translateexpand_more

Zee Telugu News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 02:44 am
గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటల కలకలం..ఫైనల్ ఓటమి కంటే పెద్ద టెన్షన్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Gujarat Titans Bus Fire Accident:ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ముందుగా పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బందిని వెంటనే బస్సు నుంచి బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే పొగ ఎక్కువగా వ్యాపించడంతో కొంతసేపు ఆటగాళ్లు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్‌కు తరలించారు. ఇప్పటికే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమి బాధ నుంచి బయటపడకముందే ఈ ఘటన జట్టును మరింత కలవరపరిచింది. గత కొన్ని రోజులుగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు వరుస ప్రయాణాలతో బిజీగా ఉన్నారు. ధర్మశాల నుంచి ముల్లన్‌పూర్‌కు, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితుల కారణంగా వారి ప్రయాణ షెడ్యూల్ కూడా ఆలస్యమైంది. దీంతో జట్టుపై అలసట ప్రభావం కనిపించిందనే చర్చలు కూడా జరిగాయి. అయితే జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి మాత్రం అలసటను ఓటమికి కారణంగా చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రత్యర్థి జట్టు

Zee Telugu01 Jun, 04:23 am
మహేష్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కీర్తి సురేష్.. చివరికి క్షమాపణ కోరిన సూపర్ స్టార్

Mahesh Babu:టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో మహేశ్ బాబు ఒకరు. అలాగే తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలకు ముందు మహేశ్ బాబు, కీర్తి సురేష్ పలువురు సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాంటి ఒక కార్యక్రమంలో జరిగిన సంభాషణ అందరినీ నవ్వించింది. ఆ కార్యక్రమంలో ఒకరు కీర్తి సురేష్‌ను ఉద్దేశించి ప్రశ్న అడిగారు. సినిమాలో ఒక పాటలో ఆమె మహేశ్ బాబు పర్సును తీసుకునే సన్నివేశం ఉంటుందని గుర్తుచేస్తూ, నిజ జీవితంలో కూడా ఎప్పుడైనా అలాంటి సరదా పనులు చేశారా అని అడిగారు. ఆ ప్రశ్న విన్న వెంటనే మహేశ్ బాబు సరదాగా స్పందించారు. నిజ జీవితంలో ఎవరైనా పర్సులు తీసుకుంటారా అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు. అయితే అందరూ ఊహించని విధంగా కీర్తి సురేష్ సమాధానం ఇచ్చింది. చిన్నప్పుడు తన తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసుకునేదాన్ని అని సరదాగా చెప్పింది. కీర్తి చెప్పిన మాటలు విన్న మహేశ్ బాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే నవ్వుతూ, తాను అలా అనుకోలేదని, సారీ అని సరదాగా స్పందించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అంతటితో ఆగకుండా కీర్తి సురేష్ మరోసారి చమత్కారంగా మాట్లాడుతూ, చిన్నప్పుడు అలాంటి అల్లరులు చేయడం తనకు అలవాటేనని చెప్పింది. దీంతో కార్యక్రమం మొత్తం సరదా వాతావరణంగా మారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. అభిమానులు

Zee Telugu01 Jun, 04:04 am
ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన రష్మిక.. విజయ్ దేవరకొండతో జపాన్ లో రచ్చ

Rashmika Shares Japan Trip With Vijay Devarakonda Photos: ఇటీవల జపాన్‌లో జరిగిన యానిమే అవార్డ్స్ వేడుకకు హీరోయిన్ రష్మిక మందన్న హాజరైన విషయం తెలిసిందే. టోక్యోలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేశారు. అయితే, తన జపాన్ డైరీకి సంబంధించి హీరో విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటోలను కూడా ఆమె పంచుకుని అభిమానులకు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. టోక్యోలో జరిగిన యానిమే అవార్డు ఫంక్షన్లకు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొత్త ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నటి తన భర్త విజయ్ దేవరకొండతో దిగిన చిత్రాలను అభిమానులకు షేర్‌ చేశారు. ఈ ఏడాది జపాన్ పర్యటన చాలా సరదాగా గడిచిందని రష్మిక తన క్యాప్షన్ లో రాశారు. రష్మిక తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి జపాన్ వీధుల్లో తిరుగుతున్న ఫోటోలను పంచుకోవడమే కాకుండా, అక్కడి సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపించారు. అంతేకాకుండా అక్కడి వంటకాలను కూడా ఆమె ఆస్వాదించారు. ఒక ఫోటోలో రష్మిక గ్రీన్ ఆకులతో, నారింజ, పసుపు రంగు సన్‌ఫ్లవర్ డిజైన్ ఉన్న సాంప్రదాయ జపనీస్ యూకాట డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రష్మిక పంచుకున్న ఈ చిత్రాల ద్వారా ఆమె ఒంటరిగా జపాన్ టూర్ చేయలేదని, విజయ్ దేవరకొండతో కలిసి పర్యటించినట్లు స్పష్టమవుతోంది. ఆమె కొన్ని అస్పష్టమైన వీడీ ఫోటోలను కూడా షేర్ చేయడంతో, ఈ జంట కలిసి జపాన్ వెళ్లారని అందరికీ అర్థమైంది. ఉదయపూర్ వేదికగా రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం ఫిబ్రవరి 26న జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని

Zee Telugu31 May, 11:37 am
ఎదురింట్లో కూరలో ఉప్పు ఎక్కువైనా నన్నే తప్పుపడతారు.. నరకం అనుభవించా

Singer Sunitha:తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని సునీత తాజాగా తన కెరీర్, సంగీత రంగంలో వచ్చిన మార్పులు, సోషల్ మీడియా ప్రభావం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రయాణం కొనసాగిస్తున్న ఆమె ప్రస్తుతం కొత్త కాన్సర్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సునీత మాట్లాడుతూ, "టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట" పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత, కొత్త తరాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలను ఎంపిక చేశామని చెప్పారు. "మాయాబజార్", "మిస్సమ్మ" వంటి క్లాసిక్ చిత్రాల పాటలతో పాటు "గోదావరి" వంటి తనకు ఇష్టమైన సినిమాలకు సంబంధించిన ప్రత్యేక భాగాలను కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. సంగీత రంగంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, "పాటల్లో లోతు తగ్గిందనే భావన కలుగుతోంది. ఒకప్పుడు పాటల సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశాలు తగ్గాయి" అన్నారు. అయితే ఇప్పటికీ మంచి పాటలు వస్తున్నాయని, "సీతారామం", "మహానటి", "ఉప్పెన" వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏఐ ప్రభావంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. "భవిష్యత్తులో సంగీతాన్ని ఏఐ ఆక్రమిస్తుందేమోనని కొన్నిసార్లు భయపడుతుంటాను. మార్పు సహజమే అయినా దాన్ని పూర్తిగా అంగీకరించడం అంత సులభం కాదు" అని అన్నారు. సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా సంగీతంలో భావోద్వేగాలు తగ్గిపోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు. తన విజయ రహస్యం గురించి మాట్లాడుతూ, "నన్ను ఇంతకాలం నిలబెట్టింది క్రమశిక్షణ. వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు. ప్రయత్నంలో లోపం ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు వచ్చాను" అని చెప్పారు. సోషల్ మీడియా విమర్శల గురించి స్పందిస్తూ

Zee Telugu31 May, 04:46 am
తిరుమలలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత! పోటెత్తిన విఐపీలు, శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Tirumala Rush Alert Today: తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం దాదాపు 18 గంటల సమయం పడుతోంది. వీకెండ్ ప్రభావంతో రద్దీ పెరగడమే కాకుండా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు ప్రముఖుల రాక కూడా పెరిగింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ చైర్మన్ జగతి శివప్ప, సినీ నటుడు రాజ్ కుమార్, తమిళనాడు బీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమలవాన్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగానే టీటీడీ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుని, రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీస్సులు పొందారు. వారు స్వామివారి పట్టువస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలను కూడా స్వీకరించారు. ఈరోజు గరుడసేవ.. తిరుమలలో ప్రతి నెలా జరిగే గరుడసేవ ఈరోజు నిర్వహించబడుతుంది. ఈ నెల 31వ తేదీ పౌర్ణమి సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య, సర్వాలంకార భూషితడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతుల గరుడిపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. భక్తులు వివిధ రూపాల్లో, అంటే బంగారం, వెండి, నగదు రూపంలో స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన నయాతీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ అగ్ర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, టీటీడీకి రూ. 1.13 కోట్ల

Zee Telugu31 May, 07:22 am
మరో వివాదంలో సింగర్ చిన్మయి.. పైరసీని ప్రశంసిచడం ఏంటని నెటిజన్లు ఫైర్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Singer chinmayi sripada clip post on Preity Mukundan Blast zone movie goes controversy: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయంఅక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఘటనపై యాక్టివ్ గా ఉంటారు. తనదైన స్టైల్ లో వాయిస్ ను విన్పిస్తుంటారు. పలు మార్లు సింగర్ చిన్మయి ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే. కొంత మంది ట్రోలర్స్ రాయుళ్లు సింగర్ చిన్మయి ఫ్యామిలీ మీద అత్యంత వర్గల్ గా కామెంట్స్ లు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఆమె సైబర్ పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా.. ఆమె బ్లాస్ట్ మూవీలోని ఒక క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం కాంటవర్సీగా మారింది. యాక్షన్‌ హీరో అర్జున్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బ్లాస్ట్ జోన్‌`. ఈ మూవీ మే 28న విడుదలైంది.దీనికి సుభాస్‌ కే రాజ్‌ దర్శకత్వం వహించిగా,అభిరామి, ప్రీతి ముకుందన్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ విడుదల చేశారు. ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ మీద దూసుకుని పోతుంది. ఈ క్రమంలో సింగర్ చిన్మయి ఈ మూవీకి సంబంధించిన ఒక థియేటర్ క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి థియేటర్ లో

Zee Telugu31 May, 06:06 am
కొండగట్టు గిరి ప్రదక్షిణ.. భక్తులంతా 108 సీడ్ బాల్స్ తీసుకురావాలి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Kondagattu Giri Pradakshina: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో వచ్చే నెలలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి నిర్వాహకులు ఒక వినూత్నమైన, పర్యావరణహితమైన పిలుపునిచ్చారు. ఈ గిరి ప్రదక్షణకు తరలివచ్చే భక్తులందరూ ఆధ్యాత్మిక భక్తి భావనతో పాటు పర్యావరణ స్పృహను చాటుకుంటూ ఒక్కొక్కరు కచ్చితంగా 108 సీడ్స్ బాల్స్ తీసుకురావాలని ఓ స్వామీజీ కోరారు.. ఈ మేరకు కొండగట్టు పరిసరాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన భక్తులందరితో ఘనంగా ప్రతిజ్ఞ చేయించారు.. కొండగట్టు అనగానే స్వామి వారితో పాటు అక్కడ భారీ సంఖ్యలో ఉండే కోతులు అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోవడంతో పాటు కొండలపై సరైన ఆహార వనరులు లేకపోవడం వల్ల ఈ కోతులు ఆహారం కోసం తరచుగా భక్తులపై, స్థానిక గ్రామాలపై పడుతూ ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంకల్పంతో ఈ సీడ్స్ బాల్స్ ప్రచారాన్ని చేపట్టారు. భక్తులు తమ ఇళ్ల వద్దనే మట్టితో పాటు పీడ మిశ్రమంతో దానిమ్మ, బొప్పాయి, జామ పండు, సీతాఫలం వంటి తదితర పండ్ల గింజలను ఉపయోగించి ఈ సీడ్స్ బాల్స్ తయారు చేసుకొని తీసుకురావాలని సూచించారు. గిరి ప్రదక్షణ చేసే సమయంలో భక్తులందరూ తాము తెచ్చిన 108 సీడ్స్ బాల్సును కొండగట్టు

Zee Telugu30 May, 04:06 pm
మంచు విష్ణు హీరోయిన్ కు మాజీ భర్త నోటీసులు.. గృహహింస వివాదంలో సరికొత్త మలుపు

Actress:బాలీవుడ్ నటి, మంచు విష్ణుతో కలిసి నటించిన సెలినా జైట్లీ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా ఆమె, మాజీ భర్త పీటర్ హాగ్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రియాలో కోర్టు విచారణ కొనసాగుతున్న సమయంలోనే సెలినాకు మాజీ భర్త పీటర్ హాగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి లీగల్ నోటీసులు అందినట్లు సమాచారం. సెలినా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల్లో తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని పీటర్ హాగ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు పిల్లలపై కూడా దీని ప్రభావం పడుతోందని వారు పేర్కొన్నట్లు సమాచారం. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించకుండా గోప్యంగా ఉంచాలని, మీడియా ముందు వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వివాదానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. సెలినా జైట్లీ 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత ఏడాది తనపై గృహహింస జరిగిందంటూ సెలినా ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మాజీ భర్త కుటుంబం నుంచి లీగల్ నోటీసులు వచ్చాయనే వార్తలతో ఈ వ్యవహారం మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇకపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది

Zee Telugu31 May, 03:49 am
ఎండితే 2 కేజీలు, మాడిపోతే 3 కేజీలు .. ఇదేంటో చెప్పగలరా? 99శాతం మంది తప్పు సమాధానమే చెబుతారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GK Quiz: సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జీకే కూడా ఒక విభాగంగా ఉంటుంది. ఈ కేటగిరిలో రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే జీకేపై పరిజ్నానం పెంచుకున్నట్లయితే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము. దానికి మీరు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా తప్పే చెబుతారు. అయితే ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: పొడిగా ఉన్నప్పుడు 2 కిలోలు.. తడిగా ఉన్నప్పుడు 1 కిలో బరువు ఉండే ఆ వస్తువు ఏమిటి? అదే వస్తువును కాల్చితే, అది 3 కిలోగ్రాములు అవుతుంది? Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!! సల్ఫర్ అంటే ఏంటి? సల్ఫర్ అనేది ఒక పసుపు రంగు రసాయన మూలకం. ఇది అలోహం. సల్ఫర్ గుర్తు S, పరమాణు సంఖ్య 16. ఈ రసాయన గంధకాన్ని కారు బ్యాటరీల తయారీ, ఎరువులు, చమురు శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి, ఖనిజాల వెలికితీతలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సల్ఫర్ అనేది విషపూరితమైన రసాయనం. సల్ఫర్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. సల్ఫర్ కణాలు దగ్గుకు కారణం అవుతాయి. ఇది చర్మానికి, కళ్ళకు కూడా చికాకు కలిగించగలదు. -చర్మం పొడిబారడం, ఎర్రబడటం..

Zee Telugu31 May, 01:53 am
నేడు అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం పవర్ ఫుల్ కాంబో.. ఈ చిన్న దీపం వెలిగిస్తే ధనలక్ష్మి మీ

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Adhika Jyeshtha Purnima 2026: ఈరోజు ఆదివారం.. అంతేకాకుండా పౌర్ణమి కూడా.. అది కూడా జ్యేష్ఠ పౌర్ణమి. అందుకే ఈరోజుకి చాలా విశిష్టత ఉంది. సూర్యచంద్రుల అనుగ్రహం కలిగించే ఒక శక్తివంతమైన మహా యోగం అంటున్నారు పండితులు. ఈ ఆదివారం సూర్యుడికి, పౌర్ణమి మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజులు. కనుక ఈరోజు పూజ చేసుకుని కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే.. మీ జీవితంలోని సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు. ఈ ఆదివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలానే స్నానం చేసే నీటిలో కల్లుప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరానికి, మనసుకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సింహద్వార పూజ.. ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి, మామిడి ఆకుల తోరణాలు కట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఆర్థిక సమస్యల కోసం పరిహారం.. ఈ ఆదివారం నాడు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక ఎరుపు లేదా పసుపు వస్త్రంలో ఐదు యాలకులు, ఐదు లవంగాలు, ఒక రూపాయి బిళ్ల వేసి మూట కట్టి పూజలో ఉంచాలి. ఆ తర్వాత దానిని బీరువాలో పెట్టుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి

Zee Telugu01 Jun, 05:43 am
కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగు ఆలస్యం? ఆకాశం వైపు అన్నదాతల చూపు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Karimnagar Kharif Season Delayed Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. గత సంవత్సరం మే చివరి వారానికి జిల్లా వ్యాప్తంగా సాగు పనులు ముమ్మరంగా ప్రారంభం కాగా.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. రోహిణి కార్తె.. ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పులతో పాటు ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం.. జూన్ నెలలో తక్కువ వర్షపాతమే.. వాతావరణ శాఖతోపాటు వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం.. జూన్ నెలలోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట.. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పాటు స్థానికంగా ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోవడంతో తొలకరి జల్లుల కోసం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.. జూన్ మధ్య నాటికి కానీ ఋతుపవనాలు జిల్లాను తాకే అవకాశం లేదని తెలుస్తోంది.. నిలిచిపోయిన పత్తి మొక్కజొన్న కంది విత్తనాల సాగు.. సాధారణంగా మీ ఆఖరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే పడే తొలకరి వర్షానికి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు

Zee Telugu31 May, 01:55 am
గాజువాకలో అర్ధరాత్రి ఊహించని విషాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు, ముగ్గురు స్పాట్ డెడ్! పలువురికి తీవ్రగాయాలు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Horrific Road Accident in Gajuwaka Today: ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులలో భయాన్ని కలిగిస్తున్నాయి. బస్సుల్లో మంటలు రావడం, ప్రమాదాలు జరగడం వంటి సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం గాజువాకలో కూడా ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ వైపు నుంచి వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు, శ్రీనగర్ దాటిన తర్వాత అతివేగంగా వెళ్తూ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, బస్సు డ్రైవర్‌తోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వల్ల ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంతో పోలీసులు దానిని క్రమబద్ధీకరించారు. డ్రైవర్ అతివేగంతో ప్రయాణించడం, నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాజువాక సిగ్నల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, అయితే పెద్ద ప్రమాదం తప్పిందని కొందరు భావిస్తున్నారు. READ ALSO: దారుణం.. పంచాయితీ

Zee Telugu01 Jun, 06:15 am
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 16 నుంచి ఎగ్జామ్స్, షెడ్యూల్ లింక్ ఇదే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Telangana TET 2026 schedule released: తెలంగాణ టెట్ షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలు 2026 జూన్ 16 నుండి 22 వరకు వివిధ సెషన్లలో నిర్వహించబడతాయి. మొత్తంగా ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగుతాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఈ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా జరగబోయే ఈ తెలంగాణ టెట్ పరీక్షలు, మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు షిఫ్టులుగా ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 నుండి 11:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ టైమ్ టేబుల్, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసే అభ్యర్థులు వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ లోని వివరాలను జాగ్రత్తగా చదువుకోవాలి. పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు... జూన్ 16వ తేదీన మొదటి సెషన్‌లో పేపర్ వన్ మ్యాథ్స్ & సైన్స్ నిర్వహించగా, రెండో షిఫ్టులో కూడా పేపర్ వన్ మ్యాథ్స్ & సైన్స్ ఉంటుంది. జూన్ 17వ తేదీన పేపర్ వన్ మ్యాథ్స్ & సైన్స్, మధ్యాహ్న సమయాల్లో పేపర్ 2 మ్యాథ్స్ & సైన్స్ నిర్వహించనున్నారు. జూన్ 18వ తేదీన మధ్యాహ్నం పేపర్ 2 మ్యాథ్స్ & సైన్స్ పరీక్ష ఉంటుంది. జూన్

Zee Telugu01 Jun, 04:51 am
మాఘ నక్షత్రంలోకి కేతువు సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టాల కాలం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Ketu Transit In Magha Nakshatra 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని ఛాయాగ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అంతే కాకుండా దీనిని రహస్యం ఆధ్యాత్మికతకు కారక గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రహం ఎల్లప్పుడూ వక్రగతిలో ఒక రాసి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే.. కేతువు గ్రహం మే 31వ తేదీన ఆదివారం తెల్లవారి జామున రెండు గంటల సమయంలో మాగ నక్షత్రంలోని మూడవ దశలోకి సంచారం చేసింది.. ఈ గ్రహం ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే, కేతువు సంచారం నాలుగు రాశుల వారికి అనేక సవాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మిథున రాశి కేతువు స్థానంలో మార్పులు రావడం కారణంగా మిధున రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.. తప్పుడు మాటలు వివాదాలకు దారి తీయవచ్చు

Zee Telugu01 Jun, 04:39 am
గురు, శుక్రుల అద్భుత కలయిక.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అపార ధనలాభం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jupiter-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ గ్రహం మిథున రాశిలోకి సంచార దశలో ఉంది.. జూన్ 2న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ స్థానంలోనే ఉంటుంది.. సంపదతో పాటు శ్రేయస్సులకు కారకుడైన శుక్రుడు జూన్ 8న ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూలై 4వ తేదీన సింహరాశిలోకి వెళ్తాడు. ఫలితంగా జూన్ నెలలో కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ రాశుల వారికి జాక్పాట్.. వృషభ రాశి గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి రోజు వారి ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత అనుకూలంగా మారుతాయి. అదృష్టం మీకు తోడు ఉండడం కారణంగా జీవితంలో ఊహించని విజయాలు

Zee Telugu01 Jun, 03:23 am
గుండె ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్.. రోజు ఉదయం తింటే హార్ట్ ఎటాక్ నుంచి జాగ్రత్తపడొచ్చు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heart Health Tips: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె అతి ముఖ్యమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే లైఫ్‌స్టైల్, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా ముఖ్యం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణ కూడా అందిస్తుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోవటానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాల్‌నట్ లేదా బాదం ఈ రెండింటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ఉదయాన్నే 4 నుంచి 5 బాదం లేదా 2 నుంచి 3 వాల్‌నట్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 2. ఓట్స్ ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ధాన్యం తంతువు ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి పాలు లేదా నీటిలో ఓట్స్ ఉడికించి తింటే మంచి ఫలితాలు అందుతాయి. వాటిలో కొద్దిగా తేనె, డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చుకోవచ్చు. 3. అవకాడో అవకాడోలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచి కొవ్వులుగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బ్రెడ్ టోస్ట్‌లో వేసుకొని తినవచ్చు. స్మూతీగా లేదా సలాడ్‌గా కలిపి తీసుకోవచ్చు. 4. చిక్కుడు వర్గపు మొలకలు మొలకలలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మాగ్నీషియం,

Zee Telugu31 May, 12:20 pm
పీఎం కిసాన్ 23వ విడతపై భారీ అప్ డేట్.. డబ్బులు వచ్చేది ఆ రోజేనా

PM Kisan 23rd Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏటా రూ.6000 చొప్పున పొందుతున్నారు. ప్రస్తుతం రైతులు 23వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 22 విడతలు విడుదల చేసింది. అసలు 23వ విడత నిధులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా మూడు విడతలుగా, అంటే రూ.2000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేస్తున్నారు. ఇప్పుడు రైతులందరూ 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఈ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. 22వ విడత ద్వారా ఇప్పటికే 18,640 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. తదుపరి విడత జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.కానీ ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా కేవలం భారతీయ రైతులు మాత్రమే ప్రయోజనం పొందగలరు. దీనికి అర్హత ఉండాలంటే రైతు వద్ద వ్యవసాయ భూమి ఉండాలి. చిన్న ,సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు లేదా నెలకు రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు ఈ పథకానికి అర్హత కలిగి ఉండరు. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే రైతులు తమ KYC ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవాలి. అప్పుడే తదుపరి విడత నిధులు మీ ఖాతాలో జమ అవుతాయి. ఓటీపీ (OTP)

Zee Telugu31 May, 10:16 am
బాబోయ్.. కంచం నిండా మిరపకాయలు పెట్టుకుని ఎలా తినేస్తున్నాడో చూడండి.. వైరల్ వీడియో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Green Chilli Eating Challenge Viral Video Watch: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారుల ముందుకు వస్తూనే ఉంది. లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే సాహసాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయేలా చేస్తే.. మరికొన్నిసార్లు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఆశ్చర్యం కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా కూరగాయల్లో ఒకటో రెండో పచ్చిమిరపకాయలు ఎక్కువైతేనే కారంతో నోరంతా మండిపోతూ ఉంటుంది.. కానీ ఈ వీడియోలో వ్యక్తి మాత్రం అత్యంత ఘాటైన పచ్చిమిరపకాయలను థియేటర్లలో లభించే పాప్‌కార్న్ తిన్నట్లు రెండు చేతులతో గుప్పిళ్ళకొద్దీ నోట్లో వేసుకుని నమిలేస్తున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి తన ముందు ఒక పెద్ద కంచం నిండా పచ్చిమిరపకాయలను పెట్టుకొని కూర్చుని ఉన్నాడు.. దాదాపు రెండు నుంచి మూడు కేజీలకు పైగా ఉన్న ఆ పచ్చిమిరపకాయలను అతని ఏమాత్రం లెక్కచేయకుండా తినడం ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు.. ఒకేసారి పదుల సంఖ్యలో మిరపకాయలను రెండు చేతులతో తీసుకొని నోట్లో కుక్కుకుంటూ.. కటకటా నములుతూ మింగేస్తున్నాడు.. ఈ దృశ్యాలు చూస్తున్న వారికే నోరు

Zee Telugu31 May, 10:10 am
అవన్ని నూరు శాతం అసత్య ప్రచారాలు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. BJP MP Dharmapuri Arvind Reacts On Etela Rajender and Bandi Sanjay Controversy: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సొంత పార్టీ నేతల మధ్య వివాదాలు అంటూ తరచుగా వార్తలు తెర మీదకు వస్తున్నాయి. కొంత మంది కీలక నేతల మధ్య ఆధిపత్య పోటీ నెలకొందని, ఒకర్నిమరోకరు పార్టీ నుంచి బైటకు పంపేందుకు అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో నేతల మధ్య తెలియకుండానే అఘాతం ఏర్పడి లేని పోనీ సమస్యలు ఎదురౌతున్నాయి. ఈ రకమైన ప్రచారాలు అన్ని పార్టీలకు చెందిన నేతల మధ్య ఇటీవల కన్పిస్తున్నాయి. తాజాగా.. గత కొన్ని రోజులుగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ కు తనకు మధ్య గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల కొంత మంది కావాలని తెలంగాణలో బీజేపీ నేతల మధ్య తరచుగా గొడవలు, ఆధిపత్యపోరు అంటూ ఫెక్ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా.. మల్కాజ్ గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారంను అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఈటల రాజేందర్ గారు సౌమ్య స్వభావం కలిగిన నాయకుడని

Zee Telugu31 May, 10:08 am
దేవుడి గదిలో శ్రీరాముడి ఫోటో పక్కనే భారీ నాగుపాము.. వీడియో వైరల్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Cobra In Puja Room Viral video Watch: ఒక నాగుపాముకు సంబంధించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎన్నో పాముల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ దేవుడి గదిలో ప్రత్యక్షమైన ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక ఇంటిలోని పూజా గదిలో.. సాక్షాత్తు శ్రీరాముడి ఫోటో పక్కనే అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పడకవిప్పి కూర్చోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా శివారు ప్రాంతాల్లో పాములు ఇళ్ళలోకి రావడం చూస్తూ ఉంటాం.. అయితే, ఈ ఘటనలో నాగుపాము నేరుగా ఇంట్లోని దేవుడి గదిలోకి ప్రవేశించింది.. నిత్యం పూజలు చేసే ఆ గదిలో.. శ్రీరాముడి పటాన్ని ఆనుకొని నిలబడింది. ఉదయాన్నే పూజ చేద్దామని వెళ్లిన ఇంటి యజమాని.. అక్కడ మృత్యుల పడక విప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును చూసి ఒక్కసారిగా షాక్కు గురైయ్యాడు.. ప్రాణ భయంతో గది బయటకు పరుగులు తీసి.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు.. పూజా గదిలో నాగుపాము ఉన్నదని కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వెళ్లి ఇతరులకు చెప్పడంతో.. ఈ వింతను చూసేందుకు స్థానికులు సైతం భారీగా తరలివచ్చారు. కొందరు భక్తితో దానికి నమస్కరించుకోగా..

Zee Telugu31 May, 08:56 am
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో టీఎంసీ ఎంపీపై దాడి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc mp kalyan Banerjee attacked by mob in Hooghly Kolkata: వెస్ట్ బెంగాల్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఒకవైపు మమత మేనల్లుడిపై సోరాన్ పూర్ లో గుడ్లు, రాళ్లతో దాడ ఘటనతో పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవైపు దీనిపై మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ ప్రతీకార రాజకీయాలు మానుకొవాలన్నారు. ఇలాంటి దాడులు తమ ఆత్మస్థైర్యంను నీరుగార్చలేవన్నారు. ఇక అభిషేక్ బెనర్జీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన బెల్ వ్యూ ఆస్పత్రి సీఈవోపై మమతా ఫైర్ అయినట్లు ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. తన మేనల్లుడు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొకుంటే తలపగిలి చనిపోయి ఉండేవాడని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారని,అవసరం అయితే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పారన్నారు. అభిషేక్ బెనర్జీకి ఏమైన జరిగితే దానికి బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ సైతం ఈ దాడులతో భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరో టీఎంసీ ఎంపీపై హుగ్లీలో దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఆయనపై కొంత

Zee Telugu31 May, 06:24 am
కింగ్ కోబ్రాకు ఎండదెబ్బ.. బాటిల్ తో నీళ్లను పోయగానే గట గట తాగుతూ.. అరుదైన వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. king cobra drinking water during his rescue video: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగ ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి జనాలు విల విల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు టెంపరెచర్ నమోదౌతుంది. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మనుషులు వడ దెబ్బలకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక నోరులేనీ జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. ప్రతిరోజు మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయిరోడ్డు మీద పడిపోతున్నాయి. ఇక పాములు అడవులు, గుట్టలలో ఎక్కువగా సంచారం చేస్తాయి. పెరిగి పోయిన ఎండలకు అవి కాస్త జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పాములు బైక్ లలో, బెడ్ రూమ్ లలో, చెట్ల పొదల్లో, కార్లలో, బూట్లలో , చీకటిగా ఉండే ప్రదేశంలో ఎక్కువగా దాక్కుని ఉంటున్నాయి. ఈ క్రమంలో కోబ్రాలు ఎక్కువగా కూడా ఎండ వేడికి గురౌతున్నాయి. తాజాగా.. ఒక కింగ్ కోబ్రా స్కూల్ ఆవరణలో వచ్చింది. మరీ పాపం అది ఎండ దెబ్బకు గురైనట్లు ఉంది.ఎటు కదల్లేక వరాండా మీదనే మూర్ఛపోయింది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వెంటనే బాటిల్ తో పాము మీద నీళ్లను పోశాడు. కింగ్ కోబ్రాపై నెమ్మదిగా బాటిల్ తో ధారగా నీళ్లు పోసేసరికి అది కూడా

Zee Telugu30 May, 05:14 pm
సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు యోగాసనాలు.. యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్న మాజీ మంత్రి

Harish Rao: హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగాసనాలు చేస్తూ కనిపించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమని హరీష్ రావు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలతో కలిసి యోగా సాధన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం సిద్దిపేటలో ఉత్సాహంగా సాగింది.

Zee Telugu31 May, 09:04 am
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc mp kalyan Banerjee attacked by mob in Hooghly Kolkata: వెస్ట్ బెంగాల్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఒకవైపు మమత మేనల్లుడిపై సోరాన్ పూర్ లో గుడ్లు, రాళ్లతో దాడ ఘటనతో పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవైపు దీనిపై మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ ప్రతీకార రాజకీయాలు మానుకొవాలన్నారు. ఇలాంటి దాడులు తమ ఆత్మస్థైర్యంను నీరుగార్చలేవన్నారు. ఇక అభిషేక్ బెనర్జీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన బెల్ వ్యూ ఆస్పత్రి సీఈవోపై మమతా ఫైర్ అయినట్లు ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. తన మేనల్లుడు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొకుంటే తలపగిలి చనిపోయి ఉండేవాడని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారని, అవసరం అయితే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పారన్నారు. అభిషేక్ బెనర్జీకి ఏమైన జరిగితే దానికి బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ సైతం ఈ దాడులతో భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరో టీఎంసీ ఎంపీపై హుగ్లీలో దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఆయనపై

Zee Telugu31 May, 04:29 am
రోజుకు 3,490 క్యాలరీలు.. కేంద్ర ఉద్యోగుల జీతాలకు దీని సంబంధం ఏంటి

8th pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈసారి జీతాల పెంపు లెక్కల్లో ద్రవ్యోల్బణంతో పాటు ఆహార అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటివరకు వేతన సంఘాలు ఒక వ్యక్తికి రోజుకు 2,700 క్యాలరీల ఆహారం సరిపోతుందనే అంచనాల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించేవి. అయితే ప్రస్తుత కాలంలో జీవన విధానం, ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, పనిభారం పెరగడంతో ఆ లెక్కలు సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వారి వాదన ప్రకారం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరియు పోషకాహార సంస్థల తాజా సూచనల ప్రకారం కొంతమంది ఉద్యోగులకు రోజుకు సుమారు 3,490 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. అందువల్ల కనీస వేతనాల లెక్కలను కూడా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం పాలు, పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పాత ప్రమాణాల ప్రకారం నిర్ణయించిన జీతాలతో కుటుంబ అవసరాలను తీర్చడం కష్టమవుతోందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఒక కొత్త లెక్కను ప్రతిపాదించాయి. ఐదుగురు సభ్యుల కుటుంబానికి అవసరమైన ఆహారం, ఇతర ప్రాథమిక ఖర్చులు, ప్రస్తుత కరువు భత్యం, విద్యా మరియు వైద్య వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే కనీస వేతనం రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉండాలని సూచిస్తున్నాయి. ఈ ప్రతిపాదన అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ నిర్ణయంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే.

Zee Telugu01 Jun, 03:32 pm
మాధురి దీక్షిత్ 4వ నెల ప్రెగ్నెంట్.. ఫైనల్ గా ఓపెన్ అయిన హీరోయిన్

Madhuri Dixit :మాధురి దీక్షిత్ పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె నటన కాదు..దేవదాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక పాత ప్రచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె నటన కాదు.. దేవదాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక పాత ప్రచారం. ఇటీవల కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ టీమ్‌కు చెందిన రుబీనా ఖాన్.. దేవదాస్ సినిమాలోని ప్రసిద్ధ ‘డోలా రే డోలా’ పాట షూటింగ్ సమయంలో మాధురి నాలుగు నెలల గర్భిణిగా ఉన్నారని చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అభిమానులు కూడా నిజమేనా అంటూ ఆరా తీశారు. ఈ ప్రచారంపై స్పందించిన మాధురి దీక్షిత్.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన పెద్ద కుమారుడు అరిన్ 2003లో జన్మించాడని, దేవదాస్ సినిమా అయితే 2002లోనే విడుదలైందని గుర్తు చేశారు. ఈ రెండు తేదీలను చూస్తే ప్రచారం పూర్తిగా తప్పని సులభంగా అర్థమవుతుందని తెలిపారు. అయితే దేవదాస్ షూటింగ్ సమయంలో తాను ఆరోగ్యంగా లేకపోవడం మాత్రం నిజమేనని మాధురి వెల్లడించారు. వరుస ప్రయాణాలు, రాత్రి వేళల్లో షూటింగ్‌లు, ఎక్కువసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ కారణంగా అలసటగా ఉండేదని చెప్పారు. కానీ దానికి ప్రెగ్నెన్సీకి

Zee Telugu01 Jun, 12:38 pm
అల్లు అర్జున్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ! 'రాకా' సినిమాలోకి మరో సోయగం

Femina George In Raaka News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మలయాళీ బ్యూటీని ఎంపిక చేశారట. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'పుష్ప' సిరీస్‌లోని రెండు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సైన్స్-ఫిక్షన్ సినిమా 'రాకా' నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో దీపికా పదుకొణెతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ భోర్సే వంటి వారు మరో హీరోయిన్‌గా నటిస్తున్నారని పుకార్లు వచ్చాయి. కానీ, చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఫెమినా జార్జ్..'రాకా' సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ సినిమాలో అవకాశం రావడం పట్ల ఆమెకు చెప్పలేనంత ఖుషీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో అల్లు అర్జున్ ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇందులో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఓ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమాను సన్‌ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్.. దాదాపుగా రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో హాలీవుడ్‌కు తగ్గట్టుగా నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ 3 నుంచి 4 గెటప్స్‌లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే అల్లు ఫ్యాన్స్‌కు ఇక

Zee Telugu30 May, 01:50 pm
జైలు ఫుడ్ కు బాగా అలవాటు పడ్డాడు బాల్క సుమన్.. కాంగ్రెస్ చరణ్ కౌశిక్ షాకింగ్ కామెంట్స్

Charan Kaushik:జైలు ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డాడు బాల్క సుమన్.. కాంగ్రెస్ చరణ్ కౌశిక్ షాకింగ్ కామెంట్స్ ఈ వార్తకు సంబంధించిన

Zee Telugu31 May, 05:59 am
కూతురి పెళ్లి, చదువుల టెన్షన్ ఫ్రీ.. లో రూ.50 లక్షల భారీ ఫండ్ కోసం నెలవారీ ప్లాన్ ఇదిగో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sukanya Samriddhi Yojana : మీ కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటే.. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కంటే ఉత్తమమైన సేవింగ్స్ స్కీమ్ మరోకటి లేదని చెప్పాలి. ఇతర సేవింగ్స్ సేవింగ్స్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ పథకం ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాదు ఈ స్కీములోని పెట్టుబడులు పాత ఆదాయపు పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కూతురు పేరు మీద రూ. 50 లక్షల భారీ నిధిని ఎలా కూడబెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం..ఆడపిల్లకు 10 సంవత్సరాలు నిండక ముందే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమె పేరు మీద అకౌంట్ తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు పెట్టుబడులను పెట్టవచ్చు. అయితే 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన కనీస వాటా రూ. 250 కాగా, గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఉంటుంది. 50 లక్షల రూపాయలు ఎలా డిపాజిట్ చేయాలి? ఒకవేళ తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 50,000 పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ. 7.5 లక్షలు

Zee Telugu01 Jun, 02:05 pm
మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Telugu States IMax: సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే అత్యుత్తమ సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నేతృత్వంలోని ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ ఎన్నో ఆధునిక సాంకేతికతలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమా థియేటర్‌ను తీసుకురావడం, హైదరాబాద్‌లో తొలి హెచ్‌డీఆర్ బై బార్కో స్క్రీన్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేయడం వంటి విజయాలను ఏఎంబీ సినిమాస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో భారీ అడుగు వేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబుతో పాటు ప్రముఖ నటులు వెంకటేశ్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరి సహకారంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సుదర్శన్ థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇక్కడ ఘన విజయాలను నమోదు చేశాయి. సినీ అభిమానుల జ్ఞాపకాలతో ముడిపడిన ఈ ప్రదేశం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐమ్యాక్స్ టెక్నాలజీ