే ఈ మెయిల్స్‌కు రిప్లై ఇచ్చినట్లు తన స్వీయ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చాలా మంది తక్కువ బడ్జెట్‌లో మంచి గేమింగ్ ఫోన్స్ కొనుగోలు చేయాలని కోరుకుంటారు.

Eenadu26 May, 09:28 am
Artificial Intelligence: ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు: ఈ ఏఐ గురువులకు కాసుల పంట..

ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధను అన్ని రంగాలు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. బేసిక్ టాస్క్‌లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ఏఐ (AI)ని వినియోగించేందుకు కంపెనీలు భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని వాడే విషయంలో తొలుత సంకోచించిన బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. లేకపోతే తాము పోటీలో నిలవలేమోనని ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఏఐ సాధనాలు వాడేలా తమ సిబ్బందిని సిద్ధం చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్‌ ఇస్తోన్న ఓ సంస్థ ఇప్పుడు అమెరికా (USA)లో ప్రాచుర్యం పొందింది. దాని పేరే వాల్‌స్ట్రీట్‌ ప్రాంప్ట్‌. 2025లో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్‌ వాంగ్‌.. వాల్‌స్ట్రీట్‌ ప్రాంప్ట్‌ స్థాపించారు. వారిద్దరూ గతంలో సాఫ్ట్‌బ్యాంక్‌లో పనిచేశారు. ఏఐ ప్లానింగ్‌లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ.. భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే.. 25వేల డాలర్లు (రూ.23,85,322) వసూలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రముఖ ఆర్థిక సంస్థలైన సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్ అమెరికా ఆ జాబితాలో ఉన్నాయి. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్‌, గూగుల్ జెమినై టూల్స్‌తో తమ రోజూవారీ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తిచేయడంలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉద్యోగులపై పిడుగులా చూస్తున్నా.. భవిష్యత్‌లో ఇదే అవసరంగా మారడాన్ని మనం గుర్తిస్తామని ఈ ఏఐ గురువులు చెప్తున్నారు. కాగా.. చాలామంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంలో తగిన శిక్షణ లేదు. దాంతో పాత మోడళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించడానికి భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్‌ రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. ఈ ఏఐతో లేఆఫ్‌లు ఐటీ రంగానికే పరిమితం

Eenadu23 May, 10:31 pm
Smartphone: ఎంత ఎదురుచూసినా.. మీక్కావాల్సిన ఫోన్‌ ధర తగ్గదు

- ఏఐ చిప్‌ల గిరాకీ భారీగా పెరగడమే కారణం డేటా సెంటర్లు, ఏఐ సర్వర్లకు మళ్లింపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ సెమీకండక్టర్ల ధర పైకి పాత మోడళ్ల తయారీకీ ఖర్చు ఎక్కువే ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ విడుదలవడమే ఆలస్యం, వెంటనే దాన్ని కొనే వార... - అయితే కాస్త ఆగి కొంటే అదే ఫోన్‌ తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ మంది భావిస్తారు. - అలా వేచిచూసిన వారికి నిజంగానే చౌకగా అది లభ్యమయ్యేది.

Eenadu29 May, 10:48 am
శాంతి’పై అనిశ్చితి.. సెన్సెక్స్ 1092 పాయింట్లు డౌన్

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి, ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగుతుండటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠాల నుంచి 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,550 దిగువన ముగిసింది. మదుపర్ల సంపద రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.466 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 75,988.51 (క్రితం ముగింపు 75,867.80) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడే 76,220.02 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 74,589.11 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరికి 1092.06 పాయింట్ల నష్టంతో 74,775.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌ షేర్లు మిగిలిన షేర్లు నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండిగో, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 91.40 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4530 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ

Eenadu25 May, 02:38 pm
ఇంటర్నెట్‌ డెస్క్: మెటా తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ పేరుతో యాప్‌ను తీసుకురాగా.....

ఇంటర్నెట్‌ డెస్క్: మెటా తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ పేరుతో యాప్‌ను తీసుకురాగా.. తాజాగా రెడ్డిట్‌ తరహాలో ఫోరమ్‌ (Facebook forum) అనే స్టాండ...

Eenadu25 May, 11:01 am
ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి (Stock Market Today). పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో...

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి (Stock Market Today). పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్‌ 1100 పాయింట్లు వరకు పెరిగింది....

Eenadu23 May, 07:45 pm
Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (23/05/2026)

- Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. - అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. - పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం.

Eenadu26 May, 09:26 am
అదానీ గ్రీన్‌ ఎనర్జీ రికార్డ్‌.. 3.37 గిగావాట్‌ అవర్‌ ఎనర్జీ స్టోరేజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: అదానీ గ్రీన్‌ ఎనర్జీ రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్‌ అవర్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్‌ను (Adani green energy) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దీంతో చైనా వెలుపల ఒకే చోట నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌గా ఇది నిలిచింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయొచ్చు. ఈ భారీ ప్రాజెక్టును కేవలం 10 నెలల్లోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ పూర్తి చేయడం విశేషం. ఇందులో భాగంగా 1.37 గిగావాట్‌ అవర్‌ కెపాసిటీని మార్చిలోనే కంపెనీ ప్రారంభించింది. మిగిలిన సామర్థ్యాన్ని జోడించి మొత్తం 3.37 గిగావాట్‌ అవర్‌ కెపాసిటీకి చేర్చింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు రోజంతా సరిపడా విద్యుత్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ తెలిపారు. సౌర, పవన వ్యవస్థల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ ఉంచి, అవసరమైనప్పుడు వాడుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ ఇంధన రంగానికి స్వావలంబన, సుస్థిరత లభిస్తుందని దీనివల్ల నాణ్యమైన, అందుబాటు ధరలో విద్యుత్‌ లభిస్తుందని వెల్లడించారు. విద్యుత్‌ను నిల్వ చేసేందుకు అధునాతన లిథియం అయాన్‌ బ్యాటరీలను అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.

Eenadu27 May, 07:08 am
ఉద్యోగులకు జాక్ పాట్ .. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏఐ విప్లవం కారణంగా డేటా కేంద్రాలకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలకు పెద్ద మొత్తంలో మెమొరీ చిప్‌లు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ (Samsung) చిప్‌ విభాగం భారీ వృద్ధిని సాధిస్తోంది. తమ మెమొరీ చిప్‌లకు భారీ డిమాండ్‌ రావడంతో ఉద్యోగులకు జాక్‌పాట్‌ తగిలింది. గత త్రైమాసికంలో తమ ఆదాయం 49 రెట్లు పెరగడంతో ఒక్కో ఉద్యోగికి రూ.3.25 కోట్ల బోనస్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ బోనస్‌ మంజూరుకు అనుకూలంగా బోర్డు ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో శామ్‌సంగ్‌ చిప్‌ డివిజన్‌ ఉద్యోగులు కోటీశ్వరులు కానున్నారు. కంపెనీకి వస్తున్న లాభాలే కాకుండా.. చిప్‌ విభాగం (Samsungs chip division) ఉద్యోగులు ఇటీవల చేపట్టిన సమ్మె కూడా ఈ బోనస్‌ ప్రకటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ‘పనితీరు ఆధారిత బోనస్’, జీతాల పెంపు వంటి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 18 రోజుల పాటు సమ్మె చేస్తామని ఇటీవల శామ్‌సంగ్‌ చిప్‌ విభాగం ఉద్యోగులు స్పష్టంచేశారు. అయితే సెమీకండక్టర్ తయారీలో ఒక్క రోజు సమ్మె జరిగినా కంపెనీకి రూ.కోట్లలో నష్టం వస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో సమ్మె నివారించడానికి ఉద్యోగుల సంఘంతో కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఫలితంగానే చిప్‌ విభాగంలోని 78వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల భారీ బోనస్ ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన మెమొరీ చిప్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ కూడా గతేడాది తమ కంపెనీకి పెరిగిన డిమాండ్‌ ఆధారంగా ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. ఇదీ చదవండి: ఏఐ వల్ల ‘ఉద్యోగాల వినాశనం’ రాదు గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార

Eenadu26 May, 10:24 am
India-US: భారత్‌ - అమెరికా మధ్య.. మరో కీలక డీల్‌..

దిల్లీ: సాంకేతికత రంగంలో కీలకమైన క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరా గొలుసులో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే దిశగా భారత్‌-అమెరికా కీలక ముందడుగు వేశాయి. క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరాకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దిల్లీ వేదికగా జరుగుతున్న క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుబంధంగా ఈ ఒప్పందం (US-India Deal) కుదిరింది. ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల్లో ఈ ఫ్రేమ్‌వర్క్‌ అత్యంత కీలకమైనదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో తెలిపారు. బలవంతపు మార్కెట్ పద్ధతుల నుంచి సున్నితమైన క్రిటికల్‌ మినరల్స్‌ (Critical Minerals) సరఫరా గొలుసులను రక్షించడం, గుత్తాధిపత్యాలను తగ్గించడానికి ఈ ఫ్రేమ్‌ వర్క్‌ కింద అమెరికా, భారత్ కలిసి పనిచేయనున్నాయి. అధునాతన తయారీ, ఇంధన వ్యవస్థలు, సాంకేతికత అభివృద్ధి తదితర రంగాల్లో అరుదైన ఖనిజాలు, క్రిటికల్‌ మినరల్స్‌ వినియోగం అత్యంత కీలకం. జైశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ క్వాడ్‌ (భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల కూటమి) సదస్సులో రూబియోతో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులు పెన్నీ వాంగ్‌, తోషిమిత్సు పాల్గొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్‌ మీదుగా సరకు రవాణా, ఇండో-పసిఫిక్‌ తదితర అంశాలపై వీరంతా చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించవద్దని, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా పోరాడే హక్కు అన్ని దేశాలకు ఉందని ఈ కూటమి పునరుద్ఘాటించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి

Eenadu25 May, 09:56 am
Redmi price hike | ఇంటర్నెట్‌ డెస్క్: మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చు పెరుగుతుండటంతో పలు కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచేస్తున్నాయి....

Redmi price hike | ఇంటర్నెట్‌ డెస్క్: మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చు పెరుగుతుండటంతో పలు కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రెడ్‌మీ మరోసారి ఫోన్‌ ధరలను పెంచేసింది....